నిన్ననే ఒకాయన టీవీలో,కలలను సాకారం చేసుకోవాలి అన్నాడు.ఈ రోజు తెల్లవారు జామునే పోలీసులు పట్టుకెళ్లినట్టు కలొచ్చి చచ్చింది.
ఏదేమైనా మనం చెరువులో మునిగినట్టో, మనకైనా, మనవాళ్లకెవరికైనా ఏదైనా అయినట్టు కలొస్తే, వెంటనే మెలుకువొచ్చి అది కల అని తెలియగానే, ఆ తబ్బిబ్బులో మళ్ళీ నిద్రపట్టదు😌
అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. ఆ మాహాదేవుని ఆశీస్సులు మనందరి పైన ఉండాలని ప్రార్ధిస్తున్నాను. ఓం నమః శివాయః హరహర మహాదేవ్🪔🙏#Mahashivratri#మహాశివరాత్రి
ఇదిగో సమీర గారు... పెళ్ళికి మీ ఆయన పిలిస్తేనే వచ్చాము. మీరిలా గిఫ్టులకు వంకలు పెడితే ఎలా? ఆశీర్వచనాలు కూడా ఇచ్చాం కదా.. పైగా వంటలేం బావోలేవ్.. అప్పడం మెత్తబడి ఖర్చీఫ్అయ్యింది. మీ చుట్టాలబ్బాయెవడో మమ్మల్ని చూసి స్వీట్లు దాచేసాడు.. మేము కంప్లైంట్ చేశామా? #sameerabharadwaj
ఏ రియల్ ఎస్టేట్ వాడైనా, ప్రత్యేకించి హైడ్రాబాదులో, బ్రోచర్ లో గాని, యూట్యూబ్ వీడియోలో గాని మా ప్రాజెక్ట్ ఎయిర్పోర్ట్ నుండి 25 నిముషాలు, ఎల్బీ నగర్ మెట్రో నుండి 30 నిమిషాల దూరంలో ఉంటుంది అంటాడు..దూరాన్ని నిమిషాల్లో? పోనీ ఏ స్పీడ్ లో వెళ్తే ఆ టైంలో చేరుకోవచ్చో కూడా చెప్పాలి కదా🤷
అయ్యా జియో సినిమా వాడు, రేపటినుండి ఇండియా సౌతాఫ్రికా టీ 20 క్రికెట్ మ్యాచులు మొదలవుతున్నాయి..
మొదలెట్టగానే ఆ కాండోమ్ వాణిజ్య ప్రకటణ ఆపెయ్యండి మహాప్రభో... కావాలంటే ఓవర్ కి ఐదు బంతులే చూపించి మళ్ళీ వేరే యాడ్స్ ఏసుకోండి, ఆ వ్యాలీ అఫ్ గాడ్స్ కి మల్లె ఏవైనా..🙏#jiocinema#INDvSA
మా నాన్న చెప్తుండేవారు, ఎస్వీ రంగారావు గారిని సైతం డామినేట్ చేయగల సత్తా "సూర్యకాంతం" గారికుండేది అని... ఆ పుర్ర చేతివాటం, ఆ నటన అనితరసాధ్యం.. ఆ మహానటి శత జయంతి రోజున నమః సుమాంజలి 💐🙏
#సూర్యకాంతం
"రుద్రవీణ" కి ముప్పై ఐదేళ్లు.. అన్నీ పాటలు బావుంటాయి... లయ రాజా మ్యాజిక్, సిరివెన్నెల కలం, బాలు గళం...ఇంకేం చెప్పగలం.. నిస్సందేహంగా మెగాస్టార్ బెస్ట్ పెర్ఫార్మన్స్ లలో ఒకటి... లలిత ప్రియకమలం, నమ్మకు నమ్మకు ఈ రేయిని, తరలిరాదా తానే వసంతం నా ఫేవరెట్.. 🎵🎶#రుద్రవీణ
మీరు, మీ సినిమాలు అజరామరం, ఆచంద్రార్కం ...
రెండు తరాలని ప్రాభావితం చేశాయి మీ సినిమాలు ....
నటీనటులెవరున్నా అది విశ్వనాథ్ గారి సినిమా...
వ్యక్తిగతమైన లోటుగా భావిస్తున్నామంటేనే మీ ముద్ర ఏమిటో తెలుస్తోంది.. 🙏💐
#కళాతపస్వి#విశ్వనాథ్#RipLegend#RIPVishwanathGaru
వైరల్ అనే పదానికి వైరస్ పట్టించేసారు. వీళ్ళకి ప్రతీది వైరలే. మునుపు బ్రేకింగ్ న్యూస్ లాగా..
నెట్టింట హల్ చల్, తెగ వైరల్ అన్న పదాలు వింటుంటే, చదువుతుంటే పిచ్చి చిరాకేస్తోంది..
ఆ రిపోర్టర్ మహాశయుడు మాట్లాడాల్సిన వాడిని పక్కనే పెట్టుకుని, మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటాడేమిటో..🤷♂️🤦♂️
మా చిన్నప్పుడు ఇతర ప్రజాప్రతినిధులను, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అని సంభోదించేవారు, మధ్యలో ఏకవచనాలు, పేర్లతో సంబోధన మొదలయ్యింది. ఇప్పుడిహ ""రా అన్న కూడా మర్యాద కిందే లెక్క... వీధిరౌడీలు నయమేమో... 😒
బట్టల దుకాణంలో కొత్త బట్టలు సెలెక్ట్ చేసుకొని, ట్రయల్ రూములో వాటిని వేసుకొని అద్ధంలో చూసుకొని మురిసినాక,మళ్ళీ పాత బట్టలని వేసుకోవాలంటే అదొక అయిష్టం నాన్న అన్నాడు మా కొడుకుగారు..కుబుసం విడిచిన పాములాగా అక్కడే పడేసి రావాలంటే కుదర్దుగా.. అందుకేనేమో కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నది🫤
కాలేజీ రోజులు.. మనం ప్రభుదేవా, నగ్మా పాత్రలోకి ఒక ముగ్గురునలుగురు అమ్మాయిలు వచ్చి వెళ్ళేవాళ్ళు (ఊహల్లో). అధరము ఉదరము నడుమున ఎదో అలజడి రేగెనులే అంటే అదో ఫీలింగ్.. కానీ ఇప్పుడు, మెడ నొప్పి, భుజాలు లాగడం,వెన్ను నొప్పి. ఇహ ఉదరంలో ఐతే చెప్పే పన్లే..ఉబ్బరం,గ్యాస్,మంట,నెప్పి..వాట్ నాట😒