AI Tech Delivery | AI Visual Art Creator | Photographer | Technical Analyst | Movies | Fitness | Ambivert
Instagram @swaroopadepu and @swaroopadepustudios
Peddi Crosses ₹100 Crore Worldwide.
Set against the backdrop of rural India, Peddi follows the journey of a determined man who rises against injustice and powerful forces in his village. Audiences have connected with its emotion, action, and Ram Charan's performance.
నాకు #Peddi బాగా నచ్చింది,
నన్ను బాగా కదిలించింది కూడా!
Terrific is a small word to describe the impeccable performances of @AlwaysRamCharan
& @IamJagguBhai 🙏
Better screenplay would've done wonders to the film. Nevertheless, it was a great attempt by @BuchiBabuSana 💐
పెద్ది... ఇది ఒక ఊరి కథ & ఆ ఊరి కోసం
సర్వం అర్పించిన ఒక పోరాట యోధుడి కథ!
@arrahman displayed his magic by giving catchy tunes & blending classical instruments like Veena in the background score (especially during the preclimax portion) 🥰
Highly Recommended: 4/5 👌
ఒకటే పని సేసేదానికీ
ఒకేలాగ బతికెయ్య���ీకీ
ఇంత పెద్ద బతుకెందుకు?
ఏదైనా సరే ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాల! మళ్ళీ మళ్ళీ పుడతామా ఏటి?
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కా��డానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైల��రాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
#Peddi:
There's not a single A-lister actor in Indian Cinema today that can even DARE to attempt the role of #Peddi. Takes some serious guts to play it.
Sorry dear #Rangasthalam, you are no longer the best ever performance of #RamCharan. #Peddi takes the crown. 🔥
"పెద్ది" - ఓ కొండ నా కొడుకు చేసిన ప్రయాణం అనుకునేరు! కాదు, కాదు.. అది ఓ మొండి నా యాల ప్రస్థానం.
స్పాయిలర్-ఫ్రీ రివ్యూ.
"గెలుపుకి ఉన్న విలువ దేనికీ లేదు, అందుకే సక్సెస్ అయినోడు ఏం మాట్లాడినా దానికో విలువ ఉంటుంది" - ఈ లైన్ తీసుకుని బుచ్చి బాబు గారు చాలా గొప్ప సినిమా, చాలా మంచి సినిమా తీశారు.
"పెద్ది" గురించి చాలా రాయాలని ఉంది గానీ ఏం రాసినా, ఎంత రాసినా ఇంకా ఏదో.. ఎంతో కొంత మర్చిపోతానేమో అన్న భయం కూడా ఉంది.
"పెద్ది" చాలా నిజాయితీగా తీసిన సినిమా అని రైల్వే స్టేషన్‌కి పేరు పెట్టినప్ప���డు అర్థమవుతుంది. రచయిత / దర్శకుడు బుచ్చిబాబు గారి కమిట్మెంట్ అక్కడే ప్రేక్షకుడికి అర్థమైంది.
ఇది పూర్తిగా రామ్ చరణ్ గారి సినిమా. ఆంగ్లంలో వన్ మ్యాన్ షో అంటారు కదా!
బ్యాటర్, మల్ల యోధుడు మరియు... మూడు పాత్రలకు న్యాయం చేయటానికి ఆయన పడ్డ కష్టం, కమిట్మెంట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
దర్శకులు బుచ్చిబాబు గారి ధైర్యానికి, నిర్మాతల సాహసానికి ఎవ్వరైనా సలాం కొట్టాల్సిందే!
"పెద్ది" రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, స్ఫూర్తిదాయకమైన సినిమా. మొదటి సగంలో బి, సి సెంటర్ల కోసం బుచ్చి సర్ రాసుకున్న కొన్ని సన్నివేశాలు పిచ్చ లైట్.
ఎందుకంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకు పెద్ది, అప్పలసూరి మాత్రమే గుర్తుంటారు.. వారి పట్టుదల, వారి మొండితనం ఇంకా చాలా కాలం గుర్తుంటుంది.
రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, సినిమా చివరి అరగంట చాలా కాలం యాదుంటది.
థాంక్యూ @BuchiBabuSana గారు.. మీ గురించి ప్రత్యేకంగా మళ్ళీ రాస్తాను.
@AlwaysRamCharan మంచి సాలిడ్ & పొటెన్షియల్ రోల్ పడితే మీ కంటే తోపు పెర్ఫార్మర్ ఇక్కడ ఎవ్వడూ లేడని మళ్ళీ ప్రూవ్ చేశారు. కంగ్రాట్స్ అండీ.
@IamJagguBhai అప్పలసూరి.. ఎంత ఉదాత్తమైన పాత్ర సర్! మీరు ప్రాణం పోసి ఆయన్ని మరో స్థాయికి తీసుకు వెళ్ళారు.
@NimmaShivanna "ఉంటావా.. పోతావా?" ఎంత సటిల్‌గా చేశారు సర్! "పెద్ది"కి పెద్ద దిక్కు మీరే.
@arrahman మీ గురించి ఎంత చెప్పినా తక్కువే స���్! బిజిఎంతో సినిమాకి ప్రాణం పోశారు సర్.
"పెద్ది" సినిమాను కుటుంబంతో కలిసి హాయిగా థియేటర్లలో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
#Peddi