మళ్లీ పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ గ్యాస్ ధర
గృహ వినియోగాలకు ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.29 పెరిగింది.
గడిచిన మూడు నెలల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి.
ధర పెరగడంతో ఇప్పటివరకు రూ.936గా ఉన్న సిలిండర్ ధర రూ.965కు చేరుకుంది.
ఈనెల జూన్ 8న నాలుగు లేన్ల బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
దీంతో మియాపూర్, నిజాంపేట్, మల్లంపేట్, బౌరంపేట్ మధ్య సిగ్నల్-ఫ్రీ రాకపోకలు సులభమై వేలాది మందికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
పంతంగి టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ముందువెళ్తున్న కారును బలంగా ఢీకొనడంతో, కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అతివేగంగా వచ్చి కారును బలంగా ఢీకొట్టింది.
బస్సు వేగానికి కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న మహిళ తీవ్ర గాయాల పాలవడంతో అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం అత్యవసరంగా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన నాయకుడు అరెస్ట్
ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ నిర్వహించిన సమయంలో, రేవంత్ రెడ్డిని "బలి ఇస్తాం" అంటూ వ్యాఖ్యలు చేసిన జనసేన నాయకుడు కొర్ర చందర్ లాల్.
కొర్ర చందర్ లాల్‌ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.
అబద్ధానికి అంగీ లాగు తొడిగితే అది రేవంత్ రెడ్డి.
కనీసం ఇచ్చిన మాట మీద ఆయనకే నిలకడ ఉండదు
కోడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని తోకముడుచుకొని వచ్చి మల్కాజ్‌గిరిలో ఎంపీ గా నిల్చున్నాడు.
- హరీష్ రావు
వరి కొయ్యలు కాల్చిన రైతుకు రూ.5,000 జరిమానా...
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం రాజారాంతండా గ్రామంలో ఘటన.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం రాజారాంతండా గ్రామంలో వరి కొయ్యలు కాల్చిన రైతుకు గ్రామ కార్యదర్శి రూ.5,000 జరిమానా విధించారు.
అయితే డంపింగ్ యార్డులు, ఇటుక బట్టీలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంపై ఎంత జరిమానా విధిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు తృటిలో తప్పిన ప్రమాదం
బిగాల గణేష్ గుప్త ప్రయాణిస్తున్న కారును కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ శివారు వద్ద జాతీయ రహదారిపై కంటైనర్ లారీ ఢీకొట్టింది.
ఆ ఘటనలో గణేష్ గుప్తకు ఎలాంటి గాయాలు కాలేదు.
కంటైనర్ లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపిన స్థానికులు.
కరీంనగర్ లో రూ.70 లక్షలతో రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం.
కరీంనగర్ నగరంలోని రాజీవ్ చౌక్‌లో రూ.70 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.
తెలంగాణ ఉద్యమంలో గోరేటి వెంకన్న రాసిన పాటలు బాగా పాడాను.
అలాగే గోరేటి వెంకన్న రాసిన ఒక పాటను కేసీఆర్ గారు కొన్ని మార్పులు చేసి పాడించారు. ఆ పాటతో నాకు చాలా పేరు వచ్చింది.
- జానపద గాయకుడు జంగి రెడ్డి
ఉమ్మడి పాలనలో మా భాషా, యాసను ఎక్కిరిస్తేనే..
మిమ్మల్ని ఉరికించి ఉరికించి తన్ని తరిమినం..
మల్లోసారి మా భాష, యాస జోలికి వస్తే అప్పుడు చేసిన పని మల్లొకసారి చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు సెక్షన్ 8 కూడా లేదు..
ఉండేది పట్నంలో పైలంగా ఉండండి.
రేవంత్ రెడ్డి మాటకు అసలు విలువ ఉందా?
పటాన్ చెరులోని సిగాచీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగితే 60 మంది కార్మికులు చనిపోయారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి వచ్చి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పాడు.
ఏడాదైనా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి ఇవ్వలేదు.
- హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అమీర్‌పేటలోని భారీ అగ్ని ప్రమాదం
అమీర్‌పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.
షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి.
క్రమంగా ఇతర దుకాణాలకూ మంటలు వ్యాపించాయి.
ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు.
సింగూరు ప్రాజెక్టు ముంపు భూములకు ఎసరు పెట్టిన కాంగ్రెస్ మంత్రి బావమరిది!
ప్రాజెక్టులో నీటిని ఖాళీ చేయడంతో పైకి తేలుతున్న మునిగిన భూములు
వందల ఎకరాల ముంపు భూముల కబ్జాకు స్కెచ్.
Source - 10Tv
రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
ఈరోజు గద్వాల నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గద్వాల బీఆర్ఎస్ నాయకుడు బాసు హనుమంతు నాయుడును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
చెరువులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకురాలు రమాదేవి
ముధోల్ నియోజకవర్గం బాసర మండలం బీదరెల్లి గ్రామ చెరువులో అక్రమంగా సాగుతున్న మైనింగ్‌ను అర్ధరాత్రి వెళ్లి అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు.
ఈ మైనింగ్‌పై స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీ మాట్లాడాలని, లేదంటే పరోక్షంగా ఈ అక్రమ మైనింగ్ వారి అండతోనే జరుగుతుందని ప్రజలు భావిస్తారని అన్నారు.
ఈ అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని EE మైనింగ్, AD మైనింగ్ మరియు ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపిన రమాదేవి.
ఈ అక్రమ మైనింగ్ ఇలాగే కొనసాగితే సహించేది లేదని, మైనింగ్ అక్రమార్కుల ఆగడాలను తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాలని రమాదేవి గారు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా ప్రజల కోసం మా ప్రభుత్వం హయాంలో నిజామాబాద్ నగరంలో నూతన బస్ స్టాండ్ కోసం స్థలం కేటాయించి, నిర్మాణం కోసం రూ.25 కోట్లు కూడా మంజూరు చేశాం.
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు.
- వేముల ప్రశాంత్ రెడ్డి
అమెరికాలో కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణికి కారు ప్రమాదం
సీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించిన వైద్యలు
రిబ్స్ విరిగినట్లు తెలిపిన వైద్యులు
కుమార్తె డాక్టర్ గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం.
బోస్టన్ నుంచి న్యూయార్క్‌కు వస్తుండగా వర్షం కారణంగా అదుపుతప్పి పల్టీలు కారు
లగేజీ ఎక్కువగా ఉండటంతో వేర్వేరు కార్లలో ప్రయాణిస్తున్న మధుయాష్కీ గౌడ్, సుచి యాష్కీ
ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్న డాక్టర్ సుచి యాష్కీ
రేపు ఇండియాకు తిరిగి రావాల్సి ఉండగా ఘటన
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.