వేగం పుంజుకున్న పల్నాడు–ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’ మెగా తాగు నీటి పథకాల పనులు
•40 శాతానికి పైగా పూర్తయిన ఇన్ టేక్ వెల్స్ – 200 కి.మీ. పైప్లైన్ నిర్మాణం పూర్తి
•పనుల్లో మరింత వేగం పెంచాలి
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి… తాగు నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదేశం
•పనుల నాణ్యతను క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలిస్తానన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో పని చేయాలని సూచన
•జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆర్.డబ్య్లూ.ఎస్. అధికారులతో సమీక్ష
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు–ప్రకాశం లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా పల్నాడు–ప్రకాశం ప్రాంతాల్లో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు నిర్ణీత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. బుధవారం పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు వివరించారు. రెండు మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ. 2,500 కోట్లు కాగా, అందులో రూ. 1,290 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో, 593 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఇంటేక్ వెల్ నిర్మాణం పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. 119 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్ పనులు, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రకాశం వాటర్ గ్రిడ్ పథకం కింద ఇప్పటి వరకు 53 కిలోమీటర్ల మేర పైపు లైన్ల నిర్మాణం పూర్తి చేసినట్టు వివరించారు.రూ. 1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని 235 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించగా, ఇప్పటికే 152 కిలోమీటర్ల మేర పైపు లైన్ నెట్వర్క్ పూర్తయ్యింది. ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు కూడా పురోగతిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ. 95 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్టు తాగునీటి సరఫరా విభాగం అధికారులు వివరించారు.
అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తాగు నీటి సమస్యతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులుపడుతున్న పల్నాడు, ప్రకాశం ప్రాంతాల ప్రజలకు ఈ ప్రాజెక్టులు జీవనాధారంగా మారనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు చాలా కీలకమైనవి. వీటి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్ణీత గడువులోపు ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగు నీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల మధ్య పైపు లైన్ల నిర్మాణం, అటవీ అనుమతులు లాంటి సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ కార్యకలాపాలను సాధ్యమైనంత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలి. భుజం శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతాను. స్వయంగా పనుల నాణ్యతను పరిశీలిస్తా. జల్ జీవన్ మిషన్ పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దు. పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పూర్తయితే ఈ రెండు ప్రాంతాల పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల పరిధిలో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత ఏర్పడుతుంద”న్నారు.
రెండు భుజాలకు శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసినా జనసేనాని ధ్యాసమంత ప్రజల సంక్షేమం పైనే..!
@APDeputyCMO, శ్రీ @PawanKalyan గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అనంతపురంలో మార్మోగిన ప్రార్థనలు...
@JanaSenaParty ఉమ్మడి అనంతపురము జిల్లా అధ్యక్షులు, అహుడా చైర్మన్ శ్రీ @tc_varun గారి సూచనలతో నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు గారి ఆధ్వర్యంలో కోర్ట్ రోడ్ లోని #శ్రీ_వరద_ఆంజనేయ_స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు...
శ్రీ అంజనేయ స్వామి వారి ఆశీస్సులతో జనసేనాని మరింత ఉత్సాహంతో ప్రజాసేవను కొనసాగించాలని ఆకాంక్షించిన నగర, జిల్లా కమిటీ నాయకులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వీరమహిళలు మరియు కార్యకార్తులు తదితరులు పాల్గొన్నారు.
సరిగ్గా 3ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన శాఖ ద్వారా దేశం లోన్ 2 స్థానం లో వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రోడ్లను తీర్చి దిద్దారు. పార్టీ నాయకులు రోడ్ల కోసం పోరాడడం నుండి ఏకంగా కళ్యాణ్ గారే రోడ్లను స్వయంగా నిర్మించడం వరకు తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు #PawanKalyanAneNenu
సరిగ్గా 3 ఏళ్ల క్రితం @PawanKalyan గారి ఆదేశాల మేరకు శ్రమదానం లో భాగంగా @tc_varun అన్న రోడ్ల కోసం రోడ్ల మీద తిరిగాడు ధర్నాలు చేసాడు ఫలితం శూన్యం ఇంకా తానే స్వయంగా సొంత డబ్బులు పెట్టి ఏకంగా రోడ్లే వేసాడు.
@JSPShatagniTeam#PawanKalyanAneNenu
కాపు ద్రోహులు వైయస్ జగన్ రెడ్డి పాలేర్లు...
గత వైసిపి హయాంలో కాపుల రిజర్వేషన్లు.. కార్పొరేషన్ లు నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా...
ప్రతిభగల కాపు యువతను విదేశీ విద్యకు దూరం చేయలేదా...
కట్టే సాయిపై దౌర్జన్యం జరిగితే అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వచ్చి ధైర్యం ఇచ్చారు..
ఇప్పుడు అదే సాయికి శ్రీకాళహస్తి దేవాలయ చైర్మన్ గా అవకాశం కల్పించారు..
వైసీపీలో ఒక కార్యకర్తకు ఇంతటి ప్రాధాన్యత స్థానం లభిస్తుందా...
జగన్ రెడ్డి ఆదేశాలతో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించినప్పుడే మీ చిత్తశుద్ధి తెలిసిపోయింది..
కులాలను కలిపి ఆలోచనతో సమాజం కోసం.. దేశం కోసం.. పోరాడే @APDeputyCMO , @JanaSenaParty శ్రీ @PawanKalyan గారిని విమర్శించే స్థాయి మీకు లేదు...
ఎంతో పరిపక్వత కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వంటి నాయకుడు వద్ద పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం..
కాపులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దూరం చేయాలని కలలో కూడా అనుకోకండి...
కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్న సంకల్పంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పని చేస్తుంటే..
జగన్ రెడ్డికి ఊడిగం చేయించాలన్న దిశగా ఈ కొందరు కాపు నేతలు చిలక పలుకులు పలుకుతున్నారు..
శ్రీ #పవన్_కళ్యాణ్ గారు కాపులకే కాదు ఏ ఒక్క వర్గానికి కూడా దూరం చేయలేరు..
మరోసారి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే సో కాల్డ్ కాపు నేతలకు మూల్యం తప్పదు..
ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అహుడా చైర్మన్ శ్రీ #TCVarun గారి హెచ్చరిక..
కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు అహుడా చైర్మన్ శ్రీ టీసీ.వరుణ్ గారు @tc_varun#IdiManchiPrabhutvam