“అందెశ్రీ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కవిగా, గాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయం ఉండొచ్చు.. కానీ నాకు మాత్రం ఉద్యమకారుడే కాదు.. అందెశ్రీ నాకు ఒక ఆత్మబంధువు” అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. “అందెశ్రీ గానంలో ఉన్న గొప్పతనం, వారి గళంలో ఉన్న స్ఫూర్తి.. ఈనాడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానంటే... ఆ స్ఫూర్తి నాలో రగిల్చిన మాట నిజం..” అని భావోద్వేగంతో చెప్పారు.
✅తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ గారి జయంతి సందర్భంగా ఘట్కేసర్లో వారి స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
✅అందెశ్రీ గారికి పుష్పాంజలి ఘటించారు. భార్య మల్లుబాయి గారు, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ కుమారుడు దత్తుల సమక్షంలో స్మతివన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమి పూజ నిర్వహించారు.
✅ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “కవి, గాయకుడు, ఉద్యమకారుడు.. నాకు ఆత్మబంధువుగా మారాడు. నా కుటుంబ సభ్యుడయ్యారు. మా కుటుంబంలో మేం ఏడుగురం అన్నదమ్ములం. నేను నాలుగో వాడిని. నాకు మా పెద్దన్ననే స్పూర్తి. తమ్ముడు ఒక స్థాయిలో ఉండాలని మా అన్న ఎన్నో కలలు గన్నడు. నేను ఎదుగుతున్న క్రమంలో నేను మా అన్నను కోల్పోయా. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందెశ్రీ” అని చెప్పారు.
✅ఈ సందర్భంగా అంద��శ్రీ గారితో జరిగిన పరిచయ ప్రస్థానం, సాన్నిహిత్యాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. తెలంగాణ గడ్డపైన ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్నప్పుడు, ఈ తెలంగాణను ఆక్రమించుకుని దోచుకోవాలనుకుంటే ఏ తరమైనా అందెశ్రీ మళ్లీ పుడుతాడని హెచ్చరించారు.
✅“అందెశ్రీ స్పూర్తి మన గుండెల్లో నిత్యం కొలువై ఉంటుంది. ఒక స్ఫూర్తి ప్రదాతగా అందెశ్రీ అందరి గుండెల్లో ఉంటారు. అందెశ్రీ స్ఫూర్తే ప్రజా ప్ర��ుత్వానికి శ్రీరామ రక్ష. అందెశ్రీ, గద్దర్ స్ఫూర్తితో ప్రభుత్వం ఉంటుంది” అని పేర్కొన్నారు.
✅తెలంగాణ ఉద్యమంలో ��ెక్కలు ముక్కలు చేసుకొని.. గొంతుని, జీవితాలను ఉద్యమానికి అంకితం చేసిన 9 మందిని గుర్తించి .. పార్టీని, జెండాను చూడకుండా.. సత్కరించి ప్రతి కుటుంబానికి రూ. కోటి అందజేశాం. ఇది నా సొమ్ము కాదు. ప్రజల సొమ్ము అని చెప్పారు.
✅అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ.. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. వంటి ఎన్నో పాటలు.. అవి పాటలు కాదు. తూటాలై.. ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కుప్పకూల్చే మహా ఫిరంగులై పేలాయని ��ుఖ్యమంత్రి గారు అందెశ్రీ గారిని స్మరిస్తూ పేర్కొన్నారు.
✅పదాలపై పదాలు పేర్చి తెలంగాణ ప్రజల గుండెళ్ల్లో అందెశ్రీ రగిల్చిన ఉద్యమ స్ఫూర్తి, ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డను ఉద్యమంవైపు నడిపించిన ఉద్యమకారుడని స్మరించుకున్నారు.
✅రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024 జూన్ 2వ తేదీన జయ జయహే తెలంగాణ.. గీతాన్ని రాష్ట్ర గీతంగా జాతికి అంకితం చేసిన సందర్భంలో అందెశ్రీ గారి భావోద్వే��ానికి లోనైన సందర్భాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు.
#AndeSri #SmruthiVanam #JayaJayaheTelangana
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, కార్మిక నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. #RajBahadurGour
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో ��మీక్షిస్తారు.
రాత్రి కొడంగల్‌లో బసచేసి మరుసటి రోజు (22వ తేదీన) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
#Kodangal #EducationHub #Vikarabad
జపాన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ @Pvsindhu1 గారికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కెరీర్లో తొలి సూపర్-750 టైటిల్‌ను సాధించడం భారత క్రీడా రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. తన ప్రతిభ, కృషి, పట్టుదలతో దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
#CMRevanthReddy #PVSindhu #JapanOpen2026 #Badminton #India #Champion
Most of you know I am a die-hard sports and a #football lover. I loved the day we could bring GOAT #Messi to #Hyderabad to share the pitch with children of Telangana.
But there is a deeper purpose and vision for my support of the FIFA World Cup.
I am convinced one day @IndianFootball team will play in the World Cup Finals and even host it. And mark my word, several of those future stars will be from #Telangana
Enjoy the finals.
రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం భారతీయ పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం (#FLO) ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం శిల్పారామం పక్కన వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రకటించారు.
🔶#FICCI ఎఫ్ఎల్వో (హైదరాబాద్) ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ విభాగం ప్రతినిధులు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (@ficci_india) ఏర్పడి 2027 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుం��ున్న నేపథ్యంలో నిర్వహించే కార్యక్రమాలను వివరించారు.
🔶ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. హైటెక్ సిటీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సీఐఐ కార్యాలయానికి మధ్యలో ఫిక్కీ ఎఫ్ఎల్వో కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.
🔶ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న #BharatFutureCity ��ో కూడా ఫిక్కీ భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారు కోరారు. ఫిక్కీ ప్రధాన కార్యాలయం కోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడి��చారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫార్చూన్ 500 కంపెనీలను నెలకొల్పాలన్నది ప్రభుత్వ సంకల్పమని, ఫిక్కీ మహిళా పారిశ్రామిక వేత్తల పాత్ర కూడా చాలా కీలకమవుతుందని చెప్పారు.
🔶ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మహిళా సాధికారత కోసం మరొక పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగిన దేశాల్లో ఆర్థికాభివృద���ధి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు.
🔶మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సమీక్షిస్తామని తెలిపారు. వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తున్న మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అవార్డులు బహూకరించి గౌరవించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.
🔶ఈ కార్యక్రమంలో #TelanganaCS సంజయ్ జాజు గారు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు గారు, ఎఫ్ఎల్వో జాతీయ అధ్యక్షురాలు పూజా గార్గ్ గారు, ఎఫ్ఎల్వో హైదరాబాద్ చైర్పర్సన్ సీతా రెడ్డి గడ్డం గారితో పాటు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
#Telangana #WomenEmpowerment #WomenEntrepreneurs
LIVE: Hon'ble Chief Minister Sri A. Revanth Reddy Participates in the Foundation Stone Laying for Ande Sri Smruthi Vanam and Statue at Ghatkesar | Ande Sri Jayanti https://t.co/P8KuiUUwse
ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు అధికారులను ఆదేశించారు. నిత��యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు అన్నీ కల్తీ అవుతుండటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (#TGFADCA) పై ఎంసీహెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు.
✅ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వినియోగిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
✅ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగంతో పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు బయట పడుతున్నాయని, దీంతో కొన్ని దేశాలు దిగుమతులకు నిరాకరిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు.
✅మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలు రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారని, అధిక ధరలు చెల్లించి ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నప్పటికీ అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
✅కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు అమలులో ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులకు సూచించారు. ఆయా అధ్యయనాల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించి శాసనసభలో సమగ్ర చర్చ చేపడతామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. శాసనసభలో చర్చతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించాలని సూచించారు.
✅కల్తీలకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించేందుకు విజిల్ బ్లోయర్ వ్యవస్థను, టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
✅కల్తీల నిరోధానికి ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. అక్కడ నిబంధనలను అమలు చేసి, వాటి అమలులో ఎదురయ్యే లోటుపాట్ల ఆధారంగా ముందుకు సాగాలని సూచించారు.
✅ ఈ సమావేశంలో @TelanganaCS సంజయ్ జాజు గారు, @TelanganaDGP సీవీ ఆనంద్ గారు, ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు గారు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి గారు, ఎన్.శ్రీధర్ గారు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#Telangana #FoodSafety #PublicHealth #ZeroAdultration
చైనాలోని ఒర్డోస్‌లో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో స్వర్ణ పతకం సాధించిన #TGSWREIS ఆధ్వర్యంలోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని నరిమళ్ల ప్రవల్లికను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఉన్నతాధికారులతో కలిసి ప్రవల్లిక ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
#IndianAthletics #TelanganaPride #PravallikaNarimalla #AsianU23Athletics
చైనాలో ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2026 లో మహిళల 4x400 రిలే పరుగుపందెంలో స్వ��్ణ పతకం సాధించిన ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు.
✅తెలంగాణ బిడ్డ ప్రవల్లిక నరిమళ్ల ఆసియా U23 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో అసమాన ప్రతిభ కనబరిచి మహిళల 4x400 మీటర్ల రిలేలో ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
✅నల్గొండలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొంది అంతర్జాతీయ వేదికపై రాణించిన ���్రవల్లిక యువ క్రీడాకారులు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. తాపీ మేస్త్రీ కూతురైన ప్రవల్లిక పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీలేదని నిరూపించారని ప��ర్కొన్నారు.
✅ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 4x400 మీటర్ల రిలే జట్టులో ప్రవల్లిక, శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్‌లతో కలిసి స్వర్ణ పతకం సాధించారు. ఈ నలుగురు సభ్యుల బృందం 3:33.62 సెకన్ల సమయంతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని, ఆతిథ్య దేశమైన చైనాను అధిగమించింది.
✅అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి ముందే, ప్రవల్లిక వివిధ వేదికల్లో 23 స్వర్ణాలతో సహా మొత్తం 35 రాష్ట్ర స్థాయి పతకాలను సాధించి అద్భుతమైన దేశీయ రికార్డును నెలకొల్పారు. ప్రవల్లికకు శిక్షణ అందించిన కోచ్‌లను ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు.
✅ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 3 స్వర్ణ, 4 రజత, 9 కాంస్య పతకాలతో సహా 16 పతకాలను సాధించిన భారత క్రీడాకారులందరికీ ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు.
#IndianAthletics #TelanganaPride #PravallikaNarimalla #AsianU23Athletics
నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల (#TGSWREIS) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఉన్నతాధికారులతో కలిసి విద్యార్థులు ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
#SocialWelfare #ResidentialSchools #NEET2026
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం" అంటూ తెలంగాణ ఘన చరితను, గత వైభవాన్ని శ్లాగిస్తూనే... సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన మహాకవి, మన అందెశ్రీ.
ప్రకృతి, మనిషి, మానవత్వమే తాత్విక భూమికగా జన గళం విని���ించిన ఆ ప్రజా కవి జయంతి సందర్భంగా ఘన నివాళులు. ఈ పవిత్రమైన రోజున ఆ ప్రజా కవి జ్ఞాపకార్థం 'స్మృతి వనం' పనులను ప్రారంభించుకుంటున్నాం..
#AndeSri
#JayaJayaHeTelangana
#Telangana
#TelanganaPride
#SmruthiVanam
Hon'ble Chief Minister Sri @revanth_anumula extended his heartfelt congratulations to @SkyrootA on the successful test flight of #Vikram1 under #MissionAagaman, an orbital-class launch vehicle developed entirely with indigenous technology.
🚀Congratulating the Hyderabad-based space-tech startup on this landmark achievement, the Chief Minister described the success of Vikram-1's Test Flight-1 — Mission Aagaman as a historic milestone for India's #space sector and a moment of immense pride for #Telangana. He commended #SkyrootAerospace for demonstrating the nation's growing technological prowess and spirit of innovation in space exploration.
🚀Recalling his visit to Skyroot Aerospace in April this year, the Chief Minister noted that he had flagged off the transportation of the Vikram-1 flight hardware to the Satish Dhawan Space Centre, #Sriharikota, ahead of the Mission Aagaman launch campaign. He observed that the successful test launch marks a defining milestone in Telangana's journey towards becoming a global hub for aerospace and space technology.
🚀The Chief Minister further stated that this remarkable achievement reinforces Telangana's position as India's premier destination for aerospace innovation, advanced manufacturing, and next-generation space technologies. He expressed confidence that such milestones will significantly advance the State's vision of emerging as a globally recognized leader in the #aerospace sector while inspiring a new generation of innovators and entrepreneurs.
#CMRevanthReddy #Vikram1 #MissionAagaman #SkyrootAerospace #Space #India #ISRO #SHAR #Sriharikota #Hyderabad #TelanganaPride #RevanthReddy #PawanKumarChandana
Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula, along with Hon’ble Industries Minister Shri @OffDSB, flagged off the flight hardware of Skyroot Aerospace’s Vikram-1 - India’s first privately developed orbital rocket. The Chief Minister said the occasion marks a key milestone in Telangana’s pursuit of becoming a global leader in the aerospace sector.
🚀The flagging-off ceremony marked the rocket’s formal departure to the launch site at Satish Dhawan Space Centre, Sriharikota. @SkyrootA is set to make India’s first private orbital launch attempt in the coming months.
🚀Congratulating the #Skyroot team on the occasion, the Chief Minister said it is a matter of great pride that the rocket has been completely designed and developed in #Hyderabad.
🚀“Skyroot has developed India’s first privately built orbital rocket to carry satellites into space. The company launched its first rocket in 2022, and reaching the stage of orbital launch in such a short time is a remarkable achievement.”
🚀He highlighted that #Telangana is ranked number one in India in the aerospace sector. Global leaders like Boeing, Airbus, and Safran are already present in the state, he added.
🚀He said Telangana aims to become a global leader in aerospace by 2047, with aerospace as a key growth sector.
🚀The Chief Minister stated that Telangana has performed exceptionally well in engineering exports since December 2023.
🚀“As per Central Government data, Telangana recorded the highest growth of 117.9% in engineering exports among Indian states between 2023–24 and 2024–25. Aircraft parts and defence equipment have been the biggest contributors to this growth.”
🚀He explained that the government is focusing on skilling youth for the aerospace sector through partnerships with global universities and industry leaders. With strong policies, infrastructure, talent, and a vibrant ecosystem, the government is committed to supporting companies like Skyroot, he added.
🚀The CM emphasized the need for skilling talent as per industry needs, elaborating on various initiatives being implemented by the state government through Young India Skills University (#YISU), Advanced Technology Centres (ATCs), and soon-to-be upgraded polytechnic colleges. He revealed plans to bring both the ATCs and polytechnic colleges under YISU’s ambit to ensure the curriculum is industry-driven and uniform across courses.
🚀“Our focus is on providing the best training to trainers in these institutions. Tata Technologies is providing training to our trainers in ATCs across the state,” the CM said.
🚀Responding to this, Skyroot Aerospace CEO and co-founder Shri @PawanKChandana, showed strong interest in collaborating with YISU. “The idea of a Skills University is unique and perfectly suits our talent needs. Skilling is the biggest challenge we face, and partnering with YISU will be a great value addition for us.”
🚀The CM invited the Skyroot leadership to visit the ATCs in Mallepally, Hyderabad. He stressed the flexibility YISU offers in dynamically updating the curriculum as per industry requirements.
🚀He also touched upon the government’s transformative plans to address gaps in the state’s school education system. Despite spending Rs 1.08 lakh per student per year in government schools, learning outcomes are not meeting expectations. A detailed plan has been prepared to address this, he added.
🚀Special Secretary to CM Shri B. Ajith Reddy, Shri @bharathdaka, co-founder and COO of Skyroot, and other officials were among those who attended the flagging-off ceremony.
#Vikram1 #VikramRocket #TelanganaRising
సూర్యాపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంత��డు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. #TelanganaRising2047
"జయ జయహే తెలంగాణ" గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, తన కలా��్ని ఉద్యమ జెండాగా మలిచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి అందెశ్రీ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.
❇️తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ స్పూర్తిని అక్షరాల్లో ఆవిష్కరించిన అరుదైన కవి అందెశ్రీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పదం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ప్రతి గేయం ప్రజల హృదయాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిందని పేర్కొన్నారు.
���️అందెశ్రీ గారి సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, స్వాభిమానానికి స్వరంగా, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిందని ముఖ్యమంత్రి గారు అన్నారు. తెలంగాణ పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సమాజానికి ఆయన అందించిన సాహిత్య సంపద చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
❇️తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ప్రజాకవి అ���దెశ్రీ గారి పేరు, ఆయన సాహిత్యం, ఆయన ప్రబోధించిన ఆత్మగౌరవ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, తరతరాలను చైతన్యపరుస్తూనే ఉంటాయని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
#AndeSri
ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆందోళనకర పరిస్థితులపై కే��ద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
✅వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తీసుకోవలసిన చర్యలపై మంత్రిమండలి సుధీర్ఘంగా చర్చించింది.
✅ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజాభవన్‌లో ఒక టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ హెల్ప్ లైన్ ప్ర��ి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు.
టోల్ ఫ్రీ నంబర్ 1-800-123-7157
✅తీవ్ర వర్షాభావ పరిస్థితులపై పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరాలని భావించింది. అలాగే, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని మంత్రిమండలి కేం���్రాన్ని కోరుతూ తీర్మానించింది.
✅ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదని, 30 నుంచి 35 శాతానికి మించి వర్షపాతం నమోదు కాలేదని మంత్రిమండలి ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితుల్లో అవసరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.
✅రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు నుంచి వచ్చే ఫిర్యాదులపై వెం���నే స్పందించాలని ఆదేశించింది. విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించింది.
✅తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతాంగానికి మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది.
✅వర్షాభావ పరిస్థితులపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస���సులు, సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
✅ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రితో పాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఈ నెల 20న జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, నిపు��ులు, శాస్త్రవేత్తలు అందరితో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారిగా తలెత్తిన పరిస్థితులు, జరిగిన నష్టంపై సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది.
✅రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ @Chinnareddy_G గారి సారథ్యంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని మంత్రివర్గం సూచించింది.
✅ముఖ్యమంత్రి గారి అధ్యక్ష��న జరిగిన 36వ మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రులు @INC_Ponguleti గారు, @jupallyk_rao గారు, @Ponnam_INC గారు, @minister_adluri గారు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
✅భూముల రికార్డులు, భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు తెలిపారు.
✅ధరణి పోర్టల్ కు సంబంధించి టెండర్ ప్రక్రియ నుంచి మొదలు ఇటీవల వచ్చిన ఆరోపణల వరకు అన్ని అంశాలపై విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
✅2020 అక్టోబర్ 29 నుంచి ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఈనాటి వరకు భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
✅రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019ను సవరించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
✅గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణకు సంబంధించి జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఈ నిధులను జమ చేసుకునేలా ప్రతిపాదించిన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణకు మంత్రిమండలి ఆమోదం ముద్ర వేసినట్టు తెలిపారు.
#Cabinet #ElNino #Drought
తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.
✳️ఇటీవల విజయవంతంగా జరిగిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన ముఖ్యమంత్రి గారు వారికి చెక్కులను అందజేశారు.
✳️క్రీడలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా ప���రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.
✳️గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు టీజీ20 ఒక మంచి అవకాశంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. టీజీ20లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులందరినీ అభినందిస్తూ, భవిష్యత్తులో దేశ ప్రతిష్ఠను పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
✳️ఏ ���ంగంలోనైనా రాణించాలంటే ఫోకస్ అవసరమని, ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి ఉండాలని క్రీడాకారులకు ముఖ్యమంత్రి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ ��ైరెక్టర్ సీహెచ్ కిరణ్ గారు, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారు పాల్గొన్నారు.
#TG20CricketLeague #HyderabadEChampions #TelanganaSports #SportsPolicy #Cricket #Eenadu