వైఎస్ జగన్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధిరాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని..
వైఎస్సార్సీపీ కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్‌ను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వ���సి.. అత్యధిక మెజార్టీతో గెలిపించాలి - వైఎస్ జగన్
45 ఏళ్లు దాటి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేలు ఇస్తా���ని చెప్పండి. ప్రతి రైతన్నకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పండి. అవ్వా తాతల పెన్షన్ రూ.3 వేల వరకు పెంచుతామని చెప్పండి - వైఎస్ జగన్
డ్వాక్వా మహిళలకు చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని చెప్పండి. బ్యాంకులకు సగర్వంగా వెళ్లే రోజ��లు మళ్లీ వ��్తాయని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని చెప్పండి - వైఎస్ జగన్
జగనన్న వచ్చిన తర్వాత పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పండి. ఉన్నత చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చయినా అన్న చదివిస్తాడని చెప్పండి. డ్వాక్వా మహిళలకు చెప్పండి.. ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తామని చెప్పండి - వైఎస్ జగన్
మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి - వైఎస్ జగన్
ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు కుట్రలు మరింత పెరుగుతాయి. ఆయన చేయని మోసం ఉండదు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు - వైఎస్ జగన్
పొరపాటున బాబుకు ఓటేస్తే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో బ్యాంకులు ఇచ్చేరుణాలకు సైతం ఇవ్వనివ్వరు. రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు తనకు అనుకూలమైన పోలీసులను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను అధికారులను రానివ్వడం లేదు. రాబోయే రోజుల్లో మనుషులను చంపేసినా అగిగేవారుండరు - జగన్
చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే.. ఆర్టీసీ, కరెంట్ చార్జీలు బాదుడే.. బాదుడు. భూములు లాక్కునేందుకు భూసేకరణ చట్టానికి సవరణలు చేశారు. భూ రికార్డులను సైతం తారుమారు చేశారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మీ భూములను లాక్కుంటారు - వైఎస్ జగన్
చింతలపూడి ఎత్తిపోతల పథకం కొలిక్కి రాలేదు. చంద్రబాబు పాలనలో పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. చంద్రబాబు ప్రతి అడుగులో మోసం.. మోసం. మోసం. పొరపాటున బాబుకు ఓటేస్తే ప్రభుత్వ పాఠశాలలు ఉండవు. ఇప్పటికే 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారు - వైఎస్ జగన్
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పుష్కరాలో సైతం అవినీతి లేకుండా పనులు సాగుతాయని అందరూ అనుకుంటారు. కానీ, అలా జరగలేదు. చెత్త ఏరివేయడం.. ఘాట్ల నిర్మాణం.. తదితర పనులను నామినేషన్ల పద్ధతిలో ��ేపట్టి ఇష్టానుసారంగా రేట్లు పెంచేశారు - వైఎస్ జగన్
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇసుక దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఏకంగా చంద్రబాబుకు వాటాలు పంచుతూ యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారు - వైఎస్ జగన్
అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్‌లను రద్దు చేస్తామని చంద్రబాబు చేసిన సంతకానికి విలువ లేదు. బడి, గుడి, వీధి చివరా.. ఎక్కడా చూసినా బెల్ట్ షాప్‌లు నిర్వహిస్తున్నారు - కొవ్వూరు బహిరంగ సభలో వైఎస్ జగన్
ఐదేళ్లుగా మనల్ని మోసం చేసిన చంద్రబాబు కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల వేళ చంద్రబాబు మూటలు మూటల డబ్బులు పంపుతారు. ఆయనిచ్చే రూ. 3000 రూపాయిలకి మోసపోవద్దని ప్రతీ ఒక్కరికి చెప్పండి - వైఎస్ జగన్