భరతమాత ముద్దు బిడ్డ, బడుగు జాతుల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపు మాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా నమస్సుమాంజలి..
#JyothiraoPhule#Mahtma#Vardanthi#VijayKumar
రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనాల రూపకల్పన మాత్రమే కాదు. కోట్లాది పీడిత ప్రజల ఆశయాలకు ప్రతిబింబము డా. బి.ఆర్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగా రూపుదిద్దుకున్నదే మన భారత రాజ్యాంగం...
భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
#IndianConstitutionDay#NationalConstitutionDay
భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.. విద్యార్థులందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు...
#NationalEducationDay#VijayKumarIAS#LiberationCongressParty
ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన పోరాటం తెలుగువారందరికీ స్ఫూర్తిదాయకం, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
#DammuVenkateshLCP
ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకోసం పోలీసులు చేసిన త్యాగానికి ప్రతీకగా, విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపేందుకు జరుపుకుంటున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పిస్తున్నాము...
#PoliceMartyrsDay#VijayKumarIAS#LCP
# DAMMU
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి మీ జీవితంలో అజ్ఞానాంధకారాన్ని పారదోలి, జ్ఞానకాంతులు ప్రసరింపజేయాలని, రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియలని, సుఖ శాంతులు, సిరి సంపదలు నిండాలని ఆకాంక్షిస్తూ... రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు