చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని BLOs, సూపర్ వైజర్లకు రామడుగుZPHS లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)శిక్షణ కార్యక్రమానికి అశ్విని తానాజీ వాకడే ACLB గారు హాజరయ్యారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ సమర్థవంతంగా ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామంలోని ఎరువుల గోదామును శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ACLB గారు తనిఖీ చేసారు.విత్తన కేంద్రాలు,ఎరువుల విక్రయ కేంద్రాలు మరియు ఇప్పటివరకు జరిగిన అమ్మకాల వివరాలను,జిల్లాకు సంబంధించిన ఎరువుల నిల్వలను సమగ్రంగా పరిశీలించి వ్యవసాయ అధికారులకు తగు సూచనలు చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ MPUPSను శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ACLB గారు తనఖీ చేసారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రీడింగ్, రైటింగ్,అర్థమెటిక్ విషయాలలో ప్రిపేర్ చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల తరగతి గదులు,వంటగది పరిశీలించి తగు సూచనలు చేసారు.
పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ACLB గారు కొత్తపల్లి మం.ఎలగందల్ మోడల్ స్కూల్,ZPHS,KGBV, SW హాస్టల్ ను సందర్శించి మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాసంస్థలను సన్నద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజాపాలనా-ప్రగతి ప్రణాళిక లో భాగంగాఅరైవ్-అలైన్ కార్యక్రం చొప్పదండి లో నిర్వహించగా MLA మేడిపల్లి సత్యం గారు, రమేష్ నాయుడు IGP గారు,గౌస్ ఆలం CP గారు,అశ్విని తానాజీ వాకడే ACLB గారు హాజరైనారు.ఈ సందర్బంగా ద్విచక్రవాహనము నడిపే వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వాహనదారులకు సూచించారు.
బేటీ బచావో- బేటీ పడావో పథకం 2026–27 సం.నకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ACLB గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాలికల సంక్షేమం మరియు విద్య కోసం పథకం నిధులను ఎలా వినియోగించాలనే విషయంలో అధికారులకు తగు సూచనలు చేసారు.
రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు పురోగతిపై వివిధ శాఖల అధికారులతో శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ACLB గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తిమ్మాపూర్ మం. కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అశ్విని తానాజీ వాకడే ACLBగారు పాల్గొని 4 రకాల ఘన వ్యర్థముల నిర్వాహణ పైన గ్రామసభలో అవగాహన కల్పించినారు మరియు వర్షాకాల సన్నద్ధత,డ్రైనేజిల శుభ్రత చేపట్టాలని మండల స్థాయి అధికారులకు సూచించారు
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంను అశ్విని తానాజీ వాకడే ACLBగారు నిర్వహించారు.ఈ సందర్బంగా పొగాకు వాడకం వల్ల క్యాన్సర్ గుండెపోటు పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నందున జిల్లాను'TOBACCO FREE'జిల్లా గా మార్చాలని జిల్లా అధికారులకు సూచించారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యా విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా అశ్విని తానాజీ వాకడే ACLB గారు, Dy.మేయర్ గారు, RDO గారు హాజరైనారు.ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలతో అభినందించారు. విద్యార్థుల విజయాలలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు
కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్ దినోత్సవం నిర్వహించగా అశ్విని తానాజీ వాకడే ACLB గారు, MCK మేయర్ గారు హాజరైనారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్ట్ క్రాఫ్ట్ మేళా వంటివి ఏర్పాటు చేశామని ACLB గారు తెలిపారు.
విద్యా వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ గారు,ACLB గారు,MCKమేయర్,సుడా చైర్మన్ గారలతో కలిసి ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గ్రంథాలయాలు మార్గదర్శక కేంద్రాలుగా ఎంచుకోవాలని ACLB గారు సూచించారు.
విద్యా వారోత్సవాలలో భాగంగా కొత్తపల్లి(H) లోని PMSHRI ZPHSపాఠశాలలో 'ప్రొ.జయశంకర్ బడిబాట'కార్యక్రమాన్ని అశ్విని తానాజి వాకడే ACLBగారు ప్రారంభించారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందే సౌకర్యాల గురించి అవగాహన కల్పించి ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక -విద్యా వారోత్సవాలలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం లో సర్పంచుల కోసం ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించగా శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ACLB&DEO గారు ఈ కార్యక్రమానికి హాజరై గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్పంచులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
ఈ రోజు కరీంనగర్ భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష &అలింకో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశమునకు శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ACLBగారు,MCKమేయర్ గారు, సుడా చైర్మెన్ గారు హాజరై దివ్యాంగ బాల బాలికలకు ఉపకరణాలు పంపిణీ చేసారు. ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు అందజేయాలని సూచించారు
#MC_KARIMNAGAR participated in a meeting along with the Additional Collector @aclbknr at the Collectorate Conference Hall to review pending applications under the Layout Regularization Scheme (LRS–2020).
During the meeting, it was informed that the State Government has issued G.O. 131, providing a 25% rebate on LRS fees and other applicable charges. Applicants who applied for LRS in 2020 but have not yet paid the fee, or have made only partial payments, can avail themselves of this benefit.
It was clarified that the 25% rebate is applicable only for payments made between May 1, 2026, and July 31, 2026. It was emphasized that plot owners can regularize their plots at a reduced cost through this scheme. Regularization will enable easier property registration, access to bank loans, and obtaining building permissions in the future.
Officials were instructed to create widespread awareness among applicants about the rebate and ensure maximum outreach. Municipal Commissioners were also directed to establish help desks to assist applicants regarding the LRS rebate scheme.
@Collector_KNR@tksreedevi@cdmatelangana@IPRTelangana@TelanganaCMO@TelanganaCS
KNR కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో DLC సమావేశం శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ACLB గారి ఆధ్వర్యంలో జరుగగా ఈ సమావేశంలో PM సూర్యఘర్ ముఫ్త్ యోజనలో భాగంగా అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి చేసిన గ్రామంగా DLC కమిటీ గొడిశాల గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా అధికారికంగా నిర్ణయించారు.
కరీంనగర్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశంకొరకు ప్రవేశపరీక్ష నిర్వహించగా,ఎలగందల్ ఆదర్శ పాఠశాలను అశ్వినీతానాజీ వాకడేACLB గారు తనిఖీ చేసారు.ఈ సందర్బంగా అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకుఅన్ని వసతులు కల్పించినట్లు మరియు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా KNRలో నిర్వహించిన అరైవ్-అలైవ్ రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి గారు,జిల్లా కలెక్టర్ గారు,సీపీ గారు,ACLB గారు హజరైనారు. డీజీపీ గారు మాట్లాడుతూ వాహనదారులు ఎల్లప్పుడూ ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ చేయాలని సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తిమ్మాపూర్ వాగేశ్వరి కళాశాలలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్ రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సును నిర్వహించగా శ్రీమతి అశ్విని తానాజీ వాకడే ACLBగారు హజరైనారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతగా హెల్మెట్,సీటు బెల్ట్ ధరించాలన్నారు.