ఒకటే యూనిఫాం-వేర్వేరు న్యాయాలు:
ఈ నెల 11 వ తేదీన,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామ శివారులో గల అడవిలో, వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ‘విధి నిర్వహణలోనే’ బానోత్ నవీన్ అనే బీట్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు.
జిల్లా అటవీ అధికారులంతా అంత్యక్రియలకు వచ్చి ఘనంగా నివాళులు అర్పించారు. అటవీ శాఖ మంత్రి సురేఖ గారు కూడా అధికారికంగా నవీన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కానీ అటవీ మంత్రి కొండా సురేఖ గారు ఛీఫ్ సెక్రటరీ కి అధికారిక లాంఛనాలతో (Tribute of Honour) అటవీ అమరవీరుడు బానోత్ నవీన్ అంత్యక్రియలు జరపాలని లేఖ రాసినా మరీ ప్రభుత్వం స్పందించలేదు!!
లేక ఎందుకు?
మంత్రి సురేఖ గారి మీద కోపమా?
నవీన్ బంజారా బిడ్డ అయినందుకా?
కింది స్థాయి అధికారులంటే చిన్న చూపా?
ఎందుకు అటవీ శాఖ పై ఈ సవతితల్లి ప్రేమ?
లేక క్షుద్ర పూజల్లో బిజీగా ఉన్నారా?
కానీ...
గతంలో విధి నిర్వహణలో మరణించిన పోలీసు కానిస్టేబుల్స్ సౌమ్య కుటుంబానికి మరియు ఎంపల్లి ప్రమోద్ కుమార్ ల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా,ఇంట్లో ఒకరికి ఉద్యోగం,ఇంటి స్థలం ఇచ్చారు. ముఖ్యమంత్రి-హోంమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెక్కులు అందజేశారు.
మరి బానోత్ నవీన్ కుమార్ ఏం పాపం చేశాడు? ఆయన కూడా యూనిఫాం ఏసుకున్న ఉద్యోగే కదా! ఆయన కూడా ఈ రాష్ట్రంలో అటవీ,పర్యావరణ పరిరక్షణ కోసమే పనిచేశాడు కదా.
పోలీస్ డిపార్టుమెంట్ కి ఒక న్యాయం,ఫారెస్ట్ డిపార్టుమెంట్ కి ఇంకో న్యాయం ఉంటదా? ఇది వివక్ష కాదా?
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబానికి,ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆశించాం. కానీ ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం.
రేవంత్ రెడ్డి గారు, అటవీ అధికారులంటే ఎందుకంత చులకనభావం? మీరు ఇంత వివక్షాపూరితంగా వ్యవహరిస్తే నవీన్ లాంటి బీట్ ఆఫీసర్లు ప్రాణాలకు తెగించి ఎలా ఉద్యోగాలు చేస్తారు?
వెంటనే నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మంత్రి అధికారికంగా కోరినప్పటికీ అటవీ అమరవీరుడు బానోత్ నవీన్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు జరపలేకపోయారో హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఛీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు విజ్ఞప్తి:
మీకు ఎలాంటి అన్యాయం జరిగినా, మీకు ఎవరైనా అక్రమ ఆదేశాలు ఇచ్చినా మన తల్లి లాంటి @BRSparty దృష్టికి తీసుకురాండి. మీకు అండగా ఉండి న్యాయం జరిగేదాకా మేం పోరాడుతాం
✊🇮🇳🫡
@revanth_anumula@TelanganaCMO@TelanganaCS@iamkondasurekha@KTRBRS@BRSHarish@PTI_News@ANI@ians_india
Act now to store later.
Before the water from rains goes waste and erodes soil, a timely creation of low cost water harvesting structures to store it and recharge ground water is the need of the hour. Called locally as khals and khantis these were created under the guidance of local youth from #Uttarakhand Mr Chandan Nayal. Well done 👏 More power to you. Chandan
Are you going to create similar structures now to store rainwater during monsoon ?
This footpath abutting Siri Fort Jogging track Delhi dotted with thick trunks always fascinates me. My favourite morning walk location whenever possible in Delhi.
Earth means a beautiful world with trees and animals #earthday#EarthDay2025#DelhiForNature#ThickTrunkThursday #thicktrunk
@Anithareddyatp కాంపౌండింగ్ కి , లంచానికి తేడా తెలియకపోతే తెల్సుకోండి ముందు….
చట్టబద్ధంగా జరిమానా చెల్లించడాన్ని కాంపౌండింగ్ అంటారు…
wild life protection Act 1972 నీ కాసంత చదవండి ఇలాంటి post లు చేసేముందు…
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 29 కు వ్యతిరేకంగా గతకొద్ది నెలలుగా గ్రూప్ 1 అభ్యర్థులతో పాటు చాలామంది ఆందోళన చేస్తున్నా ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా స్పందించలేదు.సమస్యను వివరించలేదు. కొందరు విశ్లేషకులు రాసినా ప్రచురించలేదు. దిశ కథనం ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన జీవో వారికే అర్థం కాలేదు. కోర్టులకు కూడా జీవో ఆంతర్యం బోధపడలేదు. ఫలితంగా ఈ గందరగోళం.
ఈ జీవో మూలంగా మెరిట్ కలిగిన బీసీ,ఎస్సీ, ఎస్టీ లకు, మొత్తంగా రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్ లు పొందుతున్న అభ్యర్థులకు నష్టం కలుగుతుంది అనేది వాస్తవం. ఎలాగంటే దీని ప్రకారం అభ్యర్థి మెరిట్ తో, మార్కులతో, ర్యాంక్ తో సంబంధం లేకుండా కేవలం కులం ఆధారంగానే అభ్యర్థులను గుర్తించడం, ఈ జీవో ను అనుసరించి ఫైనల్ అండ్ మెయిన్స్ పరీక్షకు అభ్యర్థి సాధించిన మెరిట్ ప్రమేయం లేకుండా కేవలం కులం, జెండర్ తదితర అంశాల ప్రాతిపదికనే ఎంపికచేశారు. దానివల్ల రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందే వారికి నష్టం జరిగిందని, పోటీకి ఎంపిక కావలసిన నిష్పత్తిని మించి అగ్రకులాల వారికి లబ్ధి జరిగిందని వస్తున్న విమర్శల్లో హేతుబద్ధత ఉంది. ఎలాగంటే ఏ పోటీ పరీక్ష అయినా మెరిట్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అందుకే ప్రతి స్థాయిలో కూడా అభ్యర్థుల ఎంపికలో ఈ రెండు ప్రాతిపదికలు ఆధారంగానే అభ్యర్థుల వడపోత జరుగుతుంది. పాత జీవో 55 ఇదే పద్ధతిలో అన్ని స్థాయిల్లో ప్రాథమిక, అంతిమ పరీక్షల్లో అభ్యర్థులను మెరిట్ కమ్ రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎంపిక చేసేది. ఎప్పుడైనా ఎంపిక రెండు దశల్లో ఉంటుంది అందులో ఒకటి మెరిట్ అంటే కేవలం మార్కుల ఆధారంగా, దీనిని మనం ఓపెన్ కంపిటేషన్ అంటున్నాం, మాములు పరిభాషలో OC లు. రెండోది రిజర్వేషన్ లు, ఇప్పుడున్న రిజర్వేషన్ విధానంలో EWS కలిపి 60 శాతం వదిలేసి మిగితా 40 శాతం అభ్యర్థులను OC లు గా పరిగణించి కేవలం మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఉదాహరణకు వంద ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తే 1:50 ప్రకారం 5000 మందిని పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మెయిన్ పరీక్షకు పిలవాలి. ఈ వంద ఉద్యోగాల లో 40 ఓపెన్ కోటా ఉద్యోగాలకు కావాల్సిన 2000 మంది అభ్యర్థులను మెరిట్ ఆధారంగా పరీక్షకు పిలుస్తారు. అందులో ఎక్కువ మార్కులు లేదా కట్- ఆఫ్ కు పైన ఉన్న అందరూ ఉంటారు. వారి కులం, జెండర్ ఇతర స్టేటస్ లతో సంబంధం లేదు. సాధారణంగా ఏ పరీక్షలో అయినా ఈ ప్రతిభా వంతులలో 80 శాతం పైగా BC SC ST లు ఉంటుంటారు. ఇదే ఉదాహరణతో విశ్లేషిస్తే దాదాపు 40 మందిలో 30-35 మంది దాకా ఈ వర్గాల నుంచి ఎంపిక అవుతారు. ఆ తరువాత రిజర్వేషన్లలో 50 శాతం BC SC ST లు ఉన్నందున 2500 మందిని ఓపెన్ కేటగిరీ కంటే దిగువన ఉన్న వారిని ఎంపిక చేస్తారు అలాగే10 శాయమంటే 500 మందిని అగ్రవర్ణ పేదలను ఎంపిక చేస్తారు. పాత పద్ధతిలో ఈ ప్రాతిపదికను పాటించే రావారు. అలా చేయడం వల్ల మెరిట్, రిజర్వేషన్ రెండింటిలో వెనుకబడిన వర్గాలవారికి న్యాయబద్ధమైన వాటా దక్కేది. ఇప్పుడు తెచ్చిన కొత్త జీవో మూలంగా మెరిట్ పరిగణన లోకి రాక రిజర్వేషన్లలో రావాల్సిన వారికి అవకాశం లేకుండా పోయింది. అలాగే ప్రతిభా వంతులైన వారిని కూడా కులం కోటాలో లెక్కించడం వల్ల వారి స్థానంలో అగ్రకులాలకు ఆయాచిత అవకాశం వచ్చిందని ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి, రాజ్యాంగ లక్ష్యానికి విరుద్ధం అని అభ్యర్థులు అంటున్నారు. అందులో వాస్తవం ఉంది. ఇప్పుడు దాదాపుగా ఈ వంద మందిలో EWS తో కలిపితే 60 శాతం మంది అగ్రకులాల వాళ్ళు మెయిన్స్ రాస్తారు. మిగితా 90 శాతం మంది (BC SC స్ట్ లు)40 శాతంలో ఉంటారు. ఇదే అభ్యర్థుల ఆందోళన. ఈ విషయాన్ని ఉద్యమం ప్రభుత్వానికి అర్థం చేయించలేక పోయింది. ఎప్పుడైనా సరే వినడానికి సిద్ధంగా ఉంటే తప్ప చెప్పేవిషయం అర్థం కాదు. జీవో జారీ చేసిన అధికారులకంటే ముందే నిరుద్యోగులకే ఈ జీవో అర్థమయ్యింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్థమయ్యింది. అర్థం కానిదల్లా ప్రభుత్వానికే.!
విచిత్రం ఏమంటే ఫైనల్ సెలెక్షన్లో రోస్టర్ పాటిస్తాం అంటున్నారు. దళిత బహుజన వర్గాలను మెరిట్ గుర్తించకుండా వారిని కులం కోటాకు పరిమితం చేసి, పోటీని పరిమితంచేసి రేపు ఫైనల్ లో కోటా పాటిస్తామంటే ఎట్లా? ఇదెక్కడి న్యాయం అన్నది బాధితుల ప్రశ్న.
గ్రూప్-1 పరీక్ష, జీవో 29 మీద ఈ రోజు సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రెస్ మీట్ అంతా పచ్చి అబద్దాల పచ్చడి. ఎలాంటి ప్రూఫ్ రీడింగ్ కూడా చేయకుండా రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ ను మహేష్ గారు చదివారు. దీనికి మా సమాధానం ఈ వీడియో. దయచేసి అందరికి చేరేలా చూడండి. రేవంత్ రెడ్డి గారికి కూడా.
అశోక్ నగర్లో ఉద్రిక్తత..!
అశోక్‌నగర్‌లో రోడ్డెక్కిన గ్రూప్ వన్ అభ్యర్థులు..
పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకున్న నిరుద్యోగులు..
నిరుద్యోగులకు మద్దతు పలికిన ప్రతిపక్ష పార్టీలు..
పరీక్షలు వాయిదా వేయాలి, జీవో 29 రద్దు చేయాలని డిమాండ్..
What kind of efficiency is this, #TGPSC? You have scheduled Main Exam tomorrow (21st October 2024) at 230PM onwards and only yesterday some candidates in sports quota were informed that they can download hall tickets and appear for exam!! This is heights of nonsense.
How on the earth they prepare for exam in just 48 hours? God knows how many such last minute adjustments you may have resorted to!
#ScrapGO29
#TgpscGroup1
Congress in Telangana has opened Nafrat ka Bazaar under the guise of Indiramma Rajyam..
If this suffering doesn’t move you, is the Congress govt even “for the people”? Is this the Praja Palana?
You have no right to talk about reconstruction of state when the future generation is weeping in the streets, facing lathis and brutality.
నాకు చావే దిక్కు అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన గ్రూప్స్ అభ్యర్థి.
రెండు సంవత్సరాల నుండి తెలుగు అకాడమి బుక్స్‌తో చదువుకున్నా.. ఇప్పుడు తెలుగు అకాడమి బుక్స్ చెల్లవు అని అంటున్నారు.
ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారింది.
జీవో 29 రద్దు చేసి, గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో మాట్లాడిన సంఘటన నాకు గుర్తుకువస్తున్నది.
అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే, భవిష్యత్ ప్రభుత్వ అధికారులయ్యే విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావు. వారిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో పెట్టే దుస్థితి వచ్చేది కాదు. వారి బతుకు, భవిష్యత్తు నడిరోడ్డు మీద పడేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలకు పెను శాపంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా లభించే హక్కులను, అవకాశాలను జీవోల పేరుతో కాలరాయడం దుర్మార్గం. న్యాయం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరిని చూస్తే ఆవేదన కలుగుతున్నది.
ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భేషజాలు పక్కనబెట్టి జీవో నెంబర్ 29 ను తక్షణం రద్దు చేసి, గ్రూప్స్ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO@Bhatti_Mallu
#CongressFailedTelangana
#CongressCheatsUnemployed
Telangana is on boil.
Students, aspiring for recruitment in Group 1 (of Telangana State Public Service Commission) are protesting the arbitrary, last minute change in syllabus, and Telangana Govt’s insistence to hold the exam, despite a pending court judgment, expected on 20th Nov 2024, which could impact the reservation framework and put those from the SC, ST, OBC and EWS section at a disadvantage.
The Congress Govt has ordered brutal crackdown on peacefully protesting students, leading to illegal arrests, intimidation and injuries.
Rahul Gandhi, who is known to champion fake causes, is missing when a Congress Govt is targeting students and clamping down on their legitimate right to be heard in a democracy.