పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని
YSR తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు
ఇఫ్తార్ విందు నిర్వహించడం జరిగింది. అల్లా కృపతో సమస్త మానవాళి సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. ధార్మిక చింతనల నడుమ ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.
నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న నాపై LOOK OUT నోటీసులు ఇవ్వడం KCR నియంత పాలనకు నిదర్శనం. ఇప్పటికే రెండుసార్లు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు దుర్మార్గంగా LOOK OUT నోటీసులు ఇచ్చి, పోలీసులను ఉసిగొల్పుతున్నారు. TSPSC ప్రశ్నాపత్రాల కుంభకోణంలో SIT పెద్ద తలకాయలను వదిలేస్తోంది.
ఇలాంటి అక్రమ అరెస్టులు తప్ప ఏం చేతనైంది KCR? ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా? పరీక్షలు నిర్వహించడం చేతనైందా? నిరుద్యోగులంతా కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే,అదే తెలంగాణలో నిరుద్యోగుల పొట్ట కొడుతున్నావ్. ప్రశ్నాపత్రాలను అమ్ముకొని నిరుద్యోగుల బతుకులను ఆగంజేస్తున్నావ్. తలదించుకొని సిగ్గుపడు!
మొన్న TSPSC ముట్టడికి వెళ్తుండగా హౌజ్ అరెస్ట్ చేశారు. KCRకు అరెస్టులు తప్ప అభివృద్ధి చేతకాదు. వైయస్ఆర్ బిడ్డ అంటే ఎందుకంత భయం? ప్రజలపక్షాన ప్రశ్నిస్తుందనా? ఉస్మానియా ఆసుపత్రిలో రేకుల షెడ్డు కిందే వైద్యం చేస్తున్నా దొరకు సోయి లేదు. 200కోట్ల ఉస్మానియా హెల్త్ టవర్ దిక్కు లేదు.
2/2
KCR మరోసారి నియంత అని నిరూపించుకున్నారు.జనతా రైడ్ లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తుండగా వందల కొద్దీ పోలీసులను పంపించి అక్రమంగా హౌజ్ అరెస్ట్ చేయించారు.ఎలాంటి ఆర్డర్ లేకుండానే హౌజ్ అరెస్ట్ చేయడం KCR దుర్మార్గ పాలనకు నిదర్శనం. గతంలో పాదయాత్రను అడ్డుకొని, హౌజ్ అరెస్ట్ చేశారు.
1/2
గౌరవ హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా.. KCR మాత్రం పోలీసు భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారు.ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను, మా కార్యకర్తలను బందీలను చేశారు. తీవ్రంగా కొట్టారు.అకారణంగా కర్ఫ్యూ విధించారు. ఇవన్నీ YSR తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారు.
1/2