భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు
రాష్ట్రవ్యాప్తంగా భూ రీసర్వేను పారదర్శకంగా, భూ వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్ గారు మరియు ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, అదనపు కలెక్టర్ డి. వెంకటగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ IDOC నుంచి పాల్గొన్నారు.
రీసర్వేకు సంబంధించి SOPను తప్పనిసరిగా అమలు చేయాలని, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా నివేదికలు రూపొందించాలని మంత్రి సూచించారు. నవంబర్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు మ్యాపులు లేని గ్రామాల్లో మొదటి దశను పూర్తి చేయాలని, వచ్చే ఏడాదిన్నరలో మూడు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం మండల స్థాయిలో సర్వే బృందాలను ఏర్పాటు చేసి, లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలని తెలిపారు.
రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టాలని, అభ్యంతరాల పరిష్కార విధానాన్ని వివరించాలని సూచించారు. దండోరా ద్వారా ఫలితాలను ప్రచారం చేసి, అభ్యంతరాలను పరిష్కరించాలన్నారు. రీసర్వే అనంతరం కొత్త QR కోడ్ పట్టాదారు పాస్‌బుక్కులు అందించనున్న నేపథ్యంలో సర్వే వివరాలు, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ముఖ్యంగా అసైన్డ్ భూముల పట్టాలు అసలైనవా, నకిలీవా, ప్రస్తుతం భూమి ఎవరి ఆధీనంలో ఉంది, విస్తీర్ణంలో తేడాలు ఉన్నాయా అనే అంశాలను ధృవీకరించాలని సూచించారు.
సాగునీటి చెరువులు, రహదారులు, కుంటలు తదితర అభివృద్ధి పనుల కోసం సేకరించిన భూములకు సంబంధించిన సర్వే నంబర్ల సమస్యలను పరిష్కరించాలని, అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.
#LandResurvey #Telangana #RevenueDepartment #LandRecords #Survey #LandDisputes #PattadarPassbook #QRCodePassbook #Farmers #FarmerWelfare #RevenueServices #Transparency #DigitalGovernance #AssignedLands #LandSurvey #VillageSurvey #TelanganaGovernment #BhadradriKothagudem #Kothagudem #Bhadrachalam #DistrictCollector #Collectorate #PublicAdministration #GoodGovernance #LandRights #SurveyTeams #RevenueRecords #TelanganaNews #GovernmentServices #Development
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakka@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన – దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ గారు
భద్రాచలంలో గోదావరి పుష్కర ఘాట్లు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పరిసరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ గారు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట పాల్గొన్నారు.
పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సురక్షిత దర్శనం, రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, డ్రైనేజీ, వైద్య సేవలు, భద్రత, రవాణా, అగ్నిమాపక ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని శ్రీమతి శైలజా రామయ్యర్ గారు అధికారులను ఆదేశించారు. పుష్కర వనానికి అనువైన స్థలం గుర్తించాలని, వీఐపీలు, భక్తులకు వేర్వేరు పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని, భక్తుల కోసం డార్మెటరీలు సిద్ధం చేయాలని సూచించారు.
దేవస్థానం అభివృద్ధి, పుష్కర ఘాట్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.348.59 కోట్లు విడుదల చేసినందున, అన్ని శాఖలు తమకు కేటాయించిన పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులన్నింటినీ శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలని, శాఖల మధ్య సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, పనులు మాత్రం నిలిపివేయరాదని స్పష్టం చేశారు.
#GodavariPushkaralu #Bhadrachalam #Telangana #ShailajaRamaiah #AnkithIAS #GodavariGhats #PushkarGhat #SitaramachandraSwamy #TempleDevelopment #EndowmentsDepartment #InfrastructureDevelopment #PilgrimFacilities #DevoteeSafety #RoadDevelopment #DrinkingWater #Sanitation #MedicalFacilities #TrafficManagement #FireSafety #ParkingFacilities #Dormitories #Pushkaravanam #SriRamaNavami #TelanganaGovernment #DistrictAdministration #BhadradriKothagudem #DevelopmentWorks #ProjectMonitoring #QualityWorks #Godavari
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakka@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కమిటీ ఆమోదం
149 మందికి ఒక్కొక్కరికి రూ.5.50 లక్షల చొప్పున రూ.8.19 కోట్ల ఆర్థిక సహాయం మంజూరుకు నిర్ణయం
బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు, మణుగూరు గ్రామానికి సంబంధించి ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అధ్యక్షతన జిల్లా స్థాయి పునరావాసం, పునరుద్ధరణ (R&R) కమిటీ సమావేశం నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.
మణుగూరు గ్రామానికి చెందిన 71 కుటుంబాల్లో గుర్తించిన 149 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5.50 లక్షల చొప్పున మొత్తం రూ.8,19,50,000 (రూ.8 కోట్ల 19 లక్షల 50 వేల) ఆర్థిక సహాయం మంజూరు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది.
ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం, పునరుద్ధరణ ప్యాకేజీ ప్రయోజనాలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని, భూసేకరణ, పరిహారం, పునరావాసం అంశాల్లో వివాదాలకు తావులేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, అర్హులైన బాధిత కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
#Manuguru #OpenCastProject #RAndRPackage #Rehabilitation #Resettlement #BhadradriKothagudem #Telangana #AnkithIAS #DistrictCollector #PayamVenkateswarlu #Pinapaka #ITDA #Singareni #ProjectAffectedFamilies #FinancialAssistance #LandAcquisition #Compensation #BeneficiaryWelfare #TransparentGovernance #RevenueDepartment #DistrictAdministration #PublicWelfare #TelanganaGovernment #IDOC #ManuguruProject #RuralDevelopment #WelfareMeasures #GovernmentSchemes #RehabilitationPackage #TelanganaUpdates
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakka@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
డిసెంబర్ నెలాఖరులోగా జిల్లాలో రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు ప్రతి మారుమూల గ్రామానికి చేరాలి
మణుగూరు మండలం చిన్నరాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ IAS క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామానికి సంబంధించిన 1,395 ఎకరాల్లో 554 ఎకరాలు అటవీ భూమిగా ఉన్నట్లు అధికారులు వివరించారు. గ్రామ సరిహద్దులు, అటవీ భూముల హద్దులు, భూముల విస్తీర్ణం, సర్వే పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.
పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వే నంబర్లు, రెవెన్యూ రికార్డులు, అటవీ శాఖ అభ్యంతరాలకు సంబంధించి రైతులు తెలిపిన సమస్యలను రికార్డుల ఆధారంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామస్తులతో మాట్లాడి తాగునీరు, విద్యుత్, వీధి దీపాలు, మొబైల్ నెట్వర్క్, రహదారి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. రాంనగర్ నుంచి పాములపాడు వరకు రహదారి లేక అత్యవసర వైద్య సేవలకు ఎదురవుతున్న ఇబ్బందులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో 70 కాడస్ట్రల్ గ్రామాలు, మ్యాప్‌లు లేని 7 నాన్ కాడస్ట్రల్ గ్రామాల్లో రీసర్వే చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 23 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి, మారుమూల, సరిహద్దు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, చేయూత పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా రీసర్వే నిర్వహించి డిసెంబర్ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
#BhadradriKothagudem #Telangana #AnkithIAS #DistrictCollector #LandResurvey #Resurvey #RevenueDepartment #ForestDepartment #Manuguru #Chinnarayigudem #RemoteVillages #BorderVillages #RuralDevelopment #LandRecords #LandBoundaries #FarmerWelfare #PattadarPassbook #IndirammaIndlu #CheyuthaPensions #DrinkingWater #RuralRoads #Electricity #StreetLights #MobileNetwork #WelfareSchemes #InfrastructureDevelopment #GoodGovernance #DistrictAdministration #TelanganaGovernment #PublicWelfare
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakka@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
ప్రజావాణి దరఖాస్తులకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలి
ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ IAS వివిధ సమస్యలపై వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.
భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, పింఛన్లు, గృహాలు, ఉపాధి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
పెండింగ్ వినతులపై ప్రత్యేక దృష్టి సారించి, పరిష్కార చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సిన పరిస్థితి రాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను నమోదు చేసి, సంబంధిత దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని సూచించారు.
#Prajavani #PublicGrievances #DistrictCollector #AnkithIAS #BhadradriKothagudem #Telangana #TelanganaGovernment #PublicService #GrievanceRedressal #CitizenServices #RevenueDepartment #LandIssues #WelfareSchemes #PensionSchemes #HousingSchemes #Employment #Infrastructure #PublicAdministration #GoodGovernance #Accountability #TimeBoundResolution #PendingApplications #InterDepartmentalCoordination #IDOC #DistrictAdministration #TelanganaDistricts #GovernmentServices #PeopleFirst #PublicWelfare #TelanganaUpdates
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakka@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
బూర్గంపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి.. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి
గైనకాలజిస్ట్ ప్రతిరోజూ అందుబాటులో ఉండాలి.. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
బూర్గంపాడు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు, వైద్య సేవలు, మందుల లభ్యత, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, ఈ విషయంపై మెడికల్ అధికారిని ఆరా తీశారు. గైనకాలజిస్ట్ రోజు విడిచి రోజు విధులకు వస్తున్నారని తెలపడంతో, డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసి గైనకాలజిస్ట్ ప్రతిరోజూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణులు, మహిళా రోగులకు వైద్య సేవల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
రక్త పరీక్షల కేంద్రాన్ని సందర్శించి రోజువారీ పరీక్షల సంఖ్య, అందుబాటులో ఉన్న పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించి, రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి జాప్యం లేకుండా వైద్యం అందించాలని, అత్యవసర కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలందించాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు తరలించడంలో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు.
ఆసుపత్రి వార్డులు, మరుగుదొడ్లు, రోగులు వేచి ఉండే ప్రదేశాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ మీటర్ వద్ద బయటకు వచ్చిన వైర్లను వెంటనే సరిచేసి, రోగులు, సిబ్బందికి ప్రమాదం జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇన్‌పేషెంట్లకు అందించే ఆహారం నాణ్యంగా, పౌష్టికంగా ఉండాలని, వంటశాలలో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో ప్రస్తుతం 15 మంది ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ నిరంతరం వైద్య సేవలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పనుల్లో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంపై కాంట్రాక్టర్‌ను ప్రశ్నించి, తగినంత మంది కార్మికులను ఏర్పాటు చేసి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవన నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ తనిఖీలో సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి, వైద్యులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #CollectorAnkithIAS #Burgampahad #CommunityHealthCentre #Healthcare #PublicHealth #GovernmentHospital #QualityHealthcare #HealthServices #MedicalServices #Gynecologist #MaternalHealth #PatientCare #HospitalInspection #HospitalHygiene #EmergencyCare #MedicalStaff #BloodTests #InpatientCare #Nutrition #HospitalInfrastructure #HealthDepartment #Telangana #TelanganaGovernment #DistrictAdministration #Kothagudem #HealthcareFacilities #PublicService #HealthForAll #GovernmentInitiatives
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakka@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
“మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
శ్రీనగర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చిన కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీలో జిల్లా కలెక్టర్ అంకిత్ IAS శనివారం పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వసంత, ఉపేంద్ర, లీలావతి ఇళ్లలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో పాల్గొని, వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. లబ్ధిదారులతో కలిసి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని, ప్రతి ఇల్లు ఆనందంతో వెలగాలని ఆకాంక్షించారు. టపాసులు కాల్చేటప్పుడు తగిన భద్రతా జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సొంత ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పండుగలు జరుపుకోవడం ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సవేరాం, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #CollectorAnkithIAS #IndirammaIndlu #MaaIndirammaIntloDeepavali #Deepavali #DiwaliCelebrations #SrinagarColony #Laxmidevipalli #TelanganaGovernment #Telangana #HousingScheme #IndirammaHousing #PoorFamilies #HousingForAll #DistrictAdministration #PublicWelfare #FestivalCelebrations #DiwaliGreetings #SafeDiwali #CommunityCelebration #Kothagudem #GovernmentSchemes #BeneficiaryFamilies #HousingDepartment #Saveraam #PeopleFirst #TelanganaUpdates #GoodGovernance #PublicService #FestivalOfLights
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakka@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
SIR-2026లో అర్హులై ఉండి డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు నమోదు కాని వారికి మరో అవకాశం: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి గారు
నవంబర్ 21 వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించవచ్చు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి గారు అధికారులకు సూచించారు.
శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో SIR-2026 ప్రక్రియ, ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, ఓటరు జాబితాలో పేర్ల నమోదు అంశాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఐడీఓసీ క్యాంపు కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం తదితర కారణాలతో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లు నవంబర్ 21వ తేదీలోగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన (ASDD) కేటగిరీ ఓటర్ల వివరాలను పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాల రూపంలో ప్రదర్శించాలని ఆదేశించారు. ఓటర్లు తమ పాత EPIC నంబర్ ఆధారంగా భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్, ECINET యాప్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలను డౌన్లోడ్ చేసుకుని సమర్పించవచ్చని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఈ అవకాశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
#SIR2026 #ElectionCommission #VoterList #VoterRegistration #EnumerationForms #EPIC #ECINET #ChiefElectoralOfficer #SudarshanReddy #CollectorAnkithIAS #BhadradriKothagudem #TelanganaElections #ElectoralRoll #VotingRights #EligibleVoters #ElectionAwareness #VoterAwareness #Form6 #ASDD #DistrictAdministration #ElectionOfficials #DemocraticRights #ElectoralRegistration #Telangana #Kothagudem #IDOC #PublicAwareness #FreeAndFairElections #VoterInclusion #ElectionUpdates
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakka@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
భూ రీసర్వే పనులను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
రాఘవపురంలో భూ సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన సర్వే పనుల పురోగతి, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియపై సంబంధిత అధికారులు, సర్వే సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రాఘవపురం గ్రామ పరిధిలో మొత్తం 1,800 ఎకరాల ఒక కుంట విస్తీర్ణంలో భూ రీ సర్వే నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే గ్రామ సరిహద్దులు, గ్రామకంఠం పరిధి, ప్రభుత్వ భూములు, గ్రామంలోని రహదారుల సర్వే పూర్తి చేసి వాటి హద్దులను నిర్ణయించారు. ప్రస్తుతం మిగిలిన భూములకు సంబంధించి సర్వే పనులు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నాయి.
భూ సర్వే ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అధికారులకు సూచించారు. గ్రామంలోని భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి భూమికి సంబంధించిన హద్దులను కచ్చితంగా గుర్తించాలని తెలిపారు. ప్రభుత్వ భూములు, గ్రామకంఠం, ప్రైవేటు భూములు, రహదారుల హద్దుల విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని, అధికారులు, సర్వే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ మిగిలిన భూ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామంలోని భూములకు సంబంధించి స్పష్టమైన హద్దులు, కచ్చితమైన వివరాలు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ పరిశీలనలో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, సర్వేయర్ కిరణ్ కుమార్, సంబంధిత రెవెన్యూ, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #CollectorAnkithIAS #LandResurvey #LandSurvey #RevenueDepartment #LandRecords #Telangana #DistrictAdministration #Sujathanagar #Raghavapuram #SurveyOperations #LandBoundaries #GovernmentLands #RevenueServices #TransparentGovernance #LandManagement #TelanganaGovernment #FieldInspection #PublicService #Kothagudem #LandRights #SurveyDepartment #RevenueAdministration #VillageSurvey #DigitalLandRecords #DistrictCollector #AdministrativeReview #RuralDevelopment #TelanganaUpdates #GoodGovernance
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakka@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, నిర్దేశిత లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరును మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఐడీఓసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
🔹 సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధులను జనవరి మొదటి వారంలోగా 100% వినియోగించాలి.
🔹 మార్చి నెలాఖరులోగా VB-G RAM G ద్వారా 12 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని సాధించాలి.
🔹 వేసవి ముగిసే వరకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. చేతిపంపులు, బోర్ పంపుల మరమ్మతులను నవంబర్ 15లోగా పూర్తి చేయాలి.
🔹 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి, లబ్ధిదారులకు ఉచిత ఇసుక, రాయితీ సిమెంట్ అందించాలి.
🔹 ‘మన ఇసుక – మన వాహనం’ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలి. సిమెంట్ బస్తాను రూ.230కే అందించాలి.
🔹 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా సాధించాలని సీఎస్ సూచించారు.
#Telangana #BhadradriKothagudem #DistrictAdministration #SanjayJaju #CollectorAnkithIAS #SamagraShiksha #PMSHRI #VBGRAMG #IndirammaIndlu #MissionBhagiratha #DrinkingWater #RuralDevelopment #EmploymentGuarantee #Education #HousingScheme #ManaIsukaManaVahanam #GovernmentSchemes #PublicWelfare #TelanganaGovernment #IDOC #DistrictCollector #WaterSupply #SchoolInfrastructure #DevelopmentWorks #WelfareSchemes #TelanganaUpdates #Kothagudem #Bhadrachalam #GovernmentInitiatives #PublicService
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం అందిన ఫారం-18 దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, 15 రోజుల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితా రూపకల్పన, నమోదు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఫారం-18 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హులైన గ్రాడ్యుయేట్ల పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అన్ని జిల్లాల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌లను ఏర్పాటు చేసి, విద్యార్థులు, యువతకు ఓటు హక్కు, ఓటరు నమోదు విధానం, ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ, జిల్లాలో అందిన ఫారం-18 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన దరఖాస్తులపై నిబంధనల ప్రకారం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్దేశించిన 15 రోజుల గడువులోగా వెరిఫికేషన్ పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టి విద్యార్థులు, యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
#Telangana #BhadradriKothagudem #AnkithIAS #GraduateMLC #MLCElections #VoterRegistration #Form18 #ElectoralRoll #ElectionCommission #SudarshanReddy #ElectoralLiteracy #VotingRights #Democracy #YouthAwareness #ElectionManagement
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@NDRFHQ@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
వీబీ-జి రామ్ జి పథకం ద్వారా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలి: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వీబీ-జి రామ్ జి పథకం ద్వారా తాత్కాలిక పనులకు బదులుగా ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ IAS తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పథకం కింద అందుబాటులో ఉన్న 375 రకాల పనులను సద్వినియోగం చేసుకుంటూ చెరువుల పూడికతీత, చెరువుకట్టల పటిష్టత, పంట కాలువల పునరుద్ధరణ, గ్రామీణ రహదారులు, వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గాలు, పాఠశాల అదనపు తరగతి గదులు, పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులకు ప్రయోజనం కలిగించే పనులను ముందుగా గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
మురసు తుపాను వల్ల దెబ్బతిన్న పంటలు, రహదారులు, కల్వర్టులు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలను త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. ములకలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, గుర్తించిన 56 ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, ఇతర నిర్మాణాల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. భద్రాచలం–వెంకటాపురం రహదారి పనులను ప్రాధాన్యతతో చేపట్టి జీఎస్బీ పనులు ప్రారంభించాలని, అవసరమైన చోట గేబియన్ నిర్మాణాలను పరిశీలించాలని సూచించారు.
మల్లెపువ్వుల వాగు పరిధిలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న కంపను తొలగించి పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి పంట కాలంలో తాత్కాలిక పనులు చేపట్టే పరిస్థితి లేకుండా శాశ్వత పరిష్కారాలు రూపొందించాలని తెలిపారు. వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు అభివృద్ధి పనులకు విడుదలైన రూ.70 లక్షలతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
రానున్న వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి గారు సూచించారు. గ్రామాల్లో పాత బోర్వెల్లు, మోటార్లు, పంపింగ్ వ్యవస్థలను పరిశీలించి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని, మిషన్ భగీరథ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ నీటి వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం, రక్షణ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని, యాతాల కుంట టన్నెల్ లైనింగ్ పనులు పూర్తయ్యే దశలో ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న జనవరి నుంచి కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని తాగునీరు, వ్యవసాయ రంగాలకు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. నీటి పొదుపుపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్‌పామ్, పశుగ్రాస పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.
కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం, జూలూరుపాడు పట్టణాల్లో ప్రధాన రహదారుల డివైడర్లపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలని, వాటిని నిరంతరం సంరక్షిస్తూ పట్టణాలను పచ్చదనంతో, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల నాణ్యత, మన్నికకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, డీసీహెచ్ఓ రవిబాబు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#Telangana #BhadradriKothagudem #ThummalaNageswaraRao #AnkithIAS #VBGRamG #RuralDevelopment #PermanentAssets #CycloneRelief #RoadRestoration #DrinkingWater #WaterConservation #Agriculture #Irrigation #ElNino #GreenTelangana
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@NDRFHQ@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా రక్షించడం అభినందనీయం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
మురసు తుపాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఏర్పడిన వరద పరిస్థితులు, నష్టం, సహాయక చర్యలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సత్తుపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, పోలీస్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బేతుపల్లి చెరువు వద్ద వరదల్లో చిక్కుకున్న మత్స్యకారులు, వారిని రక్షించేందుకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా రక్షించడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా యంత్రాగం - ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక శాఖల సిబ్బందిని మంత్రి అభినందించారు. దమ్మపేటలో దెబ్బతిన్న అలుగు ప్రాంతాన్ని, సత్తుపల్లిలో ముంపునకు గురైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
వరదల్లో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా రాత్రంతా శ్రమించి సహాయక చర్యలు విజయవంతం చేయడం అభినందనీయమని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సహాయం అందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ వ్యవస్థను బలోపేతం చేసి, 1,900 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణతో పాటు సుమారు రూ.260–270 కోట్లతో ఆధునిక రెస్క్యూ పరికరాలు సమకూర్చినట్లు వివరించారు.
భారీ వర్షాల వల్ల చెరువుల కట్టలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినడంతో పాటు పంట నష్టం జరిగినట్లు మంత్రి గారు తెలిపారు. రెండు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రెండు మూడు రోజుల్లో సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో ఇందిరమ్మ ఇళ్లు లేని అర్హులను గుర్తించి, వారికి ఇళ్లు అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ నేపథ్యంలో ముందుగానే అధికారులను అప్రమత్తం చేసి సహాయక బృందాలను క్షేత్రస్థాయిలో మోహరించినట్లు వివరించారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి ప్రాంతాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని డ్రోన్లు, లైఫ్ జాకెట్లు, తాళ్ల సహాయంతో రక్షించామని తెలిపారు. దమ్మపేటలో ఆలయ దర్శనానికి వెళ్లిన 11 మంది గిరిజనులను కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 9 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామని, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పూర్తి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఎన్డీఆర్ఎఫ్ కెప్టెన్ కిరణ్ సహాయక చర్యల వివరాలను వెల్లడించారు. గత 30 గంటల్లో అశ్వారావుపేటలో 411 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. ఫోన్ సిగ్నల్స్, లొకేషన్ ట్రేసింగ్, జియో కోఆర్డినేట్స్, మోటరైజ్డ్ బోట్ల సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించినట్లు అధికారులు వివరించారు.
ఈ సమావేశంలో భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, డీపీఓ అనూష, ఉమ్మడి ఖమ్మం జిల్లాల సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#Telangana #BhadradriKothagudem #Khammam #FloodRescue #MurasuCyclone #SDRF #NDRF #DisasterManagement #RescueOperations #FloodRelief #CropDamage #IndirammaIndlu #PonguletiSrinivasaReddy #AnkithIAS #TelanganaGovernment
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@NDRFHQ@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
ములకలపల్లి మండలం కమలాపురంలోని ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, వసతి సౌకర్యాలను పరిశీలించారు.
విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో వారితో నేరుగా మాట్లాడి ఆహారం రుచి, నాణ్యత, మెనూ అమలు, భోజనం అందించే సమయాల గురించి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌ను ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అందించాలని, విద్యార్థులకు ప్రతిరోజూ సమతుల్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.
వంటశాల, నిల్వ గదులను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన ఆహార పదార్థాలనే వినియోగించాలని స్పష్టం చేశారు. వంట తయారీ, భోజనం వడ్డించే సమయంలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని, కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాలలోని ఆర్ఓ ప్లాంట్ వినియోగంలో లేదని గుర్తించిన కలెక్టర్, వెంటనే అవసరమైన మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నిరంతరం శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
విద్యార్థులకు అందించే ఆహారం, తాగునీరు, వసతి సౌకర్యాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, వారి ఆరోగ్యం, సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ స్వాతి బిందు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#Telangana #BhadradriKothagudem #Mulakalapalli #Kamalapuram #AnkithIAS #ResidentialSchool #TribalWelfare #StudentWelfare #NutritiousFood #MidDayMeal #FoodSafety #ROPlant #SafeDrinkingWater #SchoolInspection #StudentHealth
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@NDRFHQ@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
కొత్తగూడెం మేదరబస్తీలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, రోజువారీ హాజరు, ఉపాధ్యాయుల హాజరు, బోధనా విధానాలు, విద్యా ప్రమాణాల అమలుపై ప్రధానోపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి నిర్దేశిత అభ్యసన లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఉన్నత పాఠశాలలో పదవ తరగతి డిజిటల్ తరగతి గదిని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న డిజిటల్ బోధనను సమీక్షించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, పాఠ్యాంశాలపై అవగాహన, చదివే సామర్థ్యాన్ని పరిశీలించారు. నిర్ణీత గడువులోగా సిలబస్ పూర్తి చేయడంతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
గత ఏడాది పదవ తరగతిలో 86 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వివరించగా, ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేలా ప్రణాళికాబద్ధంగా బోధన చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రతి సబ్జెక్టులో విద్యార్థుల ప్రగతిని నిరంతరం అంచనా వేస్తూ మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఉన్నత పాఠశాలలో మొత్తం 380 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థుల పాఠ్యపుస్తకాలను పరిశీలించి, వారి చదివే సామర్థ్యం, పాఠ్యాంశాలపై అవగాహనను స్వయంగా పరీక్షించారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణితానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించి, ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని, ఆహార తయారీలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ పుల్లయ్య, ప్రధానోపాధ్యాయులు బి.వి.ఎల్. కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
#Telangana #BhadradriKothagudem #Kothagudem #Education #QualityEducation #SchoolInspection #GovernmentSchools #StudentLearning #SSCExams #Class10 #DigitalClassroom #LearningOutcomes #MidDayMeal #StudentPerformance #AnkithIAS
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@NDRFHQ@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి గారు
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎస్ఐఆర్-2026 పురోగతి, పెండింగ్ అంశాలు, తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఐడీఓసీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఏఎస్డీ (గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన ఓటర్లు) జాబితాలోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తగిన ఆధారాలతో ధ్రువీకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. సరైన విచారణ, ఆధారాలు లేకుండా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిలీషన్ జాబితాలోని ప్రతి కేసును నిబంధనల ప్రకారం పరిశీలించి, పేరు తొలగింపునకు గల కారణాలు, ఆధారాలను నమోదు చేయాలని తెలిపారు.
ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదు, ఫారం-7 ద్వారా అభ్యంతరాలు, పేరు తొలగింపు, ఫారం-8 ద్వారా చిరునామా మార్పులు, ఓటరు వివరాల సవరణలకు సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి నిర్ణయానికి స్పష్టమైన కారణాలతో స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేయాలని, నోటీసులు, విచారణ నివేదికలు, ఓటర్లు సమర్పించిన ఆధార పత్రాలను క్రమపద్ధతిలో భద్రపరచాలని సూచించారు.
నోటీసులు అందుకున్న ప్రతి ఓటరుకు తమ వాదనలు వినిపించేందుకు తగిన అవకాశం కల్పించాలని, క్షేత్రస్థాయి విచారణలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు. ఏఎస్డీ, డిలీషన్ జాబితాలు, ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిష్కార పురోగతిని అధికారులు నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు.
భారత ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 26, 2026లోగా నోటీసుల జారీ, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను పూర్తి చేసి, నవంబర్ 30, 2026న తుది ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు అన్ని జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
#SIR2026 #ElectoralRoll #VoterList #ElectionCommission #ChiefElectoralOfficer #VoterRegistration #Form6 #Form7 #Form8 #ElectoralRollRevision #VoterRights #ElectionProcess #Telangana #BhadradriKothagudem #AnkithIAS
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@jupallyk_rao@UttamINC@INC_Ponguleti@OffDSB@DamodarCilarapu@KomatireddyKVR@Ponnam_INC@Tummala_INC@VivekVenkatswam@TummalaOfficial@seethakkaMLA@meeseethakka@iamkondasurekha@minister_adluri@SrihariVakiti@NDRFHQ@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM@IASassociation@IasTelangana@DCsofIndia@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad