Remembering #MakhdoomMohiuddin on his 55th death anniversary #25August
Raat Bhar Deeda-e-Namnaak Mein Lehratay Rahay
Saans Ki Tarah Se Aap Aate Rahe Jate Rahay
All night, in my moist eyes you continued to sway
Just like breath, you kept coming and going away
#MakdoomMohiuddin
నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు.
చిట్యాల ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సందర్భంగా వారి త్యాగాలను, పోరాటస్ఫూర్తిని సీఎం స్మరించుకున్నారు.
నాటి కాలంలోనే, తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామిక వాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ అని సీఎం కొనియాడారు.
నాటి వారి స్ఫూర్తి తెలంగాణ సాధనలోనూ, అనంతర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నదని సీఎం తెలిపారు.
చిట్యాల ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం అన్నారు.
దేశంలో మరెక్కడాలేని విధంగా రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం తెలిపారు. మహిళలు, బీసీ, ఎంబీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయని సీఎం అన్నారు.
సబ్బండ కులాల జీవన ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మకంగా అభివృద్ధి పరుస్తున్నదని, బీసీ, ఎంబీసీ మహిళల సంక్షేమం కోసం తమ కృషి కొనసాగుతూనే వుంటుందని సీఎం స్పష్టం చేశారు.