ప్రొటీన్లు- ప్రశ్నలు
ఎందుకు?
ఒంట్లో కండ పెరిగేందుకు,
కండలోపల ఎముక పెరిగేందుకు,
కండ పైన తోలు పెరిగేందుకు,
పాడైన పార్టులు బాగయ్యేందుకు,
ఇమ్యూనిటీ బాగుండి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు,
మెదడులో నరాలు మాట్లాడేందుకు,
తిన్న తిండి అరిగేందుకు,
రక్తం పెరిగేందుకు,
కడుపులో బిడ్డ పెరిగేందుకు,
బిడ్డని కనేందుకు బాడీ సిద్ధమయ్యేందుకు,
జుట్టు పెరిగేందుకు,
రక్తం గడ్డకట్టేందుకు,
రక్తం చిక్కగా ఉండేందుకు,
ఎత్తు పెరిగేందుకు,
షుగరు అదుపులో ఉండేందుకు,
ఎందులో?
గుడ్లు, పాలు, మాంసం,
చిక్కుళ్ళు, పప్పులు, వేరు శనగ, బాదాం, పిస్తా…
అన్నం, చపాతీలో?
ఉంటుంది కానీ సరిపడదు.
శ్రేష్ఠమైన సహజ ప్రోటీను?
గుడ్డు
శ్రేష్ఠమైన తయారీ ప్రోటీను?
పాల పొడి, వే ప్రోటీను - ఇవి సురక్షితం.
శ్రేష్ఠమైన అంటే?
తిన్న మొత్తం ప్రోటీను ఒంట్లోకి వెళ్లి పనిచెయ్యడం. కొన్ని ఆహారాల్లో ఉన్న ప్రోటీను మనకి కావాల్సినవి అందించలేదు.
అంటే?
ప్రోటీన్లలో ఇరవై రకాల అమైనో ఆమ్లాలుంటాయి, ఈ ఇరవై ఉంటేనే ప్రొటీన్లు తయారవుతాయి ఒంట్లో. వీటిలో 11 మన దేహం తయారుచేసుకుంటుంది, కానీ 9 బయటినుంచి తిండిలో తప్పనిసరిగా తీసుకోవాలి. గుడ్డు, పాలలో పుష్కలంగా ఉంటాయిఇవి. మిగతావాటిలో అంతగా ఉండకపోవచ్చు.
ప్రొటీన్లు తిండిలో తగ్గితే?
పిల్లల్లో బుద్ధి మాంద్యం, ఒళ్లంతా పొంగడం, పొట్టిగా ఉండిపోవడం, గుండె అలసిపోవడం, పాలిపోవడం, ఎముకలు బలహీనపడటం
పెద్దల్లో ఇన్ఫెక్షన్లు సులువుగా రావటం, పుండు మానకపోవడం, జుట్టు ఊడిపోవడం, కండరాలు బలహీనపడటం.
రక్తపరీక్ష?
సాధారణంగా రక్తంలో ప్రొటీన్లు 6.5 నుంచి 8.5 గ్రా/డెసి లీ. ఉంటాయి. మీరు తినే తిండి మరీ దారుణం కాకపోతే 6.5 కి తగ్గదు. మీరు ఎంత తిన్నా 8.5 కంటే పెరగదు. అంటే దేహం రక్తంలో ఉండే ప్రొటీన్లను బాగా టైట్ గా కంట్రోల్ చేస్తుంది(నియంత్రిస్తుంది). ఉన్న దానికంటే పెరిగితే దేహంలో ఏదో సమస్య ఉన్నట్లు లెక్క. తక్కువ ఉంటే తక్కువ తినడమో లేక ఇంకెక్కడో ప్రొటీన్లు పోవడమో జరుగుతుందని. మొత్తంగా చెప్పేది ఏంటంటే ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే ఒంట్లో ఐరన్ ని లెక్క వేసినట్లు, ప్రొటీన్లు తింటే ఒంట్లో ప్రొటీన్లని రక్త పరీక్ష ద్వారా లెక్క వెయ్యలేం.
ఎంత తినాలి?
పెద్దలు- 1 గ్రా/కేజీ బరువుకి. అరవై కేజీల బరువు ఉంటే 60 గ్రా తినాలి.
బాలింతలు, గర్భిణీలు, ఎదిగే పిల్లలు, ఆపరేషన్ అయ్యి కోలుకుంటున్నవాళ్ళు, ఐసీయూ నుంచి డిశ్చార్జి అయినవాళ్ళు, బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, ముసలివాళ్లు - 2 గ్రా/ కేజీ బరువుకి.
ఒక్క ప్రొటీన్ తింటే సరిపోతుందా?
సరిపోదు. దేహానికి శక్తి అవసరం అది కార్బోహైడ్రేట్లు, కొవ్వులనుంచి వస్తుంది. అవి దొరకనప్పుడు దేహంలో ఒంట్లో నిల్వని ఖర్చు చేస్తుంది, అవీ అయిపోయాక ఇంకా ఒంట్లో ప్రొటీన్లని వాడుకుంటుంది శక్తి కోసం.
గుడ్లు సురక్షితమా?
సురక్షితం. పిల్లలు పూర్తి గుడ్డు తినవచ్చు. పెద్దలు తెల్లసొన మాత్రం తింటే సరిపోతుంది.
గుడ్లు ఎలా తినాలి?
పచ్చిది వద్దు. ఉడకబెట్టి, ఆమ్లెట్, ఉక్కిరి ఎలా అయినా తినవచ్చు.
తల్లిదండ్రులు పిల్లలకి గుడ్డు పెట్టాలా?
పెట్టాలి.
ప్రభుత్వం పెట్టాలా?
పెట్టాలి.
గుడ్డుకి ప్రత్యామ్నాయం ఉందా?
లేదు. గుడ్డు లో ఉండేపోషకలు ఇంకో ఆహారం ద్వారా తినాలి అంటే ఎన్నో తినాలి, బరువుపెరుగుతారు అనవసరంగా, ఇప్పటికే పిల్లల్లో స్థూలకాయం పెరుగుతోంది. పైగా ఖర్చు, తయారుచేసేందుకు సమయం వృధా.
రోజుకి ఎన్ని గుడ్లు తినవచ్చు?
ఎన్నైనా తినవచ్చు. నేను 4-8 తింటాను.
గుడ్డు తినడం వలన అనర్థాలు ఏమన్నా ఉన్నాయా?
లేవు.
మరి శాకాహారులు?
వే తినవచ్చు. ఖరీదు అలాగే అనవసర పదార్థాలు కలుపుతారు అందులో, అలాగే నాణ్యత కచ్చితంగా ఉంటుందని చెప్పలేం. కొందరిలో బాగా అపానవాయువు వస్తుంది.
గుడ్డు కంటే ఫలానాది మంచి ప్రోటీను ఇది అని అంటే?
గుడ్డు తెలుసురా నీకు అని అనండి.
సండే యా మండే, రోజ్ అండే ఖావ్.
Peddi used the Srikakulam dialect and Telangana people watched it without throwing tantrums. But a movie based on Telangana and social media fills up with accounts mocking it. They start the hate, blame Telangana people for reacting then play the victim card.
ఎప్పుడూ కూడా నీ ఆహారం సమతుల్యంగా ఉందో లేదో చూసుకో, అంతేకానీ పక్కవాడి ఆహారాన్ని ప్రోటీన్ డెఫిషియంట్, డీప్ ఫ్రైడ్ లేదా హెల్తీ, క్రూయెల్టీ ఫ్రీ అని అనొద్దు. ఆహారం శరీరానికి అవసరం, మనసుకి ఆనందం అంతే. తినే తిండి ఇతరులను తాము అధములు అనో, ఉత్తములు అనో నిర్ణయించకూడదు.