🚩 మా జనసేన ప్రస్థానం | 6 సంవత్సరాల క్రితం
📅 2020, సెప్టెంబర్ 11
అంతర్వేది రథం దగ్ధం ఘటనను నిరసిస్తూ, అరెస్టయిన హిందూ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ–జనసేన సంయుక్తంగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది.
హిందూ ఆలయాలపై జరిగిన వరుస దాడులపై సమగ్ర విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో హిందూ మనోభావాలను దెబ్బతీసే ఘటనలను సహించేది లేదని జనసేన నాయకులు స్పష్టం చేశారు.
హిందూ ధర్మ పరిరక్షణే మా సంకల్పం. 🚩
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@mnadendla@itsRamTalluri@TSivasankararao@BolisettiSrinu@AjayaKumarJSP
#KishoreGunukula #JanaSenaParty #JanaSena #Nellore #Antarvedi #HinduDharma #BJP #JanaSenaPrasthanam
మా గునుకుల శ్రీనివాస్ హేమంత్, MBBS, MS (General Surgery), నంద్యాలలో వైద్య విద్యను అభ్యసిస్తూ APASICON 2026లో పాల్గొన్నాడు. 🩺
చదువుతో పాటు ప్రతిష్టాత్మకమైన కాన్ఫరెన్స్‌లకు హాజరవుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న నా బిడ్డ మంచి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాలి.
నువ్వు ఎంచుకున్న రంగంలో మరింత ఎత్తుకు ఎదగాలి హేమంత్… ఆల్ ది బెస్ట్! 🙏🩺
Give your valuable blessings
@PawanKalyan@JanaSenaParty@NagaBabuOffl@mnadendla@itsRamTalluri@BolisettiSrinu@Dr_NarayanaP@kotamreddy_NLR
#KishoreGunukula
#DrGunukulaSrinivasaHemanth #APASICON2026 #ProudFather
సంక్షేమం–అభివృద్ధిని కొనసాగిస్తున్న కూటమి అభ్యర్థులను గెలిపించండి..
@PawanKalyan గారి ఆశయాలతో ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుదాం...
@VijayaGunukula - @JanaSenaParty వీరమహిళ,
నెల్లూరు, ఎఎంసి డైరెక్టర్.
నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ (కొత్త 20వ డివిజన్) పరిధిలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జనసేన పార్టీ వీరమహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఆదిత్యనగర్ మొదటి వీధి, గుర్రాలమడుగు సమీప ప్రాంతాలతో పాటు డివిజన్లోని పలు ప్రాంతాల్లో ప్రతి గడపను తట్టి ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
జనసేన పార్టీ అధినేత, @APDeputyCMO శ్రీ #PawanKalyan గారి ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, అవినీతి రహిత రాజకీయాల ఆశయాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే జనసేన లక్ష్యమని విజయలక్ష్మి గునుకుల పేర్కొన్నారు.
నెల్లూరు నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ @Dr_NarayanaP గారి ఆధ్వర్యంలో నగరం అభివృద్ధి పథంలో వేగంగా పయనిస్తోందని ఆమె తెలిపారు.
“నెల్లూరు సిటీని రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్న మంత్రి పొంగూరు నారాయణ గారి సంకల్పానికి, ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న మార్గానికి ప్రజల సహకారం అవసరం. స్థానిక సంస్థల్లో కూటమిని మరింత బలోపేతం చేసి, తలారావు డివిజన్ అభివృద్ధికి కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి” అని విజయలక్ష్మి గునుకుల ప్రజలను కోరారు.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ కూటమి అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళ ఎంసీడీఓ విజయలక్ష్మి, ప్రవల్లిక,విజయలక్ష్మి,సునీత,సుప్రియా,స్వప్న,ప్రశాంత్ గౌడ్, కృష్ణారెడ్డి, మల్లిరెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు..
@mnadendla@NagaBabuOffl@JSPShatagniTeam
#Nellorecity #Andhrapradesh #Nellore #PawanKalyanAneNenu
మా జనసేన ప్రస్థానం | 3 సంవత్సరాల క్రితం
📅 సెప్టెంబర్ 12, 2023 | నెల్లూరు
అనవసరంగా అరెస్టు చేసి స్టేషన్లో ఉంచినా జనసేన వీరమహిళలు, జనసైనికులు వెనక్కి తగ్గలేదు.
పోరాట స్ఫూర్తితో నిలబడి, ఎటువంటి కేసు లేకుండా గంటలోపే బయటకు తీసుకువచ్చారు.
ఇదే మా జనసేన!
ఇదే మా న్యూ ఏజ్ పాలిటిక్స్! 🚩
నాయకుడి కోసం, పార్టీ కోసం అండగా నిలిచిన ప్రతి వీరమహిళ, జనసైనికుడికి హృదయపూర్వక ధన్యవాదాలు.
“పోరాడితే పోయేదేమీ లేదు… వెధవ బానిస సంకెళ్లు తప్ప!”
— శ్రీ పవన్ కళ్యాణ్
#KishoreGunukula #JanaSena #Nellore
#JanaSenaParty
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@mnadendla@itsRamTalluri@TSivasankararao@BolisettiSrinu@AjayaKumarJSP
🚩3సం.ల కిందట మా జనసేన ప్రస్థానం | 11 సెప్టెంబర్ 2023
పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు మేయర్ కావటి మనోహర్‌కు నిరసనగా శ్రీమంతం చేసి, బొమ్మను మురికి కాలువలో వేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని జనసేన శ్రేణులను 3 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన రోజు.
అన్న మీద మాట పడితే ఊరుకోం!
జనసేనాని గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం మా పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. 🚩
#KishoreGunukula #Nellore #JanaSenaParty #JanaSena #PawanKalyan #ManaJanaSenaPrasthanam
@JanaSenaParty@PawanKalyan@NagaBabuOffl@mnadendla@itsRamTalluri@TSivasankararao@BolisettiSrinu@AjayaKumarJSP
అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు ప్రతి ఇంటా విరబూయాలి
కూటమి అభ్యర్థులను గెలిపించండి – @JanaSenaParty నాయకులు విజయలక్ష్మి కిషోర్ గునుకుల ఆదిత్యనగర్ లో ప్రచారం...
నెల్లూరు: ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి ఘన విజయం అందించాలని జనసేన పార్టీ నాయకులు #KishoreGunukula , @VijayaGunukula కోరారు.
కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత 16వ డివిజన్, కొత్త 20వ డివిజన్ పరిధిలోని చైతన్య శిఖర అపార్ట్మెంట్ వీది తదితర ప్రాంతాలలఙ క్యాంపెయిన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత పదేళ్లుగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
#Nellorecity అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ @Dr_NarayanaP ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రతి గడపలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల స్పందన, సంతోషం స్పష్టంగా కనిపించిందని నాయకులు తెలిపారు. అభివృద్ధి అడుగులు మరింత వేగంగా సాగాలని, సంక్షేమ వెలుగులు ప్రతి ఇంటా విరబూయాలని ఆకాంక్షించారు.
రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, నెల్లూరు నగర అభివృద్ధికి ప్రజలు మరింత బలమైన మద్దతు ఇవ్వాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల,వారి శ్రీమతి ఎఎంసి డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల, ప్రశాంత్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మల్లిరెడ్డి, ప్రవల్లిక, విజయ, సుప్రియా, సునీత,కృష్ణ మోహన్ రెడ్డి,మల్లి రెడ్డి, విశ్వనాథ్,రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
@PawanKalyan@APDeputyCMO@JSPShatagniTeam@mnadendla
#Andhrapradesh #Nellore #PawanKalyanAneNenu
నెల్లూరు పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ సమావేశానికి విచ్చేసిన నెల్లూరు ఎన్నికల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ శ్రీ @TSivasankararao గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న @JanaSenaParty నాయకులు కిషోర్ గునుకుల, సుధా మాధవ్,నాగేంద్ర బాలు, నరహరి, హేమచంద్ర, హరి, మళ్లీ కిరణ్, తదితర నాయకులు శివశంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు...
జనసేన బలోపేతం – ప్రజల కోసం నిరంతర కృషి.
@PawanKalyan@APDeputyCMO@JSPShatagniTeam
#KishoreGunukula #Nellore #Nellorecity #PawanKalyan
నెల్లూరు పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ సమావేశం
నెల్లూరులోని మినర్వా గ్రాండ్లో ఎన్నికల సమన్వయ సమావేశం నిమిత్తం హాజరైన నెల్లూరు పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ శ్రీ @TSivasankararao గారిని @JanaSenaParty , నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి గునుకుల గారు మర్యాదపూర్వకంగా కలిసి, 16వ డివిజన్లో తాను నిర్వహించిన ప్రజా సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల వివరాలను సమర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి సంబంధించి అవసరమైన బాధ్యతలు, కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిషోర్ గునుకుల, బాలు తదితరులు పాల్గొన్నారు.
@PawanKalyan@APDeputyCMO@JSPShatagniTeam
#VijayalakshmiGunukula #KishoreGunukula #PawanKalyan #Nellorecity #Andhrapradesh
ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా
ఓజోన్ పొరను కాపాడటం అంటే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడమే.
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందిద్దాం —
“ఓజోన్ పొరను రక్షిద్దాం.. మన భవిష్యత్తును కాపాడుకుందాం.”
— జనసేన నాయకులు కిషోర్ గునుకుల & వీర మహిళ విజయలక్ష్మి గునుకుల
#WorldOzoneDay #OzoneDay #KishoreGunukula #VijayalakshmiGunukula #JanaSena #Nellore #PeoplesFirst #ProtectOzoneLayer #SaveEnvironment
@JanaSenaParty@PawanKalyan@JSPShatagniTeam
మా జనసేన ప్రస్థానం | 15 సెప్టెంబర్ 2020
#5yearsback
రైతుల ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధరను వెంటనే అందించాలంటూ బీజేపీ–జనసేన ఆధ్వర్యంలో వైసిపి ప్రభుత్వం పై నెల్లూరు కలెక్టరేట్ వద్ద సంయుక్త ధర్నా నిర్వహించాం.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ₹15,600 ఉన్నప్పటికీ, రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ జరుగుతున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశాం. ధాన్యాన్ని నేరుగా రైతుల వద్ద నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, మిల్లర్లు–దళారుల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కూడా డిమాండ్ చేశాం.
#JanaSena #KishoreGunukula
#PawanKalyan #JanaSenaParty @JanaSenaParty@PawanKalyan
16 సెప్టెంబర్ 2021 | మా జనసేన ప్రస్థానం
ఐదేళ్ల క్రితం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహిళల భద్రత, అన్యాయానికి వ్యతిరేకంగా చర్యలు, ప్రజలకు న్యాయం వంటి అంశాలపై తన సందేశాన్ని మీడియా ద్వారా వెల్లడించారు.
“ఆడబిడ్డను తాకాలంటే వెన్నులో వణుకు పుట్టాలి…
రౌడీ రాజ్యాన్ని అరికడతామని మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపించాలి…
అన్యాయం జరిగిన వారికి న్యాయం జరగాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి.”
16 సెప్టెంబర్ 2021 — మా జనసేన ప్రస్థానంలో మరో ముఖ్యమైన జ్ఞాపకం.
#KishoreGunukula #JanaSena #PawanKalyan #ManaJanaSenaPrasthanam @JanaSenaParty@PawanKalyan
సోషల్ మీడియా మ్యాటర్
మా జనసేన ప్రస్థానం – 4 సంవత్సరాల క్రితం… | 16 సెప్టెంబర్ 2022
365 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకటించిన మినీ బైపాస్ ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యంపై అప్పట్లో జనసేన పార్టీ ప్రజల ఇబ్బందులను ప్రశ్నించింది.
ముత్తుకూరు సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్యలు, పాదచారుల ఇబ్బందులు, ప్రత్యామ్నాయ మార్గాల కొరతపై వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిర్ణీత గడువులో నిర్మాణం పూర్తి చేయాలని జనసేన డిమాండ్ చేసింది.
ప్రజా సమస్యలపై ప్రశ్నించడం… జనసేన ప్రస్థానంలో నిరంతరం!
#KishoreGunukula #JSPNellore #JanaSena #JanaSenaPrasthanam @JanaSenaParty@PawanKalyan
మా జనసేన ప్రస్థానం | 16 సెప్టెంబర్ 2025
#గతసంవత్సరం
విలువలతో కూడిన రాజకీయాలే ప్రజాస్వామ్యానికి బలం.
కుల, మత, వర్గ విభేదాలకు తావులేకుండా ప్రజా సమస్యలు, అభివృద్ధి, బాధ్యతాయుతమైన రాజకీయాలపై చర్చ జరగాలని జనసేన నాయకత్వం ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది.
16 సెప్టెంబర్ 2025న నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో, అప్పటి రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, వ్యక్తుల చర్యలను మొత్తం వర్గాలకు ఆపాదించకుండా సామాజిక ఐక్యతను కాపాడాల్సిన అవసరాన్ని ప్రస్తావించాం.
ప్రజల కోసం.. ప్రజలతో.. ప్రజల మధ్య..
మా జనసేన ప్రస్థానం కొనసాగుతుంది.
#KishoreGunukula #JanaSena #MaaJanaSenaPrasthana #PeopleFirst #Nellore @JanaSenaParty@PawanKalyan
Admin post
సత్యం వద… ధర్మం చర…” 🙏
కిషోర్ గారి జన్మదిన సందర్భంగా వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించిన పూజ్యనీయులైన పురోహితులు
సత్యం పలుకు… ధర్మాన్ని ఆచరించు” అనే మహోన్నత సందేశాన్ని మరోసారి గుర్తుచేసిన మీ ఆశీర్వచనాలను జీవితంలో ఆచరణలో పెట్టేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాను. మీరు అందించిన ఈ వేద ఆశీర్వచనాన్ని నా జీవితంలో ఒక మార్గదర్శకంగా స్వీకరిస్తున్నాను.
మీరు అందించిన ఈ పవిత్రమైన ఆశీర్వాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ప్రజాసేవలో సత్యం, ధర్మం, నిబద్ధత అనే విలువలను పాటిస్తూ ముందుకు సాగుతానని ఈ సందర్భంగా సంకల్పిస్తున్నాను.
మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
@PawanKalyan@APDeputyCMO@JSPShatagniTeam
#KishoreGunukula
#HBDKishoreGunukula
#HappybirthdayKishoreGunukula
#Nellore #Andhrapradesh
సేవే నిజమైన వేడుక ❤️
జనసేన నాయకులు కిషోర్ గునుకుల గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల స్ఫూర్తితో,నెల్లూరు సిటీ,16వ డివిజన్ ఆంజనేయ స్వామి వారి సన్నిధి వెనుక Team GK ఆధ్వర్యంలో దాదాపు 500 మందికి వస్త్రదానం కార్యక్రమం నిర్వహించారు.
అభిమానం ఆర్భాటంలో కాదు… సేవలో కనిపించాలి.
సేవే మా సంబరం… సేవే మా సంకల్పం! 🙏
ఈ కార్యక్రమంలో కిషోర్ గునుకుల,వారి సతీమణి విజయలక్ష్మీ,జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, కిషోర్ గునుకుల గారి అభిమానులు మరియు #TeamGK సభ్యులు పాల్గొన్నారు.
#KishoreGunukula #PawanKalyan #JanaSenaParty #JanaSena #HBDKishorannaGunukulaAnna
@PawanKalyan@JanaSenaParty
*అభిమానం మాటల్లో కనిపించకూడదు… సేవలో కనిపించాలి. మన ఆనందం మరొకరి కడుపు నింపినప్పుడు, అదే నిజమైన వేడుక.*
జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు సేవా స్ఫూర్తిని ఆచరణలో చూపిస్తూ, వరుసగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
*1* మొదట 16వ డివిజన్, ఆంజనేయ స్వామి వారి గుడి వెనుక దాదాపు 500 మందికి వస్త్రదానం, అనంతరం ముత్తుకూరు సర్కిల్ వద్ద దాదాపు 1000 మందికి అన్నదానం, చివరిగా నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం వద్ద దాదాపు 1,000 మందికి నాన్‌వెజ్ బిర్యానీ వడ్డింపు కార్యక్రమాలను Team GK సభ్యులు నిర్వహించారు.
ఇవి కేవలం జన్మదిన వేడుకలు కాదు…
అభిమానాన్ని సేవగా మార్చిన సందర్భాలు.
సేవను బాధ్యతగా స్వీకరించిన సందర్భాలు.
జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన సందర్భాలు.
ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, వారి సతిమణి విజయలక్ష్మి,ప్రవీణ్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్,నరహరి,విశ్వనాధ్,వర్షన్,పవన్ రెడ్డి,అశోక్,హర్షద్,రాఘవ, నాగేంద్ర బాలు, సుధాకర్, నాని, వర్షన్, బాలాజీ, కవలిక, శుభాషిణి, కృష్ణవేణి,కోలా విజయలక్ష్మి,హైమావతి తదితర జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, #TeamGK సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని…
కిషోర్ గునుకుల గారి జన్మదినాన్ని ప్రజలతో పంచుకుంటూ…
“సేవే సంబరం – ప్రజల చిరునవ్వే మా ఆనందం” అనే సంకల్పంతో Team GK ముందుకు సాగింది.
#KishoreGunukula #JanaSena #HBDKishorannaGunukulaAnna #PawanKalyan #nellore #JSPNellore @JanaSenaParty@PawanKalyan
శ్రావణ మాసంలో నిర్వహించే పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలకు, కుటుంబ సౌభాగ్యానికి, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మీ స్వరూపంగా పూజిస్తూ, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థించే ఈ పవిత్ర పర్వదినం మన ఆధ్యాత్మిక వారసత్వంలోని గొప్ప విశిష్టతను ప్రతిబింబిస్తుంది.
ఈ పవిత్ర శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ అందాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రజలందరికీ నా హృదయపూర్వక వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.
#KishoreGunukula #janasena
#VaralakshmiVratham #ShravanaShukravaram
ఇవి జన్మదిన వేడుకలుగా నేను భావించడం లేదు. మీ ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలను మరోసారి అనుభవించే గొప్ప సందర్భంగా స్వీకరిస్తున్నాను.
#KishoreGunukula#JanaSena
నా మంచి కోరుతూ, నేను బాగుండాలని ఆకాంక్షించిన ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా ఎల్లప్పుడూ మీతో ఉంటాను. మీకు సమస్య వస్తే దానిపై నిలబడతాను… మీ కష్టాల్లో మీతో పాటు నడుస్తాను. మనం సాధించాల్సిన విజయం ఏదైనా సరే, అది సాధించే వరకు కలిసి నడుద్దాం
గాంధీ బొమ్మ సెంటర్లో ఘనంగా కిషోర్ గునుకుల జన్మదిన వేడుకలు
నెల్లూరు:
జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో టీం జీకే సభ్యులు, జనసైనికులు, అభిమానులు, సోదర సోదరీమణులు అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలు సాధారణ జన్మదిన కార్యక్రమంగా కాకుండా, కిషోర్ గునుకులపై అభిమానులు, కార్యకర్తలు చూపిస్తున్న ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచాయి.
గాంధీ బొమ్మ సెంటర్లో పెద్ద ఎత్తున అభిమానులు, జనసైనికులు తరలివచ్చి కిషోర్ గునుకులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ ఆశయాలు, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కిషోర్ గునుకుల ముందుండాలని ఆకాంక్షిస్తూ పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ—
«“నా జన్మదిన సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి సోదరుడు, సోదరి, మిత్రుడికి పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు. గాంధీ బొమ్మ సెంటర్లో ఇంతటి ఘనమైన వేడుకలు నిర్వహించి మీ ప్రేమను, అభిమానాన్ని చాటిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు.»
«నాపై మీరు ఉంచిన నమ్మకం నాకు ఎంతో గొప్ప బాధ్యతను అప్పగించింది. జనసేన ఆశయాలకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు నేను ఒక వారధిగా నిలుస్తానని మీరు నన్ను నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా శ్రేయస్సు కోసం మరింత అంకితభావంతో ముందుకు సాగుతాను.»
«ఎదిగెత్తూ… ఎదురించూ… ఎన్నుకో!
ప్రజా సేవే లక్ష్యంగా, జనసేన సిద్ధాంతాలే మార్గంగా ముందుకు సాగుదాం.”»
కిషోర్ గునుకుల జన్మదిన వేడుకలను విజయవంతం చేసిన టీం జీకే సభ్యులకు, జనసైనికులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జై జనసేన!
జై పవన్ కళ్యాణ్!
#HBDKishoreGunukulaAnna
#PawanKalyan #JanaSenaParty @PawanKalyan@JanaSenaParty