కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ అండర్‌టేకింగ్స్(ASRTU) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.సూర్య కిరణ్‌కు డాక్టరేట్ లభించింది. 'మార్కెట్ ధోరణి-టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పనితీరు' అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) డాక్టరేట్‌ను బుధవారం అందించింది. నిట్ మేనేజ్మెంట్ విభాగ అసోసియేట్ ఫ్రొఫెసర్ ప్రాన్సిస్ సుధాకర్ పర్యవేక్షణలో ఈ పరిశోధనను సూర్యకిరణ్ పూర్తి చేశారు. 1992లో ఆర్టీసీలో చేరిన ఆయన.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డీఎం, డీవీఎం, ఆర్ఎం, తదితర హోదాల్లో పనిచేశారు. #TSRTC చీఫ్ పర్సనల్ మేనేజర్(సీపీఎం)గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై న్యూఢిల్లీలోని ఏఎస్ఆర్టీయూ ఈడీతో పాటు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్(సీఐఆర్టీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
నిట్ తనకు డాక్టరేట్‌ను అందించడంతో హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ను గురువారం సూర్యకిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టరేట్ ప్రతిని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్‌ను సజ్జనర్ అభినందించారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పనితీరుపై పరిశోధన చేయడం ప్రశంసనీయమన్నారు. వరంగల్ నిట్‌తో టీఎస్ఆర్టీసీ చేసుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా సంస్థ అధికారులకు పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నారని సజ్జనర్ తెలిపారు.
@PROTSRTC @asrtudelhi @Govardhan_MLA @puvvada_ajay
ప్రయాణికులకు #TSRTC తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్టికభారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికుల టి-24 టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. అంతేకాదు, కొత్తగా సీనియర్ సిటిజన్లకు టి-24 టికెట్ లో రాయితీ కల్పించాలని నిర్ణయించింది. వారికి రూ.80కే ఆ టికెట్ ను అందించనుంది. 60 ఏళ్ళు పైబడిన వారికే టి-24 టికెట్ లో 20 శాతం రాయితీ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డ్ ను బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కొత్త టి-24 టికెట్ ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.
హైదరాబాద్ లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం గతంలో టి-24 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మొదట ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ తర్వాత టి-24ని 100కి తగ్గించింది. ఒక లీటర్ పెట్రోల్ ధర కంటే తక్కువకే 24 గంటల పాటు ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది. తాజాగా సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎండాకాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం టి-24 టికెట్ పై 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని, ఆ టికెట్ ను సీనియర్ సిటిజన్లకు రూ. 80కే అందించాలని నిర్ణయించిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. టి-24 టికెట్ కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయని పేర్కొన్నారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.
మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50 కి ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించచవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని సంస్థ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.
@PROTSRTC @way2_news@TV9Telugu@abntelugutv@SamayamTelugu @Govardhan_MLA @puvvada_ajay@sakshidaily
ఈరోజు హైదరాబాద్ ఎల్బీ నగర్ వద్ద నూతనంగా ప్రవేశపెట్టిన టిఎస్ ఆర్టిసి లహరి A/C స్లీపర్ క్లాస్ బస్సులను గౌరవ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారితో, గౌరవ ఎండి సజ్జనార్ గారితో కలిసి ప్రారంభించాము..
@puvvada_ajay @tsrtcmdoffice @TSRTCHQ @secy2chairman@BRSparty@BRSParty_News
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చెంత భక్తుల సౌకర్యార్థం నూతన టిఎస్ఆర్టిసి ప్రయాణ ప్రాంగణాన్ని గౌరవ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారితో ప్రారంభించాము.
@BRSparty
వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM’ పేరుతో కొత్త ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌కు #TSRTC శ్రీకారం చుట్టింది. ఈ సర్వీస్‌ను సంస్థ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లా కేంద్రాల్లో నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
I humbly request all celebrities to refrain from supporting/promoting QNET & all such Multi-Level Marketing companies which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. Very unfortunate that this happened in #Hyderabad today. @MirzaSania
ప్రయాణికులకు వేగంగా సేవలందించేందుకు 'TSRTC Bus Tracking’ యాప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రయాణికుల మెబైల్ ఫోన్లకు టికెట్ వివరాలతో పాటు బస్సు ట్రాకింగ్ లింక్‌ను సందేశరూపంలో పంపుతున్నాం. దానిపై క్లిక్ చేయగానే బస్సు ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు.
Track your Bus Live with #TSRTC App. See the exact location of your bus, and reach the stop a few minutes before the ETA.
Providing Hassle-free and safe travel experience.
ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం సైబర్ లైనర్ పేరుతో నూతన బస్సు సర్వీసులను #TSRTC ఏర్పాటు చేసింది. #Hyderabad లోని సైబర్ టవర్స్ వద్ద ఈ బస్సులను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తో కలిసి నేడు ప్రారంభించడం జరిగింది. #CyberLiner
Start talking to your child about GOOD TOUCH & BAD TOUCH so that they are able to understand this sensitive issue.
Educate before it’s too late!
#StopChildAbuse#ChildSafety
టీఎస్ఆర్టీసీ #Hyderabad దర్శన్ సేవలను వినియోగించుకున్న మహారాష్ట్ర వాసులకు అభినందనలు. మీ మాటల స్పూర్తితో మరింత ముందుకు వెళ్తాం. ప్రయాణికులకు సంతృప్తికరమైన సేవలను అందించడమే #TSRTC ప్రధాన ధ్యేయం.
చిన్న పిల్లలతో ప్రయాణించేటప్పుడు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి.
పెట్రోల్ ట్యాంక్ లపై కుర్చోపెట్టడం, వెనకకి తిరిగి కుర్చోపెట్టడం వంటివి చేయడం ద్వారా వారిని ప్రమాదాల్లోకి నెడుతున్నాం.
#Roadsafety