#BKRImpressions
Here is my analysis on @tarak9999@ssrajamouli@mmkeeravaani 's Blockbuster #simhadri
My takeaways
**************
* పదిమంది బాగుకోసం నేను చావడానికి అయినా ఇంకొకరిని చంపడానికైనా సిద్ధం అన్న సినిమా యొక్క మెయిన్ థీమ్ ని మూడుసార్లు ఎఫెక్ట్ గా వాడుకున్న విధానం.చిన్నప్పటి సింహాద్రి తనని తన ఆత్మహత్యకి సిద్ధమయి మరి రామ్ భూపాల్ వర్మ రక్షించడం కేరళలో రౌడీయిజాన్ని అంతమొందించడానికి సింహాద్రి వాళ్లకోసం అక్కడే ఉండిపోవడం చివరికి అరవింద్ ను చంపేయడానికి కారణం కూడా అదే థీమ్ కావడం.
************
* ఈ కథని రాజమౌళి స్క్రీన్ ప్లే ద్వారా ప్రెజెంట్ చేసిన విధానం.Opening and running multiple threads in parallel.
1. స్వామి భక్తితో ఉండే సింహాద్రి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండి అన్ని తనై చూసుకోవడం.రాంభూపాల్ వర్మ మీద ఈగ కూడా వాలనివ్వని సింహాద్రి ఎవరికీ తలఒగ్గని సింహాద్రి ఇందు దగ్గర మాత్రం అణిగిమనిగి ఉండడం తనకి సేవలు చేయటం బ్రతిమాలడం.
2. ఇదొక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తే సింహాద్రితో దెబ్బలు తిన్న రవిబాబుని పరీక్షించిన కేరళ డాక్టర్ ఈ దెబ్బలు చూస్తుంటే ఇవి సింగమలై కొట్టిన దెబ్బలాగా ఉన్నాయి అని సింహాద్రి కి సింగమలైకి రిలేషన్ ఏంటి అని క్యూరియాసిటీ బిల్డ్ చేసే త్రెడ్.
3. రామ్ భూపాల్ వర్మ పెద్దకూతురు తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని కేరళలో సెటిలైపోయింది అని సింహాద్రి కి తద్వారా ఆడియన్స్ కి రివిల్ చేసి తనని ఒప్పించి తీసుకొస్తానని సింహాద్రి సంవత్సరం ముందు కేరళ బయలుదేరడం,కేరళ నుంచి తిరిగి వచ్చిన సింహాద్రి వాళ్లు మళ్ళీ ఇంక రారు అని ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పటం.
4. కేరళ జైల్లో భాయ్ సాబ్ ను ఓపెన్ చేసి తన్ను తప్పించుకోవటానికి అవకాశం ఉన్న సింగమలై ఎక్కడున్నాడో వెతకమని తను దొరికిన తర్వాత సింగమలై ని చంపటానికి జైల్లో నుంచి బయటకు వస్తానని భాయి సాబ్ రివిల్ చేయటం.
5. ఎప్పుడూ రాంభూపాల్ వర్మ మాటకు ఎదురు చెప్పండి సింహాద్రి ఇందుకోసం ఆయనకి ఎదురు తిరిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం ఇది చూసిన కేరళ డాక్టర్ కేరళ ఫోన్ చేసి సింగమలై దొరికాడని చెప్పడం
6. కేరళ నుంచి రెండు వర్గాలు సింహాద్రిని వెతుక్కుంటూ బయలుదేరడం పుష్కరాల దగ్గర ఆ రెండు వర్గాలు సింహాద్రితో ఫైట్ చేయటం.రెండు వర్గాల్లో ఒక వర్గం సింహాద్రిని రక్షించడానికి వచ్చింది ఇంకొక వర్గం చంపడానికి వచ్చింది అని తెలియజేయడం
************
* ఈ పుష్కరాలలో గతం గుర్తుకు వచ్చిన ఇందు సింహాద్రిన పొడి చేయటం ఈ విధంగా ఫస్ట్ హాఫ్ లో మల్టిపుల్ త్రెడ్స్ ఓపెన్ చేసి రన్ చేసి ఇంటర్వెల్ కి అన్నిటిని ఒకే దగ్గర కన్నెక్ట్ చేసి ఒక గొప్ప షాక్ ఇచ్చిన సినిమా సింహాద్రి.
**********
* కేరళలో అరవింద్ భానుచందర్ చేసిన పాత్రని కన్విన్స్ చేయడానికి సింహాద్రి తన కూతురుని లేపికెళ్ళిపోతాను అంటే అరవింద్ వచ్చి కొడతాడు అప్పుడు సింహాద్రి తనతో మాట లేపుకెళ్ళిపోతాను అని అంటేనే మీకు అంత కోపం వస్తే మీరు లేపుకొచ్చేశారు మరి ఆ రాంభూపాల్ వర్మకి కోపం రావడం తప్పేముంది అని ప్రశ్నించారు.మీరిద్దరూ చేసింది తప్పుకాదు ఎందుకంటే ఇద్దరిలో ఉన్న తండ్రి పాత్ర అట్లా చేయించింది అని సింహాద్రి అరవింద్ కి అర్థమయ్యేలా చెప్పడం.ఇదే లాజిక్ ని అత్తారింటికి దారేది క్లైమాక్స్‌లో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ద్వారా రావు రమేష్ కి చెప్పించారు.
***********
* సింగమలై భారీ యాక్షన్ ఎపిసోడ్ ముందు ఆడియన్స్, ఆడిటోరియం ని ప్రిపేర్ చేయడానికి రమ్యకృష్ణతో ఐటెం సాంగ్ పెట్టించారు
*************
* సరస్వతి పాత్రని భాషా తమ్ముడు చంపేశాక రగులుతున్న సింహాద్రి ప్రతీకారతో వాళ్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు సింబాలిగ్గా ఐరన్ ని మంటతో పెట్టి కొడుతున్నట్టు షాట్లు అంటే కోపంతో రగిలిపోతున్నాడు సింహాద్రి అని జనాలకు అర్థమయ్యేటట్టు షాట్ తీశారు.
************
* సింహాద్రి అంటే నరసింహస్వామి అవతారం కాబట్టి భాయ్ సాబ్ తమ్ముడిని చంపేటప్పుడు హిరణ్యకశిపుడి లాగా ద్వారం కి పొడిచి చంపినట్టు సింబాలిగ్గా చూపించారు.
*********
* Classic example of how to package a commercial movie with right blend of emotions and screenplay highs.
************
* నాకు ఈ సినిమాలో అవాయిడ్ చేయగలిగింది అంటూ ఏదైనా ఉంది అంటే అది తలుపులు పాత్ర అంకిత సింహాద్రితో రొమాన్స్ చేస్తున్నప్పుడు చూసి ఆనందించటం తలుపులకి ఫ్లాష్ బ్యాక్ లో జరిగిందంతా ఇందు పరిస్థితి తెలుసు కాబట్టి వేరే అమ్మాయితో సింహాద్రి రొమాన్స్ చేయడం కరెక్ట్ కాదు అని తనకు తెలుసు కాబట్టి అది అవాయిడ్ చేసి ఉండాల్సింది.
ఆయన రచనలతో కొన్ని దశాబ్దాలుగా ప్రజల గుండెల్లో స్పూర్థిని నింపిన
ప్రజా గాయకుడు గద్దర్ గారు మన మధ్యన లేకున్నా, ఆయన ఆటా, మాటా, పాటా ఎప్పటికీ మన మధ్యన సజీవంగానే ఉంటుంది.
గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Congratulations @AlwaysRamCharan and @upasanakonidela. Welcome to the parents club. Every moment spent with the baby girl will be an unforgettable memory for a life time. May God bless her and you all with immense happiness.