చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కొత్తపేట గ్రామంలో నిర్వహించిన నేతన్న సేవలో కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ సీఎం శ్రీ చంద్రబాబు సార్ తో మేము, జిల్లా కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రూప్ ఫోటోలో పాల్గొనడం జరిగింది.
📷 సభావేదిక పరిశీలన
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జిల్లా పర్యటన నేపథ్యంలో, హెలిప్యాడ్, సభా వేదిక, పార్కింగ్ ప్రదేశాలు, కాన్వాయ్ మార్గాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఐఏఎస్ తో కలిసి పరిశీలించడం జరిగింది.
#APPolice#APPOLICE100#APCM#Bapatla#chiralanews
🚔 శిరోరక్ష - ప్రాణరక్ష
హెల్మెట్ ధారణ నిబంధన కాదు... అది ప్రాణాలకు రక్షణ కవచం.
దగ్గరైనా... దూరమైనా... ద్విచక్ర వాహనం నడిపే ప్రతిసారి హెల్మెట్ ధరించండి. ఎందుకంటే ప్రమాదం చెప్పి రాదు.
#appolice#roadsafety#appolice100
🚨 "Marriage Invitation" పేరుతో వచ్చే APK ఫైళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
WhatsApp ద్వారా వచ్చే APK ఫైళ్లను డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ చేయవద్దు. అలాంటి ఫైళ్లు మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, OTPలను సైబర్ నేరగాళ్ల చేతికి చేరేలా చేసే ప్రమాదం ఉంది.
Cyber Helpline: 1930
బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా పట్టణంలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం విచ్చేసిన రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసి స్వాగతం పలకడం జరిగింది.
#APPOLICE100#APGovernor
📷ప్రజల భద్రతే మా బాధ్యత...
బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలుర కేసును ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల విశ్లేషణతో కేవలం 24 గంటల్లోనే ఆచూకీ గుర్తించి క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.
🚔 నేర నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత.
బాపట్ల జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో బాపట్ల, చీరాల సబ్‌డివిజన్ పరిధిలో జిల్లా పోలీస్ యంత్రాంగం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
📷 సాయం కోసం: 112
📷 బాపట్ల జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్: 83338 13228
🚨గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి పల్నాడు పర్యటన విజయవంతంగా ముగిసింది.
అనంతరం గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ట త్రిపాఠి, IPS గారితో కలిసి పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది.
#appolice
🚔 స్మార్ట్ పోలీసింగ్‌తో సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యం
మార్టూరు రూరల్ సర్కిల్, పర్చూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయడం జరిగింది. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించాము.
#APPolice#APPOLICE100#BapatlaPolice#dail112
🚔బాపట్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న శిరోరక్ష - ప్రాణరక్ష అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు హెల్మెట్ వినియోగం యొక్క ప్రాముఖ్యతను బాపట్ల జిల్లా పోలీస్ వివరించడం జరుగుతుంది.
బైక్ పై ప్రయాణంలో హెల్మెట్ ధరించడం అందరి బాధ్యత. మీ కుటుంబం కోసం, మీ ప్రాణాల కోసం హెల్మెట్ ధరించండి
📷 జాతీయ స్థాయిలో బాపట్ల జిల్లా పోలీస్‌కు మరో గౌరవం
14వ సీనియర్ నేషనల్ పెన్కాక్ సిలాట్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ వీరంకి నరేంద్రను అభినందించడం జరిగింది.
విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటుతూ జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీసుకురావడం అభినందనీయం.
📷 పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోమ్ గార్డ్ కుటుంబానికి రూ. 40.25 లక్షల చెక్కులను అందజేయడం జరిగింది.
విధి నిర్వహణలో త్యాగం చేసిన వారి కుటుంబాలకు బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.
#APPolice#APPOLICE100
🚨 పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
"పోలీస్ సహచార్ ఓపెన్ హౌస్" కార్యక్రమంలో హోంగార్డుల వినతులను స్వయంగా స్వీకరించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.
పోలీస్ సిబ్బంది సంక్షేమమే... ప్రజలకు అందించే మెరుగైన సేవలకు పునాది.
#appolice
🚨రాత్రివేళ సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించే వాహనదారులు అలసటకు గురికాకుండా ఉండేందుకు బాపట్ల జిల్లాలోని ప్రధాన రహదారులపై Wash & Go కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం.
మీ గమ్యంకు మీరు సురక్షితంగా చేరుకోవడమే బాపట్ల జిల్లా పోలీస్ లక్ష్యం. #appolice
🚔📱పేద, మధ్యతరగతి కుటుంబాలకు మొబైల్ ఫోన్ ఎంతో విలువైనది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూడా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాపట్ల జిల్లా పోలీస్ రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది.
ఫోన్ పోగొట్టుకుంటే CEIR పోర్టల్ లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగలరు.
☎️ అత్యవసర సహాయం : 112
🚫మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
☎️ అత్యవసర సహాయం : 112
☎️ బాపట్ల జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ : 83338 13228
#appolice
ఒక తల్లి కళ్లలో కనిపించిన ఆనందం... పోలీసు సేవకు లభించిన అత్యున్నత గుర్తింపుగా భావిస్తున్నాం
బాలుడిని సురక్షితంగా తన కుటుంబానికి చేరవేయడం మా బాపట్ల జిల్లా పోలీసుల బాధ్యతగా భావించాం.
బాలుడి తల్లి మాపై వ్యక్తం చేసిన కృతజ్ఞతలు ప్రతి పోలీసు ఉద్యోగికి మరింత బాధ్యతను గుర్తు చేస్తాయి.
❤️ ఆ చిన్నారి చిరునవ్వు.. పోలీస్ సేవకు లభించిన గొప్ప ప్రశంస.
చీరాలలో కిడ్నాప్‌కు గురైన 6 నెలల చిన్నారిని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి 24 గంటల్లో తల్లిదండ్రుల చెంతకు చేర్చాము.
ఆ చిన్నారి నన్ను చూసి అమాయకంగా నవ్విన ఆ క్షణం మనసును హత్తుకుంది.
#APPolice#APPOLICE100
ఆపరేషన్ దండాయనతో.. మహిళలకు భరోసా
బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీగా అమలు చేస్తోంది.
ప్రతి మహిళ ధైర్యంగా, సురక్షితంగా జీవించే వాతావరణం కల్పించడమే మనందరి లక్ష్యం.
అత్యవసర సహాయం : 112
#appolice#dail112