కొన్ని తప్పులు జరిగినయి... ఒప్పుకుంటా.
గతంలో మన కార్యకర్తలను మీరు అనుకున్నంతగా పట్టించుకోని మాట వాస్తవమే.
కానీ వచ్చే ఐదేళ్లలో రాజకీయంగా, ఆర్థికంగా మీ జీవితాలు మారేలా చేసే బాధ్యత నేనే తీసుకుంటా.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నిన్న జరిగిన పరకాల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, SIR మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కొత్తగూడెంలో జరిగిన సింగరేణి కార్మికుల సమ్మేళనంలో పాల్గొని సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కాములపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ..
మేమిచ్చిన పంట బోనస్ మూడు రైతు బంధులకు సమానం అంటున్నడు..
మిస్టర్ జూపల్లి..
మీరు ఇచ్చిన పంట బోనస్ రూ. 2500 కోట్లయితే..
ఎగ్గొట్టిన రైతు బంధు విలువ రూ. 29,350 కోట్లు..
ఎక్కడ చర్చ పెడుతావో చెప్పు.. నేను నిరూపిస్తా..
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,000 కోట్ల స్కామ్ చేసింది.
2 వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెబుతుంటే.. టెండర్లు ఎలా పిలిచారో, ఎంత మింగారో మంత్రులుగా ఉన్న లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ ఏం చేస్తున్నారో తెలుస్తలేదు.
పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో ఎవరైనా స్కామ్ చేస్తారా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
రేవంత్ పాలనలో స్కీములు లేవు..
అన్నీ స్కాములే!
సివిల్ సప్లైస్ నుండి సింగరేణి వరకు
అన్ని డిపార్ట్మెంట్లలో స్కాములే..
ఆఖరికి పిల్లలకు పెట్టే కోడిగుడ్లు, పప్పు, ఉప్పును వదలని పాపపు కాంగ్రెస్.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish🔥
మాటలు కాదు… లెక్కలు చెప్పాలి‼️
20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాకే ఓట్లు అడుగుతామని గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన వీడియోను చూపించిన కేటీఆర్ గారు.
రెండున్నరేళ్లలో ఎన్ని ఇండ్లు కట్టారు⁉️
20 లక్షల ఇండ్లు పూర్తి కాకపోతే ఓట్లు అడగమన్న మాటపై ఇప్పటికీ నిలబడే దమ్ముందా?
@KTRBRS
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, SIR అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...
తెలంగాణ ఉద్యమ తొలి నాళ్లలో కేసీఆర్ గారు నిరాహార దీక్షకు వెళ్తుంటే.. ఆయనతో పాటే అలుగునూరు చౌరస్తాలో అరెస్టయి జైలు జీవితం గడిపిన గొప్ప నిబద్ధత గల నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు.
ఈ వయసులో కూడా పార్టీ కార్యక్రమానికి రావడం ఆయన అంకితభావానికి నిదర్శనం.
హుస్నాబాద్ అంటే కేసీఆర్ గారికి ఎంతో నమ్మకం. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించేవారు. కేసీఆర్ సైకిల్ యాత్రకు బ్రహ్మరథం పట్టి, తొలిరోజుల్లోనే ఎంపీపీలు, జడ్పీటీసీలను గెలిపించిన గడ్డ ఇది.
నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కోసం మనం దీక్షలు చేశాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చారు.
ఎస్పీ, డీఎస్పీ, ఎలక్ట్రిసిటీ డీఈ ఆఫీసులు తెచ్చుకున్నాం. బస్టాండ్‌ను ఫుల్ ఫ్లెడ్జ్ డిపోగా మార్చారు. గౌరవెల్లి ప్రాజెక్టును, గండి మహాసముద్రం చెరువును అద్భుతంగా తీర్చిదిద్దారు.
SIR ఓటర్ల సర్వే విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఇది చనిపోయిన, డబుల్ ఓట్లను తొలగించి జాబితాను సవరించే ప్రక్రియ.
అధికారికంగా ఇందులో పార్టీలకు భాగస్వామ్యం ఉంది. కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్లు (అంగన్వాడీ టీచర్లు) ఇంటింటికి వచ్చేటప్పుడు మన బూత్ లెవెల్ ఏజెంట్లు వారి వెంట వెళ్లాలి.
ఎవరైనా అధికారులు సహకరించకపోతే ఏఆర్ఓ, ఆర్డీఓలకు ఫిర్యాదు చేయొచ్చు. ఫ్యామిలీ గ్రూపింగ్ ఫారాలు, ఓటరు నమోదు ఫారాలు నింపడంలో ప్రజలకు మనమే దగ్గరుండి సహాయపడాలి.
కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా ప్రతి కార్యకర్త బాధ్యతగా చూసుకోవాలి. ఒక్క ఓటు కూడా ఎన్నికల్లో క్రియాశీలకంగా మారుతుంది.
రాజశేఖర్ రెడ్డి హయాంలో 610 జీవో అమలు చేయకపోతే, పోతిరెడ్డిపాడు పెంచుతుంటే.. మనమే తెలంగాణ కోసం పదవులను తృణప్రాయంగా వదిలేసి రాజీనామాలు చేశాం.
తెలంగాణ కోసం రాజీనామా చేయాలన్నప్పుడు ముందుగా స్పీకర్ కి రాజీనామాలు ఇచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
రేవంత్ రెడ్డి మాత్రం ఒరిజినల్ కాపీ జేబులో పెట్టుకుని జిరాక్స్ కాపీ ఇచ్చి డ్రామాలు ఆడాడు. ఎలాంటి త్యాగం చేయని వ్యక్తి సీఎం అయ్యాడు.
తెలంగాణ కోసం త్యాగాలు చేసింది బీఆర్ఎస్ అయితే.. మోసాలు చేస్తోంది రేవంత్ రెడ్డి.
గత ఎన్నికల్లో కృతజ్ఞతకు, ఆశకు మధ్య పోటీ జరిగితే.. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలకు మోసపోయారు. కానీ రేవంత్ మోసగాడన్న నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది.
ఎస్టీ సబ్ ప్లాన్ కింద 2730 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పి, కేవలం 52 కోట్లు.. అది కూడా కరెంట్ బిల్లులు, జీతాలకే ఖర్చు చేశారు.
ఒక్క ఎస్టీ యువకుడికి కూడా ఉపాధి కల్పించలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ మంత్రిగా ఉండేవారు, ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో ఒక్క గిరిజన మంత్రి కూడా లేడు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ నిధులు ల్యాప్స్ కాకుండా 'క్యారీ ఫార్వర్డ్' విధానాన్ని కేసీఆర్ తెచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కింద 5403 కోట్లు కేటాయించినా ఒక్క దళితుడికి కూడా లోన్ రాలేదు. దళిత బంధు కింద 12 లక్షలు ఇస్తామన్న హామీ గాలికి పోయింది.
బీసీ కార్పొరేషన్ కు 1370 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
33 కుల కార్పొరేషన్లు పెట్టి, అందులో కాంగ్రెస్ నేతలకు కుర్చీలు ఇచ్చారు తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదు.
కేసీఆర్ గారు యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు ఏటా 100 కోట్లతో ఉచిత చేప పిల్లలు ఇస్తే.. కాంగ్రెస్ వాటన్నింటినీ బంద్ పెట్టింది.
చేనేతన్నలకు బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం ఆర్డర్లు కేసీఆర్ ఇస్తే, రేవంత్ రెడ్డి ఆ ఆర్డర్లను గుజరాత్ కార్పొరేట్లకు కట్టబెట్టి నేతన్నల పొట్టగొట్టాడు. చేనేత సబ్సిడీలు ఆపేశాడు.
గౌడన్నలకు వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చి, చెట్ల పన్ను రద్దు చేసి ఆదుకున్న ఘనత కేసీఆర్ ది. కానీ రేవంత్ రెడ్డి వేలాది మంది గౌడన్నలను జైళ్లకు పంపుతున్నాడు.
గౌరవెల్లి ప్రాజెక్టును ప్రత్యేక ప్యాకేజీతో పూర్తి చేసి కేసీఆర్ ట్రయల్ రన్ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైనా కనీసం 30 గజాల కాలువ కూడా తవ్వలేదు.
సొంత జిల్లాలోని పాలమూరు ప్రాజెక్టు అర్థం కావడానికే తనకు రెండున్నరేళ్లు పట్టిందని సీఎం అంటున్నాడు, మరి గౌరవెల్లి అర్థం కావడానికి ఐదేళ్లు పడుతుందా? చేతగాక అధికారుల మీద నెపం నెడుతున్నాడు.
85 రోజులు దాటినా రైతుబంధు దిక్కులేదు. కేసీఆర్ తెచ్చిన రైతుబీమా 5 నెలలుగా ఆగిపోయింది.
వడ్లకు 5 కిలోల తరుగు పెడుతున్నారు. సన్నాలకే బోనస్ అని చెప్పి ఇప్పుడు కేవలం 7 రకాలకే ఇస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారు.
గురుకుల పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడు కానీ.. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే 15-20% కమీషన్లు వస్తాయని అటు పైసలు మళ్లిస్తున్నాడు.
రేవంత్‌ది మిషన్ మోడ్ కాదు కమీషన్ మోడ్. గురుకుల పిల్లల కోడిగుడ్లలో కూడా కమీషన్లు కొడుతున్నాడు.
స్కూల్ పిల్లల ప్రోగ్రాంకు పోయి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా ఎత్తు గురించి, నేను తాటిచెట్టు, ఈతచెట్టు లెక్క పెరిగానని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రికి నా ఎత్తుతో పనేంటి?
నేను రేవంత్ లాగా చిల్లర మాటలు మాట్లాడను. రైతుబంధు ఎప్పుడిస్తావ్? రైతుబీమా ఎప్పుడిస్తావ్? బోనస్ ఏమైంది? ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడిస్తావ్? అని ప్రజల పక్షాన సూటిగా ప్రశ్నిస్తా. హామీలు నెరవేర్చేదాకా నేను నిలదీస్తూనే ఉంటా, స్కాములు బయటపెడుతూనే ఉంటా.
ఖజానాలో పైసలు లేవంటాడు కానీ.. ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్, తన ఇంటికి 17 కోట్లతో ఇనుప కంచెలు కట్టుకుంటున్నాడు.
పేద ఎస్సీ, ఎస్టీ పిల్లలతో కాకుండా తన మనుమడు, మంత్రులు, రాహుల్ గాంధీ దోస్తుల పిల్లలతో ఫుట్ బాల్ ఆడేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు.
సిటీలో మోరీలు బాగుచేయడం చేతకాని వాడు ఫ్యూచర్ సిటీ కడతాడట. 1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అని కమీషన్లకు కక్కుర్తి పడుతున్నాడు.
జర్నలిస్టుల సంక్షేమానికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే, కమీషన్లు రావని రేవంత్ జర్నలిస్టులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.
కేసీఆర్ ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తే, కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రజలను అప్పుల పాలు చేస్తోంది.
ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇస్తామన్న లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు.
ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగితే ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పట్టించుకోలేదు. నేను నిమ్స్ కు వెళ్లి, బయట మందులు కొనుక్కుంటున్న ఆ తల్లి బాధను, బిల్లులను మీడియాకు చూపిస్తే అప్పుడు ఈ దద్దమ్మ ప్రభుత్వం కదిలింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజల గొంతుకగా నిలబడి పోరాడుతోంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీఆర్ఎస్ ఉంటుంది.
హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది. ఐరోపాలో హిట్లర్ పేరు ఎత్తితే ఎలా నిషేధిస్తారో, రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు నిషేధించే రోజు వస్తుంది.
వేమనపల్లి మండలం ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యార్ధి సంఘాల ఛలో అసెంబ్లీ ముట్టడి ముట్టడి కార్యక్రమం నేపథ్యం లో వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన BRSV నాయకులు చెన్నూరి సంతోష్ ,చెన్నూరి ప్రసాద్ ,దుర్గం సుధాకర్ గారిని ముందస్తు అరెస్ట్ చేసిన నీల్వాయి పోలీసులు
Live: మానకొండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు https://t.co/43wydPHwee
✳️ పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తాతామధు, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, లింగాల కమల్ రాజ్, ఏనుగుల రాకేశ్ రెడ్డి, బమ్మెర రామ్మూర్తి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.
❇️ కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు👇
♦️ రాష్ట్రంలో రెవెన్యూ పడిపోతా ఉంది, కానీ రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం వందల వేల రెట్లు పెరిగిపోయింది.
♦️ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కానీ రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారి ఆదాయం, కమీషన్ దందాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.
♦️ బాంబుల మంత్రి పొంగులేటి ఎంత సంపాదించాడంటే.. నోట్లు లెక్కపెట్టే మెషీన్లు కూడా అలసిపోతున్నాయి.
♦️ రెండు సంవత్సరాల కింద ఈడీ దాడి చేసి పట్టుకున్న వందల కోట్ల రూపాయల పైన కనీసం ప్రకటన లేదు.
♦️ పొంగులేటి ఈడీ దాడి పైన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు మాట్లాడలేదు ఇన్ని రోజులు.
♦️ బీజేపీతో పొంగులేటికి ఉన్న లాలూచీ కారణంగానే ఈడీ ఆయన పైన కేసు పెట్టలేదు.
♦️ తెలంగాణలో కోటి ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పద జాబితాలో పెట్టి వాటిని దోచుకుంటున్నాడు.
♦️ కోటి ఎకరాల పైన ఆంక్షలు పెట్టి ఆ భూములను బెదిరించి సెటిల్మెంట్లు చేయించుకుంటూ నికృష్టమైన పనులు చేస్తున్నాడు.
♦️ రేవంత్ రెడ్డి దొంగ అయితే పొంగులేటి గజదొంగ మాదిరిగా దోచుకుంటున్నాడు.
♦️ పొంగులేటి డైలాగులు, అహంకారం ప్రజలందరూ చూశారు.
♦️ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీసీ మంత్రులు కొండా సురేఖ గారిని మాట్లాడనియ్యకుండా మైక్ కట్ చేశారు.
♦️ పక్కన ఉన్న మరో బీసీ మంత్రి వాకిటి శ్రీహరి మీద కాగితాలు విసిరేశారు.
♦️ ఎంత అహంకారం కాకుంటే తోటి మంత్రులతో అంత అహంకారంగా ప్రవర్తిస్తాడు.
♦️ బీసీ మంత్రులు కూడా పొంగులేటి మాదిరే ప్రజలతో ఎన్నుకోబడ్డ వారని గుర్తుంచుకోవాలి.
♦️ అధికారులను పట్టుకొని సెన్సు ఉందా అని అహంకారంతో పొంగులేటి మాట్లాడుతున్నాడు.
♦️ ఇష్టానుసారంగా దోచుకోవడానికి, అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడిని అడ్డు పెట్టుకొని వట్టినాగులపల్లిలో గజదొంగల భూములు దోచుకోవడానికి నీకు సెన్స్ ఉందా అని అడుగుతున్నా.
♦️ వట్టినాగులపల్లిలో పదుల ఎకరాలపైన మీ కొడుకు మరియు కిరాయి మూకలు పంపి వాళ్లపై దాడి చేసింది వాస్తవం కాదా?
♦️ నీ కొడుకుపైన పోలీస్ కేసు నమోదు చేస్తే ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవం కాదా? నీ అన్యాయాలు, అక్రమాలు అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నావా?
♦️ అందుకే పాలేరులో ఎప్పుడు ఎన్నిక వచ్చినా గులాబీ జెండా మాత్రమే ఎగురుతుంది.
♦️ హౌసింగ్ మంత్రిగా 20 లక్షల ఇండ్లు కడితేనే ఓట్లు అడుగుతా అన్నావు కదా ఆ మాట మీద నిలబడే సత్తా ఉన్నదా?
♦️ మరి సగం కాలం అయిపోయింది 10 లక్షల ఇండ్లు కట్టావా? లేదా నువ్వు కడతా అన్న 20 లక్షల ఇండ్లు నీ రాఘవ కంపెనీ ఏమైనా కడుతుందా?
♦️ ఖమ్మంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎన్ని ఇండ్లు ఇచ్చావు?
♦️ వారికి 6 లక్షల రూపాయలు ఇండ్లు కట్టుకోవడానికి ఇస్తామన్నావు ఆ మాట ఎక్కడ పోయింది.
♦️ అయినా నీకు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది, వెలుగుమట్ల మాదిరి ఇండ్లు కూలగొట్టడం, విధ్వంసం తప్ప వికాసం తెల్వదు.
♦️ విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాళ్యం ముఠా మీది.
♦️ కాంగ్రెస్ రైతుల నుంచి పీల్చి పిండుకున్న భూమి శిస్తు కేసీఆర్ తీసేసిండు.
♦️ కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భూమి శిస్తు పెట్టి రైతులను వేధించేందుకు సిద్ధమవుతున్నది.
♦️ రేవంత్ రెడ్డి మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి భూమి శిస్తు పెడతామని చెబుతున్నారు. భూమి శిస్తు పేరుతో రైతుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తారా?
♦️ ములుగు జిల్లాలో పొంగులేటి వేల కోట్ల ఇసుక దందా కోసం స్కెచ్ వేశాడు, చివరికి సమ్మక్క సారలమ్మ జాతర్ల టెండర్లను కూడా పొంగులేటి వదిలిపెట్టలేదు.
♦️ సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా కమీషన్ల కుమ్ములాటల కోసం మంత్రులు కొట్లాడుకున్నారు.
@KTRBRS
గద్దెనెక్కి రెండున్నరేళ్లు అయినంక
ఒక్క ప్రభుత్వ పాఠశాలకు సున్నాలేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటూ ప్రచారం చేసుకుంటున్న సన్నాసి రేవంత్!
గతంలో పాత షెడ్డుకు రంగులు వేసి "యంగ్ ఇండియా పోలీస్ స్కూల్" అంటూ ప్రచారం చేసి దొరికిపోయిన రేవంత్...
ఇప్పుడు ఆరుట్లలో "తెలంగాణ పబ్లిక్ స్కూల్" పేరుతో అదే డ్రామా!
కేసీఆర్ హయాంలో మన ఊరు - మన బడి కింద అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలకు రంగులు వేసి, కొత్త స్కూల్ కట్టినట్టుగా ఫోటోలకు పోజులు.
స్కూల్‌కు వేసిన రంగుల ఖర్చుకన్నా...
ప్రచారానికి పెట్టిన ఖర్చే ఎక్కువ!
ఉన్నవాటికి రంగులు వేయడం కాదు రేవంతూ...
రెండున్నరేళ్లలో ఒక్క కొత్త ప్రభుత్వ పాఠశాల అయినా కట్టినవా?
🚉 సంకటంలో హైదరాబాద్ మెట్రో రైల్ ⚠️
🚨 ఎల్ అండ్ టీతో ముగిసిన ఒప్పంద గడువు. టేకోవర్ చేసుకోలేకపోయిన రేవంత్ సర్కార్
📢 ఎల్ అండ్ టీ ఖాతాకు చేరని ఐఆర్ఎఫ్సీ రుణం
📣 రూ.13,600 కోట్ల రుణ సమీకరణలో పీటముడి
🆘 ఎన్నడూ 7.5 శాతం వడ్డీరేటుకు తగ్గని ఐఆర్ఎఫ్సీ.. రేవంత్ చెప్తున్న 4% వడ్డీరేటు నిజమేనా?
⛔ టేకోవర్‌కు ఎంతటైమ్ పడుతుందో చెప్పని సీఎం
కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ మెట్రో గణనీయమైన పురోగతిని సాధించింది. విస్తరణ, ప్రజాసేవలకు తోడు నిర్వహణ ప్రమాణాలతో దేశంలోనే అత్యుత్తమ మెట్రోగా రాణించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రేవంత్ సర్కార్ మెట్రో రైలుకు మోకాలడ్డటం మొదలుపెట్టింది.
విలువైన స్థలాలపై కన్నేసిన కొందరు పెద్దలు.. మెట్రోను బంగారు బాతులా చూడటం ప్రారంభించారు. ఎప్పుడెప్పుడు దాన్ని కోసుకుతిందామనే యావలో ఎడాపెడా నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దుచేశారు. కోర్ సిటీని గాలికొదిలి.. జనమే లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో అన్నారు. కష్టమో నష్టమో సంస్థను నడిపిస్తున్న ఎల్అండ్టీని వెళ్లిపోయేలా బెదిరింపులకు దిగారు. స్వయంగా ప్రభుత్వమే నడుపుతుందని ప్రకటించారు.
తీరా ఇప్పుడేమైంది? తానే నడుపుతానంటూ తొడగొట్టిన ప్రభుత్వం.. మెల్లమెల్లగా చేతులెత్తేస్తున్నది. నిన్నటిదాకా రూ.30వేల కోట్ల ఆస్తిని రూ.15వేలకే సర్కార్ పరం చేయబోతున్నానంటూ బీరాలు పలికిన ప్రభుత్వం.. ఇప్పుడు 8 నుంచి 11% వడ్డీకి బయటి రుణమే దిక్కని పిల్లికూతలు వినిపిస్తున్నది. ట్రాక్ తప్పిన నిర్ణయాలతో హైదరాబాద్ మెట్రో ఆగమైతున్నది. చిక్కుల్లోపడి కుక్కలు చింపిన విస్తరిలా మారుతున్నది.
రాష్ట్ర రెవెన్యూ ఆదాయం పడిపోయింది..
కానీ రెవెన్యూ మంత్రి పొంగులేటి అవినీతి సామ్రాజ్యం వేల రెట్లు పెరిగిపోతున్నది!
విచ్చలవిడి అవినీతి, అక్రమాలు, అహంకారంతో విర్రవీగుతున్న పొంగులేటి బాగోతాలు చూడండి👇
✳️ పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS