అవధులు లేని అభిమానం…
అడుగులై సాగింది…
నన్ను కలుసుకోవాలన్న బలమైన ఆకాంక్షతో అభిమాని తాయన్న ఏకంగా కర్నూలు జిల్లా ఆదోని నుంచి కాలినడకన 350 కి.మీ. మేర ప్రయాణం చేసి రావడం ఆశ్చర్యం కలిగించింది. తను చూపిన అభిమానం ఎప్పటికీ మరువలేనిది.
ఎన్టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
#KotiDeepotsavam
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ..!
పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ శుభవేళ…
ఇందిరమ్మ ఇండ్లలో, లబ్ధిదారుల సొంతింటి సంతోషంలో… నేను సైతం పాలుపంచుకోనున్నాను.
ఈ దీపావళి సందర్భంగా, నేను ఇందిరమ్మ ఇంట్లో, లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు.. మీరు సైతం ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను.
#MaaIndirammaIntloDeepavali
#IndirammaIndlu
Deeply saddened by the passing of Sri A. Chakrapani garu, former Chairman of the Andhra Pradesh Legislative Council.
He was the first Chairman of the Council when the body was revived in 2007 in erstwhile Andhra Pradesh. He presided over it for over a decade, serving it with dignity, fairness and deep respect for Parliamentary traditions. A lawyer, a scholar of legislative practice and a committed Congressman across five decades of public life, he will be remembered. My heartfelt condolences to his family and well-wishers.
శ్రీ కృష్ణ సదర్ సమ్మేళన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన “సదర్ సమ్మేళనం” కార్యక్రమంలో పాల్గొన్నాను. యాదవ సోదరుల ఆకాంక్షలకు అనుగుణంగా సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించామని గుర్తు చేశాను.
యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు లేకుండా మా ప్రభుత్వం రాజకీయ, సామాజిక రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించింది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన యాదవ సోదరులు రాష్ట్ర అభివృద్ధిలోనూ ఐక్యంగా కలిసి రావాలి. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలి.
#SadarSammelan
ఈ నెల 23న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆహ్వానించారు.
ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ గారు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ జి చలం, ఇతర సభ్యులు ఆహ్వానాన్ని అందజేశారు.
నాడు దేశం క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, తన సమర్థవంతమైన నాయకత్వంతో సంక్షోభాలను అధిగమించడమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఉక్కు మహిళ, మాజీ ప్రధాని భారతరత్న, శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
ఇందిరమ్మ గొప్ప నాయకత్వ లక్షణాలు, ప్రజాసంక్షేమం పట్ల అంకితభావం, దేశం పట్ల నిబద్ధత ఎప్పటికీ మనందరికీ స్ఫూర్తిదాయకం.
#IndiraGandhi
ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే పోరాటానికి మద్దతుగా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైళ్లు ఆపినా వెనక్కి తగ్గకుండా తరలివచ్చి పోరాట స్ఫూర్తిని చాటిన ప్రతీ ఒక్కరికీ నా అభినందనలు.
పేదల ఓటు హక్కును కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. ఈ పోరాటంలో మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ భవన్ వేదికగా పిలుపునిస్తున్నా.
#VoteChori #SaveDemocracy #ChaloDilli
My heartfelt appreciation to the thousands of Congress workers and leaders from #Telangana who travelled to Delhi to join the #VoteBachaoDeshBachao rally.
Despite attempts to disrupt their journey and prevent them from reaching Delhi, the determination of our cadre remained unshaken. Their presence at #RamlilaMaidan is a powerful testament to Telangana's fighting spirit and its commitment to safeguarding democracy.
The right to vote, guaranteed by Babasaheb Dr. B.R. Ambedkar through our Constitution, is the foundation of our democracy. Any attempt to undermine this fundamental right must be resisted with unity and determination.
Like the Vanara Sena stood with Lord Rama in the fight against Ravana, our Congress family will stand united in the fight against vote theft and those undermining democratic institutions. We will not rest until this battle is won.
Let us protect every vote. Let us defend the Constitution. Let us save our democracy.
#SaveDemocracy #votechori
When the vote is stolen, every other right is in danger.
@RahulGandhi ji has called the nation to defend our democracy and our Constitution.
I support our leader's call and I will be there. #Telangana stands with him.
This is not one party's fight. It is India's fight against #votechori for our democracy and our Constitution. It is for our right to a voice, and for our right to exist.
Samvidhan Bachao. Loktantra Bachao. Chalo Delhi!
#ChaloDilli
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపిఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం గారి మృతి బాధాకరం. నిబద్ధత కలిగిన వ్యక్తిగా పోలీస్ వ్యవస్థలో ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.