తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ ఈ ప్రతిజ్ఞ చేద్దాం.
ఈ నేల ఆత్మగౌరవం, అస్తిత్వ రక్షణ కోసం
తెలంగాణ సైనికులుగా నిరంతరం పోరాడదాం
“తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదిద్దాం..
మన తెలంగాణను కాపాడుకుందాం!”
జై తెలంగాణ ✊
జై కేసీఆర్ ✊
#TelanganaFormationDay
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. మన గులాబీ జెండా!
అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా..
అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా!
బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రజలకు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
ఉద్యమ కాలమైనా, పరిపాలనా ప్రస్థానమైనా… నిత్యం తెలంగాణనే శ్వాసించిన నేత!
రాష్ట్రం కోసం ఢిల్లీ గద్దెనే ఎదిరించి, ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన ధీశాలి!
ప్రజల కోసం పోరుగళమై గర్జించే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!
#HappyBirthdayKCR
తెగువ చూపి తెలంగాణ సాధించిన వీరుడా..
అందుకో మా వందనం!!
తన ప్రాణమే ఫణంగా పెట్టి...
మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది...
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అని గర్జించి
ప్రతి తెలంగాణ బిడ్డను ఉద్యమంలో మమేకం చేసి ఢిల్లీ మెడలు వంచిన అపూర్వమైన ఘట్టం.
నవంబర్ 29, 2009
#DeekshaDiwas
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని బ్యాలెట్ పేపర్లోని 3వ నెంబర్ క్రమసంఖ్యలో మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి.
తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాలన్నా.. నిధులు తేవాలన్నా.. కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యం.
పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం..
ప్రశ్నించే గొంతులను పార్లమెంట్‌కు పంపిద్దాం.
#VoteForCar#LokSabhaElections2024
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనం..
ఐదు నెలల్లో ఆగమాగం.
పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం..
ప్రశ్నించే గొంతులను పార్లమెంట్‌కు పంపిద్దాం.
#VoteForCar
భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి @KyamaMalleshBRS కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ గెలవాలి..
‘నేను ఒక్కటే చెబుతున్నా. ఇవాళ రైతుల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు గానీ, ఎవరికైనా గానీ మోసం జరిగితే.. అన్యాయం జరిగితే నిద్రపోను. భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులుపడ్డంత పోరాటం చేస్తా. ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడీ కొట్టించింది.
చల్లగా ముందుకుపోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి.. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాలి.
మీ అందరినీ కోరుతున్నా. కార్యకర్తలు, నాయకులు అందరూ క్యామ మల్లేశ్‌ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. ఈ రోజు చూపించిన ఉత్సాహాన్ని ఏడు నియోజకవర్గాల్లో మే 13వ తేదీ వరకు చూపించి.. కారు గుర్తుకు ఓటేసి క్యామ మల్లేశ్‌ను భారీ మెజారీటీతో గెలిపించాలి అని కేసీఆర్ అన్నారు.
#VoteForCar #KCRBusYatra
కాంగ్రెస్ అంటేనే జూటా పార్టీ
రైతుబంధుపై సీఎం, డిప్యూటీ సీఎం తలోమాట
3 ఎకరాల వరకు రైతుబంధు వేశాం అన్న భట్టి విక్రమార్క
5 ఎకరాల వరకు రైతుబంధు వేశాం అంటున్న రేవంత్ రెడ్డి
ఇప్పటికీ సగానికి పైగా రైతులకు అందని రైతు బంధు
మోసాలకు, అబద్ధాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ.. ఇలా జూటా మాటలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ నాయకులు.
రైతుల ఉసురు కాంగ్రెస్ కు తగులుతుంది
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
🔹కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితి
🔹నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు, వేల ఎకరాల్లో పంట నష్టం
🔹ఎండిపోయిన వరి రైతులకు ఎకరాకు రూ. 50 వేలు, మిరప రైతులకు రూ. 80 వేలు నష్ట పరిహారం ఇవ్వాలి
🔹గత కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చాం
🔹కక్ష పూరితంగా ప్రాజెక్టుల నుండి రైతులకు నీళ్లు వదలని కాంగ్రెస్ ప్రభుత్వం
🔹సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి, మిరప తోటలను రైతులతో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి