AYUSH house surgeons and PG scholars in Telangana intensified their 17-day protest by storming the Commissionerate office in Secunderabad. Nearly 100 medicos sought talks with senior officials, demanding higher stipends and highlighting the disparity with Allopathy and other States.
https://t.co/qUnSDclEQv
ప్రెస్ నోట్
హోమియోపతి వైద్య విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు బీజేపీ సంపూర్ణ మద్దతు: తాడూరి శ్రీనివాస్
స్టైఫండ్ పెంపుదల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడం తగదు
రామాంతపూర్ హోమియోపతి కళాశాల విద్యార్థుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తాడూరి శ్రీనివాస్
Wishing you happy Independence day,
We seek *JUSTICE DIGNITY EQUALITY*. Hike our Stipends on par with allopathy as per the G.Os ,pending since 10 years making the least stipend state in the country since the Seperation of Telangana state.
#TelanganaAyushStipendHike#Hungerstrike
రోగం ఎవరికైనా ఒక్కటే.. ప్రాణాలు కాపాడే విషయంలో అలోపతి డాక్టర్ అయినా, ఆయుష్ డాక్టర్ అయినా పడే కష్టం ఒక్కటే. రోగాలకు లేని వివక్ష.. వైద్యం చేసే డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఎందుకు?@revanth_anumula
రాష్ట్రంలో అలోపతి హౌస్ సర్జన్లకు రూ. 28 వేలు ఇస్తుంటే, ఆయుష్ వాళ్లకు కేవలం రూ. 13 వేలు చేతిలో పెడుతున్నారు.
అలోపతి పీజీ విద్యార్థులకు రూ. 70 వేలు ఇస్తుంటే, ఆయుష్ పీజీలకు ఇచ్చేది కేవలం రూ. 30 వేలే. ఒక దినసరి కూలీకి వచ్చే గిట్టుబాటు కంటే తక్కువ ఇచ్చి చదువుకున్న ప్రభుత్వ డాక్టర్ల పరిస్థితిని ఇంతలా దిగజార్చడం ఈ కాంగ్రెస్ సర్కారుకే చెల్లింది.
పక్కనున్న ఏపీలో ఆయుష్ హౌస్ సర్జన్లకు రూ. 26 వేలు, పీజీలకు రూ. 65 వేల పైన స్టైఫండ్ ఇస్తుంటే.. మన రాష్ట్రంలో పెంచడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదా..
సుప్రీంకోర్టు పదేపదే చెబుతున్న 'సమాన పనికి సమాన వేతనం' అన్న కనీస ధర్మాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కుతోంది..
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి, ప్రతిరోజూ విమానాల్లో ఢిల్లీకి ఎగరడానికి వందల కోట్లు ఖర్చు పెడతారు కానీ.. నిరంతరం పేదల ఆరోగ్యాల కోసం శ్రమించే ఆయుష్ విద్యార్థులకు ఇవ్వాల్సిన 15 శాతం స్టైఫండ్ పెంపు ఫైలు మాత్రం ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి భారంగా కనిపిస్తోందా..
హైదరాబాద్ లాంటి మహానగరంలో నెలకు 13 వేల రూపాయలతో ఒక డాక్టర్ ఎలా బతుకుతాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
హాస్టల్ ఫీజులు, మెస్ ఛార్జీలు, ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు.. వీటన్నింటికీ ఆ కొద్దిపాటి స్టైఫండ్ ఏ మూలకు సరిపోతుంది
విద్యార్థులు చదువుకోవాలా? లేక పూటగడవక పస్తులుండాలా?
ఇది కేవలం డబ్బుల సమస్య కాదు.. ఆయుష్ డాక్టర్ల ఆత్మగౌరవ సమస్య.
రాత్రింబవళ్లు డ్యూటీలు చేస్తూ, ఎమర్జెన్సీ వార్డుల్లో అలోపతి విద్యార్థులతో సమానంగా వీరు కూడా రిస్క్ తీసుకుంటున్నారు.
అలాంటప్పుడు వారిని రెండో తరగతి డాక్టర్లుగా చూసే వివక్ష తగదు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి పెంచాల్సిన 15 శాతం స్టైఫండ్ పెంపును ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
జీవోలు కేవలం కాగితాలకే పరిమితమా? పెంచాల్సిన స్టైఫండ్ తో పాటు, ఇన్నేళ్లుగా దక్కకుండా ఆపిన బకాయిలను కూడా విద్యార్థులకు వెంటనే చెల్లించాలి.
సమ్మెకు వెళ్తామని 15 రోజుల ముందే విద్యార్థులు నోటీసులు ఇచ్చినా.. ప్రభుత్వంలో ఉలుకూ లేదు, పలుకూ లేదు.
పాలనను గాలికి వదిలేసి, రాజకీయ చేరికల మీద పెట్టిన శ్రద్ధ.. వైద్యుల సమస్యల మీద పెట్టి ఉంటే నేడు ఆస్పత్రుల్లో రోగులకు ఈ దుస్థితి వచ్చేది కాదు.
కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాకముందు నిరుద్యోగులు, విద్యార్థులను వాడుకుని వాళ్ల భుజాల మీదెక్కి గద్దెనెక్కారు.
తీరా అధికారంలోకి వచ్చాక ఆ భుజాలపైనే ఎక్కి తొక్కుతున్నారు. వాగ్దానాలు చేసి, గద్దెనెక్కగానే వాళ్లను నడిరోడ్డు మీదకు తెచ్చి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో కూర్చోబెట్టిన ఘనత ఈ రేవంత్ రెడ్డి సర్కారుకే దక్కుతుంది.
లక్షలాది మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది.
కోర్సులు పూర్తయినా కాలేజీలకు ఫీజులు కట్టక, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఉద్యోగాలకు వెళ్లలేక, పైచదువులు చదవలేక వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టిన పేద బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలనే కలను ముఖ్యమంత్రి నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు.
ఓవర్సీస్ స్కాలర్షిప్ లను ఆపేయడంతో ప్రభుత్వాన్ని నమ్ముకుని విదేశాలకు వెళ్లిన మన బిడ్డలు, అక్కడ యూనివర్సిటీల్లో ఫీజులు కట్టలేక పడుతున్న నరకానికి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది..
నాడు కేసీఆర్ గారి పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకుల పాఠశాలలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మృత్యుకుహరాలుగా మార్చేసింది.
పసిపిల్లలకు నాణ్యమైన అన్నం పెట్టే దిక్కు లేదు. రోజూ ఎక్కడో ఒకచోట ఫుడ్ పాయిజన్ కావడం, పాము కాట్లు, ఎలుక కాట్లతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే గుండె రగిలిపోతోంది.
విద్యాశాఖను తన దగ్గరే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఇంతలా భ్రష్టుపట్టిపోతున్నా ఎందుకు చీమ కుట్టినట్లు కూడా లేదు..
ఆయుష్ విద్యార్థుల నుంచి మొదలుకొని గురుకులాల దాకా.. విద్యార్థి లోకాన్ని, యువతను రోడ్డెక్కించిన ఏ ప్రభుత్వమూ చరిత్రలో నిలబడలేదు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడబోమని విద్యార్థులు చెబుతున్నారంటే వారు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
తక్షణమే ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్ల డిమాండ్లను నెరవేర్చి, అలోపతి డాక్టర్లతో సమానంగా స్టైఫండ్ పెంచుతూ జీవో విడుదల చేయాలి.
#JusticeForAyushDoctors
When we wear the same White apron,when we wear the same stethoscope,when we study same subjects ,when we do the same things ,why we can't have the Dr. Prefix as you'll have,where is the right to equality gone now