*డయాబెటిక్ రోగులకు గొప్ప శుభవార్త... భారత్‌లోకి వచ్చేసిన బరువు తగ్గించే ఒజెంపిక్ ఇంజెక్షన్.. నెల రోజుల డోసు ప్రారంభ ధర ఎంతంటే..!*
ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల
టైప్ 2 డయాబెటిస్ నియంత్రణకు అధికారికంగా అనుమతి
బరువు తగ్గడానికి కూడా ఈ ఔషధాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న వైనం
నెల రోజుల డోసు ప్రారంభ ధర రూ. 8,800గా నిర్ణయం
గుండె, కిడ్నీ సమస్యల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందన్న సంస్థ
ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే ఔషధంగా సంచలనం సృష్టించిన 'ఒజెంపిక్' (Ozempic) ఇంజెక్షన్ ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ ఈరోజు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. టైప్ 2 మధుమేహం నియంత్రణ కోసం అధికారికంగా అనుమతి పొందిన ఈ డ్రగ్‌కు, బరువు తగ్గించే గుణం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. దీని నెల రోజుల డోసు ప్రారంభ ధర రూ. 8,800గా ఉంది.
ఒజెంపిక్ (సెమాగ్లుటైడ్) అనేది వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్. ఇది 0.25mg, 0.5mg, 1mg డోసుల్లో లభిస్తుంది. నొప్పి లేకుండా సులభంగా ఇంజెక్ట్ చేసుకునేందుకు వీలుగా 'నోవోఫైన్ నీడిల్స్' అనే ప్రీ-ఫిల్డ్ పెన్ రూపంలో దీన్ని అందిస్తున్నారు. ప్రారంభ డోస్ అయిన 0.25mg పెన్ ధర రూ. 8,800 కాగా, 0.5mg ధర రూ. 10,170, 1mg ధర రూ. 11,175గా కంపెనీ నిర్ణయించింది. ప్రతి పెన్లో నాలుగు వారాలకు సరిపడా డోసులు ఉంటాయి.
ఈ సందర్భంగా నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మాట్లాడుతూ... "ఒజెంపిక్‌ను భారత్‌కు తీసుకురావడం ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన క్లినికల్ ఫలితాలతో వస్తున్న ఈ ఔషధం భారతీయ వైద్యులకు ఒక సమర్థవంతమైన చికిత్సా మార్గాన్ని అందిస్తుంది. సులభంగా వాడే పెన్ ద్వారా మెరుగైన గ్లూకోజ్ నియంత్రణ, బరువు నియంత్రణ, గుండె, కిడ్నీలకు దీర్ఘకాలిక రక్షణ అందించడమే మా లక్ష్యం" అని వివరించారు.
@27stories_@PrasadsCinemas భోజనం చాలా బావుంటుంది. అక్కడే ఎమరాల్డ్ స్వీట్ షాప్ ఉంటుంది. అక్కడ సగ్గుబియ్యం పాయసం కూడా చాలా బావుంటుంది. ప్యూర్ cow మిల్క్ తో ప్రిపేర్ చేస్తారు.
An amazing video, our national animal and bird, together in one frame! A perfect symbol of India's vibrant spirit. Wishing everyone a Happy Independence Day.
आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं, जय हिंद। 🇮🇳
VC: Rakesh Bhatt
#IndependenceDay#JaiHind #स्वतंत्रता_दिवस #India #tiger #peacock
Dictionary definitions of the word ‘Champion.’
—noun
1. a person who has defeated all opponents in a competition or series of competitions, so as to hold first place
2. a Fighter or Warrior.
The first definition is factual & logical
The second is the essence of being a Champion.
When you believe in yourself, never give in and fight till the end.
Thank you to our BlueWarriors
Thank you for the Fighters in you…
#ChampionsTrophy2025 #INDvNZ