శ్రీ నాదెండ్ల మనోహర్ గారి అరెస్టు అప్రజాస్వామికం - Sri @PawanKalyan
* ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా?
* శ్రీ మనోహర్ గారితోపాటు, ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తా... పోరాడతా
విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసి వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు మా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటి? ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటి? ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోంది. అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని శ్రీ మనోహర్ గారి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నాం. శ్రీ మనోహర్ గారిని, ఇతర నేతలను తక్షణమే విడుదల చేయాలి. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తాను. ప్రజల తరఫున పోరాడతాను.
సభ అయ్యాక
మన జనసైనికుల కంటే
పోలీసులే అత్యంత ఆసక్తిగా
మన జనసేన పార్టీ అధినేత
@PawanKalyan గారి AV
అలా చూస్తూ ఉండిపోయారు
ఆయన మాటలు
పాటలు ప్రసంగాలు వింటుంటే
ఏవరైనా ఒకలాంటి మాయాలోకి
మైకంలోకి వెళ్ళిపోక తప్పదు మరి