పవిత్రమైన అహోబిల క్షేత్రంపై రాజకీయాలా? అహోబిలం అభివృద్ధిని కోరుకోవాలి. అహోబిలం మఠము, దేవస్థానం ఏదైనా అభివృద్ధికి సహకరించాలి
పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలం అభివృద్ధిని కోరుకోవాలి తప్ప మఠము, దేవస్థానం అంటూ రాజకీయాలు చేయడం ఏమిటని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గారు ప్రశ్నించారు. వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఇటీవల అహోబిలంకు సంబంధించి చేసిన విమర్శలపై మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గారు స్పందించారు. వైయస్ఆర్ సీపీ హయంలో అన్యాయం జరిగిందంటూ మాట్లాడి ప్రజలను మోసం చేయడం ఏమిటని అడిగారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు మేరకు అహోబిల క్షేత్రం మఠం ఆధీనంలోనికి వెళ్లిపోయిందన్నారు. 2019 ఏప్రిల్ నెలలో హైకోర్టు మఠానికి అనుకూలంగా తీర్పు ఇవ్వగా, సుప్రీంకోర్టు 2024 లో తిరిగి మఠానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. 2023లో ఆర్డర్ ఎవరు వేశారు, వైయస్ఆర్ సీపీ వారికి ఏమిటి సంబంధమని ప్రశ్నించారు. 2018-19లో టెంకాయల వేలంపాట రూ.54 లక్షలు, 2019-20లో రూ.51 లక్షలు, 2020-21లో 48 లక్షలు, ఇలా 2025-26కు రూ.30 లక్షలకు చేరితే టెంకాయ ధర రూ.75 ఎందుకు ఉందని అడిగారు. వైయస్ఆర్ సీపీ హయాంలో టెంకాయ ధర రూ.50 ఎక్కువగా ఉందన్న వారికి రూ.70 కనిపించడం లేదా అని ప్రశ్నించారు. టోల్ గేట్ వసూలు వైయస్ఆర్ సీపీ హయాంలో ఎక్కువ అని గగోలు పెట్టారని, నేడు టెండర్లో వేలంపాట తక్కువకు పాడారని, గతంలో రూ. 50 లక్షలు పాట ఉన్నప్పుడు ఉన్నదానికంటే నేడు ఎందుకు ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. తమకు అవకాశం ఇస్తే రూ.40 లక్షలకు టెండర్ పాడి గ్రామాభివృద్ధికి కృషి చేయడంతో పాటు టోల్ గేట్ రూ.100 వసూలు చేస్తామని, అవకాశం ఇస్తారా ఇందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అహోబిలంలో ఉద్యోగాల విషయంలో వైయస్ఆర్ సీపీ హయాంలో అహోబిలానికి చెందిన వారు కాకుండా ఇతరులకు ఉద్యోగాలు ఇప్పించారని అవాస్తవాలు మాట్లాడుతున్నారని, తెలుగుదేశం వారు ఉద్యోగాలు ఇప్పించినవారు స్థానికేతరులు కాదా అని అడిగారు. తాము ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఉద్యోగాలు ఇప్పించామన్నారు. అహోబిలానికి వస్తున్న సరుకులు ఎవరు నిలుపుదల చేశారని ప్రశ్నించారు. అహోబిలం వెంట్రుకలు చెన్నైలో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అడిగారు. ఎంతో పవిత్రమైన అహోబిలం అభివృద్ధిని ఆకాంక్షించాలి తప్ప చౌకబారు విమర్శలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గారు హితవు పలికారు.
కూటమి ప్రభుత్వంలో సూటుబూటు వేసుకున్న వాళ్లకు మాత్రమే రెడ్ కార్పెట్. మత్స్యకారుల ప్రాణాలకు విలువ లేదు. ఎంపీ భరత్, మంత్రి అచ్చెన్నాయుడు చేసిందేమీ లేదు. పవన్ కళ్యాణ్ మెట్లు కడగడం కాదు మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకున్న మత్స్యకారుల కుటుంబాల కాళ్లు కడగాలి. భారత నౌకాదళానికి ఒక్క సమాచారం ఇస్తే వాళ్లు మత్స్యకారులను కాపాడేవాళ్లు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే.
-వాసుపల్లి గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే
వినుకొండలో స్కూల్ ఓపెనింగ్‌కి వెళ్లిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. సభలో వైయస్ జగన్ గారి గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎందుకు సంధ్యారాణి ఇలా తరచూ అసహనానికి గురవుతున్నారని ఆరా తీస్తే.. ఐపీఎల్ 2026లో ఆమెకు గట్టిగా సన్‌స్ట్రోక్ తగిలినట్లు తెలిసింది. ఎన్ని కోట్లు పోయాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉందట
-పుష్ప శ్రీవాణి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి
కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు ఎన్ని బూతులు మాట్లాడతారు? అలాంటి వాళ్లకు వీళ్లే పెట్టుబడి పెట్టి పోషిస్తారు. అదే వీళ్లను ప్రశ్నిస్తే మాత్రం UAPA యాక్ట్ కేసులు, కక్ష సాధింపులా? చంద్రబాబుకి చెబుతున్నా..ఇలాంటివన్నీ చేస్తూ మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. ఎంత క్రైమ్‌కి అంతే కేసుండాలి అంతేకానీ అక్రమ కేసులు పెట్టి ఇలా దుర్మార్గమైన తీరులో వ్యవహరించడం దారుణం. ఇందులో పోలీసుల అతి చూస్తుంటే సాయికృష్ణ లాకప్‌డెత్ అంశాన్ని డైవర్ట్ చేసే కుట్రగా కూడా ఇది కనిపిస్తోంది.
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం..
కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగా అక్రమంగా అరెస్ట్‌కు గురైన సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్ గారి కుటుంబ సభ్యులను ఈరోజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వాటిని పక్కనపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు, ప్రజా గొంతుకలను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య. అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి, కేవీఆర్ గారిని బలవంతంగా తీసుకెళ్లడం ప్రజాస్వామ్య విలువలపై దాడితో సమానం. ప్రశ్నించే ప్రతి స్వరాన్ని అణిచివేయాలని చూస్తున్న ఈ వైఖరి రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ప్రజాస్వామ్యంలో విమర్శలను, ప్రశ్నలను అణచివేయడం కాదు, వాటికి సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత.
-శ్యామల గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
విశాఖ బీచ్‌కి ప్రతిరోజూ వేలాది మంది కుటుంబాలతో వచ్చి.. సేద తీరుతుంటారు
బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు బీచ్‌లో చేపడితే మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుంది?
బీచ్ షాక్స్ కావాలంటూ పబ్లిక్ చెప్తున్నారని నిస్సిగ్గుగా టీడీపీ ఎంపీ భరత్ చెప్తున్నారు.. మీ గీతం యూనివర్సిటీలో మద్యం విక్రయాలు పెట్టగలరా?
టీడీపీ ఆఫీస్‌కి వచ్చే కార్యకర్తలు, నాయకులకు టీ, కాఫీకి బదులు బీర్లను పల్లా శ్రీనివాసరావు ఇస్తారా?
-వరుదు కల్యాణి గారు, ఎమ్మెల్సీ, వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు
#NaraLiquorBabu
#SadistChandraBabu
గాదె విజయలక్ష్మి గారికి భర్త లేరు.. ఉన్న కొడుకు గాదె సాయికృష్ణను పోలీసులు చంపేశారు
ఏకాకిగా మారిపోయిన విజయలక్ష్మి గారికి ఆర్థికంగా సాయం చేయాలని వైయస్ఆర్సీపీలోని కాపు నేతలు నిర్ణయించుకుని.. రూ.20 లక్షల విలువైన డీడీని ఆమెకు స్వయంగా అందజేశాం
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
కాపు యువకుడు గాదె సాయికృష్ణను కృష్ణలంక @APPOLICE100, @ncbn, @PawanKalyan లాకప్‌లో చంపేసి బూడిదని కూడా మాయం చేశారు!
నా కొడుకు బూడిదైనా ఇప్పించండి అంటూ విజయలక్ష్మి గారు కన్నీళ్లతో అడుగుతున్నా పట్టించుకోని కూటమి నేతలు
కనీసం సొంత ఇల్లు కూడా లేని బాధిత సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తూ.. రూ.20 లక్షల ఆర్థిక సాయం చేసిన వైయస్ఆర్సీపీ కాపు నేతలు
తాడేపల్లి
దళితులకు బతికే స్వేచ్ఛే లేకుండా చేశారు
- కూటమి పాలనలో దళితులకు రక్షణ లేదు
- రెండేళ్లలో 16 మంది దళితులను చంపేశారు
: బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగ్రహం
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం
తాడేపల్లి:
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దళితులు కనీసం బతికే స్వేచ్ఛను కూడా కోల్పోయారని, ఒకపక్క ప్రభుత్వం, ఇంకో పక్క పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో 16 మందికిపైగా దళితులను ఈ ప్రభుత్వం పొట్టనపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ తొలి దళిత ఉప ప్రధానిగా, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన బాబూ జగ్జీవన్ రామ్ (బాబూజీ) వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటం వద్ద పార్టీ నాయకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రిగా 'హరిత విప్లవం' విజయవంతం కావడంలో బాబూజీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. కుల, మత బేధాలు లేని సమసమాజ స్థాపన కోసం ఆయన నిరంతరం కృషి చేశారని, మనుషుల మధ్య గోడలు కూల్చి, మానవత్వాన్ని చాటడమే దేశ ప్రగతికి మూలస్తంభం అని చెప్పారన్నారు. వైఎస్ జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో జగ్జీవన్‌రామ్ ఆశయాల సాధన కోసం పనిచేశారని చెప్పారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడానికి ఎంతో కృషిచేశారని కొనియాడారు.
రాష్ట్రంలో నరమేధం సృష్టిస్తున్నారు
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నరమేధం సృష్టిస్తోందని, అడుగడుగునా చట్టాలు, న్యాయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం, అక్రమ కేసులతో వేధించడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. పాలన చేతకాక దురహంకారంతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారని, ప్రతిఘటించేవారిని చంపడమే ఎజెండా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతి కుమార్, కర్నూలులో పోలీసుల దెబ్బలకు తాళలేక చనిపోయిన మాల గంగమ్మల మరణాలే కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న దాష్టీకాలకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా పేరుపోగు క్రాంతికుమార్ మరణానికి నివాళులు అర్పిస్తూ కాసేపు పార్టీ నాయకులు మౌనం పాటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, మళ్లీ వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రం బాగుపడే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ గారి నేతృత్వంలో బాధితుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేశ్, శంకర నారాయణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, పార్టీ అధికార ప్రతినిధి వేల్పుల రవి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వీరితోపాటు వివిధ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ వర్ధంతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రతి పనికీ రేటు గట్టి.. రెండేళ్లలో భారీగా వెనకేసుకున్న పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
ఏఎంసీ పదవి ఇచ్చేందుకు గిరిజనుడిని రూ.50 లక్షలు డిమాండ్ చేసిన ఎమ్మెల్యే
నీ సపోర్ట్ లేకుండానే మీ ఎమ్మెల్యే ఈ దందాలు నడిపిస్తున్నాడా @PawanKalyan ?
#SeizeTheLiarPK
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్‌కి గురైన కాపు యువకుడు గాదె సాయికృష్ణ కుటుంబానికి వైయస్ఆర్సీపీ కాపు నేతలు రూ.20 లక్షలు ఆర్థిక సాయం!
వడ్డేశ్వరంలోని తన సోదరుడి ఇంట్లో ఉన్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారిని పరామర్శించి.. రూ.20 లక్షల విలువైన డీడీని అందజేసిన వైయస్ఆర్సీపీ కాపు నేతలు అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, సింహాద్రి రమేష్ గారు, అడపా శేషు గారు తదితరులు
అధైర్యపడొద్దని.. న్యాయం జరిగే వరకూ వైయస్ఆర్సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని విజయలక్ష్మి గారికి పార్టీ కాపు నేతలు భరోసా
మై టీడీపీ యాప్‌లో అప్లోడ్ చేయడానికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలంటూ మహిళా వీఆర్వో (బీఎల్వో)ను బెదిరించిన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ పీఏ నాగరాజు
ఎమ్మార్వో చెబితే ఇస్తానంటూ ధీటుగా సమాధానమిచ్చిన వీఆర్వో.. దాంతో సహనం కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడిన నాగరాజు
నారా లోకేష్ ఆ యాప్‌లో అప్లోడ్ చేయమన్నట్లు చెప్పుకొచ్చిన నాగరాజు.. నియోజకవర్గంలోని బీఎల్వోలు అందరూ ఇప్పటికే డేటా కూడా ఇచ్చినట్లు ఒప్పుకోలు
SIR ప్రక్రియ ముసుగులో ఇంత అరాచకమా @ncbn ? మై టీడీపీ యాప్ కోసం డేటా ఇవ్వాలని ఈసీ చెప్పిందా @naralokesh ?
Seven fishermen went missing near Gangavaram Port in Visakhapatnam at around 2:30 PM on July 4 after their boat capsized. In any rescue operation, every moment is crucial.
Their families spent the entire day and night in unbearable anxiety, hoping that immediate action would save their loved ones. However, instead of treating this as a life-and-death emergency, the TDP coalition government reportedly began rescue operations only at 11:00 AM on July 5, losing nearly 20 golden hours. Such an extraordinary delay in a maritime emergency cannot be dismissed as a mere lapse. It amounts to criminal negligence.
The tragedy is even more painful because the only fisherman who survived was rescued with the help of another boat, not because of the government’s response. Even today, six fishermen remain untraced, leaving their families caught between hope and despair.
This is not just administrative failure. It is a complete collapse of responsibility. Fishermen risk their lives every day to earn an honest livelihood and contribute to the State’s economy. Yet, when they desperately needed the government to act with urgency, they were abandoned. Had influential people been involved instead of poor fishermen, would the government have waited nearly 20 hours?
The TDP coalition government is always quick to claim credit and spend its energy on publicity. But when lives are hanging by a thread, it vanishes. Governance is measured by timely action, not press releases.
The @JaiTDP government must immediately intensify the rescue operation by deploying every available resource, including advanced search equipment. The search must continue until every missing fisherman is found. Their families deserve swift action, accountability and justice, not delay, indifference and empty propaganda.
బీచ్ షాక్స్‌కి వ్యతిరేకంగా విశాఖ ఆర్కే బీచ్‌లో మిన్నంటిన నిరసన జ్వాలలు
గోవా తరహా సంస్కృతిని ఏపీలోకి తీసుకువచ్చి.. అందమైన విశాఖ తీరాన్ని మందుబాబుల అడ్డాగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండటాన్ని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గట్టిగా వ్యతిరేకించిన విశాఖ వాసులు
జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లతో నిరసనలు
పర్యాటక రంగం అభివృద్ధి ముసుగులో మహిళల భద్రతను పణంగా పెట్టడాన్ని సహించేది లేదని హెచ్చరిక
పోలవరం జిల్లా వాసులకు తప్పని డోలీ మోతలు
కూనవరం మండలం, కొత్త కర్మానుకొండ కొండరెడ్డి గిరిజన గ్రామానికి చెందిన సూట్రు సమ్మక్క ప్రియ అనే యువతికి పాము కాటు
బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో కొండల మీద నుండి కూటూరు పీహెచ్‌సీకి దాదాపు 7 కి.మీ డోలీలో తీసుకొచ్చిన బంధువులు
ఇంకెన్నాళ్లు గిరిజన బిడ్డలకు ఈ డోలీ మోతలు @ncbn, @PawanKalyan ?
వైయస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ గారిని అక్రమంగా పోలీసులు అరెస్ట్
తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా టోల్గేట్ వద్ద సందీప్ గారి వాహనాన్ని అడ్డుకుని.. బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయిన పోలీసులు
కేసు ఏంటి? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అని ప్రశ్నించినా కనీసం సమాధానం కూడా చెప్పని పోలీసులు
ఇంకెన్నాళ్లు ప్రశ్నించే గొంతుల్ని అణిచివేస్తూ ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్ట్‌లు @ncbn ?
ఆక్వా రైతుల్ని రెండేళ్లలో నిలువునా ముంచేసిన చంద్రబాబు
సిండికేట్ యాజమాన్యాలు, దళారులు కుమ్మక్కై ఫీడ్ రేట్లు భారీగా పెంచేసినా కనీసం పట్టించుకోని కూటమి నేతలు
వైయస్ జగన్ గారి హెచ్చరికతో ఇటీవల ఫీడ్ రేట్లు కాస్త తగ్గించినా.. ఇప్పటికీ ఇబ్బందుల్లోనే ఆక్వా రైతులు
ఆక్వా రైతుల్లో భరోసా నింపేందుకు ఈ నెల 15న భీమవరం వెళ్లబోతున్న వైయస్ జగన్ గారు
#YSJaganForFarmers