కెమెరా చూస్తోంది అనుకుంటే
మన ప్రవర్తన మారుతుంది.
AI చూస్తోంది అనుకుంటే
ఇంకాస్త జాగ్రత్త పడతాం.
కానీ అసలు ప్రశ్న—
కెమెరా నిజంగా
ఏం చూస్తోంది?
టెక్నాలజీ కంటే ముందు
దాని గురించి మనకు
చెప్పే సమాచారం నిజమై ఉండాలి.
ఎందుకంటే
నిఘా కంటే ప్రమాదకరమైనది
నిఘా ఉందనే భ్రమ కూడా కావచ్చు.
Digital Literacy అంటే
Technology ఎలా ఉపయోగించాలో
తెలుసుకోవడం మాత్రమే కాదు.
ఎప్పుడు ఆగాలో
తెలుసుకోవడం కూడా.
**PAUSE.
THINK.
VERIFY.**
కొన్నిసార్లు
ఒక నిమిషం ఆగడం…
ఒక జీవితకాలపు నష్టాన్ని
ఆపగలదు.
✍️ TMSRAO
మన ఫోన్ను Hack చేయడం కాదు…
మన తొందరను Hack చేస్తున్నారు.
“ఇప్పుడే చేయాలి.”
“ఇప్పుడే Pay చేయాలి.”
“ఇప్పుడే Decision తీసుకోవాలి.”
Scamలో అత్యంత ప్రమాదకరమైన Link
కొన్నిసార్లు మన భయమే.
Offlineలో ఎవరైనా
“నీ డబ్బంతా ఇప్పుడే ఇవ్వు” అంటే
మనం అనుమానిస్తాం.
Onlineలో అదే మాట
ఒక Logoతో,
ఒక Video Callతో,
ఒక Official-looking Messageతో వస్తే
ఎందుకు నమ్ముతున్నాం?
Screen నిజానికి
సాక్ష్యం కాదు.