విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం
తిరుపతి, జూన్ 22: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంస్థ సిఎండి శివశంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం 'డయల్ యువర్ సిఎండి' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏపీఎస్పీడీసీఎల్ లో ఘనంగా యోగా దినోత్సవం
తిరుపతి, జూన్ 21: నేటి సమాజంలో మానవుని దైనందిన జీవితంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఫీడర్ లెవల్ సోలరైజేషన్ లో భాగంగా పీఎం-కుసుమ్ పథకం కింద గూడూరు డివిజన్ లోని మద్దాళి గ్రామంలో అభివృద్ధి చేస్తున్న సౌర విద్యుత్ ప్రాజెక్టు స్థలాన్ని బుధవారం APSPDCL సిఎండి శివశంకర్ లోతేటి పరిశీలించారు. కడివేడు వద్ద జరుగుతున్న 132 కెవి సబ్-స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని గోదాముల్లో విద్యుత్ పరికరాల నిర్వహణ కీలకమని ఆ సంస్థ సిఎండి శివశంకర్ లోతేటి తెలిపారు. గూడూరు డిస్ట్రిక్ట్ స్టోర్స్ ను బుధవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు.
అర్హులందరికీ రూఫ్ టాప్ సోలార్
తిరుపతి, జూన్ 15: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు.
రేపు 'డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి'
తిరుపతి, జూన్ 14: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 15వ తేదీన ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గం||ల వరకు 'డయల్ యువర్ సిఎండి' (8977716661) కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది.
ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివశంకర్ లోతేటి, ఐఎఎస్ ఆదివారం వెదుళ్ళచెరువు గ్రామంలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ కు గ్రిడ్ తో అనుసంధాన ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్(ప్రాజెక్ట్స్, ఐటి)పి. అయూబ్ ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. ఉమాపతి పాల్గొన్నారు
ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి 'డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి' కార్యక్రమాన్ని నిర్వహించారు.