పౌర్ణమి రోజున శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామివారిని గా నా మిత్రులతో కలిసి పెంచలకోన చేరుకుని స్వామివారి దివ్య దర్శనం ఎంతో అదృష్టంగా, ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తున్నాము. ఈ దర్శనం మనసుకు అపారమైన ప్రశాంతతను కలిగించింది.
"శ్రీకర... శుభకర... ప్రణవ స్వరూప జ్వాల నరసింహ...
భక్త జనావన దయామయ నరసింహ..."
స్వామివారి అనుగ్రహం సర్వలోకాలకు శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి! 🙏
#KishoreGunukula #JanaSenaParty #JanaSena #penusila #lakshminarasimhaswamy #narasimha
మా ఆవిడకు మామిడికాయలు "కొట్టేయడం" అంటే ఎంతో ఇష్టం. అందుకే తోటలో సరదాగా మామిడికాయలు కోయడం, నవ్వులు పంచుకోవడం,పచ్చని ప్రకృతి మధ్య కాసేపు గడుపుతూ ఆ క్షణాలను ఆస్వాదించడం మరింత ప్రత్యేకంగా నిలిచిపోయాయి.
రోజువారీ జీవితంలోని హడావుడిని కాసేపు పక్కనపెట్టి, ప్రకృతి ఒడిలో సన్నిహితులతో కలిసి గడపడం మనసుకు ఎంతో ప్రశాంతతను, కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి.
#KishoreGunukula #JanaSenaParty #JanaSena #summer #mango #funnyreels
ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యం
భగత్‌సింగ్ కాలనీ సచివాలయాల్లో సిబ్బంది కొరత వెంటనే తీర్చాలి –
"గాంధీ బొమ్మ సెంటర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులను కోరాం."
#KishoreGunukula - @JanaSenaParty
నగరం లో పలు సమస్యల పరిష్కారం కోసం
53_54డివిజన్ జనసేన స్థానిక జనసేన నాయకుడు దివానం సురేష్ తో కలసి డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని @APDeputyCMO శ్రీ @PawanKalyan గారు జనసేన శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలతో మమేకమై దివానం సురేష్ పనిచేయడం అభినందనీయమని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.
నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీ సచివాలయం-1, సచివాలయం-2 పరిధిలోని ప్రజలు తీవ్ర సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల తెలిపారు.
ఈ రెండు సచివాలయాలకు కలిపి సుమారు 15 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉండటంతో దాదాపు 2,700 కుటుంబాలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందడం లేదన్నారు. ముఖ్యంగా రెండు సచివాలయాల్లో అడ్మిన్ పోస్టులు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) పోస్టులు ఖాళీగా ఉండటంతో సదరం ఎంట్రీలు, కొత్త పింఛన్ దరఖాస్తులు, ధ్రువపత్రాల జారీ తదితర సేవలు తీవ్ర జాప్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు.
భగత్‌సింగ్ కాలనీ సచివాలయం-1, సచివాలయం-2లకు అత్యవసరంగా అడ్మిన్ మరియు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరినట్లు చెప్పారు.
అదేవిధంగా నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం వల్ల స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు.
ఈ సమస్యపై స్పందించిన హెల్త్ ఆఫీసర్, మంత్రి @Dr_NarayanaP గారి నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నామని, కాలువల నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే శాశ్వత పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని, ఉప ముఖ్యమంత్రి #PawanKalyan గారు, స్థానిక ఎమ్మెల్యే మరియు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తామని కిషోర్ గునుకుల స్పష్టం చేశారు....
@APDeputyCMO@itsRamTalluri@mnadendla@NagaBabuOffl@AjayaKumarJSP
#Nellore #Nellorecity #Andhrapradesh #PawanKalyanAneNenu
"గాడిదకు వయసు పెరుగుతుంది గానీ బుద్ధి పెరగదు"
పొన్నా ప్రభాకర్ గారిని చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తోంది;
11 రోజుల నిరాహార దీక్ష ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదనే బాధతో చేశారు. దాన్ని ఈరోజు కట్ అండ్ ఎడిట్ రాజకీయాల కోసం వాడుకోవడం దారుణం...
కవిత గారు, మీ పార్టీకి జెండా గానీ అజెండా లేదు; నోటికి వచ్చినట్లు ముందు మీ హయాంలో మంత్రిగా జరిగిన అవినీతి కి సమాదానం చెప్పండి...
#KishoreGunukula #JanaSena
— కిషోర్ గునుకుల, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, వన్ టు వన్ డిబేట్ విత్ సాస్ టీవీ.
తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే పంచెలు తడిసిపోయే పరిస్థితి...
పంచెలు ఊడదీసి కొడతాను" అని గతంలో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద సభ ఇక్కడ పెడుతుంటే, మన ఉనికి కోల్పోతామేమో అన్న భయం కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.
జనసేనకు సంబంధించిన నవ నిర్మాణ సభ పెట్టాలా వద్దా అన్నది అక్కడి జనసేన అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు, వారికి మద్దతు ఇచ్చే వర్గాలు చర్చించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా పార్టీ అధినేత సభ పెట్టాలనుకుంటున్నారంటే ఒక అజెండా లేకుండా అక్కడ పెట్టాలనుకుంటున్నారని ఆలోచించుకోవాలి.
ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు "కాంగ్రెస్ హటావో – దేశ్ బచావో" అని నినాదం ఇచ్చారో, ఆ తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎలా మారిందో అందరికీ తెలుసు. అదే కాంగ్రెస్ ఈరోజు భయాందోళనకు గురవుతోంది.
జనసేన పార్టీ తెలంగాణలో బలపడుతుందనే భయంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పొన్నా ప్రభాకర్ గారు మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఒక సామెత చెప్పారు. నేను కూడా ఒక సామెత చెబుతాను.
గాడిద కి ఒళ్ళు పెరిగినా బుర్ర పెరగదు...
"వయసు వచ్చింది కానీ తెలివి రాలేదు" అని.వయసు హోదా పెరిగినా మాటల్లో పరిణతి కనిపించకపోవడం దురదృష్టకరం.
ఒక మంత్రి పదవిలో ఉండవచ్చు. ఒక హోదాలో ఉండవచ్చు. కానీ ప్రజానాయకుడిగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడతారా?
గతంలో కూడా ఒక నాయకుడిపై బాడీ షేమింగ్ చేశారు. మీకు, ఆ గాడిదకు ఇద్దరికీ తెలివి తేటలు లేవని ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిన్నటి సమావేశంలో చెప్పారు. ఏ కుల నేత మాట్లాడితే ఆ కుల నేతతో, ఏ ప్రాంతీయ నేత మాట్లాడితే ఆ ప్రాంతీయ నేతతో తగవులు పెట్టుకునే ఓల్డ్ డేస్ పాలిటిక్స్ మానేయండి అన్నారు. మనం జెన్-జీ కోసం, కొత్త తరాల కోసం రాజకీయాలు చేయాలని చెప్పారు.
మొదటి విషయానికి వస్తే, ఏ రోజూ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఇది దేశం మొత్తం ఎరిగిన సత్యం. మనం రాష్ట్రాలుగా విడిపోయినా భారతీయులమే. దేశ సమగ్రత కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెబుతుంటారు.
ఏ పార్టీలో అధికారం ఉందన్నది కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి సహకారం అవసరమైతే వారితో కలిసి పనిచేయాలని ఆయన నమ్ముతారు.
11 రోజుల నిరాహార దీక్ష కూడా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదనే బాధతో చేశారు. దాన్ని ఈరోజు కట్ అండ్ ఎడిట్ రాజకీయాల కోసం వాడుకోవడం సరైంది కాదు.
జనసేనను ఎదుర్కొనే ధైర్యం లేక ఈరోజు భయంతో ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. అది చూస్తుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది.
తప్పు చేస్తే భారతదేశంలో ఎవరికైనా ఒకటే చట్టం వర్తిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే. ఈ విషయం మర్చిపోయి ఒక నాయకురాలు పూర్తిగా అమాయకురాలిలా మాట్లాడుతున్నారు.
కవిత గారు, తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన మీ అవినీతి వ్యవహారాలకు సమాధానం చెప్పండి. తర్వాత జనసేన గురించి మాట్లాడండి.
రేపు పవన్ కళ్యాణ్ గారు దిగ్విజయంగా సభ నిర్వహించబోతున్నారు. ఎవరైనా అడ్డుకుంటామని అనుకుంటే అది సాధ్యం కాదు.
ఆపాలనుకునే వారు పదిమంది ఉండవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వారు లక్షలాది మంది ఉన్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఎన్ని కోట్లు దోచుకున్నాం, ఏ పనిలో ఎంత డబ్బు తీసుకున్నాం అన్న రాజకీయాల కన్నా, దేశ అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు.
75 సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న మార్పు కోసం, కొత్త రాజకీయ సంస్కృతి కోసం ఆయన పనిచేస్తున్నారు.
#PawanKalyan
#NavaNirmanaSabha
#Telangana
#JanaSenaForNewPolitics
#PeopleFirstPolitics
#NavaAndhraNavaTelangana
#YouthForChange
#PawanKalyanInTelangana
@JanaSenaParty@PawanKalyan@APDeputyCMO
కెఎన్నార్ కేవలం పీఏ స్థాయిలో ఉండి వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెడ్తే అసలు సూత్రధారులు ఎవరు? ఆ హయాంలో అధికారంలో ఉన్న కీలక వ్యక్తులు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో లబ్ధి ఎంత జరిగి ఉండొచ్చో తలుచుకుంటేనే ప్రజలు విస్మయానికి గురవుతున్నారు..
#KishoreGunukula#JanaSena
ABN Live డిబేట్లో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల
మధ్యతరగతి ప్రజలు తమ కుటుంబాల కోసం కష్టపడుతుంటే, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన జీవితాలు గడిపే వారిని ఉపేక్షించకూడదు.
నెలకు పరిమిత జీతం పొందే వ్యక్తి పేరిట హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో విలువైన ఆస్తులు, భూములు, బంగారం, కంపెనీల్లో వాటాలు ఉండటం సహజంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది.
లిక్కర్ స్కాంలో బయటపడుతున్న అంశాలు చూస్తుంటే ఇది కేవలం ఒక వ్యక్తి వ్యవహారమా? లేక దీని వెనుక మరింత పెద్ద వ్యవస్థ ఉందా? అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఒక బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వద్దే ఇంత ఆస్తి ఉంటే, అసలు సూత్రధారులు ఎవరు? వారికి ఎంత మేర లబ్ధి చేకూరింది? అనే అంశాలను దర్యాప్తు సంస్థలు పూర్తిగా వెలికితీయాలి.
ప్రజల సొమ్మును దోచుకునే అవినీతి వ్యవస్థలను కఠినంగా శిక్షించకపోతే ప్రజల్లో చట్టాలపై, పాలనా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది.
ఫోన్ల ధ్వంసం, ఆధారాల మాయం, సాక్షులపై ఒత్తిళ్లు వంటి ఆరోపణలు నిజమైతే అవి మరింత తీవ్రమైన నేరాలుగా పరిగణించాలి.
ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ జరిపి, అసలు లబ్ధిదారులు ఎవరు, ఎంత ప్రజాధనం దుర్వినియోగమైంది అనే విషయాలను ప్రజల ముందుంచాలి.
అవినీతికి పాల్పడిన వారెవ్వరైనా సరే, వారి హోదా ఏదైనా సరే, చట్టం ముందు అందరూ సమానమే అనే సందేశం వెళ్లేలా కఠిన చర్యలు తీసుకోవాలి.
– కిషోర్ గునుకుల
జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ, నెల్లూరు జిల్లా
@JanaSenaParty@PawanKalyan@APDeputyCMO
#ABNLive #JanaSenaParty #LiquorScam #AndhraPradesh #AntiCorruption #NelloreJanaSena
మా శ్రేయోభిలాషి,ఆప్తులు,మంచి మనసున్న మిత్రుడు ప్రముఖ న్యాయవాది మోపాటి సుమంత్ రెడ్డి గారు న్యాయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, వృత్తిపరంగా విశేష విజయాలు సాధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను...
#KishoreGunukula - @JanaSenaParty
ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ మోపాటి సుమంత్ రెడ్డి గారి నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం ఎంతో ఆనందంగా అనిపించింది.
ప్రజలకు న్యాయం అందించే సేవా మార్గంలో ఆయన మరింత కీర్తి ప్రతిష్ఠలు సంపాదించి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
@PawanKalyan@APDeputyCMO
#Nellore #Andhrapradesh #Nellorecity
తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే #పంచెలు తడిసిపోయే పరిస్థితి...
పంచెలు ఊడదీసి కొడతాను" అని గతంలో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద సభ ఇక్కడ పెడుతుంటే, మన ఉనికి కోల్పోతామేమో అన్న భయం కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.
#KishoreGunukula #JanaSena
#JanaSenaTelangana #TelanganaFormationDay
#PawanKalyan
#NavaNirmanaSabha
#Telangana
#JanaSenaForNewPolitics #trendingnow
@JanaSenaParty@PawanKalyan
కవిత గారికి జెండా లేదు, ఎజెండా లేదు. ముందు మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న సొమ్ముకు లెక్క చెప్పండి, తర్వాత ఇతరుల గురించి మాట్లాడండి.
#KishoreGunukula#JanaSena
— కిషోర్ గునుకుల, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, వన్ టు వన్ డిబేట్ విత్ సాస్ టీవీ
#JanaSenaTelangana #TelanganaFormationDay
#PawanKalyan
#NavaNirmanaSabha
#Telangana
#JanaSenaForNewPolitics
@JanaSenaParty@PawanKalyan
పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రెండు రోజుల పాటు పరిశీలన చేయడం నిజమైన బాధ్యతాయుత నాయకత్వానికి నిదర్శనం”
సిటీ 24 టీవీ డిబేట్లో కిషోర్ గునుకుల _జనసేన
#KishoreGunukula#JanaSena
సిటీ 24 టీవీ డిబేట్లో మాట్లాడిన ఆయన, “దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు నదులు, చెరువుల్లో కలుస్తున్నాయి. దీనివల్ల లక్షల ఎకరాలకు నీరందించే జల వనరులు కలుషితమవుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు ఉపయోగించే నీరు కూడా ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితి ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారింది”
గోదావరి నది కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్టితో చూడాలని
పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ అంశాన్ని మొదటి నుంచే అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు.
అటవీ శాఖ, మైనింగ్, కాలుష్య నియంత్రణ వంటి నిర్లక్ష్యానికి గురైన అంశాలపై ఆయన స్పష్టమైన వైఖరితో పనిచేస్తున్నారని చెప్పారు. గతంలో నల్లమల యురేనియం తవ్వకాల విషయంలో కూడా బయోడైవర్సిటీ రక్షణ కోసం ఆయన బహిరంగంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు.
“పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధికి అవసరమే. కానీ ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేం. గోదావరి పుష్కరాలకు భక్తులు విశ్వాసంతో వస్తారు. కనీసం వారు స్నానం చేసే నీరు పరిశుభ్రంగా ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత” అని కిశోర్ గునుకుల అన్నారు.
గోదావరి నదిలో కాలుష్య పరిస్థితిని స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్ గారు, కేవలం గోదావరికే కాకుండా రాష్ట్రంలోని అన్ని నదులను పరిరక్షించే విధంగా “రివర్ పొల్యూషన్ కన్జర్వేషన్ కమిటీ” ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించారని వెల్లడించారు. ఈ కమిటీ కాలుష్య మూలాలను గుర్తించి నివారణ చర్యలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు.
“మార్పు ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన సమస్యపై ఇప్పుడు పారదర్శకంగా స్పందించే నాయకత్వం కనిపిస్తోంది. ప్రజల డబ్బుతో పనిచేసే అధికారులు, రాజకీయ నాయకులు ప్రజారోగ్యంపై మరింత బాధ్యతతో వ్యవహరించాలి” అని అన్నారు.
జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణ ఒక ముఖ్యమైన సిద్ధాంతమని, ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్ తరాల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెబుతున్నారని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.
చివరగా, “లక్షలాది మంది భక్తులు వచ్చే పుష్కరాల సమయంలో ప్రజలకు హాని కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రెండు రోజుల పాటు పరిశీలన చేయడం నిజమైన బాధ్యతాయుత నాయకత్వానికి నిదర్శనం” అని అన్నారు.
@JanaSenaParty@PawanKalyan #trending #JanaSenaParty #DeputyCMPawanKalyan #JSPForNewAgePolitics #sity24 #PawanKalyanAneNenu
మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలనే ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షులు గారు 2019 నుంచే “నారీ శక్తి” భావజాలాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు.
#KishoreGunukula#JanaSena
పార్టీ కమిటీల్లో కూడా 33 శాతం మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే సూచించారని తెలిపారు. మహిళలు కేవలం ఓటర్లుగానే కాకుండా సమాజాన్ని నడిపించే నాయకత్వ శక్తిగా ఎదగాలని ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సహించారని పేర్కొన్నారు.
కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సమాజం కోసం ముందుకు వచ్చే మహిళలు రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో పిలుపునిచ్చారని కిషోర్ గునుకుల తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కృతి ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ గారి నమ్మకం అని చెప్పారు.
సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే ధైర్యం, మార్పును తీసుకురాగల సామర్థ్యం మహిళల్లో ఉందని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు బోధించారని పేర్కొన్నారు. అవసరమైతే మహిళలు ఝాన్సీ రాణిలా పోరాడగలరని ఆయన విశ్వసిస్తారని తెలిపారు.
మహిళలకు గౌరవం, ప్రాధాన్యం, రాజకీయ అవకాశాలు కల్పించడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందంజలోనే ఉందని, మహిళా శక్తిని బలోపేతం చేసే ప్రతి నిర్ణయాన్నీ పార్టీ స్వాగతిస్తుందని కిషోర్ గునుకుల స్పష్టం చేశారు.
@JanaSenaParty@PawanKalyan
సిటీ24 ఛానెల్లో జరిగిన రాజకీయ చర్చా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు కిశషొర్ గునుకుల మహిళా సాధికారత, మహిళా రాజకీయ ప్రాతినిధ్యం అంశాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.
#trending #JanaSenaParty #DeputyCMPawanKalyan #JSPForNewAgePolitics #sity24 #PawanKalyanAneNenu
రే రామిరెడ్డి… “నీ నత్తిపకోడీ, ఏనా కొడుకో, ఆనా కొడుకులు” అని అన్నారట. “ఆనా కొడుక్కి, విన్నా నా కొడుక్కి ఇద్దరికీ తోలు తీస్తా కోడల్లారా” అని చెప్పే సంస్కారం మాకు జనసేన పార్టీ నేర్పించలేదు.
#KishoreGunukula - @JanaSenaParty
మెగా సోదరులపై అసభ్య వ్యాఖ్యలు ఖండనీయం — జనసేన హెచ్చరిక
జనసేన పార్టీ అధ్యక్షుడు @PawanKalyan గారు, @KChiruTweets గార్ల పై నోటికి వచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో వాటిని ఖండిస్తూ.
నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల మీడియా సమావేశం..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...
“మీ మాటలే తుస్సనుకున్నాం… ఇప్పుడు మీ ఆలోచనలు కూడా తుస్సేనని ప్రజలు గుర్తిస్తున్నారు. నీచ ఆలోచనలు సవరించుకోండి.”
“రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు… కానీ కుటుంబాలను, వ్యక్తిగతంగా దూషించే సంస్కారం జనసేన పార్టీ ఎప్పుడూ నేర్పలేదు.”
“కుక్క కూడా తిన్న ఇంటి విశ్వాసం మర్చిపోదు. కానీ ప్రజారాజ్యం, జనసేన పార్టీల వల్ల గుర్తింపు పొందిన కొందరు ఇప్పుడు అదే కుటుంబాన్ని అవమానించే స్థాయికి దిగజారడం దురదృష్టకరం.”
“ప్రజారాజ్యం, జనసేన పార్టీ లేకపోతే ‘విన్నోడు’, ‘అన్నోడు’ ఎవరో కూడా ప్రజలకు తెలిసేది కాదు.”
“గత ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కన్నా… అవినీతి, భూముల దందాలు, మట్టి – గ్రావెల్ దోపిడీలే ఎక్కువ జరిగాయి.”
“ప్రభుత్వ ఇళ్ల భూముల పేరుతో కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందాలు జరిగాయి.”
“మెగా సోదరులు, జనసేన పార్టీ, #PawanKalyan గారిపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు సహించరు.”
“సామాజిక మాధ్యమాల్లో కావాలనే విషప్రచారం చేస్తూ ఆడియోలు, వీడియోలు వైరల్ చేస్తున్నారు. వాటిని జనసేన పార్టీ బలంగా తిప్పికొడుతుంది.”
“జనసేన పార్టీని బలహీనపర్చాలనే కుట్రలను ప్రతి జనసేనికుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు.”
“రాజకీయ విమర్శలు హద్దులు దాటితే ప్రజలే తగిన సమాధానం చెబుతారు.”
“వ్యక్తిగత దూషణలు, అసభ్య రాజకీయాలు, విషప్రచారాలతో జనసేన పార్టీని బలహీనపరచలేరు. ప్రజల విశ్వాసం, జనసేనికుల అంకితభావం ముందు ఇలాంటి చీప్ రాజకీయాలు నిలవవు” అని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల స్పష్టం చేశారు...
@APDeputyCMO@itsRamTalluri@NagaBabuOffl@mnadendla@AjayaKumarJSP@JSPShatagniTeam
#PawanKalyanAneNenu #Nellorecity #Andhrapradesh
#nellore #Kavali
జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.
త్యాగం, ప్రేమ, సోదరభావానికి ప్రతీక అయిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఈ బక్రీద్ మీ జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధిని తీసుకురావాలి.
మన సమాజంలో ఐక్యత, మానవత్వం మరింత బలపడాలి.
ఈద్ ముబారక్
జై జనసేన #KishoreGunukula #JanaSena #JanaSenaParty #PawanKalyan #bakraeid #Bakrid
“నెల్లూరు సిటీ,ప్రజలకు సేవలు అందించాల్సిన సచివాలయాలు… సిబ్బంది కొరతతో ఇబ్బందుల కేంద్రాలుగా మారకూడదు”
“రెండు సచివాలయాలకు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, అడ్మిన్ పోస్టులు అత్యవసరం. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందాలంటే ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి. వీలైనంత త్వరగా సిబ్బందిని కేటాయించాలని మంత్రిగారిని కోరుతున్నాము.”
“2700 కుటుంబాలకు 18 మంది సిబ్బంది అవసరం… ముగ్గురితో ప్రజాసేవలు ఎలా సాధ్యం?”
#KishoreGunukula - @JanaSenaParty జిల్లా ప్రధాన కార్యదర్శి,
స్థానిక జనసేన నాయకులు దివానం సురేష్ బాబు సమాచారం మేరకు భగత్‌సింగ్ కాలనీ సచివాలయం-1,2 పరిధిలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు సిబ్బంది కొరత కారణంగా తీవ్ర ఆలస్యానికి గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు సంవత్సరం కాలంగా రెండు సచివాలయాలకి వెల్ఫేర్ ఆఫీసర్, ఉమెన్ ప్రొటెక్షన్, అమెనిటీస్ ఈ ముగ్గురు అధికారులతో మాత్రమే ఈ రెండు సచివాలయాలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. తాత్కాలికంగా ఇన్‌చార్జ్‌లను నియమించినప్పటికీ వారు ఎక్కువకాలం అక్కడ విధులు నిర్వహించకపోవడం గమనార్హం. దీంతో ప్రజలకు అందాల్సిన సేవలు మరింత ఆలస్యమవుతూ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో సచివాలయంలో వెల్ఫేర్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఉమెన్ ప్రొటెక్షన్, టౌన్ ప్లానింగ్, అమెనిటీస్, వీఆర్ఓ, శానిటేషన్, డేటా ప్రాసెసింగ్, అడ్మిన్ ఇలా మొత్తం తొమ్మిది విభాగాలకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉండాలి. అంటే రెండు సచివాలయాలకు కలిపి మొత్తం పందొమ్మిది మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం రెండింటికీ కేవలం ముగ్గురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
దీంతో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆధార్ సవరణలు, ధృవపత్రాల జారీ వంటి కీలక సేవలు ఆలస్యమవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒక్కో సచివాలయం లో దాదాపు 1340 ఇళ్లు, సుమారు 2700 కుటుంబాలకు ఈ కొద్దిమంది సిబ్బందితో సేవలు అందించడం అసాధ్యంగా మారిందన్నారు.
అదేవిధంగా జనగణన పనుల కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బంది కూడా పూర్తిస్థాయిలో ప్రజాసేవలకు సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు. సచివాలయం ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం, రాత్రివేళల్లో అకతాయిల గందరగోళం కొనసాగడం భద్రతాపరమైన ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఈ సమస్యలను కమిషనర్ గారి దృష్టికి, అలాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మరియు మంత్రి @Dr_NarayanaP గారి దృష్టికి తీసుకెళ్లి ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరనున్నట్లు గునుకుల కిషోర్ తెలిపారు.
ప్రజలకు వేగవంతమైన సేవలు అందేలా చేయడం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులుదివానం సురేష్ బాబు,జిల్లా ప్రదాన కార్యదర్శి కిషోర్ గునుకుల,సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ పాల్గన్నారు..
@PawanKalyan@APDeputyCMO@NagaBabuOffl@mnadendla@JSPShatagniTeam@itsRamTalluri@AjayaKumarJSP
#Nellorecity #Nellore #Andhrapradesh #PawanKalya
స్ట్రాకెన్జో #AI#ROBOTICS ఆధారిత సంస్థ ను చూస్తే “యువత అనుకుంటే ఏదైనా సాధించగలదు” అని శ్రీ @PawanKalyan గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
#KishoreGunukula - @JanaSenaParty
ఈ రోజు శైమంత్ విష్ణు Founder గా యువత నమ్మకాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి, AI & Robotics రంగంలో రోబో ఆధారిత చేయి తయారీపై శిక్షణ ఇవ్వడం, ఆ పరికరాల పనితీరును ప్రత్యక్షంగా చూపించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.
మా రోజుల్లో ఇలాంటి సాంకేతిక శిక్షణలు లేకపోయినందుకు ఒకింత ఈర్ష కలిగినప్పటికీ…
ఈరోజు మన పిల్లలు సాంకేతికతను అర్థం చేసుకుని స్వయంగా ఇలాంటి పరికరాలను రూపొందించడం చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది.
విష్ణు శ,తోఫిక్,చరణ్,నవీన్ మరియు అతని మిత్రబృందం ఆలోచనలను నడిపిస్తున్న స్ట్రాకెన్జో సంస్థ అగ్రశ్రేణికి ఎదగాలని, వారి కలలు నిజం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
యువతకు అవసరమైన ప్రతి సహకారం, ప్రోత్సాహం జనసేన పార్టీ తరపున ఎల్లప్పుడూ అందిస్తామని తెలియజేస్తున్నాను..
@APDeputyCMO@itsRamTalluri@mnadendla@NagaBabuOffl@AjayaKumarJSP@naralokesh
#nellorecity #Andhrapradesh #Nellore #PawanKalyanAneNenu
భాదని భావాన్ని అర్థం చేసుకోకుండా, పక్షపాతంతో రగిలిపోయే ఒక ఉన్మాద గుంపును చూసినట్లుగా అనిపించింది.
కుర్చీల వెనక దాక్కొని వెర్రి కేకలేసిన *మాడగానికి చెబుతున్నా… @PawanKalyan గారి నీడను కూడా తాకలేవు
#KishoreGunukula - @JanaSenaParty
“ఎముకలు కుళ్లిన వయసులు మళ్లిన, సోమరులారా చావండి…”
సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన పెద్దలు తమ బాధ్యతను మరిచి ద్వేషాన్ని రెచ్చగొట్టే స్థాయికి దిగజారితే ఎలా?
ఒక తప్పు జరిగిందని భావించినప్పుడు దాన్ని ప్రశ్నించడం, సున్నితంగా ఖండించడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ జరిగిన ఘటనను వక్రీకరించి, ఊహాగానాలను నిజాల్లా ప్రచారం చేస్తూ, దానిని ఖండించిన నాయకుడిపైనే అసభ్య పదజాలంతో విరుచుకుపడటం మాత్రం బాధ్యతారాహిత్యం. అది ప్రజాస్వామ్య సంస్కృతి కాదు.
నిన్న తెలంగాణలో జరిగిన ప్రెస్‌మీట్ చూస్తుంటే… సీనియర్స్ అంటే నిజాన్ని వెలికితీయడం, సమాజానికి దారి చూపించడం అనే విలువలు మరిచిపోయి, కొందరు తమ వ్యక్తిగత మరియు రాజకీయ అజెండాలను ముందుకు తీసుకెళ్లడానికే వేదికను ఉపయోగించినట్లుగా కనిపించింది.
ప్రజల బాధను అర్థం చేసుకుని బాధ్యతగా మాట్లాడాల్సిన చోట… ప్రాంతీయ విద్వేషాలు, రాజకీయ ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. సమాజాన్ని కలపాల్సిన వారు విభజనల గురించి మాట్లాడితే యువతలో తప్పు సందేశం వెళ్తుంది.
#PawanKalyan గారు ఎప్పుడూ ప్రాంతాల మధ్య గోడలు కట్టే నాయకుడు కాదు. “మనమంతా భారతీయులమే” అనే భావనతో ప్రజలను కలపాలని ప్రయత్నించే నాయకుడు. అలాంటి నాయకుడిపై అనవసర విమర్శలు చేయడం ద్వారా కొందరు తమ అసహనాన్ని మాత్రమే బయటపెట్టుకున్నారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం. కానీ అవి హద్దులు దాటి వ్యక్తిగత ద్వేషం, ప్రాంతీయ విద్వేషం వైపు వెళ్లకూడదు. సమాజంలో శాంతి, ఐక్యత, పరస్పర గౌరవం నిలవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది.
@APDeputyCMO@itsRamTalluri@mnadendla@NagaBabuOffl@AjayaKumarJSP@JSPShatagniTeam
#PawanKalyanAneNenu #NelloreCity #Andhrapradesh #Telangana #Nellore
“గోదావరి నదిని క్లీన్ చేస్తుంటే మీకు వచ్చిన నొప్పేంటి?
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం చేసే పనుల్లో కూడా రాజకీయాలు వెతకడం దురదృష్టకరం.
నది శుభ్రత అంటే కేవలం ఒక కార్యక్రమం కాదు… భవిష్యత్ తరాలకు మన బాధ్యత.”
@JanaSenaParty@PawanKalyan#KishoreGunukula#JanaSena#trending #JanaSenaParty #DeputyCMPawanKalyan #JSPForNewAgePolitics #sity24 #PawanKalyanAneNenu
నక్కల వాగు అక్రమ తవ్వకాలపై జనసేన ఫైర్
“ప్రభుత్వాలు మారినా.. నక్కల వాగులో గుంట నక్కల అక్రమ తవ్వకాలు మాత్రం ఆగలేదు. సహజ వనరులను కాపాడాలని, అవినీతిని నిర్మూలించాలని కూటమి పెద్దలు ఎంత చెప్పినా కొంతమంది స్వార్థపరులైన అధికారుల అండతో మట్టి అక్రమ తవ్వకాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి...”
#KishoreGunukula - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఏఎస్‌పేట మండలంలో నక్కల వాగులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను వ్యతిరేకిస్తూ అక్కడ తవ్వకాలను అడ్డుకుని నిలిపివేసిన ఏఎస్‌పేట జనసేన మండల అధ్యక్షుడు అక్బర్, బాను తదితర జనసైనికులతో కలిసి జిల్లా కలెక్టర్ గారికి
ఆత్మకూరు జనసేన నాయకులు చదలవాడ హరిష్ ఆధ్వర్యం లో జిల్లా పర్యవేక్షకులు @AjayaKumarJSP గారి సూచనలతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అర్జీ సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
నక్కల వాగు సమీపంలో ఏర్పడిన భారీ గుంతల వలన రాబోయే రోజుల్లో వరదలు వస్తే గ్రామాలకు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. అలాగే మూగజీవాలు నీటికి వెళ్తే గుంతల్లో మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రభుత్వం రూ.20 నుంచి రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన కాలువలు, కల్వర్టులను ధ్వంసం చేయడం దారుణమన్నారు. అక్రమంగా తవ్వి తరలించిన 1500 టిప్పర్ల మట్టి వలన ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని, రహదారుల నుంచి నీరు లోపలికి వెళ్లే విధంగా నిర్మించిన కల్వర్టులను పునర్నిర్మించాలని, అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చామని తెలిపారు.
గతంలో ఇసుక అక్రమ రవాణా గురించి మంత్రి రామనారాయణరెడ్డి గారి దగ్గరకు తీసుకెళ్లగా, ఆ రోజున స్థానిక కార్యకర్తలు ఇసుక అక్రమ రవాణాపై అన్ని పార్టీలు వదిలేసినా జనసేన నాయకులు మాత్రమే బలంగా పోరాటం చేస్తున్నారని చెప్పారని గుర్తు చేశారు. అప్పటినుంచి ప్రజల పక్షాన నిలబడుతూ జనసేన నాయకులు ముందుకు నడుస్తున్నారని పేర్కొన్నారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యులను ఉద్యమకారులుగా అభివర్ణించిన ఆ స్ఫూర్తిని ముందుకు నడిపిస్తూ ప్రజాసేవ కోసం, సమాజసేవ కోసం, ప్రజల సంక్షేమార్థం జనసేన పార్టీ నాయకులు ఉద్యమకారులుగా ముందుకు నడుస్తున్నారని తెలిపారు.
నక్కల వాగు సమీపంలో అక్రమంగా తవ్వకాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులు లక్షల రూపాయల మట్టిని కొల్లగొడుతూ ప్రభుత్వ రెవెన్యూకి భారీ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. తమ సొంత ప్రయోజనాల కోసం సహజ వనరులను దోచుకుంటున్న స్థానిక అక్రమదారుల చర్యలను ఖండిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి రామనారాయణరెడ్డి గారికి కూడా తెలియజేయగా అధికారులు వెళ్లి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు...
@PawanKalyan@APDeputyCMO@itsRamTalluri@mnadendla@NagaBabuOffl
#PawanKalyan #nellore #Athamakuru #Nellorecity #Andhrapradesh #PawanKalyanAneNenu
“చదువు మన భవిష్యత్తుకు బలం… నైపుణ్యం మన విజయానికి ఆయుధం.”
#KishoreGunukula@JanaSenaParty ప్రధాన కార్యదర్శి,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
#AI & #ROBOTICS ఉచిత స్టాకెన్జో క్యాంప్ సర్టిఫికేషన్ యూరో కిడ్స్,విద్యార్థి స్కూల్ లో అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,నారాయణ విద్యాసంస్థల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రసాద్ గారు,స్కూల్ కరెస్పాండెంట్లు సంద్యా గారు మరియు రవి గారు,స్టాకెన్జో ఫౌండర్ సైమంత్ విష్ణు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు AI, Robotics మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ అందించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ..
స్టాకెన్జో మరియు విద్యార్థి స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సర్టిఫికేషన్ ప్రోగ్రామ్” కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నేటి విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యక్తిత్వ వికాసం వైపు ముందుకు సాగాల్సిన అవసరం ఎంతో ఉంది.
ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే విద్యతో పాటు టెక్నాలజీపై పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు కూడా ఎంతో అవసరం. ఇలాంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలను అందించే మార్గదర్శకాలు అవుతాయి.
విద్యార్థులు పెద్ద కలలు కనాలి… ఆ కలలను నిజం చేసుకునే దిశగా కష్టపడి పనిచేయాలి. విజయానికి షార్ట్‌కట్స్ ఉండవు. క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన ఉంటే ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోగలడు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్టాకెన్జో మరియు విద్యార్థి ఈఎం స్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు, సృజనాత్మకత మరియు నైపుణ్యాలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాను.
“చదువు మన భవిష్యత్తుకు బలం… నైపుణ్యం మన విజయానికి ఆయుధం.”
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
@PawanKalyan@APDeputyCMO@itsRamTalluri@mnadendla@NagaBabuOffl
#Nellore #Nellorecity #Andhrapradesh #PawanKalyan