#Thimmarajupallitv Movie Review
సింపుల్ లైన్.. టీవీ చోరికి సంబంధించిన నేపథ్యం.. ఇంత చిన్న పొడుపు కథ లాంటి కథతో సినిమా ఆద్యంతం నడిపించాలంటే నిజంగా కష్టమే.. అయినా దర్శకుడు మునిరాజు ఈ సింపుల్ లైన్‌కు ప్రేమకథ, ఎమోషన్‌తో కాసింత కథకు బరువు పెంచి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చెప్పాలనకున్న కథను నిజాయితీగా చెప్పాలని ప్రయత్నం కనిపించింది కానీ దర్శకుడికి కావాలసిన మెరుపులు మ్యాజిక్‌లు కనిపించలేదు. ఈ రోజుల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడాలంటే కేవలం హానెస్ట్ స్ట���రీ టెల్లింగ్ సరిపోదు.. కాసింత కాసులు వచ్చే సన్నివేశాలు జోడించాలి. హిలేరియస్ నవ్వులతో పాటు పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టించడం లేకపోతే ఎవ్వరూ ఊహించలేని ట్విస్ట్.. అయితే ఇందులో ట్విస్ట్ మాత్రం ఉందడి.. కానీ నవ్వులు మాత్రం లేవు. టీవీ దొంగతనం జరిగిందని కాబోలు సినిమాలో అందరూ సీరియస్‌గానే కనిపించారు. ఇక నటీనటులు కొత్తవాళ్లందరూ శభాష్.. శభాష్ అని భుజాలు తట్టేలా చేశారు. అయితే మునిరాజు కాసింత.. రచనపై దృష్టి పెట్టి.. కేవలం టీవీ నేపథ్యమే కాకుండా గ్రామీణ వాతావరణంలో ఉండే రాజకీయాలు.. ఆ రాజకీయాలకు టీవీ నేపథ్యం ఏదో ఇలాంటివి యాడ్ చేస్తే కమర్షియల్‌గా బాగుండేది... కాకపోతే కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేసిన ప్రయత్నం. అందుకు మునిరాజు పెట్టిన ఎఫర్ట్ అభినందనీయమే. బుల్లి తెర టీవీపై తీసిన సినిమా పెద్ద తెర వెండితెరపై ఆడాలంటే ఇంకాస్త కంటెంట్ ఉంటే బాగుండేది. ఏది ఏమైనా తిమ్మరాజు పల్లి టీవీ టీమ్ మీరు అభినందనీయులే..
Rating 2.5/5
#Papamprathap
కథాంశంలో నవ్యత���ో పాటు ఆడియన్స్ కన్వీన్స్ అండ్ కనెక్ట్ అయ్యే అంశం ఏ మాత్రం లేదు. ఇటువంటి కాన్సెప్ట్‌ను తీసుకున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ బాగా వర్కవుట్ కావాలి. ఈ రెండూ అంశాల్లోనూ పాపం ప్రతాప్ విఫలమయ్యాడు. సినిమా ఆద్యంతం బోరింగ్‌గా, ప్రేక్షకుడికి సహనానికి పరీక్షలా ఉంటుంది. ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తే సెకండాఫ్ విసుగు తెప్పిస్తుంది. ఇక ఈ సినిమాకు హీరో తిరువీర్ చేయని ప్రమోషన్ లేదు.. ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో సినిమా పబ్లిసిటి లేకపోవడం వల్లే సినిమాకు థియేటర్స్‌లో కలెక్షన్స్ రాలేదని భావించిన ఈ హీరో పాపం ప్రతాప్‌కు పబ్లిసిటి విషయంలో నిర్మాతలు ఏ లోటు చేయలేదు. అయినా తీరా చూస్తే 'పాపం ప్రతాప్'కు కూడా మినిమమ్ ఓపెనింగ్స్ రాలేదు. టోటల్‌గా పాపం ప్రతాప్ పూర్తిగా నిరాశపరిచాడు.
Rating 1.75/5
సినిమా విడుదలకు ముందు కౌంట్‌డౌన్ పోస్టర్స్‌లు వదలటం పబ్లిసిటిలో భాగం. అయితే ఈ మధ్య కాలంలో ఈ పోస్టర్స్‌లో క్రియేటివిటీ మరీ ఎక్కువైంది. అది ఒక్కోసారి టూమచ్‌గా కూడా అనిపిస్తుంది. కౌంట్‌డౌన్ అంకెను తెలియజేయడానికి వింత వింత పద్దతులు అనుసరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా #TimmarajupalliTv టీమ్‌కూడా తమ సినిమా 4 రోజుల కౌంట్‌డౌన్ పోస్టర్‌ను కూడా ఓ వింత కాన్సెప్ట్‌తో వదిలింది.. పోస్టర్‌ను టక్కున చూడగానే ఎవరికి అర్థం కాదు.. అందుకు మినిమమ్ డిగ్రీ చదవాలి.. చిన్నప్పుడు మనం తాటి ఆకులతో చేసుకునే ఫ్యాన్‌ను ఈ టీమ్ పోస్టర్లో వేసి డేస్ టు గో అన్నారు.. చాలా సేపు ఆలోచించిన తరువాత ఆ తాటి ఆకులను లెక్కబెడితేనే కానీ ఈ సినిమా 4 రోజుల కౌంట్‌డౌన్ అనేది తెలియలేదు.. మీ క్రియేటివిటికి జోహర్లు..
#Kaproductions
@Kiran_Abbavaram
#Dacoit#DacoitMoviereview
డెకాయిట్' మూవ�� రివ్యూ
రొటిన్ కథతో, బోరింగ్ స్క్రీన్‌ప్లేతో అడవిశేష్ మాస్ హీరోగా ఎదిగేందుకు చేసిన ప్రయత్నం ఇది. కథ, కథనాల్లో ఏ మాత్రం నవ్యత లేదు. స్క్రీన్‌ప్లేలో ఏ మాత్రం లాజిక్‌లు పట్టించుకోలేదు. కన్వీనెంట్ రైటింగ్‌తో అడవి శేష్ తన హీరోయిజాన్ని ఎలివేట్ చేసుకునేందుకు చేసిన ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. టెక్నకిల్గా స్ట్రాంగ్‌గా ఉన్న ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ ఏపిపోడ్స్ అలరిస్తాయి. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే లవ్‌సీన్స్ బోరింగ్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా అక్కడక్కడ మెప్పించే ఈ డెకాయిట్‌కు ఈ వీకండ్‌లో మంచి వసూళ్లు కనిపించినా.. లాంగ్‌రన్‌లో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునే అవకాశాలు తక్కువే.. ఓవరాల్‌గా ఈ డెకాయిట్ ఈ అసంపూర్తి ప్రేమకథ.
Rating 2/5
ఇటీవల నిర్మాతగా మారిన యువ హీరో దర్శకుడుగా మారి రియాల్టీ టైటిల్ తో ఒక చిత్రాని తెరకెక్కిస్తున్నా���ు..ఆ చిత్రములో కూడా అతనే హీరో
ఓ ఇం��్రస్టింగ్ కాంటెంపరరీ ఇష్యూ చుట్టూ అల్లుకున్న కథ ఇది... ఈ హీరో ఎవరో గెస్ చేయండి చూద్దాం
#News
#Cinema
#Tollywood
దురంధర్‌కు తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేవు..
సింగిల్ ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదు. అయినా తెలుగు, రాష్ట్రాల్లో ఈ చిత్రం కలెక్షన్లు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సో.. కంటెంట్ ఈజ్ కింగ్.. కంటెంట్ ఉంటే ప్రమ��షన్స్ పేరుతో విచిత్ర ఇంటర్వ్యూలు, పబ్లిసిటి మాస్టర్ ప్లాన్స్ పేరుతో జనాలకు విసుగు తెప్పించే పబ్లిసిటి స్టంట్స్ చేయాల్సిన పనిలేదు.
#Dhurandhar2
#Dhurandhar2TheRevenge
#Rākāsā టీమ్‌కు...
మీ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉందా?
అయితే మీరు స్ట్రెస్ ఫీలవుతూ ఇలాంటి రీల్స్ చేసి మమ్ముల్ని బోల్తా కొట్టించాల్సిన పనిలేదు.
స్ట్రాంగ్‌గా కంటెంట్ ఉంటే మీ సినిమా తప్పక చూస్తాం.. ఆల్ ది బెస్ట్
#RaaKaaSaa In Cinemas April 03rd!
https://t.co/9aDrR8KXhN
#SriChidambaramGaru#SriChidambaramGarureview
శ్రీ చిదంబరం గారు.. సింపుల్ అండ్ క్యూట్ లవ్‌స్టోరీ.. ఓ మంచి సందేశంతో నేటి యువతకు నచ్చే విధంగా ఈసినిమా ను తెరకెక్కించారు. సినిమా ఆద్యంతం ఎంతో ప్లెజెంట్‌గా మనసుకు హాయిను కలిగిస్తుంది. మెల్లకన్ను ఉందని బాధపడుతున్నయువకుడు ప్రేమిస్తే ఏం జరిగింది అనే ఈ కథాంశాన్ని దర్శకుడు ఎంతో స్పూర్తివంతంగా తెరకెక్కించాడు. సాధారణంగా ఇలాంటి విజువల్స్.. ఇలాంటి కథాంశంతో మలయాళంలో సినిమాలు వస్��ుంటాయి. కానీ తెలుగులో ఇలాంటి ఓ సింపుల్ కథతో మనసుకు హత్తుకునే సినిమా రావడం, అందరిలో స్పూర్తిని కలిగించడం ఎంతో శుభపరిణామం.
Rating 3/5
అత్యాచారం జరిగిన సన్నివేశం రీ కన్స్ట్రక్షన్ చేయడం ఏమిటి సార్.. గుణశేఖర్ గారు..
అమ్మ మీద కొడుకు అలా ప్రవర్తించే సీన్... భూమిక గారిని సెకండాఫ్‌లో అలా చూపించడం..
మీ సినిమాకు ఇవీ బిగ్గెస్ట్ మైనస్‌లు.. మీ లాంటి గొప్ప దర్శకుడు తీయాల్సిన సినిమా కాదు..
#Euphoria
#EuphoriaTheFilm#Euphoria
యుఫోరియా.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్ ఇష్యూ చుట్టు అల్లుకున్న ఓ సోషల్ కాజ్ కథ ఇది. అయితే తొలిభాగం కాస్త ఎంగేజింగ్‌గా అ���ిపించినా.. సెకండాఫ్‌లో పట్టు తప్పింది. ఇంటర్వెల్ తరువాత కథను ఎలా డీల్ చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో దర్శకుడు ఉండిపోయాడు. ఇలాంటి సినిమాకు ఎప్పుడైనా సెకండాఫ్ కీలకం. ముఖ్యంగా భూమిక పాత్రను సెకండాఫ్‌లో ప్ర��ెంట్ చేసిన విధానం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ఫస్ట్‌హాఫ్ తరహాలోనే సెకండాఫ్‌లో రచనా పరంగా కసరత్తలు చేసి వుంటే ఖచ్చితంగా యుఫోరియా కొన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉండేది. అమ్మాయిలపై జరుగుతున్న అఘయాత్యాలపై గుణశేఖర్ ఓ మంచి కథను చెప్పాలనా ఆలోచన బాగుంది. కానీ దానిని కన్వీన్స్ చేయడంలో దర్శకుడిగా విఫలమయ్యాడు.
మంచి కమర్షియల్ సక్సెస్ ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్రేక్షకుల మైండ్‌లో ఎటువంటి అంచనాలు పెంచకుండా సైలెంట్‌గా హిట్ కొట్టాలి. అంతేతప్ప ఇంకా సరిగ్గా షూటింగ్ కూడా ప్రారంభించని సినిమాలపై ఇన్ని ప్రచార చిత్రాలు వదిలి హైప్ క్రియేట్ చేయడం స్ట్రాటజీ కాదు.. సైలెంట్‌గా షూటింగ్ చేసుకుని.. కంటెంట్ చూస్తే ప్రేక్షకులకు షాకింగ్‌గా ఉండాలి.. అనుభూతి పొందాలి.. అంతేతప్��� ఇలా ముందు నుంచే అతి ప్రచారం అనర్థానికి కారణం.
#VijayDeverakonda
@TheDeverakonda
#OmShantiShantiShantihi
అందరూ ఓటీటీలో చూసేసిన సినిమాను రీమేక్ చేయడమే పెద్ద సాహసం.. ఒకవేళ చేసినా.. కథాగమనంలో మార్పులు మాతృక సినిమాకు మించిన స్క్రీన్‌ప్లే, సన్నివేశాలు రాసుకోవాలి. ఇవేమీ లేకుండా సాద���సీదాగా రీమేక్ చేశారు. సినిమా ఆద్యంతం ఎక్కడా కూడా ఆసక్తి రేకెత్తించదు. చాలా స్లోగా, భారంగా కొనసాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ మరింత భారంగా మారుతుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు అలరించినా, పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో ఓం శాంతి శాంతి శాంతి' విఫలమైంది. రీమేక్ సినిమా చూడనివాళ్లు మాత్రం ఎటువంటి అంచనాలు లేకుండా టైమ్‌పాస్ వాచ్‌గా అయితే థియేటర్‌కు వెళ్లొచ్చు..
#OSSS
#MovieReviews
Rating 2/5