మీడియా ప్రకటన
తేదీ:07-03-2024
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా
👉 రాజ్యాంగం,లౌకికత్వం ప్రమాదంలో ఉంది:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
👉 బీఎస్పీపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య��� వెనుక సీఎం రేవంత్ హస్తం
👉 ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో 3,000 ఖాళీలు మిగిలాయి
దేశంలో రాజ్యాంగానికి,లౌకికత్వానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొనే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ,భారాస పార్టీలు కలసి పోటీ ��ేయనున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు.గురువారం కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు.బహుజన సాధికారత, రక్షణలే భవిష్యత్ లక్ష్యంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసమే బీఎస్పీ,భారాస పార్టీల మధ్య పొత్తు కుదిరిందన్నారు.
బిజెపి పాలనలో లౌకికత్వం ప్రమా���ంలో పడిందన్నారు.బిజెపి,కాంగ్రెస్ పార్టీలు రహస్య ఒప్పందంతో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓటమి కొంత నిరుత్సాహపర్చిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు.రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు వ్యూహాలను మార్చుకోవడం సర్వసాధారణమన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న,ప్ర��ి పక్షంలో ఉన్న పార్టీలన్నీ తమ ప్రస్థానంలో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఎదిగినవేనని స్పష్టం చేశారు.ఇతర పార్టీలు కలిసినప్పుడు ఎన్నడూ మాట్లాడని కొందరు స్వార్దపూరితంగా బీఎస్పీ,భారాస కూటమిని నిందించడం హాస్యాస్పదమన్నారు.కూటమిగా ఏర్పడడం సరైందో కాదో చరిత్రనే సమాధానం చెబుతుందని అన్నారు.జన్వాడలో ప్రార్థన మందిరంపై దాడి జరిగితే ముఖ్యమంత్రి స్పందించలేదని విమర్శించారు.
👉 మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి హస్తం
మంత్రి కొండా సురేఖ తనను గుండా అంటూ,బీఎస్పీని అసాంఘిక శక్తుల ముఠాగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా మాట్లాడకుండా మంత్రులతో తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో మతపరమైన స్వేచ్ఛ లేకుండా పోతుందన్న ఆయన మునుపెన్నడూ లేనివిధంగా బహుజన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
👉 ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో ఖాళీలు
గురుకుల ఉద్యోగాల భర్తీలో రీలింకిష్ మెంట్, డిసెండింగ్ ఆర్డర్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంవల్లే సుమారు 3,000 పోస్టులు బ్యాక్ లాగ్ గా మిగులుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చేసిన ఎక్స్ (ట్విట్టర్) స్పందించారే తప్ప,కింది స్థాయి అధికారులకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు.ప్రభుత్వం ఉద్యోగాలను డిసెండింగ్ ఆర్డర్ లో భర్తీ చేయకుండా 3000 మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
#IamRSP #BSP4Telangana #VR99 #CongressCheatedTelangana @RSPraveenSwaero @BITCELL_BSP
ఈ పొత్తు వలన బహుజన రాజ్యాధికారానికి ఎంత దగ్గర అయితున్నాం అనేది ప్రజలు ఆలోచించాలి, రాబోయే రోజుల్లో బహుజనులను కూడగట్టడం లో మరో కాన్షిరాం అయితడు @RSPraveenSwaero
@BSP4Telangana
@NKRL_Parliament
@TSRSPBSP ప్రతి ఒక్కరూ బహుజనవాదం అని చెప్పుకొని తిరిగేటోళ్లే కానీ బానిసలు��ా బతకడం అలవాటయింది. ఈ నాయకులంతా ప్రజల కోసం రాలే ప్రజలను ముంచడానికి వచ్చారు. @MPRamulu17
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ లో చేరానున్న విశ్రాంత IPS అధికారి పూర్ణ చంద్రరావు(బీసీ). WELCOME TO THE #BSP SIR 💐🐘💙✊
@andrapradeshBsp
@BSP4Telangana
@bsp_ts
@TSRSPBSP @RSPraveenSwaero@tonybekkal @BSP4Telangana డాక్టర్ ఆర్ఎస్ #ప్రవీణ్ కుమార్ సార్ గారు చేరినప్పటి నుండి ఇప్పటిదాకా #బహుజన సమాజ్ పార్టీకి మంచి పేరు ఉంది. కనుక పొత్తు పెట్టుకోవడం సరికాదు ఒంటరిగానే పోటీ చేయాలి.వాళ్లతోనే వీళ్ళతోనే పొత్తు పెట్టుకుంటే మనల్ని ఇంకా మోసం చేస్తారు. కాబట్టి పొత్తు సరికాదు
@AllIndiaBSP@RSPraveenSwaero