@CMC_Offcl@GHMCOnline@TV9Telugu the same builder lansum is using 40 feet road to for transportation of the dump vehicles there is lot of heavy vehicles movement throughout the night which is unbearable..
The state government is drowning only in assurances. Congress’s price rise has become too much for the people of the state. The Karnataka (Congress) Rakshana Vedike, which doesn’t open its mouth about the price rise, is staging this drama.
2014 ముందు 80% పైగా మొబైల్ ఫొన్ లను దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఇప్పుడు ప్రపంచంలోనే మొబైల్ ఫొన్ లు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానం పొందింది అంటే, అది కూడా జీర్ణించుకోలేక కొందరు భారత్‌ను “స్క్రూడ్రైవర్ టెక్నాలజీ” అని వెక్కిరిస్తూ ఉన్నారు. అంటే మనం ఇతర దేశాల నుంచి భాగాలు తెచ్చుకుని, ఇక్కడ కేవలం అసెంబుల్ చేసి అమ్ముతామని వెక్కిరించడం అన్న మాట. పోనీ అది అంత ఈజీ గా చేయగలిగేది అయితే అదే మొబైల్ ఫోన్ అసెంబ్లింగ్ 2014 ముందు ఎందుకు ప్రోత్సహించలేదు అంటే జవాబు రాదు.😪
భారత్ ప్రస్తుతం ఒక్క అసెంబ్లింగ్ మీదే దృష్టి పెట్టడం లేదు. ఏకంగా మొత్తం మొబైల్ ఫోన్లు దేశంలో తయారుచేయడానికి వీలుగా వాటి భాగాలు తాయారు చేయడానికి అనువైన మెషీన్స్ తయారుచేయడానికి ప్రోత్సాహకాలు ఇస్తూ కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ఇటువంటి వాటిల్లో బెంగళూరులోని ఒక భారతీయ కంపెనీ (Ethereal Machines) తయారు చేస��న 5-axis CNC మెషిన్ దీనికి ఉదాహరణ.
ఈ మెషిన్ చాలా సూక్ష్మంగా ఉండే వస్తువులను కూడా ఖచ్చితత్వంతో కత్తిరించగలదు. దాని ఖచ్చితత్వం 2 నుంచి 5 మైక్రాన్లు. అంటే ఎంత సూక్ష్మమైన పార్ట్స్ ని ఈ మెషీన్ హేండిల్ చేయగలదో మనకు అర్ధం కావాలి అంటే, మనుషుల వెంట్రుక మందం సుమారు 70-80 మైక్రాన్లు తో 2-5 మైక్రాన్ సైజ్ ని పోల్చుకోండి. అంటే ఈ మెషిన్ ఎంత సూక్ష్మమైన వస్తువులను అంటే కంటికి కనిపించని సైజ్ ని హేండిల్ చేయగలదు. మన అవసరాలకు ఇలాంటి మెషిన్లను ఇప్పటివరకు జర్మనీ, జపాన్ లాంటి దేశాల నుంచే తెచ్చుకునేవారం. ఇప్పుడు అవి భారత్‌లోనే డిజైన్ అయి, తయారవుతున్నాయి.
ఇది ఎందుకు ముఖ్యం?
సెమీకండక్టర్ (చిప్) తయారీకి చాలా ఖచ్చితమైన యంత్రాలు, భాగాలు కావాలి. ఆ యంత్రాల్లో వాడే చిన్న చిన్న కాంపోనెంట్స్ కూడా మైక్రా���్ స్థాయిలో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటివరకు ఈ భాగాలన్నీ విదేశాల నుంచి వచ్చేవి. ఇప్పుడు భారత్‌లోనే అలాంటి భాగాలను తయారు చేయగల మెషిన్లు వస్తున్నాయి. అంటే మనం కేవలం చిప్‌లను అసెంబుల్ చేయడం కాకుండా, చిప్‌లు తయారు చేసే యంత్రాలకు కావాల్సిన భాగాలను కూడా స్వదేశంలోనే తయారు చేసుకోగలుగుతున్నాం.
భవిష్యత్తులో ఇది ఎలా ఉపయోగపడుతుంది?
చిప్ తయారీలో:
చిప్ ఫ్యాక్టరీలకు కావాల్సిన ప్రెసిషన్ మెష��న్ భాగాలు, మోల్డ్‌లు, టూల్స్ భారత్‌లోనే తయారవుతాయి. దీంతో విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది.
చిప్ డిజైనింగ్‌కు:
మన దేశంలో ఇప్పటికే చాలా మంది ఇంజనీర్లు అధునాతన చిప్‌లను డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ డిజైన్లను భౌతికంగా తయారు చేసే సామర్థ్యం కూడా పెరుగుతోంది. డిజైన్ + తయారీ రెండూ ఒకే దేశంలో ఉంటే పని వేగంగా, చవకగా జరుగుతుంది.
ఇతర రంగాల్లో దీని ఉపయోగం:
ఏరోస్పేస్, డిఫెన్స్, మెడికల్ రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో కూడా ఇలాంటి అధిక ఖచ్చితత్వం కలిగిన భాగాలు అవసరం. అవన్నీ కూడా స్వదేశీయంగా తయారవుతాయి.
సంక్షిప్తంగా చెప్పాలంటే, భారత్ ఇప్పుడు కేవలం అసెంబుల్ చేసే దేశం మాత్రమే కాకుండా, అధునాతన యంత్రాలను స్వయంగా తయారు చేసే దేశంగా మారుతోంది. ప్రస్తుతం ఇది చిన్న అడుగులా కనిపించినా, రాబోయే రోజుల్లో సెమీకండక్టర్ మరియు అధునాతన తయారీ రంగంలో ఇది భారత్‌కు చాలా పెద్ద బలం అవుతుంది.
ఈ పరిశ్రమకే అశ్వనీ వైష్ణవ్ గారు ఈ మధ్య వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.
.....చాడా శాస్త్రి...
#సోనియాగాంధీ_పుస్తకం _వాస్తవాలు -1
చరిత్రలో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా లేదు, మీడియా ఇప్పుడు ఉన్నంత ఎక్కువగా ��ప్పుడు ఉండేది కాదు. కాబట్టి నెహ్రూ, ఇందిరా, సంజయ్, రాజీవ్, సోనియా రాజ్యాంగ వ్యవస్థలను వాడుకున్న తీరు, నడిపిన వ్యవహారాలు, డీల్స్, ప్రైవేట్ వ్యవహారాలు పబ్లిక్ కి ఎక్కువగా తెలిసేవి కాదు. అవి ఈ తరానికి తెలియదు కాబట్టే ఇప్పుడు వ్యవస్థ లు బాగాలేవు, పారదర్శకత లేదు, పాలన నియంతల పాలనలా ఉంది అంటూ మాట్లాడుతున్నారు. వాటిని అలా వదిలేసి ఉంటే కాంగ్రెస్ కి సోనియా కుటుంబానికి కూడా గౌరవం గా ఉండేది. ���ానీ, తన గొప్పతనం, తన భర్త, అత్తగారు గొప్పతనం చెప్పుకోడానికి , సంజయ్ ని ఇతరులను దోషులుగా చూపిస్తూ సోనియా కొత్త పుస్తకం రాశారు.
సో దానిలో రాసిన విషయాలు మీద సహజంగానే చర్చ జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్. లేపి తన్నించుకోవడం అంటే దీనినే అంటారు.
ఇప్పుడు మరుగున పడ్డ నిజమైన కధలు అన్ని బయటకు వస్తాయి.
సోనియా గాంధీ తాజా పుస్తకం విడుదల సందర్భంగా ఆమె దానిలో రాసిన విషయాలను తప్పు పడుతూ లేదా విమర్శిస్తూ వస్తున్న కథనాలను నేను ఈ రోజు నుండి వరుసగా ఒక సీరీస్ రూపంలో తెలుగులో రాస్తాను. దానిలో ఈ రోజు మొదటి పోస్ట్ ఇది.
సోనియా గాంధీ తాజా పుస్తకం ప్రకారం మరియూ గతంలో పలు సందర్భాల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్వభావరీత్యా ప్రైవేట్ వ్యక్తి అని, ప్రొఫెషనల్ పైలట్‌గా ఉండటాన్ని ఎంతో ఇష్టపడేవారని అధికార వ్యవ���ారాలు, రాజకీయాలు, ఎన్నికల వ్యవహారాలపై ఆయనకు ఆసక్తి లేదని రాశారు.
సోనియా తాజా పుస్తకం లో 1975–77 ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ వ్యవహారశైలి, అధికార దుర్వినియోగం పట్ల రాజీవ్ తీవ్ర ఆగ్రహంతో ఉండేవారని, సంజయ్ చర్యల వల్లే ఇందిరా గాంధీకి ఆ దుస్థితి వచ్చిందని ఆయన భావించినట్లు పుస్తకంలో వెల్లడించారు. 1980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత, ఒంటరైన తల్లి ఇందిరా గాంధీకి బాసటగా నిలవడానికే రాజీవ్ అయిష్ట��గానే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని సోనియా వివరించారు.
అంటే రాజీవ్ మంచి బాలుడు, అమాయకుడు.
సంజయ్ గాంధీ యే అన్ని చేసాడు అని రాశారు.
అయితే, అప్పటి ఎమెర్జెన్సీ షా నివేదిక, అధికారిక పత్రాలు, యుఎస్ వికీలీక్స్ విడుదలలు దీనికి భిన్నంగా రుజువులు బయటపెట్టాయి.
2013లో వికీలీక్స్ విడుదల చేసిన ‘కిస్సింజర్ కేబుల్స్’ (Kissinger Cables) ఆధారంగా, ఎమర్జెన్సీ కాలంలో విమానాల కొనుగోలు ఒప్పందాలలో రాజీవ్ గాంధీ పాత్ర, దీనికి సంబంధించిన ఆధారాలపై షా కమిషన్ నివేదిక వెల్లడించిన అంశాలను ఉటంకిస్తూ ఓపెన్ మ్యాగజైన్ (Open Magazine) లో బీజేపీ బద్ధ వ్యతిరేక పాత్రికేయుడు హర్తోష్ సింగ్ బాల్ (Hartosh Singh Bal) "Rajiv Gandhi: Middleman?" అంటే రాజీవ్ గాంధీ మధ్యవర్తిగా వ్యవహరించారా అనే విశ్లేషణాత్మక కథనాన్ని రాశారు.
ఆ కథనంలోని ప్రధానాంశాలు:
1. 1970లలో రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రాకముందు ‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’లో కమర్షియల్ పైలట్‌గా ఉండేవారు. ఆ సమయంలో విమానాల కొనుగోలు ఒప్పందంలో ఆయన మధ్యవర్తిగా లేదా ప్రతినిధిగా వ్యవహరించారని యూఎస్ రాయబార కార్యాలయ అంతర్గత కేబుల్స్ (వికీలీక్స్) పేర్కొన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను ఖండించింది; వికీలీక్స్ కేబుల్స్ ఆధారాల్లేనివని కొట్టిపారేసింది.
అయితే కేవలం వికీలీక్స్ మాత్రమే కాకుండా, ఎమర్జెన్సీ అక్రమాలపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన షా కమిషన్ (Shah Commission) నివేదిక లోనూ స్వతంత్ర ఆధారాలు ఉన్నాయని హార్స్ హర్తోష్ సింగ్ బాల్ తన వ్యాసం లో పేర్కొన్నారు.
2. ఇండియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 ఒప్పందం
1976–77 ఎమర్జెన్సీ కాలంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ కోసం మూడు బోయింగ్ 737 విమానాలను కొనుగోలు చేసే ప్రక్రియలో అనేక నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని షా కమిషన్ గుర్తించింది.
ఈ పోటీలో ��ోయింగ్ 737తో పాటు బ్రిటిష్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (BAC 111), డచ్ ఫోకర్ (Fokker F-28) విమానాలు ఉన్నాయి.
3. రాజీవ్ గాంధీ ప్రమేయంపై షా కమిషన్ ప్రకారం
నిబంధనలకు వ��రుద్ధంగా సమావేశం జరిగింది అని, 1976 సెప్టెంబర్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ తాత్కాలిక చైర్మన్ ఎ.హెచ్. మెహతా కార్యాలయానికి పైలట్‌గా ఉన్న రాజీవ్ గాంధీ వెళ్లారు అని, అక్కడ ఎయిర్‌లైన్స్ ఫైనాన్స్ డైరెక్టర్ కిర్పాల్ చంద్ ద్వారా గోప్యమైన ఆర్థిక అంచనాలను (Financial Projections) రాజీవ్ గాంధీకి చూపించారు అని షా నివేదిక పేర్కొంది.
ఇది సాధారణ నిబంధనలకు, అధికారిక విధానాలకు పూర్తిగా విరుద్ధంగా ఈ చర్య జరిగిం���ని షా కమిషన్ తప్పుబట్టింది. ఆ సమావేశంలో ఎవరు ఎవరిని పిలిపించారనే విషయంలో అధికారుల వాంగ్మూలాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి.
1/2