ముడుమాల్, కృష్ణ మండలం, నారాయణపేట జిల్లా
🗓️ తేది:18-05-2026,
*పర్యాటక, చారిత్రక, పరిశోధన కేంద్రంగా మూడ్ మల్ నిలువు రాళ్ళు*
------నిలువురాళ్ల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది.
------ జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక.
👉 ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని నారాయణపేట జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్ల (మెన్హిర్స్) ను ఆమె సందర్శించారు.
👉నిలువు రాళ్లు, సప్తర్షి మండలంతో ఖగోళ పరిజ్ఞానాన్ని, కాలాలను, వాతావరణ మార్పులను ఆనాడే తెలుసుకునేవారని, కాలాలను గుర్తించడానికి ఆది మానవులు నిలువురాళ్లను ఓ క్రమంలో ఏర్పాటు చేసినట్లు ఆర్కియాలజీ శాఖకు చెందిన అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఎలాంటి సాంకేతికత లేని 4 వేల సంవత్సరాల క్రితమే రాళ్ల ద్వారా తెలుసుకోవడం అనేది ఆబ్బురపరిచేలా, అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
👉ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా ఈ నెల 18 నుంచి 23 వరకు యువజన క్రీడా/పర్యాటక వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని ఆమె సూచించారు. రాష్ట్ర పర్యాటక శాఖ కు సంబంధించిన వారోత్సవాల టూరిస్ట్ గైడ్ పోస్టర్ తో పాటు మూడ్ మల్ నిలువు రాళ్ళ విశిష్టత ను తెలిపే ప్రచార పత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీపీ ఆర్ వో రషీద్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ శెట్టి, మూడ్ మల్ సర్పంచి, పురావస్తు శాఖ అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO ceo
@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM
Thank You, 2025 Years — For The Lessons, Not The Comfort.
తీసుకున్న నిర్ణయాల ఫలితం.
ఆ నిర్ణయాల మధ్యనే జీవితం అందంగా మారాలంటే,
నిశ్శబ్దమైన నిరంతర కృషే మార్గమని నేర్పిన సంవత్సరం.
@venkatvrlphotography ❤️📸 @thelifeofvenkatvrl