తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ��ద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?
తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?
నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన..
���తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..
“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ??
తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు..!
జై తెలంగాణ
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థుల పై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గం.
ఇదేనా ప్రజా పాలన అంటే,
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?
👉నాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీస��కువెళ్లి ఓట్లు కొల్లగొట్టారు.
👉నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారు.
విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలి. ఈ ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
@TelanganaCMO
#CongressFailedTelangana
*రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువకులు విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కేటీఆర్*
*తన అడ్డగోలు వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్*
నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి, అత్యంత దివాళకోరుతనంతో మాట్లాడారు
నిరుద్యోగుల కోసం పోరాటం చేస్త���న్న మోతీలాల్ ని అవమానించేలా మాట్లాడారు
అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారు
అందుకే ఈరోజు తెలంగాణ యువత భగ్గుమంటుంది..
మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది
8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇయ్యని మీరు, మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలి
మిమ్మల్ని వదిలిపెట్టము... క్షేత్రంలో నిలదీస్తాం విద్యార్థులతో నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతాం
ఇది రాజకీయ పార్టీల సమస్��� కాదు... లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశం
ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఈగోకి... బేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలి
కండకావరం తో మాట్లాడడం రేవంత్ రెడ్డి ఆపాలి
రేవంత్ రెడ్డి నిరుద్యోగులు విద్యార్థులపై చేసిన తన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి
@BRSparty @KCRBRSPresident @KTRBRS
ఒక్కో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వంద కోట్లు సంపాదించడానికి వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ముఖ్యమంత్రి గారూ... కావాలంటే మీ పంచన చేరిన రియాజ్ ను అడగండి చెబుతాడు!
ఇక నిరుద్యోగులను కిరాయి మనుషులనడం మీకే చెల్లు. ఆనాడు @RahulGandhi గారిని అశోక్ నగర్ కు తీసుకొచ్చినపుడు మీ వెంబడి వచ్చిన వాళ్లందరు కిరాయి మనుషులేనా? Just Asking.
వచ్చిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలి��్చిండ్రా? తమరికి ఉద్యోగాల నోటిఫికేషన్ కు, నియామకాలకు తేడా తెలవక పోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం.
పక్కనున్న AP లో 1:50 నుండి 1:100 చేయగలిగినప్పుడు ఇక్కడ TG లో ఎందుకు చేయలేం? In this particular case, you are neither changing the syllabus nor the examination pattern. You are simply going to change the number of candidates who will be eligible for particular exam. Did you ask the Advocate General to come up with a solution? We are not sure.
ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్ కుమార్ సర్ ఒక్క రూపాయికే గ్రూప్ 2 and 3 కోచింగ్ అందిస్తున్నారు.... అలాగే గ్రూప్స్ postpone అనంతరం చాలా కోచింగ్ సెంటర్స్ రూపాయి ధరకే కోచింగ్ అందించినవి...పేద విద్యార్థులకు సాయం చేసినవి....మీకు దగ్గరున్న పక్క రాష్ట్ర కోచింగ్ సెంటర్ల లాగా లక్షలు కడితేనే టెస్టు సీరిస్ ఇస్తం అనే సంస్కృతి తెలంగాణ బిడ��డలకు లేదు.
అందుకే అశోక్ వెనక వేలాది మంది నిరుద్యోగులు ర్యాలీ ఐతున్నరు .
అసలు ప్రాబ్లం ఏందంటే…
మీకు నిరుద్యోగుల గోస అర్థం ఐతలేదు. అర్థం చేసుకునే ప్రయత్నమూ చెయ్యడం లేదు. మీ చుట్టూ ఉన్న సోకాల్డు మేధావులేమో పదవుల వేటలో ఉన్నరు. నిరుద్యోగులను వాడుకొని పదవుల్లో ఉన్నోళ్లకేమో పోటీ పరీక్షలు రాసిన అనుభవం లేదు..వచ్చిన పదవులను కాపాడుకనీకె వాళ్లు భౌన్సర్లను, బూతులను నమ్ముకున్నరు.
ఇక అధి��ారులేమో తమరిని నిరంతరం ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీగా ఉన్నరు. వాళ్లకు పరిష్కారం తెలవక కాదు, కానీ మీకు పరిష్కారం ఇష్టం లేదు కాబట్టి వాళ్లు మీకు అసలు విషయం చెప్పడం లేదు. కావాలంటే మీరు ఈ రోజు మీ @TelanganaCS కు చెప్పి చూడండి, సాయంత్రం కల్లా వాళ్లు మీకు అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తరు.
మీకేమో ప్రతీదీ రాజకీయ కుట్ర లాగనే కనిపిస్తున్నది. నిరుద్యోగులకు సంఘీభావంగా మాట్లాడిన ప్రతి ���్యక్తిని తలకుమా��ినోడని మీరంటున్నరు! మరి మీరు కూడా 2023లో ఇదే పని చేసిండ్రు కదా? మరి మిమ్మల్ని ఏమనాలి?ఆనాడు చిక్కడపల్లి కి వచ్చిన రాహుల్ గాంధీని ఏమనాలి?? అసలు ప్రజాసమస్యల పై మాట్లాడే బాధ్యత ప్రతిపక్షాలకు లేదంటారా ?
You must stop looking at everything from a political and commercial angle, sir. Then only you will be able to arrive at a pragmatic solution in a democracy.
Curious to know what’s going on in your mind at this moment!
#LiberateTelanganaFromCongress
#DSC
#JobCalendar
ఉస్మానియా యూనివర్సిటీలో..
జీన్యూస్ రిపోర్టర్, కెమెరామెన్ లను
అక్రమంగా అరెస్టు చేయడం దారుణం
విధి నిర్వహణలో భాగంగా...
జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ?
డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా ?
నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద..
మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన..
ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
జీన్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్టు..
ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా ?
ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా ?
ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం ?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి..
ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస���తున్నాయి.
మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు
అడగడుగునా దర్శనమిస్తున్నాయి
జర్నలిస్టులపట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం
ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదు
వెంటనే జీన్యూస్ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలి