@HariKrishnaCMO sir please help us for my brother.
He is admitted in hospital, Changing the liver transplant treatment, his mother donar for him , total 40 lakhs approximately, but he doesn't have, he have only 3days for treatment please help us sir thank you 🙏 @ysjagan
వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని నేడు ప్రారంభిస్తున్నాం. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం వంటి విద్యా సామాగ్రి కోసం ఇబ్బంది పడకుండా పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజు నుంచే ఈ కిట్ల పంపిణీని మన ప్రభుత్వంలో చేపడుతున్నాం. ఈ ఏడాది యూనిఫాం డిజైన్‌లో మార్పులు చేసి, మెరుగ్గా తీర్చిదిద్దాం. షూస్ నాణ్యత పెంచడంతో పాటు పుస్తకాల బ్యాగ్ సైజ్‌ను కూడా పెంచాం. విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన కిట్లను రూ.1,042 కోట్ల ఖర్చుతో అందిస్తున్నాం.
వైయస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా మన ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, రైతులకు ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల వంటి వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. రాష్ట్రంలోని 10,444 ఆర్బీకేల పరిధిలో రైతులు ఒక గ్రూప్‌గా ఏర్పడి, ఈ వ్యవసాయ పరికరాలను తక్కువ ధరకే ఇతర రైతులకు అద్దెకిచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన నిర్వచనం చెప్పేలా మన ప్రభుత్వం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు మన ప్రభుత్వం సుప్రీంకోర్ట్ వరకూ వెళ్ళి పోరాడింది. నేడు అదే అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ళ స్థలాలకు 50,793 మంది అక్కచెల్లెమ్మలను యజమానులను చేసింది మన ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే అవకాశాన్ని నాకు కల్పించిన దేవుడికి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను.
రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో నేడు శంఖుస్థాపన చేశాం. 4 బెర్తులతో, దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్ట్‌ను నిర్మిస్తున్నాం. అలాగే కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్ట్‌ను జాతీయ రహదారి-216కి, గుడివాడ-మచిలీపట్నం రైల్వేలైన్‌కు అనుసంధానం చేస్తున్నాం.