పాలమూరు ఎంపీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో రూ.500 కోట్లకు పైగా కేంద్ర నిధులతో పాలమూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది.
పాలమూరుకు నవోదయ పాఠశాల, నారాయణపేటకు సైనిక స్కూల్, గద్వాలలో కేంద్రీయ విద్యాలయం మంజూరుతో పాటు మహబూబ్ నగర్ కు బైపాస్ రోడ్డు నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులకు ముందడుగు పడింది.
పాలమూరు ప్రజల ఆశీస్సులతో, అండదండలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాటిస్తున్నాను.
#1YearOfMPDKAruna #DKAruna #MPDKAruna #Mahbubnagar #MahbubnagarParliament #Gadwal #BJP #BJPTelangana
తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం!
ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన 'దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులను' జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, మన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది.
నాడు కార్యకర్తల కఠోర దీక్ష, మోదీ గారి నాయకత్వంపై నమ్మకంతోనే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అదే పట్టుదలతో తెలంగాణను కషాయమయం చేసేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలి.
పదేళ్లు BRS రాష్ట్రాన్ని దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ అదే పనిలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు చెప్తున్నారు తప్ప అభివృద్ధి శూన్యం. మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి.
మహాలక్ష్మి ₹2500, స్కూటీలు, తులం బంగారం, పెన్షన్ల పెంపు అంటూ మహిళలు, నిరుద్యోగులు, రైతులను కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసింది. అర్హులను కాదని ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సొంత సొమ్ము కాదు.. ప్రజా ధనం!
స్థానిక సమస్యలపై, కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజా క్షేత్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు, నిరసన దీక్షలకు కార్యకర్తలు సిద్ధం కావాలి. కార్యకర్తలు చేసే ప్రతి పోరాటంలో నేను భాగస్వామినై, మీకు సంపూర్ణ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను.
ఈ కార్యక్రమం అనంతరం "ఏక్ పేడ్ మా కే నామ్" పిలుపులో భాగంగా ట్రిబుల్ ఐటీ (IIIT) ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు పద్మజారెడ్డి గారు, జిల్లా ముఖ్య నేతలు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు.
#DKAruna #Mahabubnagar #BJP4Telangana #EkPedMaaKeNaam #CongressFailures #NarendraModi
నారాయణపేట జిల్లాలో జరిగిన 'దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల' ముగింపు కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాబోయే కార్యాచరణపై దిశానిర్దేశం చేశాను.
కేంద్రంలోని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సమర్థవంతమైన నాయకత్వంపై నమ్మకం, కార్యకర్తల కఠోర దీక్షతో పశ్చిమ బెంగాల్లోనే బీజేపీ బలపడింది. అలాంటప్పుడు తెలంగాణలో కమలం వికసించడం పెద్ద కష్టమేమీ కాదు. మనమంతా సమిష్టగా, కంకణబద్ధులమై పనిచేసి రాబోయే రోజుల్లో తెలంగాణను కషాయమయం చేద్దాం! 🚩
ముఖ్యమంత్రి గారు గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారు. కాంగ్రెస్ గాలిలో అధికారంలోకి వచ్చింది.. త్వరలోనే గాల్లో కలిసిపోవడం ఖాయం. తెలంగాణ అభివృద్ధి పైన అవగాహన గానీ, చిత్తశుద్ధి గానీ కాంగ్రెస్‌కు లేదు. మహిళలకు మహాలక్ష్మి ₹2500, స్కూటీలు, తులం బంగారం, పెన్షన్ల పెంపు అంటూ ఇచ్చిన 90% హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టి, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులను నిలువునా ముంచింది.
ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తూ, నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారు. ఇవి రేవంత్ రెడ్డి గారో, మంత్రి పొంగులేటి గారో వాళ్ళ సొంత సొమ్ముతో ఇవ్వడం లేదు.. ప్రజల సొమ్ముతో ఇస్తున్నారు. దీనిపై ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలి. నేడు రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ పోషకాహారం నుండి మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారుల (భారత్ మాల) పనుల వరకు అన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేకపోతోంది.
కాంగ్రెస్ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు, నిరసన దీక్షలకు కార్యకర్తలు సిద్ధం కావాలి. ప్రజల పక్షాన నిలబడి మీరు చేసే ప్రతి పోరాటంలో నేను మీకు సంపూర్ణ సహకారం, మద్దతు అందిస్తూ భాగస్వామినవుతానని భరోసా ఇస్తున్నాను. ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుంది.
ఈ కార్యక్రమం అనంతరం 'ఏక్ పేడ్ మా కే నామ్' (అమ్మ పేరిట ఒక మొక్క) పిలుపులో భాగంగా ద్వారక స్కూల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్య యాదవ్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, పార్టీ ముఖ్య నేతలకు మరియు నా తోటి కార్యకర్తలకు ధన్యవాదాలు.
#DKAruna #BJP4Telangana #Narayanpet #EkPedMaaKeNaam #NarendraModi #JanSampark
ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఒక అరుణమ్మై గొంతెత్తి ప్రశ్నించాలి!
గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ నాయకుల నీడన సాగుతున్న ఇసుక, మట్టి, భూ దందాలు, బియ్యం అక్రమ రవాణాపై నా గళం ఎప్పటికీ ఆగదు. సామాన్యుల ట్రాక్టర్లను ఆపి ఫైన్లు వేసే అధికారులు, లక్షల రూపాయల అవినీతి జరుగుతుంటే కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారు.
నా నియోజకవర్గ ప్రజలారా, కార్యకర్తలారా.. ప్రతిదానికీ అరుణమ్మే వచ్చి అడగాలి అనుకోవద్దు. మీ గ్రామంలో జరిగే అన్యాయాలపై, అక్రమాలపై మీరే ఒక 'అరుణమ్మ'గా మారి ధైర్యంగా గొంతెత్తి ప్రశ్నించండి. అప్పుడే ఈ అరాచకాలకు పూర్తి ముగింపు పడుతుంది! ✊
#DKAruna #BJP #Mahabubnagar #Gadwal #TelanganaPolitics
ఇటీవల గుండె శస్త్రచికిత్స జరిగిన బీజేపీ కార్యకర్త బ్రాహ్మణ్ణను.. గురువారం గద్వాల పట్టణంలోని ద్వారక నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లి కలిసి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నాను.
అయిజ మున్సిపాలిటీకి చెందిన బెల్లంకొండ నాగరాజు గుప్తా గారి కుమారుడు బెల్లంకొండ విష్ణు చైతన్య గుప్తా ఇటీవల గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకుని.. గురువారం వారి నివాసానికి వెళ్లి నాగరాజు గుప్తా గారిని పరామర్శించాను. విష్ణు చైతన్య గుప్తా చిత్రపటానికి నివాళులు అర్పించాను. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన జుట్టు ఇసాక్ నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. జుట్టు ఇసాక్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఇక్కడి పాలమూరు ప్రాజెక్టులు (కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, గట్టు లిఫ్ట్) మరియు జూరాల ప్రాజెక్టు పనులన్నీ నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్నే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ప్రజలను నిలువునా ముంచుతోంది.
#DKAruna #BJP #CongressFailures #Mahabubnagar #PalamuruProjects
ఈరోజు గద్వాల జిల్లా SV ఈవెంట్ హాల్ లో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ సమావేశంలో పాల్గొని, అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించాను.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు. ఉమ్మడి జిల్లా నుంచే ముఖ్యమంత్రి ఉన్నా ఇక్కడి ప్రాజెక్టులు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. జూరాల సేఫ్టీ బ్రిడ్జి, ర్యాలంపాడు, గట్టు లిఫ్ట్ వంటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారికి పబ్లిసిటీ, పాపులారిటీ పై ఉన్న శ్రద్ధ తెలంగాణ, పాలమూరు అభివృద్ధిపై లేదు. హెలికాప్టర్లు పక్కన పెట్టి రోడ్లపై తిరిగితే కదా గుంతలమయమైన రోడ్ల పరిస్థితి అర్థమయ్యేది! రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది కానీ.. సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నేతల ఆస్తులు, ఆదాయం మాత్రం పెరుగుతున్నాయి.
నాడు BRS, నేడు కాంగ్రెస్‌లో ఉన్న గద్వాల ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. గద్వాలలో భూ కబ్జాలు, ఇసుక, మట్టి, బియ్యం దందాలు చేస్తూ దోచుకుంటున్నారు. ఇంతటి అవినీతిని గద్వాలలో నేనెన్నడూ చూడలేదు. ఎన్నికల్లో డబ్బులు పంచితే సరిపోతుందని ఎమ్మెల్యే అహంకారంతో మాట్లాడుతున్నాడు. రైతు భరోసా ₹15 వేల నుండి ₹12 వేలకు కుదించి, కేవలం రెండు ఎకరాలకే పరిమితం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు.
గద్వాల జిల్లాను ఏర్పాటు చేయించింది మీ అరుణమ్మ అయితే.. ఇక్కడికి మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.
ఈ అవినీతి, దోపిడీ చూస్తూ కూర్చుంటే గద్వాలను ఎవరూ కాపాడలేరు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించినప్పుడే అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేయించే విధంగా ప్రజా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రోడ్లు, పెండింగ్ ప్రాజెక్టులు, నిరుద్యోగం, మహిళల సమస్యలపై మీరు చేసే ప్రతి పోరాటంలో నేను భాగమవుతాను.
#DKAruna #Gadwal #Palamoor #BJPTelangana #viksitbharat
Under the visionary leadership of PM Shri @narendramodi Ji, India achieved a historic milestone in 2025, overtaking the USA to become the world’s 2nd-largest market for annual solar installations. A giant leap towards a cleaner, greener future. #IndiaRanks2InSolar
తెలంగాణ స్వరాష్ట్ర సాధన వెనుక దశాబ్దాల పోరాటం, వేలాది మంది అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. తొలిదశ ఉద్యమ అమరవీరుడు శంకర్ త్యాగం నుండి పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే వరకు, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచింది భారతీయ జనతా పార్టీ.
1997 కాకినాడ తీర్మానం "ఒక ఓటు - రెండు రాష్ట్రాలు" నుండి పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారి సింహగర్జన వరకు... తెలంగాణ ఉద్యమ ప్రతి అడుగులోనూ బీజేపీ భాగస్వామ్యం విస్మరించలేనిది.
కానీ, నేడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజంగా నెరవేరాయా? అమరవీరుల ఆశయాలు సాకారమయ్యాయా? కుటుంబ పాలన మరియు అవినీతి కోరల నుండి తెలంగాణను విముక్తి చేసి, ప్రజల అసలైన ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా బీజేపీ మరోసారి ముందుకు సాగుతోంది.
#bjp #BJPWithTelangana #telangana
The #IndiaOmanCEPA comes into force today!
Under the visionary leadership of PM @NarendraModi ji, Indian exporters will gain unprecedented market access, with ZERO DUTY on 98.08% of Oman's tariff lines covering 99.38% of trade value.
📣 #6YearsofPMSVANidhi
For decades, India’s street vendors stayed invisible to formal banking, lacking financial support and safety nets. Under the visionary leadership of Hon’ble PM Shri Narendra Modi ji, PM SVANidhi has spent 6 glorious years turning the smallest vendors into thriving micro-entrepreneurs!
75 Lakh+ Vendors Empowered with over 112 Lakh collateral-free loans.
841 Crore+ Digital Transactions worth nearly ₹9 Lakh Crore driven by local street entrepreneurs.
Inclusive & Empowering: Nearly 46% of beneficiaries are women, and 70% belong to marginalized communities.
From the streets to the formal banking system—this is PM Modi's guarantee of dignity, stability, and an Atmanirbhar Bharat! 🇮🇳
#ModiKiGuarantee #AtmanirbharBharat #FinancialInclusion #StreetVendors #TransformingIndia
ఈరోజు హైదరాబాద్, మోకిలాలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది క్వాంటం స్కూల్’ ప్రారంభోత్సవ వేడుకలో గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా గారు, తోటి ఎంపీలు శ్రీ ఈటెల రాజేందర్ గారు, శ్రీ ధర్మపురి అరవింద్ గారు, ఎమ్మెల్సీ శ్రీ మల్కా కొమరయ్య గారు, ఎమ్మెల్యేలు శ్రీ రాకేష్ రెడ్డి గారు మరియు శ్రీ కాలే యాదయ్య గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ‘ది క్వాంటం స్కూల్’ యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పటికే విద్యాబోధనలో ఎంతో గొప్ప పేరు సంపాదించి, అనేక పాఠశాలలు, కళాశాలలను విజయవంతంగా నడుపుతున్న యాజమాన్యం.. రాబోయే రోజుల్లో విద్యా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే ఉన్నతమైన ఆలోచనతో ఈ పాఠశాలను ప్రారంభించడం అభినందనీయం. కేవలం చదువు మాత్రమే కాకుండా, విద్యార్థులను సంస్కారం, ధర్మం తెలిసిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది.. దేశ భవిష్యత్తులో వారు కీలక పాత్ర పోషించేలా ఈ సంస్థ కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
#DKAruna #TheQuantumSchool #Mokila #Hyderabad #BJP4Telangana
40 lakh households are now benefitted by solar energy through @PMSuryaGhar Muft Bijli Yojana. Under the leadership of Hon’ble PM Shri @narendramodi Ji, India’s clean energy revolution is transforming lives at scale. #40LakhsPMSuryaGhar
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ఇప్పుడు 40 లక్షల కుటుంబాలు సౌరశక్తితో లబ్ధి పొందుతున్నాయి. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతదేశపు స్వచ్ఛ ఇంధన విప్లవం పెద్ద ఎత్తున ప్రజల జీవితాలను మారుస్తోంది.
"History doesn't lie. From Aksai Chin and PoK to the bitter memories of 1984 and the Bhopal gas tragedy... the legacy of the compromise politics of those days is proof of this.
Watch this video without fail, which exposes the true colors of the dynastic rule that pushed India's progress backward!"
చరిత్ర అబద్ధం చెప్పదు. అక్సాయ్ చిన్, పిఓకె (PoK) ల నుండి 1984 నాటి చేదు జ్ఞాపకాలు మరియు భోపాల్ గ్యాస్ దురంతం వరకు... ఆనాటి రాజీ రాజకీయాల వారసత్వమే దీనికి నిదర్శనం.
భారతదేశ ప్రగతిని వెనక్కి నెట్టిన కుటుంబ పాలన అసలు రంగును బయటపెట్టే ఈ వీడియోను తప్పక చూడండి!