మీడియా, వార్తాపత్రికలు, యూట్యూబ్ ఛానల్ వారికి విజ్ఞప్తి.
నేను పార్టీ మారుతున్నానంటూ కొన్ని మీడియా, వార్తాపత్రికలు మరియు యూట్యూబ్ ఛానల్ లలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
✍️ బురద చల్లి కడుక్కోమనటం.. బట్ట కాల్చి మీద వేయడం.. మంచిది కాదు.
✍️ నేను మాటలు మార్చే, పార్టీలు మారే వ్యక్తిని కాదు.
✍️ పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు.
✍️ పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలి.. గొప్ప కారణం ఉండాలి.
✍️ టిఆర్ఎస్ నుంచి కూడా బయటికి పంపిస్తే వచ్చాను తప్ప నా అంతట నేను రాలేదు.
✍️ నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ.
✍️ పార్టీ మారుతున్నానంటూ రాస్తున్న వార్తలను, చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
✍️ పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదు.
✍️వ్యక్తిత్వ హననం చేయకండి.
✍️ ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
- మీ.. ఈటల రాజేందర్, ఎంపీ.
సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఈవీ తయారీలో భారత్ ను ప్రపంచంలో అగ్రగామిగా నిలపడమే మన మోదీ లక్ష్యం. 2030 నాటికి భారత్‌ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడం మన మోదీ గ్యారంటీ. మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ.
#PhirEkBaarModiSarkar#ModiKiGuarantee
#ManaModi
దేశం కోరుకున్నట్లు బిజెపి అభ్యర్థులను గెలిపించి శ్రీ @narendramodi గారిని నాయకత్వాన్ని బలపరిస్తే... తెలంగాణను నంబర్ వన్ చేస్తామని, కమలం గుర్తుకు వేస్తే ప్రతి ఓటు నరేంద్ర మోదీ గారిని ప్రధాని చేస్తుందన్నారు కేంద్ర మంత్రి శ్రీ @amitshah గారు.
#AbkiBaar400Paar#PhirEkBaarModiSarkar
మల్కాజిగిరి పార్లమెంట్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కూకట్ పల్లి నియోజకవర్గం, బాలాజీ నగర్, హౌసింగ్ బోర్డు.. KPHB రోడ్ నంబర్ 1 నుండి వేంకటేశ్వర స్వామి టెంపుల్ బస్ స్టాప్ వరకు జరిగిన రోడ్ షో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి.. బిజెపి లో చేరుతున్న పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
భారీ ఎత్తున హాజరైన బిజెపి శ్రేణులు, అభిమానులు, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆర్థిక మంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా నేను చేసిన పని మీ అందరికీ తెలుసు.
కేసీఆర్ మన విశ్వాసాలను అవహేళన చేస్తున్నారు. 2019 లో ఇలానే మాట్లాడితే కర్రు కాల్చి వాతపెట్టారు. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది జాగ్రత్త.
రేవంత్ వచ్చి నాలుగు నెలలు అయినా ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేస్తున్నారు. మళ్ళీ మోసపుమాటలతో మాయచేయాలని చూస్తే ప్రజల ఆగ్రహం చవిచూడక తప్పదు.
ఆడబిడ్డలకి 2500 ఇవ్వలేదు.
పెన్షన్ పెంచలేదు. పెళ్లికి తులం బంగారం లేదు. కొత్త పెన్షన్ లేదు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు.
తలకాయ కిందపెట్టి కాళ్ళు పైకిపెట్టి జపం చేసినా రాహుల్ ప్రధాని కాలేరు.
మీ హయాంలో బాంబుల మోతలు, బుల్లెట్ల గాయాలు. స్కాములు, అరెస్టులు.
కాని మోదీ గారి హయాంలో కాశ్మీర్ లో కూడా ప్రశాంతత నెలకొంది.
ఓట్ల కోసం రాజీపడి ప్రజల ప్రాణాలు బలితీసుకున్న పార్టీ కాంగ్రెస్ అయితే… ఇటుకతో కొడితే రాయితో కొడతా అని సర్జికల్ స్ట్రైక్ చేసిన వారు మోదీ గారు.
మన గుళ్లను కూల్చిన మాట వాస్తవం కాదా ? ఆ రామాలయం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. అలాంటి ఆలయాన్ని అందరిని ఒప్పించి కట్టిన నాయకుడు మోదీ గారు.
మోదీ గారి హయాంలో తలెత్తుకునే పాలన సాగుతుంది. మన దేశంలోనే కాదు అమెరికా సెనేట్ లో మోదీ గారు మాట్లాడుతుంటే నిలబడి చప్పట్లు కొట్టారు అంటే మన దేశగౌరవం ఎంత పెంచారో అర్థంచేసుకోండి.
ప్రశ్నించే గొంతు అని గెలిపిస్తే నువ్వు ఏం అభివృద్ధి చేశావు.. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించరు.
ఈదేశం సురక్షితంగా ప్రశాంతంగా ఉండాలి అంటే.. అభివృద్ధి కొనసాగాలంటే మోదీ గారు మళ్ళీ గెలవాలి.
నేను ఎంపీ అయితే నేరుగా మోదీ గారి దగ్గరకి వెళ్ళి మల్కాజిగిరి కి కావల్సింది తీసుకువస్తానని హామీ ఇస్తున్నాను.
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నిండు మనస్సుతో ఆశీర్వదించండి.
భారత్ మాతా కీ జై..
జై తెలంగాణ..
ఈ కార్యక్రమంలో పాపయ్య గౌడ్ గారు, కాంతారావు గారు, వడ్డేపల్లి రాజేశ్వర రావు గారు, నాగేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.
#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #Eatala4Malkajgiri
Gratitude to the people of #Malkajgiri Lok Sabha for making my #NominationRally as a BJP MP Candidate in Malkajgiri Lok Sabha Constituency a grand success.
Very special thanks to Hon'ble Union Minister, @BJP4Telangana State President Shri @kishanreddybjp Ji and Hon'ble Union Minister Shri @HardeepSPuri Ji for inducing motivation in party leaders and karyakarta's.
The enthusiasm and participation of karyakarta's, well wishers and people in such huge numbers clearly reflects that people's resolve for #PhirEkBaarModiSarkar, thier immense love for Hon'ble PM Shri @NarendraModi Ji.
I promise Malkajgiri Lok Sabha will be in #AbkiBaar400Paar.
#Eatala4Malkajgiri
మల్కాజ్ గిరి లోక్ సభ బిజెపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీ @Eatala_Rajender గారు, అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ @MLA_RakeshReddy గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి గారు, శ్రీ కొప్పు భాషా గారు, పార్టీ నాయకులు.
#PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
I filed my nomination papers as a BJP candidate for the Malkajigiri Lok Sabha constituency in the coming parliamentary elections.
MLA Shri @MLA_RakeshReddy garu, State Mahila Morcha President Smt. @DrShilpa4Bjp garu, Shri Koppu Basha garu and Shri Vamsha Krishna garu were present.
#PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
#Eatala4Malkajgiri
ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @kishanreddybjp గారికి, కేంద్ర మంత్రి శ్రీ @HardeepSPuri గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
నా నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు.
#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #Eatala4Malkajgiri
దేశం కోసం మోదీ - మోదీ కోసం మనం.. హైదరాబాద్ లోక్ సభ నియోజవర్గ అభివృద్ధి కోసం బిజెపి అభ్యర్థి శ్రీమతి కొంపెళ్ల మాధవీలత గారిని గెలిపిద్దాం.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం.
#PhirEkBaarModiSarkar#AbkiBaar400Paar#BJP4Telangana
మల్కాజిగిరి పార్లమెంట్ : మేడ్చల్ నియోజకవర్గం..
నాగారం మున్సిపల్ చైర్మన్ శ్రీ కోడూరి చంద్రారెడ్డి గారు, పలువురు కౌన్సిలర్లు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిజెపిలో చేరుతున్న సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
రాబోయే కాలంలో ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ ప్రజలు శాంతితో వర్ధిల్లాలి అంటే, ఈ దేశం పురోగతించాలంటే రాబోయే కాలంలో నాయకత్వం వహించబోయే పార్టీ బిజెపి అని భావించి, ఈరోజు పార్టీలో జాయిన్ అయినా చంద్ర రెడ్డి గారికి ధన్యవాదములు.
కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా నా పదవి ఉంటదా పోతదా ముఖ్యం కాదు.... మోడీ గారికి మద్దతు ఇవ్వాలి, దేశానికి మద్దతు ఇవ్వాలని వారు ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు.
దారిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి పోయిన... అక్కడ సాధువులు చాలామంది ఉన్నారు, పోయి ఆశీర్వాదం కోసం నిలబడ్డా... వారిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే అఖండ మెజారిటీతో గెలవబోతున్నావు అని చెప్పారు.
నేను ఒకటే అడిగినా మీరు సాధువులు, సంతులే మీరు ఆశీర్వాదం ఇచ్చారు కానీ అసలు ఆశీర్వాదం ఇవ్వాల్సింది మల్కాజిగిరి ప్రజలు కదా.. వాళ్ల అభిప్రాయాన్ని, వాళ్లు ఆత్మను మీరు ఎట్లా చెప్తారని అన్నాను. తపోపురుషులం మేము, ఆకాశం నుంచి ఉడిపడ్డ వాళ్ళం కాదు... మల్కాజ్గిరి ప్రజల ఆంతర్యం ఏమిటో చెబుతున్నాం గెలిచేది భారతీయ జనతా పార్టీఏ అని.
టీవీలలో తప్పుడు ప్రచారం, దొంగ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కి బిజెపికి కొద్దిగానే తేడా ఉంది. బిజెపికి 37-38 శాతం ఉంటే.. కాంగ్రెస్ కి 34-35 శాతం వస్తుంది అని చెప్తున్నారు.
నేను ఉదయాన మౌలాలి వెళ్తే అక్కడున్న ప్రజలు ఏ సర్వే సంస్థలకి అందని ఫలితాలు రాబోతున్నాయి అని చెబుతున్నారు. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో మొదటి శంఖారావం మోడీ గారు పూరించింది మల్కాజ్గిరి లోనే. మల్కాజ్గిరి ప్రజల అభిమానాన్ని చూసి మోడీ గారు ముగ్ధుడైపోయారు.
దేశం మొత్తంలో రెండు పార్లమెంట్ నియోజకవర్గం కలిపి ఎన్ని ఓట్లు ఉంటాయో... అన్ని ఓట్లు కలిగిన ఒకే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి. ఇక్కడ బిజెపి గెలిస్తే 15 అసెంబ్లీ సీట్లు గెలిచినట్లే.
ఇక్కడ 70 శాతం మంది బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్లే ఉన్నారు. ప్రపంచ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాళ్లు, చైతన్యానికి మారుపేరుగా ఉన్నవాళ్లు మల్కాజిగిరి ప్రజలు.
మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఈ సీటు నాది అంటున్నాడు. రేవంత్ రెడ్డికి మల్కాజిగిరిలో ఒక ఇల్లు ఉందా వాకిలి ఉందా.
నా స్కూల్ కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నారాయణగూడ, కాలేజ్ ఆలియా కాలేజ్, నా డిగ్రీ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ .. నేను చదివింది ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో. 1992 నుండి నేను ఈ ప్రాంతంలో బిజినెస్ చేశాను. ఏది పడితే అది మాట్లాతే చెల్లదు మిస్టర్ రేవంత్ రెడ్డి.
ఆనాడు కొడంగల్ లో ఓడిపోతే... ఈ మల్కాజిగిరి ప్రజలు కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కొట్లాడేటోడు ఒకడు ఉండాలని, మాట్లాడేటోడు ఉండాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పి నీకు పట్టం కడితే.... ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గ ప్రజల ముఖం చూడలేదు, ఎన్నడూ ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోని వాడు, ఇప్పుడు వచ్చి నాది నాది అంటున్నాడు.
నీది నిజమైతే ఎందుకు ఇక్కడ ఒక మున్సిపాలిటీని, ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయావ్.
రేవంత్ రెడ్డి...దేశానికి స్వతంత్రం తెచ్చా అని చెప్పే నీ పార్టీ, 75 ఏళ్లుగా ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేయని దద్దమ్మ పార్టీ మీ పార్టీ. ఒకే దేశం ఒకే చట్టం అమలు చేసిన పార్టీ నా పార్టీ, అమలు చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు...
ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, సుభిక్షంగా ఉండాలంటే, బాంబులు మూత లేకుండా ఉండాలంటే మోడీ గారు ఉండాలి.
రేపటి పురోగమనం, రేపటి భవిష్యత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో సాధ్యమైతది కాబట్టి మీరంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి.
జై తెలంగాణ...
భారత్ మాతాకీ జై...
#ModiJiKaParivaar #BJP4Telangana #BJP4India #ModiHaiToMumkinHai #ModiAgainIn2024 #LokSabhaElections2024 #BJP4India #EatalaRajender #Eatala4Malkajgiri #MPEatala #Eatala4BJP #malkajgiriconstituency #malkajgirimp
#ModiGuranteeEatalaSurety
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు..
మల్కాజ్ గిరిని ప్రధాని శ్రీ @narendramodi గారు మరింత అభివృద్ధి చేస్తా అని చెప్పిండు..
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం.. మల్కాజిగిరి ని అభివృద్ధి చేసుకుందాం..
#EatalaRajenderBJP#ModiAgain2024#AbkiBaar400Paar #ModiHaiToMumkinHai #Eatala4Malkajgiri
#EatalaForMalkajgiri
#MalkajgiriWithBjp
#MalkajgiriWithEatala
#PhirEkBaarModiSarkar
#MeinModiKaParivar
#TelanganaFutureEatala
#EatalaRajendarBJP
#AyodhyaRamMandir
#MalkajgiriLokSabhaConstituencies