@Smitha_IASfans గారు.మీకు సివిల్ సర్వీస్ లో ఏ ర్యాంక్ వచ్చిందో తెలీదు కానీ..2014 సివిల్స్ లో మొదటి ర్యాంక్ సాధించిన ఇరా సింఘాల్ వికలాంగురాలు. మీలాంటి కొంత మంది ఉన్నతాధికారులు ప్రోత్సహించిన నకిలీ వికలాంగులను చూసి మొత్తం వ్యవస్థనే అవమానించారు.ఫలితం తప్పకుండా ఉంటుంది.
@revanth_anumula
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నమస్కారం.. తెలంగాణ పింఛన్ల పంపిణీలో వికలాంగులు,వీల్ చైర్ కు మరియి మంచానికే పరిమితం అయిన వికలాంగులు, వృద్దులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.దయచేసి తెలంగాణలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మనవి.ధన్యవాదాలు
@revanth_anumula
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారకి నమస్కారం..
తెలంగాణలోని అన్ని గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు ఏర్పాటు అభినందనీయం. ఈ కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటులో వికలాంగులకు 5%రిజర్వేషన్ కల్పించి వికలాంగ మహిళలకు ఉపాధిని కల్పించాలని తమరికి మనవి..ధన్యవాదాలు
@revanth_anumula reddy ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం.. సకాలంలో పింఛన్లు అందక పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నెలాఖరు వరకు పెన్షన్లు అందడం లేదు, ప్రభుత్వం మారినా ఎలాంటి మార్పు రాలేదు 5 వ తేదీలోపు పింఛన్లు అందించి పేదలను ఆదుకోండి..
@Collector_NLG
సార్ నమస్కారం. ..
నల్లగొండ ప్రధాన ఆసుపత్రిలో "డెంగ్యూ" పరీక్షల కోసం డాక్టర్ రాశారు.మూడు రోజులుగా రిపోర్ట్ రాలేదని చెబుతున్నారు.ఆసుపత్రి సూపరిండెంట్ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళాము వారు సరైన విధంగా స్పందించడం లేదు.
జరంతో బాధపడుతున్నాను దయచేసి చర్యలు తీసుకోండి.
@MinisterKTR గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర IT మంత్రివర్యులు kt రామారావు గారికి నమస్కారముులు.
వికలాంగుల తరుపున చిన్న విజ్ఞప్తి వికలాంగులకు అందిస్తున్న సబ్సిడీ రుణాలు వికలాంగులకు అందడం లేదు.సబ్సిడీ రుణాల స్థానంలో వికలాంగుల బందు ఏర్పాటు చేసి లక్ష ఆర్థిక సహాయం అందించగలరనీ మనవి.
@MinisterKTR సర్ నమస్కారం..తెలంగాణలో అధికారికంగా ఉన్న వికలాంగుల సంఖ్య 5 లక్షల 50 వేలు (పెన్షన్ పొందుతున్న వాళ్ళు ) ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలకు కేటాయించిన యూనిట్స్ మొత్తం 841.ఇది ఎంతవరకు న్యాయం సార్..దయచేసి బడ్జెట్ పెంచి ఎక్కువ మంది వికలాంగులకు న్యాయం చేయండి.
@KTRTRS గౌరవనీయులు తెలంగాణ మంత్రివర్యులు శ్రీ kt రామారావు గారికి నమస్కారం.. భర్త మరణించిన వితంతువులకు ఒక నెలలోనే కొత్త పెన్షన్ల మంజూరుకు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది..మనస్పూర్తిగా దన్యవాదాలు.. సదరం సర్టిఫికెట్లు కలిగిన వికలాంగులకు అదే విధంగా పెన్షన్లు మంజూరు చేయగలరు..
@Collector_NLG ఒంటి గంట దాటినా నల్లగొండ జిల్లాలో ప్రారంభం కానీ వికలాంగుల క్రీడోత్సవాలు.. ప్రారంభానికి రాని జిల్లా ఉన్నత అధికారులు..రాజకీయ నాయకులు..వికలాంగుల ఎదురు చూపు..
@MinisterKTR sir..తెలంగాణలో వికలాంగులకు మంత్రిత్వ శాఖ ఏది? పోరాడి తెచ్చుకున్న శాఖను మరో శాఖలో విలీనం చేసి వికలాంగులకు తీరని అన్యాయం చేసింది ప్రభుత్వం..
@PMOIndia gaurava neeya pradhaan mantri jee namaskaar..aapka ek nivedan hi divyangjan ke liye "pratyeek Aadhaar card" Dene kaa aadesh de deejiye.
sir..
Give special Aadhaar card to disabled people