మంత్రి గారికి పని తక్కువ.. ప్రచార ఆర్భాటం ఎక్కువ ఉన్నట్టుంది!
సమస్యను వదిలేసి కేవలం ఫోటో, వీడియో కోసం వచ్చినట్టు కనిపిస్తుంది.
సొంత ఫోటోగ్రాఫర్ తో ఏ యాంగిల్ లో ఫోటో, వీడియో తీయాలో తానే స్వయంగా డైరెక్షన్ ఇస్తున్నాడు.
ఢిల్లీలో విద్యార్థి, యువతపైన కేంద్ర ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
ఢిల్లీలో విద్యార్థులు, యువతపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యానికి, అణిచివేతకు వ్యతిరేకంగా BRSV రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్దఎత్తున పాల్గొనబోతున్నారు.
విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా BRSV చేపట్టే ఈ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు హాజరుకానున్నారు.
రేవంత్ రెడ్డికి, రామన్న మాస్ కౌంటర్ 🔥🔥🔥
తెలంగాణలో ఉన్నవి రెండే రెండు జాతులు.. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి!
ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి మాది కాదు!
వలస పాలకుల సంక నాకుతూ, సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు!
ఎమ్మెల్యేల కొనుగోలు కోసం లంచాల కేసుల్లో దొరికిపోయిన లుచ్ఛా జాతి మాది కాదు!
సాగునీటి ప్రాజెక్టులపై వందల కేసులు వేసి తెలంగాణ అభివృద్ధిని ఆపాలని చూసిన దివానాగాళ్ల బ్యాచ్ మాది కాదు
అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజలను రెచ్చగొట్టే చిల్లర జాతి మాది కాదు!
ప్రాజెక్టులను బాంబులతో పేల్చేస్తామని మాట్లాడే అధమ జాతి మాది కాదు!
నీళ్లు ఉన్నా, ఇచ్చే వ్యవస్థ ఉన్నా.. జనాలకు అందించలేని అసమర్థ జాతి మాది కాదు!
ఉద్యోగాలు అడిగితే 'ఎండ్రిన్ తాగు, బావుల్లో దుంకు' అని మాట్లాడే రాక్షస జాతి మాది కాదు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న 🔥
కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డులు కళాకారులకు స్ఫూర్తి.. కళను ప్రోత్సహించడం సమాజ బాధ్యత: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్ 2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం. నారు, ఆర్టిస్టు విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాజకీయ జీవితంలో ప్రతిరోజూ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య గడుపుతున్న తమకు ఇలాంటి ఆహ్లాదకరమైన సాహిత్య, కళా వేదికల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులతో మమేకమయ్యే అవకాశాలు అరుదుగా వస్తాయని, అలాంటి సందర్భాలు పాత జ్ఞాపకాలను, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తాయని చెప్పారు.
కార్టూనిస్టుల పాత్రపై మాట్లాడిన కేటీఆర్, "ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం" అనే సూక్తిని ప్రస్తావిస్తూ, సమాజం, రాజకీయాలపై కార్టూన్లు చూపే ప్రభావం ఎంతో గొప్పదని అన్నారు. భారతదేశంలో ఆర్.కే. లక్ష్మణ్ వంటి మహోన్నత కార్టూనిస్టులు చూపిన మార్గం చిరస్మరణీయమని, అంతర్జాతీయంగా బిల్ వాటర్సన్ సృష్టించిన క్యాల్విన్ అండ్ హాబ్స్ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తెలుగులో ఈనాడు శ్రీధర్, సాక్షి శంకర్ వంటి కార్టూనిస్టుల ప్రతిభను ప్రశంసించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మా గాంధీ విలువలు, ఆయన చూపిన సిద్ధాంతాల అవసరం దేశానికి మరింత పెరిగిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మత విశ్వాసాలు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనవేనని, పరస్పర గౌరవంతో ముందుకు సాగడం సమాజానికి అవసరమని పేర్కొన్నారు.
జీవితంలో గెలుపు, ఓటములు సహజమని, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మేలు చేయడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యమని కేటీఆర్ అన్నారు. కళను ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు తప్పనిసరి అని పేర్కొంటూ, ప్రతిభావంతులైన యువ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని చెప్పారు.
శేఖర్ కుటుంబ సభ్యులు, మిత్రులు గత ఆరేళ్లుగా ఆయన స్మారకార్థం అవార్డులను అందించడం అభినందనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కార్టూనిస్టుగా శేఖర్ విశిష్ట సేవలు అందించారని, సమకాలీన అంశాలపై ఆయన వేసిన కార్టూన్లు ప్రత్యేక గుర్తింపు పొందాయని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన గీసిన కార్టూన్లు ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాయని, ఆయన ప్రస్థానం నేటి తరం కార్టూనిస్టులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
శేఖర్‌ను వ్యక్తిగతంగా కలిసే అవకాశం రాకపోయినా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లు ఆమోదమైన రోజున గన్‌పార్క్‌కు వెళ్లి తెలంగాణ సాధనను చూసి ఆనందించిన సంఘటన తనను ఎంతో కదిలించిందని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. జూన్ 2, 2014కు ముందే ఆయన మరణించడం దురదృష్టకరమన్నారు.
వచ్చే ఏడాది నుంచి శేఖర్ మెమోరియల్ అవార్డులను మరింత ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్‌కు బదులుగా రవీంద్రభారతిలో మరింత వైభవంగా కార్యక్రమం నిర్వహించేలా అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. కళాకారులు, రచయితలు సమాజానికి అందిస్తున్న సేవలను ఎల్లప్పుడూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రేవంత్ రెడ్డి 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా
అవసరమైతే రాహుల్ గాంధీకి జై కొడతా.. రుజువు చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి?
- కేటీఆర్
తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్.
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం.. కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం.. బిజెపి , కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయి.
కేసీఆర్ నాయకత్వంలో సింగరేణిని లాభాల బాట పట్టించాం.. సింగరేణిలో కారుణ్య నియామకాలను కేసీఆర్ ఇచ్చారు..
జీవో 76 క్రింద వేలాది కుటుంబాలకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది.
ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేసీఆర్ కృషి ఉంది.
గనుల వేలానికి సంబంధించిన ఎంఎంటీఆర్ బిల్లును నేను ఎంపీ గా వ్యతిరేకించా..
బీ ఆర్ ఎస్ ఆ చట్టానికి వ్యతిరేకంగా లోకి సభ నుంచి వాకౌట్ చేసింది..
సింగరేణిని వేలం పాట పెడితే సింగరేణి నష్ట పోతుందని ఆనాడే రాజ్యసభలో మా పార్టీ తరపున ఆనాడు కేశవరావు మాట్లాడిండు.
సింగరేణి బొగ్గు బావులను వేలం వేయొద్దని ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాశారు.
కేసీఆర్ నాయకత్వంలో సింగరేణినీ సిరుల గనిగా ఉంచారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో కుంభకోణాలకు అడ్డాగా మారిపోయింది.
సైట్ విజిట్ సర్టిఫికెట్ తో OB టెండర్ లో కుంభకోణం చేశారు.
42 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు 16 వందల కోట్ల రూపాయల కుంభకోణం.
కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో సింగరేణిలో మొత్తం 16 వేల కోట్ల కుంభ కోణాలు జరిగాయి
మా నాయకుడు హరీష్ రావు బొగ్గు నిల్వల చూసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ వచ్చిన తరువాత సింగరేణిలో డీజిల్ కుంభకోణానికి తెరలేపారు.
పంపకాల విషయంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య పంచాయతీ.
ఆ తర్వాత నైని బొగ్గు బ్లాక్ టెండర్ ను రద్దు చేశారు.
బడే బాయ్, చోటే బాయ్ మధ్యలో మిడిల్ బాయ్ కిషన్ రెడ్డి .అందరు కలిసి సింగరేణి ని ముంచుతున్నారు
తాడిచర్ల బొగ్గు బ్లాక్ 2 ను సాధించామని బిజెపి, కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటున్నారు.
మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద NDSA ను పంపారు
సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాల పై CBI ఎందుకు రావడం లేదు.
ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి సింగరేణిలో వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారు.
ఆధారాలతో సహ మా నాయకుడు హరీష్ రావు సింగరేణి కుంభకోణం బయటపెడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బాయి బాయి అందుకే సింగరేణిలో కుంభకోణాలకు పాల్పడుతున్నారు.
సింగరేణిలో జరుగుతున్న అవినీతి కిషన్ రెడ్డికి ఎందుకు కనిపించడం లేదు.
అన్ని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను సింగరేణి సంస్థకే అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము
ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్ లను నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో చెన్నూరులో బిఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకు బతుకుతెరువు కల్పించాం. కానీ రేవంత్ రెడ్డికి ఆ కాన్సెప్టే అర్థం కాలేదు.
నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్టగొట్టొద్దని అసెంబ్లీలోనే వేడుకున్నా వినలేదు.
ఇవాళ కేసీఆర్ కిట్, బతుకమ్మ చీర, పిల్లల బ్రేక్‌ఫాస్ట్, రైతుబంధు.. ఇలా అన్నీ బంద్ చేశారు!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, అసలు వాస్తవాలను ఎందుకు దాచిపెడుతోంది? ?
గత ఏడాది సింగరేణికి రూ. 8,300 కోట్ల లాభాలు వచ్చాయని చెబుతూనే, మళ్లీ ఎందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తోంది? అసలు లాభాలు వస్తుంటే ఓడీ (OD) సమస్య ఎందుకు తలెత్తుతోంది??
వచ్చిన లాభాలను సంస్థ అభివృద్ధికి వాడకుండా, నిధులను ఏ రకంగా వాడుకుంటున్నారు? బొగ్గు ఉత్పత్తి పెరిగిందని చెబుతూనే, సంస్థను అప్పుల ఊబిలోకి ఎందుకు నెట్టేస్తున్నారు??
నిజంగా లాభాల్లో ఉన్న సంస్థపై ఇన్కమ్ టాక్స్, కోల్ సెస్, మరియు డిఎంఎఫ్టి (DMFT) వంటి పన్నుల భారం ఎందుకు మోపుతున్నారు?? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లాభాలను డివిడెండ్ల రూపంలో పంచుతూ, సింగరేణిని ఆర్థికంగా ఎందుకు బలహీనపరుస్తున్నారు??
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
అన్న
నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించిన వేల కోట్ల అవినీతి ఆరోపణలు రాగానే గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేశావు. తప్పు లేకపోతే రద్దు ఎందుకు చేశావు? రద్దు చేసినా దానిపై విచారణ ఎందుకు జరిపించడం లేదు? ఎందుకంటే మొత్తం సింగరేణిని @gautam_adani కి కట్టబెట్టడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారు. మీ బావమరిది సృజన్ రెడ్డి కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడానికే ఈ కుట్రలన్నీ!
@KCRBRSPresident@revanth_anumula@KTRBRS@BRSHarish@balkasumantrs
సింగరేణిలో రూ.15,000 కోట్ల అవినీతి, దోపిడీపై ప్రశ్నించినందుకే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు బనాయింపు.
• @KTRBRS ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో బాల్క సుమన్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం.
• జైలు నిర్బంధాలతో ఉద్యమకారుల గొంతు నొక్కలేరు.. మర్డర్ సెక్షన్లు పెట్టినా బాల్క సుమన్ వెనక్కి తగ్గరు.
• తెలంగాణ ఉద్యమంలో వందల కేసులు ఎదుర్కొన్న బాల్క సుమన్‌కు జైలు కొత్త కాదని వ్యాఖ్య.
• జైలులోనూ పూర్తి ధైర్యంతో, రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారని బాల్క సుమన్‌పై శ్రవణ్ ప్రశంసలు.
• సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన డా. దాసోజు శ్రవణ్.
• ప్రతిపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా @revanth_anumula గారి పై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదు
• కాంగ్రెస్ నేతల బూతు వ్యాఖ్యలకు చట్టాలు వర్తించవా? అని నిలదీత.
• సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం వ్యవహారంపై జుడీషియల్ విచారణ డిమాండ్.
• రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు నిల్వలపై నిజాలు బయటపడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ.
• నైనీ బొగ్గు బ్లాక్‌ను రద్దు చేసినా విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్న.
• సింగరేణిని అదానీకి అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపణ.
• సృజన్ రెడ్డి వ్యాపార ప్రయోజనాల కోసమే సింగరేణిని వాడుకుంటున్నారని విమర్శ.
• 19,500 మంది సింగరేణి కార్మిక కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన.
• కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వెయ్యి రోజులు దాటినా ఒక్క మెడికల్ బోర్డు కూడా వేయలేదని విమర్శ.
• కారుణ్య నియామకాలపై విజిలెన్స్ పేరుతో కార్మికులను వేధిస్తున్నారని ఆరోపణ.
• జీఓ 76 ద్వారా లభించిన భూములను కార్మికుల నుంచి లాక్కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ.
• డీజిల్, జిలెటిన్ స్టిక్స్, ఓబీ వర్క్స్ కాంట్రాక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ.
• సింగరేణిలో మొత్తం రూ.15,000 కోట్ల దోపిడీ జరిగిందని డా. దాసోజు శ్రవణ్ ఆరోపణ.
• సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి.. ఎవరి జాగీరు కాదని స్పష్టం.
• కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందాలతో వ్యవహరిస్తున్నాయని విమర్శ.
• సింగరేణిని కాపాడుకోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజల బాధ్యత అని పిలుపు.
• అక్రమ కేసులతో ప్రజాస్వామిక స్వరాలను అణచివేయాలనే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరిక.
• “Every Day is Not a Sunday” అంటూ పోలీసులకు డా. దాసోజు శ్రవణ్ హెచ్చరిక.
• @balkasumantrs జైలు పాలైనా సింగరేణి పరిరక్షణ పోరాటం మరింత ఉధృతమవుతుందని స్పష్టం.
• సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
@KCRBRSPresident@TelanganaCMO@BRSHarish
👇👇Full Pressnote and Vedio are attached
నాడు ఎంతో ముందుచూపుతో
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో
పుట్టిన ప్రతి బిడ్డకు కేసీఆర్ కిట్ ఇచ్చి,
మగ బిడ్డ పుడితే రూ.12,000,
ఆడ బిడ్డ పుడితే రూ.13,000 ఇచ్చిన
నాయకుడు మన కేసీఆర్ గారు.
రెండేళ్లుగా ఈ పథకానికి
కాంగ్రెస్ అనే గ్రహణం పట్టుకుంది.
ఈ పథకాన్ని అమలు చేయడం లేదు.
గాంధీ ఆసుపత్రి బయట
కేసీఆర్ కిట్‌లో ఉండే వస్తువులు
షాపుల్లో అమ్ముతున్నారు..
ఇది కాంగ్రెస్ తెచ్చిన మార్పు!