అనాథ యువకుడి పెళ్లికి వేలాదిగా వచ్చిన జనం!
తనకు బంధువులు లేరని, తన తరఫున కనీసం 10 మంది అయినా రండి అని సోషల్ మీడియా ద్వారా పెళ్లికి ఆహ్వానించాడు.
ఒక్క వీడియోతో వేలాదిగా తరలివచ్చిన జనం!
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన చైనాకు చెందిన జు ��ెంగ్హాంగ్ (24), కన్నతల్లి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో తన నానమ్మ దగ్గరే పెరిగాడు. కొద్దిరోజుల క్రితం ఆమె కూడా మరణించింది.
ఇప్పుడు తన పెళ్లికి రావడానికి బంధువులు ఎవరూ లేరని, ఉన్నవాళ్లు కూడా ఎవరూ రారని ఆవేదన చెందాడు. దీంతో సోషల్ మీడియా ద్వారా అపరిచితులను పెళ్లికి ఆహ్వానించాడు.
అతడి పిలుపుకు వేలాదిమంది స్పందించి పెళ్లికి తరలివచ్చారు. ఖరీదైన కార్లతో పాటు విలువైన కానుకలు అందించి అతడిని ఆనందభాష్పాలతో ముంచెత్తారు.
వచ్చినవారు భోజనం తయారీకి అవసరమైన సామగ్రిని తెచ్చుకుని, వండుకుని తిని అపరిచితులే ఆత్మీయులుగా మారి అతడి పెళ్లిని చిరస్మరణీయంగా మార్చారు.