రేవంత్ "హైడ్రా" పూర్తిగా ఫెయిల్! 🌧️❌
ప్రచారం ఫుల్... పని నిల్!
ఒక్క చిన్నపాటి వర్షానికే చెరువులైన హైదరాబాద్ రోడ్లు, కాలనీలు.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్... గంటలకొద్దీ నరకయాతన పడ్డ నగర ప్రజలు!
పేదల ఇండ్లు కూల్చడంలో చూపిన హడావిడి...
వానాకాలం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఎందుకు లేదు?
ఇది హైడ్రా కాదు... హై డ్రామా!
ప్రజల ప్రాణాలు, నగర భవిష్యత్తుతో ఆటలాడుతున్న రేవంత్ సర్కార్.
#CongressFailedTelangana
మెట్రో విషయంలో మరోసారి తెలంగాణపై బీజేపీ వివక్ష! 🚫🚇
అహ్మదాబాద్ మెట్రోకు వేల కోట్ల నిధులు కేటాయిస్తూ...
హైదరాబాద్‌కు మాత్రం "నిధులు లేవు" అంటూ చేతులెత్తేసిన మోదీ సర్కార్.
8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా...
తెలంగాణకు తెచ్చింది నిధులు కాదు, నిరాశ మాత్రమే!
పన్నులు తెలంగాణవి... పైసలు గుజరాత్‌కు!
ఇదేనా బీజేపీ "సబ్కా సాథ్, సబ్కా వికాస్"?
📢 పాలమూరుపై రేవంత్ పచ్చి అబద్ధాలు ⛔
💥 పాదయాత్ర చేస్తామన్న బీఆర్ఎస్ నాయకుల హెచ్చరికలతో కదిలొచ్చిన కాంగ్రెస్ సర్కార్ 🎯
🌊 కేసీఆర్ మహాయజ్ఞం కోసం.. పాలమూరు రైతుల త్యాగం
📣 కేసీఆర్ సర్కార్ సేకరించింది 26,950 ఎకరాలు. ఎత్తిపోతల కోసం ఖర్చు చేసింది రూ.27,000 కోట్లు
⚠️ సీఎంవి అసత్యాలని తేల్చిన అధికారిక లెక్కలు. పథకం ప్రకారమే సొంత జిల్లాపై రేవంత్ వివక్ష
🚨 అన్నీ మరచి భూ సేకరణ చేయకుండానే పనులు చేశారని రేవంత్ ఆరోపణ
🔸 పట్టణాల్లా రూపుదిద్దుకున్న నిర్వాసిత గ్రామాలు
❌ తప్పులు కప్పిపుచ్చుకొనేందుకు డాంబికాలు. 10 శాతం పనులు చేయలేక అసత్య ప్రచారం
కేసీఆర్ సర్కార్‌పై బట్టకాల్చి మీద వేసేందుకు సొంతగడ్డకే ద్రోహం తలపెట్టిన రేవంత్‌రెడ్డి.. ‘పాలమూరు-రంగారెడ్డి’పై చెప్పింది పచ్చి అబద్ధమని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.
ఎత్తిపోతల పథకంలో మొత్తం ఐదు స్టేజ్‌ల ద్వారా 90 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకొని, 12.3 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు వెచ్చించి పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు నిర్మించి 90 శాతం పనులు పూర్తి చేసింది. మొత్తం 27,081.95 ఎకరాలు అవసరమైతే,అక్షరాలా 26,950.97 ఎకరాలు సేకరించింది.
చాలాచోట్ల భూసేకరణ చట్టం-2013 ప్రకారం మెరుగైన పరిహారం అందించి నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఆర్అండ్ఆర్ కాలనీలు మినీ పట్టణాల్లా కళకళలాడుతున్నాయి. పాలమూరు పథకంలో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లను కేసీఆర్ హయాంలో భారీ ఎత్తున భూసేకరణ చేసి రైతులకు పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టినట్టు తేటతెల్లమైంది.
ఈ ఎత్తిపోతల పథకాన్ని మహాయజ్ఞంగా భావించిన కేసీఆర్ 2016 జూన్ 11న ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కరోనా కష్టకాలాన్ని కూడా జయించి 2023న సెప్టెంబర్ 16న కృష్ణానది జలాలను ఉప్పొంగించి రైతుల కండ్లల్లో సంతోషాన్ని చూశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిగిలిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను త్వరితగతిన పూర్తిచేయాల్సింది పోయి నిరాశే మిగిల్చారు.
ఈ పథకం పూర్తిచేస్తే ఎక్కడ కేసీఆర్‌కు పేరొస్తుందోనని 30 నెలలుగా పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ కార్యాచరణకు దిగడంతో హడావుడిగా ప్రాజెక్టుల బాట పట్టింది.
♦️ తొలి వర్షానికే చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్
♦️ హైదరాబాద్ ప్రజల నరకయాతనకు సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతే కారణం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS తీవ్ర ధ్వజం 👇
తొలి వర్షానికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అతలాకుతలమైందని ఇంత నిర్లజ్జగా అంగీకరించడానికి రేవంత్ రెడ్డికి సిగ్గనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ఆయనే ముఖ్యమంత్రి అని, మున్సిపల్ శాఖ మంత్రి అనే విషయం కూడా రేవంత్ రెడ్డి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు.
రోజంతా కష్టం చేసి ఇళ్లకు తిరిగి వెళ్ళే సమయంలో వాహనదారులు, మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు పడే అవస్థల పట్ల ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.
అధికార యంత్రాంగాన్ని, మొత్తం వ్యవస్థనంతా గుప్పిట్లో పెట్టుకుని, వర్షం రాగానే మొత్తంగా చేతులెత్తేయడం ముఖ్యమంత్రి అసమర్థత కాకపోతే మరేంటని నిలదీశారు.
హైదరాబాద్ ప్రజలు రోడ్లపై ట్రాఫిక్ లో చిక్కుకుపోయి దాదాపు నాలుగు గంటల పాటు నరకయాతనకు గురవుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ప్రతి ఏడాది వర్షాకాలం రాకముందే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకునే సంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి రాగానే తుంగలో తొక్కారని కేటీఆర్ విమర్శించారు.
నగర పరిస్థితిపై కనీసం ఒక్క సమీక్ష కూడా లేదని, చెత్తతో కూరుకుపోయిన డ్రైనేజీలను, పేరుకుపోయిన మురికి కాలువలను క్లీన్ చేసిన దాఖలాలే లేవని ధ్వజమెత్తారు.
వర్షాకాల ప్రణాళిక సన్నద్ధత ఏమాత్రం చేయకపోవడం వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరంలో చిన్న వర్షానికే ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంది అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో SNDP, SRDP వంటి పగడ్బందీ ప్రణాళికలను అమలు చేసి హైదరాబాద్ వాసుల కష్టాలను తీరిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మళ్లీ కథ మొదటికి తెచ్చారని ఆరోపించారు.
ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు విద్యుదాఘాతాలతో మరణాలు సంభవించినా చలనం లేని ఈ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.
కేవలం రాజధానిలో విలువైన భూములను కబళించడమే ఏకైక పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి పాలనకు బుద్ధి చెప్పేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
రాష్ట్రానికే ఎకనామిక్ ఇంజన్ అయిన హైదరాబాద్ ను గాలికి వదిలేసిన సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల చేతిలో శిక్ష తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.
మనకు మన తాతల కథ, తండ్రుల కథ, మన జాతి కథ తెల్వకపోతే..
భవిష్యత్తు కూడా అర్థమయ్యే అవకాశం లేదు.
కాబట్టి ఎన్నో పోరాటాలతో.. ఎన్నో బలిదానాలతో..
ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత
ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది.
జై తెలంగాణ! ✊🏻
@KTRBRS
రేపు రేవంత్ రెడ్డికి కూడా హిట్లర్‌కు పట్టిన గతే పడుతుంది.
ప్రపంచంలోనే అత్యంత కిరాతకుడైన హిట్లర్‌తో
రేవంత్ రెడ్డి తనను తాను పోల్చుకుంటున్నాడు అంటేనే ఆయన మనస్తత్వం ఏంటో అర్థమవుతోంది.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @jeevanreddyMLC
పేదల భూములు లాక్కోవడానికి.. ఇదేమన్నా రేవంత్ రెడ్డి అబ్బ జాగీరా?
మమ్మల్ని చంపినా సరే.. మా భూములు ఇచ్చేది లేదు.
నమ్మి కాంగ్రెస్ కి ఓటేసినందుకు మమ్మల్ని నట్టేట ముంచిర్రు.
- కోహెడ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితురాలు
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు కానీ..
తన సీటును కాపాడుకోవడం కోసం ఢిల్లీ బాసులకు మూటలు మోయడానికి డబ్బులున్నాయి.
అలవికాని హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ దొంగలు!
#CongressFailedTelangana
Look who is preaching….. సొంత పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడవడం మీకు కొత్తేమీ కాదు గా, కాంగ్రెస్ పార్టీ లో ఉండి బీజేపీ కి వోట్ వెయ్యమని చెప్పి పార్టీ నుండి షోకాజ్ నోటీస్ లు అందుకుంది మర్చిపోయినవా??
నిరుద్యోగులను నమ్మించి.. నిలువునా ముంచుతున్న దగాకోరు కాంగ్రెస్!
ఎన్నికలప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులూ ఉండవని నమ్మబలికి,
తీరా అధికారంలోకి వచ్చాక రూ. 200 ఉన్న టీజీపీఎస్సీ ఉద్యోగ అప్లికేషన్ ఫీజును ఏకంగా రూ. 1,000కి పెంచిన కాంగ్రెస్ సర్కార్.
ఓట్ల కోసం నిరుద్యోగులను వాడుకుని నయవంచన చేసిన రేవంత్ సర్కార్!
ఎన్నికల ముందు ఎన్నో చెప్పి, ఓట్లేశాక మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అసలు కనిపించడం లేదు.
మహిళా సంఘాలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్నారు, గ్యాస్ ఫ్రీ అన్నారు ఇంతవరకు దిక్కే లేదు.
కేసీఆర్ ఉన్నప్పుడు సక్కగ వచ్చిన రైతుబంధు ఇప్పుడెందుకు రావడం లేదు?
- మహిళా రైతు
తుమ్మిడిహట్టిని మొదట వ్యతిరేకించిందే నాటి మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.
2013లో నాటి మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసి 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమని చెప్పారు.
ఆ సమయంలో కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి.
ఇవ్వాళ రేవంత్ రెడ్డి ఎవరిని మోసం చేద్దామని అనుకుంటున్నారు?
రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణకు కాళేశ్వరమే దిక్కు.
- మాజీ ఎంపీ @vinodboianpalli
@BRSparty పాలనలో
సంవత్సరం: 2020–21
🌾 ధాన్యం కొనుగోలు:
92 లక్షల మెట్రిక్ టన్నులు
సుమారు 15 లక్షల మంది రైతులకు
మొత్తం : ₹17,300 కోట్ల మొత్తాన్ని
ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా
రైతన్నల ఖాతాల్లో జమచేసిన
తొలి ప్రభుత్వం బీఆర్ఎస్
📎 Source: (FCI)
Food Corporation of India
ఇంకెన్ని రోజులు అబద్దాలతో
గ్లోబెల్ ప్రచారం చేస్తావు,
@UttamINC !
DCP విధానం నుండి
తెలంగాణను తప్పించటానికి
కేంద్రం ప్రయత్నించినా..
కేంద్రం తరపున రైస్ మిల్లింగ్,
తరలింపు, స్టోరేజ్ కోటా తగ్గించి,
తెలంగాణ నుంచి ఎక్కువ వడ్లు
తీసుకోమని తేల్చేసినా..
BRS ప్రభుత్వం అన్నదాతల
పక్షాన నిలబడి, వడ్లు మొత్తాన్ని
కొనుగోలు చేసింది.
తెలంగాణ రైతుల ధాన్యానికి
అత్యంత కఠిన నిబంధనలు పెట్టినా
ఇంకా ఎన్నో మార్గాలలో
కేంద్రం వివక్షత చూయించినా,
@KCRBRSPresident గారి
దార్శనికతతో బీఆర్ఎస్ హయాంలో
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఓ.. రికార్డు !
@KTRBRS
#CongressFailedTelangana
Dear Hyderabadis,
The national parties that won 8 seats each in Telangana have done zilch for you.
As soon as it came to power, the Congress-led government cancelled the Raidurg–Airport Metro, which was ready for construction.
The BJP-led Union government denied the BHEL–Lakdikapul Metro line to Hyderabad, citing low ridership, while approving metro projects for Lucknow, Indore, and other cities.
Both are a burden on Telangana!
గుర్తుంచుకో రేవంత్..
నువ్వు రోల్ మోడల్‌గా భావించే ఆ హిట్లర్ కూడా ప్రజల ఆగ్రహ జ్వాలల్లో బూడిదై, చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడే తప్ప సాధించింది ఏమీ లేదు!
ఇది పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ!
ఈ గడ్డ బిడ్డల తిరుగుబాటు ముందు నీ అహంకారం, నీ నియంతృత్వం తలవంచక తప్పదు. పేదల ఇండ్లను కూలుస్తూ నువ్వు చేస్తున్న విధ్వంసానికి.. నిన్ను, నీ హైడ్రాను జనం పాతరేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
తెలంగాణ జన సముద్రం ముందు నువ్వు, నీ అహంకారం కొట్టుకుపోవడం ఖాయం! 🎯
జై తెలంగాణ ✊🏻