ఇలా ఉంటాయి అండి పేటీఎం కబుర్లు!! 🤦
హాఫ్ బాటిల్ కొన్నాడు - క్వార్టర్ పొట్టలోకి వేసాడు. 😄😅
ఒరేయ్ బాబు నువ్వు స్కాన్ చేయాల్సింది బాటిల్ మూత మీద ఏపీ ప్రభుత్వం వేసే స్టికర్ మీద ఉండే QR కోడ్ రా నాయనా.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు దంపతులు
సుమారు 450 మంది టీడీపీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు
వెలిగొండ ప్రాజెక్ట్ సందర్శన అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు దంపతులు నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పార్టీ శ్రేణులకు ఏర్పాటు చేసిన వెలిగొండ–శ్రీశైలం పర్యటనలో భాగంగా ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలే తన కుటుంబమని, వారి కష్టానికి గుర్తింపుగా ఇలాంటి పర్యటనలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారు దంపతులకు దేవస్థానం అధికారులు, పాలకమండలి సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు గారు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు దంపతులకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ దర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు.
#GallaMadhavi #GunturWestMLA #GunturWest #TDP #Srisailam #BhramarambaMallikarjuna @naralokesh@iTDP_Official
తప్పు చేసినది ఎవరైనా.. ఏ పార్టీ వారైనా.. ఉపేక్షించేది లేదు. ఏ మహిళ గౌరవానికి భంగం కలిగించే సంఘటనైనా పూర్తిగా ఖండించదగినదే. గుంటూరు పశ్చిమలో చోటుచేసుకున్న ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. మన సమాజంలో ఇలాంటి ఘటనలకు ఏమాత్రం స్థానం లేదు.
చట్టపరమైన చర్యలు వెంటనే ప్రారంభమై, నిందితుడిని అరెస్ట్ చేయడం, సంబంధిత వ్యక్తిపై పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది.
చట్టం ముందు అందరూ సమానులే. రాజకీయాలు, హోదాలు, వ్యక్తిగత సంబంధాలు ఎవరికీ రక్షణగా నిలవకూడదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చట్టం ముందు జవాబు చెప్పాల్సిందే.
గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ప్రతి మహిళ గౌరవం, భద్రతకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను. ప్రతి మహిళ నిర్భయంగా జీవించే, న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగిన సమాజ నిర్మాణానికి మనమంతా కలిసి కట్టుబడి ఉన్నాం.
మహిళల గౌరవం విషయంలో రాజీ లేదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
మల్లెల మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో జరిగిన ఘటన నా దృష్టికి వచ్చిన వెంటనే తీవ్ర ఆవేదనకు గురయ్యాను. బాధితులు నన్ను కలిసి జరిగిన విషయాన్ని వివరించగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా నగరంపాలెం పోలీసులను సంప్రదించి వెంటనే కేసు నమోదు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మహిళల గౌరవం, భద్రత విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడను. మహిళలను అవమానించే, వేధించే, వారి మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి చర్యల నైనా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం ముందు అందరూ సమానమే. తప్పు చేసిన వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరు.
ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లెల మూర్తిని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని సమర్థించే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు. పార్టీ క్రమశిక్షణ, మహిళల గౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.
గతంలో కూడా మహిళలను, విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్నాం. అదే విధంగా ఈ ఘటనలో కూడా చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు కొనసాగుతాయి. బాధిత కుటుంబానికి నేను పూర్తిస్థాయిలో అండగా ఉంటాను. వారికి న్యాయం జరిగే వరకు నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల భద్రతకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.
– గళ్ళా మాధవి
ఎమ్మెల్యే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు
#gallamadhavi #GunturWestMLA @iTDP_Official@naralokesh
(09-07-2026)
ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం – “మీ వద్దకు–మీ గళ్ళా మాధవి” కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి గారు అన్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న “మీ వద్దకు–మీ గళ్ళా మాధవి” కార్యక్రమంలో భాగంగా గురువారం 19వ డివిజన్లోని 278వ బూత్ పరిధిలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, బూత్ స్థాయి కార్యాచరణ, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, అలాగే జరుగుతున్న సర్ (Special Intensive Revision) ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్ల అభివృద్ధి, కొత్త బోరింగ్ పంపుల ఏర్పాటు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు మరియు మరమ్మతులకు సంబంధించిన సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల నుంచి వచ్చిన సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యలను అత్యవసర ప్రాతిపదికన పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ... ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు మౌలిక వసతుల మెరుగుదల కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#GallaMadhavi #GunturWest #GUNTURWESTMLA #MeeVaddakuMeeGallaMadhavi #PrajaSeva @iTDP_Official@naralokesh