లోకేష్ మౌఖిక ఆదేశాలతోనే గన్మెన్లు తొలగించారు..!
▪️బాధితుల పక్షాన నిలబడటమే నా తప్పా..? అంటూ ప్రశ్న..!
▪️నన్ను అడ్డుకుంటే ప్రజలను అడ్డుకున్నట్టే..!
▪️రాప్తాడులో అరాచకాలు పెరిగాయి..!
▪️భూకబ్జాలు, ఇసుక దోపిడీ, అక్రమ వసూళ్లపై సంచలన ఆరోపణలు..!
▪️పాపంపేట భూముల వ్యవహారంపై మళ్లీ రగిలిన రాజకీయ వేడి..!
▪️వేల కుటుంబాల కోసం పోరాడుతున్నా..!
▪️దళిత బాలిక అత్యాచారం నుంచి భూ వివాదాల దాకా ప్రభుత్వ వైఫల్యాలే..!
▪️టమోటా మార్కెట్లో ‘పరిటాల శ్రీరామ్ ట్యాక్స్ వసూళ్లు’ జరుగుతున్నాయి..!
▪️ఉపాధి కూలీల నుంచి కోట్ల రూపాయల వసూళ్లు చేస్తున్నారు..!
▪️అక్రమ మద్యం, రేషన్ బియ్యం దందా జరుగుతోంది..!
▪️రైతుల బోర్లు ఎండిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమన్న ఆరోపణ..!
▪️ప్రశ్నించే వాళ్లను అణచివేయాలనుకుంటున్నారు..!
▪️రాప్తాడులో జరుగుతున్న ప్రతి అన్యాయంపై పోరాటం కొనసాగుతుంది..!
▪️గన్మెన్లు తీసేసినా గళం ఆగదు అంటూ ప్రభుత్వానికి సవాల్..!
▪️ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించడం తప్పా..?
▪️పాపంపేట ఇళ్ల కూల్చివేతపై పరిటాల కుటుంబం క్షమాపణ చెప్పాలి..!
▪️ప్రజల విశ్వాసమే నా బలం..!
▪️పాపంపేటలో ఇళ్లన్నీ కూల్చేస్తామని ఎవడో వచ్చి అన్నాడట..!
▪️వారి తల నేలకూల్చుతాం ఇప్ప ఒక్క ఇంటినీ నేలకూలనివ్వం..!
▪️ప్రజలు నన్ను ఒకసారి ఎన్నుకున్నారనే విశ్వాసంతో వారి సమస్యలపై స్పందిస్తున్నాం..!
▪️మీకూ ఆ విశ్వాసం ఉంటే పాపంపేట భూముల విషయంలో స్పందించండి లోకేష్ గారు..!
▪️ప్రశ్నించే గొంతు లేనప్పుడు అరాచకం మరింత ప్రభలుతుంది. అది మీకే నష్టం..!
▪️పూర్తిగా పుట్టి మునిగిపోయేదాకా కళ్లు తెరవకపోతే ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఉనికిలేకుండా పోతుందనేది గుర్తుపెట్టుకోండి..!
▪️నా ప్రాణానికి ముప్పు ఉందని భద్రత అవసరం భావించి నివేదికల ఆధారంగా పదేళ్ల పాటు గన్మెన్లను ఇచ్చిన ఎస్పీ కార్యాలయమే ఈరోజు కనీసం నోటీసు ఇవ్వకుండా గన్మెన్లను తొలిగించింది..!
▪️గన్మెన్లు లేకపోయినా నా ప్రజలే నాకు రక్షణగా ఉంటారు..!
▪️ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తూనే ఉంటా ఖబడ్దార్ లోకేష్ గారు
👉మంత్రి మౌఖిక ఆదేశాలతోనే తనకు గన్మెన్లను తొలిగించారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆరోపించారు. శుక్రవారం అనంతపురంలోని వైఎస్సార్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వాడు జిల్లా కేంద్రంలో ఉంటూ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చేస్తున్న దుర్మార్గాలను ఎండగడుతూ ప్రజలను రెచ్చగొడుతున్నాడంటూ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్‌కు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఇలాంటి వ్యక్తిని అనంతపురం పరిసర ప్రాంతాల్లో తిరగనీయకుండా కట్టడి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. నారా లోకేష్ మౌఖిక ఆదేశాలతో ఎస్పీ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి అంగరక్షకులను తొలిగించారు.
👉తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేసిన పాపం ఏంటంటే...జిల్లాలో జరుగుతున్న దుర్మార్గాలు, దారుణాలు, దౌర్జన్యాలపై ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూ బాధితుల పక్షాన నిలబడడంతో ప్రభుత్వానికి కంటకప్రాయంగా మారాడు.
👉లోకేష్ గారూ...మీరు తొలిసారి మంత్రి అయ్యారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను సరిదిద్దుకుంటూ పోతే మీకే భవిష్యత్తు ఉంటుంది. మీ చుట్టూ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు భజన చేస్తారు, జిల్లాలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలను మీకు చెప్పరు. ఎందుకంటే వారు మీవద్ద పదవులు, తృణమో ఫణమో ఆశిస్తారు. కానీ ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీకి బాధ్యత ఉంటుంది.
👉ప్రభుత్వం మంచి చేయకపోగా ప్రభుత్వంలోని అధికారులు, ప్రజాప్రతినిధుల వల్ల రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ పరిధిలోని ప్రజలు ఏవిధంగా నష్టపోతున్నారో గమనిస్తూ వాటిపై గళం విప్పుతాం. అవసరమైతే రోడ్డు ఎక్కుతాం. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోనే ఇన్ని అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయో నారా లోకేష్ గమనించాలి.
👉కురుబ లింగమయ్య హత్య చేసింది పరిటాల సునీత తమ్ముడు కాదా? ముద్దాయిలు వారి కుటుంబ సభ్యులే కదా? ఈ కేసులో చాలామంది ముద్దాయిలను తప్పించారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరగడంతో వారి పక్షాన పోరాడా.
👉పరిటాల సునీత స్వగ్రామం పక్కన ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనరు బాలికపై 14 మంది నెలల తరబడి అత్యాచారం చేశారు. ఈ ఘటనను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో గట్టిగా ప్రశ్నించాం. ఫలితంగా ఎస్పీ చర్యలు తీసుకుని బాధ్యులందరినీ జైలుకు పంపారు.
👉రాప్తాడులో ఓ భూ వివాదానికి సంబంధించి పరిటాల సునీత అనుచరులు నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులను వారి పొలంలోనే హత్య చేశారు. బాధిత కుటుంబం తరుపున నేను మాట్లాడా. మీతప్పులను గమనించుకుని ఇలాంటి తప్పులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి.
#ThopudurthiPrakashReddy
#TeamTPR #tprtarget2029
పన్నుల భారం, దోపిడీలతో ప్రజలు విసిగిపోయారు..!
రాష్ట్రంలో పెట్రోలుపై 35 శాతం, డీజిల్‌పై 25 శాతం వ్యాట్ విధిస్తున్నారు..!
▪️రోడ్ సెస్ పేరిట లీటరుకు అదనంగా 4 రూపాయలు వసూలు చేస్తున్నారు..!
▪️రెండేళ్లుగా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు..!
▪️జగనన్న సంక్షేమ పథకాలు నిలిపేసి పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నారు..!
▪️అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు ఈరోజు పెంచుతున్నారు..!
▪️యుద్ధం ముగిసినా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం లేదు..!
▪️ప్రజలు రోజూ 10 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు..!
▪️5 లక్షలతో ఇల్లు కడుతామన్న హామీ అమలు కాలేదు..!
▪️జగన్ హయాంలో 20 లక్షల ఇళ్లు, ఇప్పుడు కేవలం 43 వేల ఇళ్లే..!
▪️ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలే దోపిడీ చేస్తున్నారు..!
▪️పేరూరు డ్యాం వద్ద 500 కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవాణా జరగింది..!
▪️పేదలకు ఇచ్చే బియ్యాన్ని కూడా అక్రమంగా తరలిస్తున్నారు..!
▪️అమరావతి కోసం రెండేళ్లలో 3.60 లక్షల కోట్లు అప్పులు చేశారు..!
▪️వైఎస్ జగన్ అప్పులు మాత్రం డీబీటీ రూపంలో పేదలకు చేరాయి…!
▪️పంచాతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ గ్రామాలకు తాగునీళ్లు ఇవ్వలేకపోతున్నారు..!
▪️రాప్తాడులో హత్యలు, దోపిడీలు, కబ్జాలు పెరిగిపోయాయి..!
▪️ఎమ్మెల్యే పరిటాల సునీతను భర్తరఫ్ చేయాలి..!
▪️రాప్తాడు మాజీ ఎంఎల్ఎ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫైర్
▪️పెట్రోలు, డీజిల్ ధరలను నిరసిస్తూ రాప్తాడులో నిరసన
👉రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం పెట్రోలుపై 35 శాతం, డీజిల్‌పై 25 శాతం వ్యాట్ సుంకాన్ని అమలు చేస్తోందని రాప్తాడు మాజి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రోడ్ సెస్ పేరుతో లీటరుకు రూ. 4 అదనంగా సెస్సు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూనే ఉన్నారన్నారు. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాప్తాడులో నిరసన తెలియజేశారు. వైఎస్ విగ్రహం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.... బాదుడే బాదుడే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు ఆదాయాలు లేవు. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు లేవు కానీ పన్నుల రూపంలో ప్రజల నడ్డి విరిస్తున్నారు.
👉తాము అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామన్న పెద్దమనిషి...ఈరోజు తగ్గించకపోగా పెంచుతూ పోతున్నాడు. యుద్ధం పేరుతో ధరలు పెంచుతున్నారు. యుద్ధం ఆగిపోయినా ధరలు మాత్రం తగ్గించడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు రోజూ రూ. 10 కోట్లు అదనంగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు.
👉అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు అరకొర అమలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. రూ. 5 లక్షలతో ఇల్లు కట్టిస్తామన్నారు ఒక్క ఇల్లూ నిర్మించలేదు. జగనన్న హయాంలో 20 లక్షల ఇళ్లు మంజూరు చేయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం 43 వేల ఇళ్లు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ వాటా తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇచ్చేలా లేదు..
👉ఉచిత ఇసుక అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలే దోచుకుంటున్నారు. సామాన్యుడు ఉచిత ఇసుక తీసుకున్న దాఖలాలు లేవు. పేరూరు డ్యాం కింద ఉన్న పెన్నానదిలో దాదాపు 500 కోట్ల రూపాయల ఇసుక దోపిడీ చేశారు. పక్కనే ఉన్న కర్నాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు..
👉రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే వీటి వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదు. అక్రమ మద్యం అమ్ముతూ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారు. నిరుపేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కూడా అక్రమ మార్గాల ద్వారా కర్నాటకకు తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. దోపిడీలు చేయడానికి మీరు అధికారంలోకి వచ్చారు.
#ThopudurthiPrakashReddy
#FuelHikeUnderCBN
#BaadudeBaaduduByCBN
#SadistChandraBabu
#TeamTPR #tprtarget2029
నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అనంతపురం లోని వారి నివాసంలో రాప్తాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల [BLA] లకి మరియు [SIR] పై అవగాహన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది..
👉🏻ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ
▪️ప్రతి బూత్ స్థాయిలో బలమైన నిర్మాణం ఉండేలా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం తప్పనిసరి అని సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లు పార్టీకి పునాది స్తంభాలు అవుతారని, వారి చురుకైన పాత్ర పార్టీ విజయంలో కీలకమని ఆయన పేర్కొన్నారు.
▪️గ్రామస్థాయిలో ప్రస్తుతం పెద్ద ఎత్తున వస్తున్న ఫారం 7 దరఖాస్తులపై బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. నకిలీ ఫారం 7లను అరికట్టడంతోపాటు, పార్టీ కార్యకర్తలు సజాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆయన హితవు పలికారు.
▪️అదే సమయంలో, మన పార్టీ కీ సంబందించిన తొలగించిన ఓట్లను గుర్తించి వాటిని తిరిగి చేర్చేలా కృషి చేయాలని ఏజెంట్లకు పిలుపునిచ్చారు. ప్రజల ఓటు హక్కు కాపాడడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలని ఆయన గుర్తుచేశారు.
ఈ సమావేశంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, రాష్ట్ర,జిల్లా నియోజకవర్గ మండల,గ్రామ అనుబంధ విభాగాలు అధ్యక్షలు,తదితులు పాల్గొన్నారు..
#ThopudurthiPrakashReddy
#TeamTPR #tprtarget2029
🚨
పెరంబూరులో కూడా విజయ్ ఘన విజయం.
రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన హీరోలను చూశాం.
రెండు చోట్లా ఘన విజయం సాధించిన విజయ్..
ఒకే ఒక్కడు.. విజయ్ 🦸
#TVKVijay#Vijay
ఓ అభిమాని ఫ్రేమ్ ఇవ్వగానే తీసుకొని చూసి చూసాడు జగనన్న పిక్ చూసి అభివాదం చేసిన విజయ్
ఈ సన్నివేశం జరిగిన పెరుంబూర్ లో 40K+ మెజారిటీ తో MLA గా గెలిచాడు
ఈ వీడియో మీద ఎల్లో ఛానెల్స్ డిబేట్ నడిపాయ్ విజయ్ కి మైనస్ అవుద్ది అని CM అయ్యాడు 💥
సింగిల్‌గా పోటీ చేసిన రోజే విజయం సాధించిన @actorvijay@TVKVijayHQ
History created. Your confidence and determination made you a real hero, unlike some movie actors who always depend on others for power
சிங்கம் தனியாக வந்து, கூட்டமாக வரும் எதிரிகளை தோற்கடிக்கும் 💐💐💐
Heartiest congratulations to @actorvijay on this spectacular and resounding victory! This moment is a true testament to your vision, your perseverance, and the unwavering love people have for you.
The people of Tamil Nadu have spoken—loud, clear, and with immense pride. This isn’t just a win, it’s a celebration of a deep, powerful connection with millions.
Wishing you great strength and success as you step into this inspiring new chapter. May you bring the change so many are hoping for.
Congratulations once again on this phenomenal achievement! ✨
@TVKVijayHQ