కష్టజీవి చెమట చుక్కలే చరిత్ర లిఖిస్తాయి.
పని చేసే చేతులే ప్రపంచాన్ని నిర్మిస్తాయి.
కలిసి కట్టుగా పోరాడదాం.
హక్కులు సాధించుకుందాం.
కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు
#MayDay
శ్రమజీవుల చెమట చుక్కలతోనే మానవజాతి పురోగమిస్తోంది.
కష్టజీవుల భాగస్వామ్యంతోనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోంది.
కార్మిక, కర్షక, కష్టజీవులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
#MayDay#InternationalWorkersDay#LabourDay#WorkersUnity
సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ రావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి.
దశాబ్దాల వలస పాలనలో సాగిన జలదోపిడీ, ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన కుట్రలను శాస్త్రీయంగా వివరించి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన అపర మేధావి ఆర్.విద్యాసాగర్ రావు.
వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవటం అంటే కేవలం ఒక వ్యక్తిని స్మరించుకోవటం కాదు, తెలంగాణ జల హక్కులను కాపాడుతామని, అందుకోసం ఎంత దాకైనా వెళ్ళి పోరాడతామని ప్రతిజ్ఞ చేయడం.
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్..
పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish బహిరంగ లేఖ✍️
ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్.
తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడు.
కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదు?
మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా?
మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలి.
పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు.
కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసింది, మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలి.
శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయి. కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేశారు.
శనగలకు మద్దతు ధర రూ. 5,875 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చింది.
జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారు?
కనీస మద్దతు ధర రూ. 3371 ఉంటే, ప్రైవేటు వ్యక్తులకు కేవలం రూ. 2500 కే రైతులు నష్టపోతూ అమ్ముకుంటున్నారు.
ఆరుగాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష అవసరమా? ఎకరాకు 26.50 క్వింటాళ్లే కొంటామనే నిబంధనను సడలించాలి.
ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలి?
తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుంది.
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్..!
పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత @BRSHarish గారు బహిరంగ లేఖ 🔥
రైతుల సమస్యలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్.
#CongressFailedTelangana#TelanganaPolitics
తెలంగాణ తల్లి.. ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపం. తెలంగాణ బిడ్డలంతా స్వచ్ఛందంగా ఊరూరా, వాడవాడలా విగ్రహాలు పెట్టుకొని పూజించుకున్నాం.
ఇప్పుడు మార్పు.. మార్పు అంటూ
తల్లి చేతిలో నుండి మన సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మను తీసేసి,
ఉద్యమానికి ఏమాత్రం సంబంధంలేని కాంగ్రెస్ తల్లిని సృష్టించి
ఆ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న దుర్మార్గుడు రేవంత్.
తల్లి రూపాన్నే మార్చిన చరిత్రహీనుడిగా రేవంత్ మిగిలిపోవడం ఖాయం!
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
ఈ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ భవన్‌కు తరలించుడు పక్కా!
ఎవడేమన్నా..
తెలంగాణ ఉన్నంత కాలం
కేసీఆర్ గారి పేరు
చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో
నిలబడి ఉంటది.
జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
❇️ తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా విజయ్ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
❇️ ఈ సందర్భంగా భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు
🔸 నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్షా దివస్ లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు.
🔸 తెలంగాణ ఉద్యమం అంటేనే కేసీఆర్ గారి త్యాగం.. ఆయన చేసిన పోరాట ఫలితమే నేటి తెలంగాణ
🔸 నా శవం మీద తెలంగాణ జెండా కప్పండని ప్రాణ త్యాగానికి తెగించి పోరాడిన గొప్ప నాయకుడు కేసీఆర్
🔸 కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం
🔸 సమైక్యవాదుల బాటలో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు
🔸 తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదు.. అది పోరాటంలో పుట్టిన భావోద్వేగం
🔸 నాడు ఉద్యమకారులపై తుపాకీ పట్టుకున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి.. నేడు తల్లి విగ్రహాన్ని మారుస్తున్నారు
🔸 అమెరికాలో మన బిడ్డలను జైల్లో వేసిన ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెడతావా? ఇది భారతీయులను అవమానించడమే
🔸 నాడు తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డది.. నేడు రేవంత్ పాలనలో మళ్లీ వెనుకబాటుకు గురవుతోంది
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..👇🏻
♦️ డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు. నవంబర్ 29న కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితమే డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటన.
♦️ నాడు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి కొట్లాడకపోతే డిసెంబర్ 9 ప్రకటన వచ్చేది కాదు. నేడు మనం చూస్తున్న జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉండేది కాదు.
♦️ కేసీఆర్ గారి దీక్ష, అమరుల త్యాగ ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం.
♦️ చరిత్ర గురించి మాట్లాడితే కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. కానీ రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, రేవంత్ అంటే ద్రోహం.
♦️ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయమంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి.
♦️ ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఆయన. అలాంటి వ్యక్తి నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడు.
♦️ తెలంగాణ తల్లి ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపం. ప్రజలు స్వచ్ఛందంగా ఊరూరా, వాడవాడలా విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్న తల్లిని రేవంత్ రెడ్డి మార్చాలనుకోవడం దుర్మార్గం.
♦️ రేవంత్ సృష్టించినది నకిలీ తల్లి, ఆ తల్లి చేతిలో నుండి మన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను తీసేసిన దుర్మార్గుడు రేవంత్.
♦️ జై తెలంగాణ అనని, ఉద్యమంలో జైలుకు వెళ్ళని రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు లేదు.
♦️ ఎన్నికల ముందు తలరాతలు మారుస్తానని చెప్పి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నాడు.
♦️ చేసింది శూన్యం.. ఎరువుల కొరత తెచ్చాడు, విత్తనాల ధరలు పెంచాడు, కరెంటు కోతలు తెచ్చాడు, రైతుబంధు ఎగ్గొట్టాడు. రైతు బీమా డబ్బులు కూడా కట్టకుండా రైతులను గోస పెడుతున్నాడు.
♦️ కాకతీయ తోరణాన్ని, చార్మినార్ ను చిహ్నం నుంచి తొలగిస్తానంటాడు. రవీంద్ర భారతి కంటే రామోజీ ఫిలిం సిటీ గొప్పదని మాట్లాడి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు.
కాళోజీ, దాశరథి, గద్దర్ లను చిన్నచేసి మాట్లాడుతున్నాడు.
♦️ అమెరికాలో మన తెలుగు పిల్లలకు బేడీలు వేసి జైల్లో పెట్టిన ట్రంప్ పేరును హైదరాబాద్ రోడ్డుకు పెడతాడట. పన్నులు పెంచి, వీసాలు కఠినం చేసి భారతీయులను ఇబ్బంది పెడుతున్న ట్రంప్ పేరు పెట్టడం అంటే భారతీయులను అవమానించడమే.
♦️ మన పిల్లల ఉద్యోగాలు ఊడగొడుతున్న వ్యక్తికి నీరాజనాలు పడతావా రేవంత్ రెడ్డి?
♦️ డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తామని ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్న సోనియా గాంధీని నాడు బలి దేవత అన్నది రేవంత్ రెడ్డే.
♦️ ఇప్పుడు ఆ సోనియా గాంధీకి గుడి కడతామంటున్నాడు. నాడు తెలంగాణ వెనక్కి తీసుకున్నప్పుడు మన యువకులు బలిదానాలు చేసుకున్నారు.
♦️ సోనియాగాంధీ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసీసీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నారు యాదిరెడ్డి.
♦️ యాదిరెడ్డి పార్థివ దేహాన్ని ఏపీ భవన్ కు కూడా రానివ్వని దుర్మార్గపు పాలన అది.
♦️ ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. కేసీఆర్ గారు అంటేనే త్యాగాలు.
♦️ బహుశా దేశంలో ఒక కాజ్ కోసం ఇన్ని పదవులకు రాజీనామా చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారే.
♦️ పదవులే కాదు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్.
♦️ నిమ్స్ లో కేసీఆర్ గారికి సోడియం లెవెల్స్ తగ్గిపోయినాయి. కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి మనిషి చనిపోతాడని డాక్టర్లు మాకు చెప్పారు.
♦️ నేను పోయి కేసీఆర్ గారికి దీక్ష విరమించుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తే, నాకే తిరిగి ధైర్యం చెప్పి తెలంగాణ వచ్చేవరకూ నా ప్రాణం పోదు మనం కొట్లాడుదామని అన్నాడు కేసీఆర్.
♦️ అయితే జైత్రయాత్ర లేకపోతే శవయాత్ర అని కేసీఆర్ గారు తేల్చి చెప్పారు.
♦️ నా శవం మీద తెలంగాణ జెండా కప్పండని చెప్పిన గొప్ప నాయకుడు.
♦️ ఆయన ఉద్యమంలో ఆమరణ దీక్ష వల్ల, పోరాటం వల్ల వారి ఆయుష్షు పది సంవత్సరాలు తగ్గింది.
♦️ దేవుని దయవల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నారు కేసీఆర్ గారు ఇప్పుడు.
♦️ తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తారు. కచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు.
♦️ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించారు. తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డదని జయశంకర్ సార్ చెప్పేవారు.
♦️ కేసీఆర్ గారి పోరాటం వల్ల, తెలంగాణ రావడం వల్లే నేడు 24 గంటల కరెంటు, ఇంటింటికి నీళ్ళు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైంది. తలసరి ఆదాయంలో, వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది.
♦️ కానీ నేడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణను మళ్లీ వెనుకబడేసే కుట్ర జరుగుతోంది.
♦️ సమైక్యవాదుల బాటలో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు.
♦️ ప్రజల పక్షాన కేసీఆర్ గారు మళ్ళీ పోరాటం చేస్తారు, కచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు.
♦️ ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది.
దశాబ్దాల ఆశ, ఆవేదన, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఉద్విగ్న భరితంగా మారి ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టిన సుదినం నేడు.
నవంబర్ 29 దీక్ష దివాస్
డిసెంబర్ 9 విజయ్ దివాస్
2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన రోజులివి.
కేసీఆర్ పోరాటం + నాలుగు కోట్ల ప్రజల చైతన్యం = తెలంగాణ ఉద్యమ చరిత్ర
చెరిపేస్తే చెరిగిపోయేది కాదు..
చరిత్ర నుదిటిపై కాలం చేసిన సంతకం..
కేసీఆర్ గారు.
#JaiTelangana #JaiKCR
కరప్షన్ నేర్పడానికి కాలేజీ పెడితే..
తెలంగాణ కాంగ్రెస్ కరప్షన్ పాలనను ఒక సిలబస్ మోడల్ గా పెట్టొచ్చు.
ఈ రెండేండ్లలో రేవంత్ చేసిన ఆర్గనైజ్డ్ కరప్షన్ లను బయటపెట్టిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish#SCAMgress
ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రజా భవన్ కు వచ్చిండు..
పత్తా లేకుండా పోయిండు.
ప్రజా భవన్
పొద్దుగాల బ్రేక్‌ఫాస్ట్ మీటింగులు..
మధ్యాహ్నం సెటిల్మెంట్లు..
సాయంత్రం గానా భజానాలు,
సంగీత్‌లు, ఎంగేజ్మెంట్లు,
విందులు వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
రేవంత్ రెడ్డి నిర్వహించేది గ్లోబల్ సమ్మిట్ కాదు గోబెల్స్ సమ్మిట్.
దావోస్ పెట్టుబడుల్లో డొల్ల కంపెనీల పెట్టుబడులే ఎక్కువ, ఫ్యూచర్ సిటీలో కూడా ఫేక్ పెట్టుబడులతో జనాల్ని భ్రమింపజేయాలని చూస్తున్నావ్.
అబద్దాలతో అపనిందలతో నీ పాలన ఎక్కువ కాలం సాగించలేవు.
రెండేళ్లలో నీ అరాచకం రెట్టింపు అయ్యింది, తప్ప ప్రజలకు మేలు జరగలేదు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్).
సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏళ్లు.
నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు... డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు.
జై తెలంగాణ ✊
#JaiTelangana