రాజ్యాంగ సంస్థలను కించపరిచేలా ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై దేశంలోని 42 మంది మాజీ న్యాయమూర్తులు రాసిన బహిరంగ లేఖ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశం. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళలో ప్రతిపక్షాలు గెలిచినప్పుడు లేని సందేహాలు ఓడిపోయినప్పుడు మాత్రమే రావడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ప్రతిపక్షాలు మీడియా సమావేశాల్లో నిరాధార ఆరోపణలు చేయడం కాకుండా, న్యాయస్థానాల్లో ఆధారాలు చూపాలి. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థపై మరియు అధికారులపై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ.
దసరా నవరాత్రి ఉత్సవాల వేళ, భక్తుల ఆధ్యాత్మిక ఆనందానికి తోడుగా నిలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల అనుమతితో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలకు గ్రామాల్లో 3 కిలోవాట్లు, పట్టణాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని రాష్ట్ర NDA కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకునేందుకు వీలుగా తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు ఎంతో ఊరటనిస్తుంది.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దార్శనిక నాయకత్వంలో 'జన్ విశ్వాస్' సంస్కరణలు దేశంలో సులభతర వ్యాపార నిర్వహణకు సరికొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి. చిన్నపాటి ఉల్లంఘనలకు జైలు శిక్షల స్థానంలో సులభమైన జరిమానాలను ప్రవేశపెడుతూ, సంక్లిష్ట నిబంధనలను సరళీకరిస్తూ పౌరులు, వ్యాపారవేత్తలపై అనవసరమైన నియంత్రణ భారాన్ని తగ్గిస్తున్నారు. 2023 చట్టం ద్వారా 183 నిబంధనలను, 2026 చట్టం ద్వారా ఏకంగా 717 నిబంధనలను నేరపరిధి నుంచి తొలగించడంతో పాటు, 79 కేంద్ర చట్టాల్లోని 784 నిబంధనలను సవరించడం @narendramodi ప్రభుత్వం చేపట్టిన సంస్కరణాత్మక పాలనకు నిదర్శనం.
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి స్వచ్ఛ ఇంధనం, సుస్థిర అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో వృద్ధి కోసం రాష్ట్ర NDA కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడుల అనుకూల విధానాల కారణంగా 2024 జూన్ నుంచి రూ.4 లక్షల కోట్ల విలువైన 97 ప్రాజెక్టుల ద్వారా 4.71 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇలా హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక ప్రగతికి, యువత భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తూ 'వికసిత భారత్' లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ తనవంతు కీలక పాత్ర పోషిస్తోంది.
2047 నాటికి భారత్‌ను ప్రపంచ అగ్రపీఠంపై నిలబెట్టడమే ప్రధాని శ్రీ @narendramodi గారి అచంచలమైన సంకల్పం. మాన్యుఫ్యాక్చరింగ్, అంతరిక్షం, రక్షణ రంగాల నుంచి విప్లవాత్మక AI టెక్నాలజీ వరకు, నాణ్యమైన విద్యతో మన యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడం నుంచి రైతు, కార్మిక, మాతృమూర్తుల సంక్షేమం వరకు ప్రతి పౌరుడి వికాసం కోసమే ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే వరకు విశ్రమించని ఆయన చెదరని పట్టుదలే, 'వికసిత్ భారత్' సాధనకు ప్రధాన ఇంధనం.
11 Years of #Rudhramadevi .
#GonaGannaReddy . An Iconic character in my filmography.
Thank you everyone for being a part of this journey. 🖤
EYY … GAMMUNUNDAVOYY ..! 🔥
Many many happy returns of the day to the commercial blockbuster director,
#VVVinayak garu .
He is not just a director to me. He is like an elder brother who has taught me many important foundations in life.
Happy Birthday Annaya 🖤
గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ప్రస్థానం..
భారత ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రజాసేవా పయనం...
ఈరోజుతో 25 ఏళ్ల అపూర్వ మైలురాయిని చేరుకోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. ఒక పావు శతాబ్దం పాటు నిరంతరంగా కార్యనిర్వాహక బాధ్యతల్లో కొనసాగుతూ, తన దూరదృష్టి, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, నిర్ణయాత్మక నాయకత్వంతో దేశ ప్రగతి పథాన్ని కొత్త దిశగా మలిచిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వ ప్రస్థానం స్ఫూర్తిదాయకం.
గుజరాత్ అభివృద్ధి నమూనా నుంచి 'వికసిత్ భారత్' సంకల్పం వరకు.. మౌలిక వసతుల విస్తరణ నుంచి సాంకేతిక విప్లవం వరకు.. సంక్షేమం నుంచి ఆత్మనిర్భరత వరకు.. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేలా సాగిన ఈ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం అనేక చారిత్రాత్మక మార్పులకు సాక్ష్యంగా నిలిచింది. భారతదేశాన్ని మరింత శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి ఈ చారిత్రాత్మక 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు.