అటకెక్కిన ఒక హీరో దర్శకత్వపు సినిమా
సమస్య బడ్జెట్ కోటలు దాటినందుకు ప్రొడ్యూసర్ బెదిరిపోవడం..!!
గుమ్మడికాయ కొట్టబోతున్న మరో హీరో దర్శకత్వపు సినిమా
కారణం హీరో ప్రొడ్యూసర్ దగ్గర మంచి ప్యాకేజీ తీసుకోవడం అది మిగుల్చుకోడానికి తొందరగా ఫినిష్ చేయడం..!!
ఇంకో హీరో సినిమా జరుగుతూనే ఉంది టీవీ సీరియల్ లా
సరదాగా OTT కి చూపిస్తే క్లైమాక్స్ ఏంటి అని అడిగారట. కానీ.. ఆ హీరోకే క్లైమాక్స్ ఏంటో తెలియదట అదే ఆలస్యానికి కారణం..!!
ఇంకో ఎర్రగా బుర్రగా ఉండే కుర్ర హీరో మెగా ఫోన్ పట్టాడు, కానీ కొంచం చేతులు వణుకుతున్నాయంట, ఆ వణుకు తగ్గించడానికి ఒక సీనియర్ దర్శకుడు రోజూ పక్కనే ఉంటున్నాడట..!!
ఈ నలుగురి చిత్రాలు నవ్వులపాలవ్వకుండా బయటకి వస్తే ఎవరి "మెగా ఫోన్" ఎంత "రేట్" పలుకుతుందో చూద్దాం..!
#TheParadise #telugucinema #cinema #director #hero
ఏళ్ళ తరబడి సినిమా షూట్ చేస్తున్న దర్శకుడికి డెడ్ లైన్ పెట్టిన బడా హీరో.
నెల రోజుల డేట్స్ మాత్రమే నీకు సినిమా కంప్లీట్ చేయకపోతే ఇక నా దగ్గర కి డేట్స్ కోసం రావొద్దని దర్శకుణ్ణి హెచ్చరించిన బడా హీరో. ఆ హీరో ని అందరు బంగారు గని గా పిలుచుకుంటారు. తెర మీద హీరోగానే కాదు తెర వెనుక కూడా వ్యక్తిత్వంలో బంగారమే మావాడు అని లోకమే కోడై కూస్తుంటుంది. అంత మంచి హీరోకే అంత చిరాకు తెప్పించిన ఆ దర్శకునికి ఇది ఊహించని షాక్. 30 రోజుల్లో సినిమా ఎలా కంప్లీట్ చేయాలా అని తల పట్టుకొని చిందులు వేస్తున్నాడు. ఆ దర్శకుణ్ణి చూసి "అయ్యో రామం" అనుకుంటున్నారు.
#telugucinema #TheParadise
థమన్ స్వరాలలో అపస్వరం "నారాయణమ్మ"
త్రివిక్రమ్ థమన్ కాంబినేషన్ అంటే సరస్వతి వీణ కాంబినేషన్. వీణ సరస్వతి చేతిలో ఎంత అందంగా ఇమిడిపోతుందో అంత అందంగా వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో స్వరాలు ఉండేవి. సామజవరగమన పాట ఆవిడే స్వయంగా వీణ వాయించినంత వినసొంపుగా ఉంటుంది. ఈ "నారాయణమ్మ" పాట మాత్రం రోడ్డు మీద డప్పు వాయించుకునే సాదా సీదా కళాకారుడు స్వరంలా కూడా లేదు. మోస్ట్ డిసప్పోయింటెడ్ సాంగ్ ఫ్రమ్ థమన్ & త్రివిక్రమ్.
@VenkyMama@MusicThaman@ramjowrites@DimpleHayathi@Nivetha_Tweets@Ram_Miriyala@haarikahassine@vamsi84 #Narayanamma #AK47 @SrinidhiShetty7
Inside Info:
పర భాషా దర్శకుడితో తయారవుతున్న ఒక భారీ సినిమా ని ఆ పెద్ద హీరో చూసి, తన వైపు నుంచి నిష్ణాతులైన 10 మంది రైటర్స్ ని కూర్చోపెట్టి సినిమాకి రిపేర్లు మొదలు పెట్టాడు.
ఈ రిపేర్లు చేసే న్యూస్ బయటకి పోకుండా ఆ సినిమాకి పని చేస్తున్న "తెలుగు" సిబ్బందిని తొలగించాడు. మరి...... స్టాఫ్ ని తీయగలిగినంత ఈజీ గా ఆ హీరో హిట్టుని కొట్టగలుగుతాడా..? అది చాలా కష్టం అంటున్నారు తొలగించబడ్డ తెలుగు సిబ్బంది. గంటకు పైగా సినిమాని తీసేసి మళ్ళీ రీషూట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఇది కూడా ఆ సిబ్బందే ఆనోటా ఈనోటా చెప్పిన మాట.
#telugucinema #CinemaUpdate #latestupdate
మరక లేకుండా బయటపడ్డ తెల్లకాగితం
అసలు ఈ మధ్య యూత్ సినిమా అంటేనే "A" సర్టిఫికెట్ తో రిలీజ్ కి రావడం పరిపాటి అయిపోయింది. దాన్ని బ్రేక్ చేస్తూ "A" అనే "మరక"లేకుండా "U/A" తో "తెల్లకాగితం" బయటకి రావడం నిజంగా అభినందనీయమే. ఫ్యామిలీ తో సినిమాకి వెళ్లాలనుకునవాళ్ళు బుక్ మై షో లో A సర్టిఫికెట్ చూసి చాలా మంది ఆగిపోతున్నారు. ఆ బాధ లేకుండా ఈ సినిమా "U/A" సర్టిఫికెట్ సంపాదించుకుంది అంటే ఎంతో కొంత ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైనట్టే. బెస్ట్ విషెస్ టు తెల్లకాగితం టీం ఫ్రమ్ తూటా..!!
#ThellaKaagithamOnOct2nd #ThellaKaagitham
@HarshRoshan7@Nakshatra_3@RameshBandreddi@krishnakommala@vijaibulganin@NanduSavirigana@kvguhan@karthikaSriniva@ArunachalaCoffl@etvwin@saregamasouth@vamsikaka
Latest Info:
ఒక పెద్ద సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం.
హడావిడిగా వచ్చిన ప్యారడైజ్ ని చూసి...
తానూ హడావిడిగా రాకూడదు కంటెంట్ ఇవ్వాలంటే మరికొంత సమయం కావాలని అని నిర్మాతని రిక్వెస్ట్ చేస్తున్న ఆ బడా దర్శకుడు.
నాని రేంజ్ ని పెంచిన నిర్మాత
ది ప్యారడైజ్..... ఎవరు అవునన్నా కాదన్నా నాని రేంజ్ ని పెంచిన సినిమా ఇది. కానీ సినిమా లో కథతో సహా అన్ని విభాగాలు యే మాత్రం బాగుండి ఉన్నా నాని రేంజ్ మరోలా ఉండేది. 224 రోజులు షూటింగ్ చేసినా... "జరుగుతున్న తప్పును గుర్తించలేకపోవడం 32 సినిమాల అనుభవం ఉన్న నాని తప్పిదం".
"నిర్మాత"కి ఉన్న అనుభవం కంటే "హీరో" కి ఉన్న "అనుభవం ఎక్కువైనప్పుడు" దాన్ని గుర్తించాల్సిన బాధ్యత హీరోది. కానీ ఆ బాధ్యతని నిర్వర్తించడం లో నాని విఫలమయ్యాడు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో అందరి కళ్ళు ఒక్కచోటే ఆగిపోయాయి. రెప్ప వాల్చకుండా ఆయన వైపే చూశాయి. ఎవరి వైపో తెలుసా..? నిర్మాత చెరుకూరి సుధాకర్ వైపు.
ఆయన మైక్ తీసుకోగానే ప్యారడైజ్ సినిమా కి ఆయన పడ్డ కష్టం, భరించిన భారం, పడిన ఆనందం, వస్తున్న కలెక్షన్ లు మరేదీ ఆయన పెదవి దాటి బయటకి రాలేదు. అన్ని ఆయన కళ్ళల్లోనే ఆగిపోయాయి. అందుకే మనందరి కళ్ళు ఆయన వైపే చూస్తూ ఆగిపోయాయి.
"224 రోజుల షూటింగ్" కి విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టి "హీరో స్థాయి"ని పెంచడానికి తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా, చెప్పిన మాటలు దాటి, లెక్కలు దాటి, కోటలు దాటి, "బడ్జెట్ "వెళ్లినా ఎవ్వరికీ చెప్పకుండా అన్నీ తానే భరిస్తూ, చిరు దరహాసంతో, పట్టుదలతో సినిమా ని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇది సామాన్యుడి వల్ల జరగదు. అది ఆయన చేయగలిగారంటే యే రేంజ్లో కమిట్మెంట్, నిబద్ధత ఆయనకి ఉన్నాయో అర్ధం అవుతోంది. ఇదంతా ఆయన మొహం లో కనిపించింది.
ఇలాంటి బాధ్యత ఉన్న నిర్మాతలు దొరకడం అరుదు. కొందరు నిర్మాతలు సాధించింది తక్కువైనా కాలర్ ఎగరేసి మైక్ లు విసిరేయడం ఎన్నో ప్రెస్ మీటుల్లో చూసాం. సినిమా రిలీజ్ అయి ఫెయిల్ అయ్యాక ప్రెస్ మీట్లో దర్శకుడి పక్కన కూర్చొని ఇది ఫెయిల్ అవుతందని ముందే చెప్పనా అని దర్శకుల మీద తప్పులేసిన నిర్మాతలని చూసాం. అలా ఏమీ మాట్లాడకుండా కళ్ళల్లోనే తన భావాలని చెప్పి ప్రెస్ మీట్ ని ముగించిన చెరుకూరి సుధాకర్ అభినందనీయుడు.
కాబట్టి ఎన్నెన్నో మంచి సినిమాలు ఆయన చెంతకు చేరి విజయ గర్వంతో ఆ సినిమాలు బయటకి రావాలని ఆయన పది కాలాలు సంతోషంగా ఉంటూ అనేక మంది సినీ కార్మికులకు పని కల్పిస్తూ అగ్ర నిర్మాతగా ఎదగాలని కోరుకుంటుంది తూటా..!!
హాట్స్ ఆఫ్ టూ చెరుకూరి గారు..!!
@SLVCinemasOffl@NameisNani@TheParadiseOffl@mohanbab@Preyadarshe@sampoornesh@11Lohar@MythriOfficial@DilRajuOff_@sahugarapati7@AKentsOfficial@70mmEntertains@MythriOfficial@odela_srikanth@TheDeverakonda@ImSharwanand@hanurpudi@ssrajamouli
#TheParadise #theparadise #TheParadiseMovie #TeluguCinema #teluguproducers #producer
కిలో కూరగాయలు 50 రూపాయలకి అమ్మే రైతు "ప్రభుత్వ ఉత్తర్వులతో" కిలో 2000 కి అమ్మడం మొదలు పెడితే అతను కూడా అపర కోటీశ్వరుడే. ప్రతీ పేపర్ లోను తన బీరయకాయల కలెక్షన్స్ కూడా "నిలువెత్తు పోస్టర్" వేయించుకోగలడు. తన "స్వార్ధం" వదిలి అందరికి "అందుబాటులో ఉండే ధరలతో" తన ప్రోడక్ట్ ని అందించే రైతే నిజమైన మగాడు. మీలా "టికెట్ రేట్లని" పెంచి ప్రజలని దోచుకునే బడా హీరోలు హీరోలే కాదు. ఈ "తూటా" రేట్లని పెంచి కలెక్షన్ల పోస్టర్ల కోసం పాకులాడే హీరోలు అందరికీ...!!
@NameisNani@TheParadiseOffl@SLVCinemasOffl@anirudhofficial@odela_srikanth@11Lohar@KayaduLoharFC
#TheParadise #TheParadiseMovie
Sai Pallavi Loses Another Pan-India Film… Another Heroine Steals the Show..! ఆరేసుకోబోయి పారేసుకున్న సాయి పల్లవి..!!
సాయి పల్లవి మరో పాన్ ఇండియా సినిమాని దొబ్బేసిన మరో హీరోయిన్
జరిగిన కథాంశంతో సినిమా తీద్దామని పెద్ద బ్యానర్ సాయి పల్లవిని అప్ప్రోచ్ అయింది. ఆ కథ ఆమెకి కూడా బాగా నచ్చింది. కానీ రామాయణం చేస్తూ బిజీగా ఉన్న కారణం చేత కొన్ని రోజుల తర్వాత డేట్స్ సర్దుబాటు చేస్తానని చెప్పింది.
ఈ విషయం ఆనోటా ఈ నోటా తన చెవిన పడిన వెంటనే మరో క్రేజీ హీరోయిన్ డైరెక్టుగా సదరు నిర్మాత దగ్గరకి వెళ్ళిపోయి కాళ్ళా వేళ్ళా పడి అవకాశం చేజిక్కించుకుంది.
హనుమాన్ అంష్ గురించి మనకి తెలుసు కదా..! ముందు గా ఒక హీరో అనుకుంటే అనివార్య కారణాల వాళ్ళ మరొక హీరో తో ఆ సినిమా మన ముందరకి వచ్చింది. అది దైవనిర్ణయం అని ఆ యూనిట్ బలంగా నమ్మింది. ఇది కూడా అలాగే చేతులు మారిపోయింది కాబట్టి సాయి పల్లవి తన మార్పు కూడా దైవ నిర్ణయమే అయివుంటుందని, తాను నిమిత్త మాత్రురాలినే అని వేదాంతం చెబుతోంది.
కానీ సినీ ప్రముఖులు మాత్రం ఆరేసుకోడం (తర్వాత చేస్తాను అని చెప్పడం) మంచిదే కానీ పారేసుకోవడం (ఓపెనింగ్ లేకుండా నిర్మాతని వెయిట్ చేయించడం) మంచిది కాదని అంటున్నారు.
#saipallavi #telugucinema #panindia #ramayana
#insidetalk :
మరో పాన్ ఇండియా సినిమాకి లెంగ్త్ కష్టాలు..!
4 గంటల సినిమాను చూపించిన దర్శకుడు.. లబోదిబోమన్న హీరో బ్యాచ్..!!
“ఏం చెప్పి.. ఏం తీశావ్?” అంటూ దర్శకుడిని నిలదీత.. దర్శకుడి మొహంలో రెడ్ లైట్..! 🚨కోట్లు పెట్టిన నిర్మాతకు డేంజర్ లైట్..! 🔴
ఇక చేసేదేం లేక.. “రెండు పార్టులుగా చేస్తే ఎలా ఉంటుంది?” అనే ఆలోచన..!
దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తే.....? 🟢😏
· నో స్టొరీ... నో కామెడీ
· లాజిక్ లెస్, వీక్ ప్లాట్ పాయింట్
· బోరింగ్ ఫిల్మ్
· నిరాశపరిచిన దర్శకుడు
· ANIMATION రంగంలో క్రియేటివిటీతో పేరు తెచ్చుకున్న సంస్థ నుండి వచ్చిన ఏమాత్రం క్రియేటివిటి లేని సినిమా
THOOTAAA RATING -1/5
#అనుమానపక్షి#anumanapakshi#telugucinema