సత్యాగ్రహమే ఆయుధంగా.. అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్చా స్వాతంత్ర్యాలు అందించిన జాతిపిత #మహత్మాగాంధీ గారి #జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.
#GandhiJayanti
సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ( బి ఆర్ ఎస్ ) విస్తృత స్థాయి సమావేశం ఈరోజు సంగీత నిలయంలో విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావు గారు సహా అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీని మూడవసారి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.
ఆ విజయ గణపతి ఆశీస్సులతో విఘ్నాలు తొలగి విజయం సాధించాలని, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని కోరుకుంటూ..
రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
సెప్టెంబర్ 17 - జాతీయ సమైక్యతా దినోత్సవం
రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు...
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు!