సి.ఆర్.మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ ల ఆధ్వర్యం లో "డిప్లమో కోర్సు ఇన్ జర్నలిజం" (డి.సి.జె.) తరగతులు 28.09.26 నుండి ప్రారంభం.
ప్రారంభించిన వారు: సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్
కోర్సు డైరెక్టర్: ప్రొ. బాబీవర్ధన్
సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 3, 4 తేదీల్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్ లో జిల్లా గ్రామీణ విలేఖరుల పునశ్చరణ తరగతుల నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు పునశ్చరణ తరగతులు ప్రారంభమౌతాయన్నారు.
నెల్లూరు జిల్లా గ్రామీణ జర్నలిస్టుల పునశ్చరణ తరగతుల” కార్యక్రమం జిల్లా పరిషత్ మీటింగ్ హాలు, జిల్లా కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో సి.ఆర్. మీడియా అకాడమీ నిర్వహించింది. ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా,అధ్యక్షులు ఆలపాటి సురేశ్ కుమార్.
సి. ఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జడ్. పి. మీటింగ్ హాల్ లో యీ నెల 5, 6 తేదీల్లో జరుగనున్న “గ్రామీణ విలేఖరుల పునశ్చరణ తరగతులలో” రాష్ట్ర పురపాలక, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి శ్రీ పి. నారాయణ, జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా లు పాల్గొంటారు.విలేఖరులు పాల్గొనాలని విజ్ఞప్తి.
సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామీణ విలేఖరులకు సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రెండు రోజులపాటు నెల్లూరు "జిల్లా పరిషద్ మీటింగ్ హాల్”లోపునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. .రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్:
https://t.co/hM1cduT1Rk
సి.ఆర్.మీడియా అకాడమీ, ఏపి స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరర్ కమీషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో 187 వ ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవ వేడుకల అవార్డుల ప్రధానోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్మలిస్టుల అసోసియేషన్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం (25.08.26) ఘనంగా నిర్వహించారు.
Diploma in Journalism Course” కు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 5 వ తేదీ వరకు పొడిగింపు.
సి.ఆర్. మీడియా అకాడమీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లు సంయుక్తంగా నిర్వహించే Diploma in Journalism Course కు దరఖాస్తు చేసుకోవడానికి గడువును వొచ్చే నెల (సెప్టెంబర్) 5 వతేదీ వరకు గడువు పొడిగించారు
దరఖాస్తు తో సాధారణ గ్రాడ్యుయేట్లు జతపరచవలసిన ధ్రువ పత్రాలు:
డిగ్రీ సర్టిఫికేట్, సెక్రెటరీ సి.ఆర్.మీడియా అకాడమీ పేరున తీసిన రూ.2500/- డిమాండ్ డ్రాఫ్ట్
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: సెక్రెటరీ, సి.ఆర్. మీడియా అకాడమీ, 40-6/4-8, 4 వ అంతస్తు, రెవెన్యూ కాలనీ, మొగల్రాజపురం, విజయవాడ -10
సి.ఆర్. మీడియా అకాడమీ అందిస్తోన్న"జర్నలిజం లో డిప్లొమా కోర్సు" ప్రత్యేకతలు
నామమాత్ర ఫీజు : 1. జర్నలిస్టులకు రూ. 2000/-
సాధారణ గ్రాడ్యుయేట్లకు : రూ. 2500/
కోర్సు వ్యవధి: 6 నెలలు
కోర్సురూపకల్పన: ఒంగోలు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ V. C డి.వి.ఆర్.మూర్తి ఆధ్వర్యంలో బోర్డు ఆఫ్ స్టడీస్"
దరఖాస్తు తో జర్నలిస్టులు జతపరచవలసిన ధ్రువ పత్రాలు:
ఇంటర్ మీడియట్ సర్టిఫికెట్, అక్రిడిటేషన్ కార్డు లేదా ఐ.డి.కార్డు లేదా సర్వీసు ధ్రువీకరణ పత్రం జెరాక్స్ కాపీ లను సెక్రెటరీ, సి.ఆర్. మీడియా అకాడమీ పేరున తీసిన రూ..2000/- డిమాండ్ డ్రాఫ్ట్
డిప్లమో ఇన్ జర్నలిజం కోర్సు లో ప్రవేశానికి సి. ఆర్. మీడియా అకాడమీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 6 నెలల వ్యవధిగల ఈ కోర్సు జర్నలిస్టుల వృత్తి పరమైన నైపుణ్యాలను పెంచుతుంది. సి.ఆర్.మీడియా అకాడమీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లు ఒప్పందం చేసుకున్నాయి.
సి.ఆర్.మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ : రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛ ఉన్నతమైంది. ఆర్టికల్ 19 (1) లోపత్రికా స్వేచ్ఛ దీనికి అతీతం కాదని మీడియా గమనించాలి. పాత్రికేయులుగా పౌరుల స్వేచ్ఛను గౌరవిస్తూనే సామాజిక శ్రేయస్సుకు దోహదం చేసే వార్తలు రాయాలి.
పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ విలేఖరుల రెండు రోజుల పునశ్చరణ తరగతుల ముగింపు సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడుపాల్గొని ప్రసంగించారు.
సామాజిక సేవ చేయాలనే తపన వున్న పాత్రికేయ వృత్తి పవిత్రమైనది. నైపుణ్యంతో పాటు, ఎప్పటికప్పుడు జర్నలిస్టులు తమ పరిజ్ఞానాన్ని పెంచు కోవాలి.
.
పాలకొల్లు “కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్” లో సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో2026 జూన్ నెల 27, 28 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు. పాల్గొన దలచినవారు తమ వివరాలు ఈ నెల 26 వ తేదీ లోపు https://t.co/FsrndU0qjA లో నమోదు చేసు కోవాలి .
సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా సోమవారం (జూన్ 1 న) తేళ్ల కస్తూరి బాధ్యతలు చేపట్టారు. అకాడమీ మేనేజర్ శ్రీ ఎం. భాస్కర నారాయణ అకాడమీలో అమలవుతోన్న పలు కార్యక్రమాలను సెక్రెటరీ తేళ్ల కస్తూరి కి వివరించారు