ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.
పుట్టినరోజు సందర్భంగా మునుగోడు పట్టణంలోని శివరామ ఆలయంలో శివయ్యకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం మునుగోడు లోని అధికారిక క్యాంపు కార్యాలయంలో జన్మదినం సందర్భంగా వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు..
మునుగోడులో ఆధునికరించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు @Bmaheshgoud6666 గారికి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను, స్థానిక నాయకులను పిసిసి అధ్యక్షుడి కి పరిచయం చేసిన గౌరవ ఎమ్మెల్యే..
నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటున్న కోమటిరెడ్డి రాజన్న!!
KOMATIREDDY SUSHEELAMMA FOUNDATION
ఆపరేషన్లు చేయించి వదిలేయకుండా ఆపరేషన్ అయిన వారికి రెండవ సారి వైద్య పరీక్షలు చేయించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు
తన తల్లి పేరు మీద పెట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజల చూపు చల్లగా ఉండాలని ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కంటి సమస్యలు వున్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు..
#AdminPost #KomatireddyRajgopalReddy
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీ గ్లోబల్ ప్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిస్టాన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సుకు హాజరు అవ్వడం జరిగింది..
ఈ భోగి, ప్రజలందరి జీవితాల్లో భోగభాగ్యాలతో పాటుగా సుఖసంతోషాలను అందించాలని, ప్రతీ ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ..
రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు!!
#HappyBhogi2025
ఎన్టీఆర్ గారు అంటే నాకు గౌరవం ఉంది.
నేను అనని మాటల్ని అన్నానని వక్రీకరించి దుష్ప్రచారం చేశారు..
ఎన్టీఆర్ లెజెండరీ నాయకుడు, ఆయనంటే అందరికీ అభిమానం..
నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు, దయచేసి మరోసారి ఇలాంటివి (అబద్ధపు ప్రచారాలు) పునరావృతం కాకుండా చూడాలని మీడియా సోదరులకు విజ్ఞప్తి.
- కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా యాదవులకు గొర్రెల పంపిణీ పథకం సందర్భంగా లబ్ధిదారుల ఎకౌంట్లు ఫ్రీజ్ చేసిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం..
నేటికీ ఎకౌంటు ఫ్రీజ్ ఎత్తివేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని నా దృష్టికి తీసుకువచ్చిన నాంపల్లి మండలం - దేవత్ పల్లి గ్రామ యాదవులు..
వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి వెంటనే అకౌంట్ ఫ్రిజ్ ను ఎత్తివేయాలని కోరడం జరిగింది..
#KomatireddyRajgopalReddy #Munugode #BRSFailedTelangana
Remembering the Iron Lady of India, Smt. Indira Gandhi Ji, on her birth anniversary.
A visionary leader who shaped India's destiny with courage, determination, and compassion. Her legacy continues to inspire us. 🙏
#IndiraGandhi#IronLady
చౌటుప్పల్ మండలం, ఆరెగూడెం గ్రామంలో
𝟭𝟭 𝗞𝗩 విద్యుత్ తీగలు ఇండ్ల మీద నుండి ఉండటం వలన ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకునే వారు పూర్తిస్తాయిలో కట్టుకోలేకపోతున్నారు.
కరెంట్ తీగల వలన ఎలాంటి నష్టం జరగకముందే అధికారులు స్పందించగలరు.
@rajgopalreddy_K