శ్రీశైలంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం మూడవ రోజు ఘనంగా నిర్వహించారు. వరుణ జపాలు, పంచాక్షరీ జపం, వారుణానువాక పారాయణం, విరాటపర్వం పారాయణం చేపట్టారు. ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. 🙏
#Srisailam#VarunaYagam#RainPrayers
📍 **కోనసీమ తిరుమల – వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం**
ప్రతి శనివారం ఉదయం **3:00 గంటలకు** స్వామివారికి నిర్వహించే **సుప్రభాత సేవ** ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతుంది.
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి మూడు రోజుల పాటు శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పచ్చని ఆకుకూరలు,కూరగాయలు, పండ్లు, పూలతో అలంకరించిన అమ్మవారి దివ్య స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు