The Tone News is a leading digital news vertical under the TeluguOne brand. It is known for its high-speed delivery of current events and political analysis.
గాన కోకిల ఎస్. జానకి ఇకలేరు 😭����
మూగబోయిన భారతీయ సంగీతం!📷📷🕊️
దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది హృదయాలను ఓలలాడించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి గారు కన్నుమూశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు దాదాపు 17 భాషల్లో 48,000 పైగా పాటలు పాడి, నాలుగు జాతీయ అవార్డులు అందుకున్న ఆమె మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆ మధుర స్వరానికి, మాతృమూర్తికి అశ్రునమస్సులు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఓం ��ాంతి!
#TeluguOne #SJanaki #RIPJanakiAmma #TeluguCinema #NightingaleOfSouth #SJanakiNoMore #TeluguMusic #SingerJanaki
#BJP తో పొత్తు పెట్టుకుంటే ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి? వ్యూహాలకు బలికాకుండా ప్రాంతీయ పార్టీలే జాగ్రత్త పడాలి... నితీష్ కుమార్, ఏకనాథ్ షిండేల ఉదాహరణలతో వివరణ..
Full Interview:- https://t.co/J3wmVL9ZP4
#ToneNewsLive#VivekKrishnaTankha#RaviShankarKantamneni #NitishKumar #EknathShinde #PoliticalStrategies
కక్షతో రగిలిపోయిన ఉన్మాది.. ఒకేసారి ఆరుగురి దారుణ హత్య!
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జులై 11 తెల్లవారుజామున నరమేధం జరిగింది. మే 16న తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారన్న కక్షతో బెయిల్‌పై వచ్చిన రాజ్‌కుమార్, అర్ధరాత్రి గాఢనిద్���లో ఉన్న బాధిత మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మలను విచక్షణారహితంగా నరికి చంపాడు. అంతటితో ఆగక తన భార్య సరిత, మూడేళ్ల కూతురు, రెండేళ్ల కొడుకును కూడా దారుణంగా హతమార్చాడు. ఈ ఘోర నరమేధంలో మొత్తం ఆరుగురి ప్రాణాలు తీసి ఉన్మాదిగా మారిన రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#ToneNewsLive #ShabadMurderCase #RangareddyNews #CrimeNewsTelugu #TeluguNews
పవన్ కల్యాణ్ భుజానికి సర్జరీ..
ప్రజల కోసం నొప్పిని భరించిన జనసేనాని! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో జులై 11న దాదాపు మూడున్నర గంటల పాటు కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. గతంలో సినిమా షూటింగ్లో గాయపడిన రొటేటర్ కఫ్ కండరాలు వారాహి యాత్ర, ఎన్నికల ప్రచారాల్లో అభిమానుల కరచాలనాల వల్ల తీ��్రంగా మారాయి. నొప్పి ఉన్నా ప్రజా బాధ్యతల కోసం వాయిదా వేసుకున్న ఆయనకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు ఫోన్ చేసి పరామర్శించారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత సర్జరీ జరగనుంది. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
#ToneNewsLive #PawanKalyan #PawanKalyanSurgery #JanaSena #PawanKalyanHealth
ప్రారంభానికి ముందే హైవే గోడ కూలింది!
ఉత్తరప్రదేశ్–ఉత్తరాఖండ్‌ను కలిపే ��ీరట్–కోట్ద్వార్ నేషనల్ హైవే నిర్మాణం పూర్తికాకముందే, చిన్న వర్షానికే ఒక వైపు సేఫ్టీ వాల్ పూర్తిగా కూలిపోయింది. నాసిరకం నిర్మాణ పనుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#ToneNewsLive #NationalHighway #UttarPradesh #Infrastructure #BreakingNews
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై CM రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
2029 మే–జూన్ మధ్యే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌పై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
#ToneNewsLive#RevanthReddy #Telangana #AssemblyElections #BreakingNews
"మహిళల నుంచి రైతుల వరకు… అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది" అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట��టిన డ్వాక్రా మహిళల వడ్డీలేని రుణాలను కూడా అందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీలను ప్రారంభించామని, కేవలం 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కుచెదరని నిర్మాణానికి నిదర్శ��మని భట్టి వ్యాఖ్యానించారు.
#ToneNewsLive #BhattiVikramarka #Telangana #RythuBharosa #DWCRA