హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మైదానంలో నిర్వహించిన 7వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ (SGF) హాకీ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు...(1/2)
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్ గారితో పాటు పాల్గొని వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేయడమైనది. @TelanganaCMO@TelanganaCS@INC_Ponguleti
డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 ప్రచార వాల్ పోస్టర్‌ను గురువారం జిల్లా కలెక్టరేట్లో సంబంధిత శాఖ అధికారులతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించనైనది.
@TelanganaCMO@TelanganaCS@INC_Ponguleti
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు, SIR ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సమీక్ష లో పాల్గొనడమైనది.
@TelanganaCMO@TelanganaCS@INC_Ponguleti
ఎంజీఎం ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాలను గురువారం తనిఖీ చేసి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ,ఆసుపత్రి వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని
వైద్యులను, భద్రత సిబ్బందిని ఆదేశించడమైనది.
వరంగల్ జిల్లా సంగెం మండలంలో రూ.40.95 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సీతక్క గారు, ఎంపీ శ్రీమతి కడియం కావ్య గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య గారు, ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడమైనది.
మంగళవారం నర్సంపేట నియోజక వర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి స్థల పరిశీలనలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా అటవీ అధికారి నిఖిత గార్లతో పాటు పాల్గొని పరిశీలించనైనది.
@TelanganaCMO@TelanganaCS@INC_Ponguleti
మంగళవారం వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో SIR పై రికార్డులు, దరఖాస్తులను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీమతి హరిచందన ఐఏఎస్ గారితో పాటు పరిశీలించనైనది.
@TelanganaCMO@TelanganaCS@INC_Ponguleti
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై వివిధ మండల ప్రత్యేక అధికారులు, మండలాల తహసీల్దార్లు, MPDO లు, మునిసిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భీమా కవరేజీ అందేలా పక్కాగా దరఖాస్తుల నమోదు చేపట్టాలని అధికారులను ఆదేశించనైనది.
వరంగల్ తీర్పు నియోజక వర్గం లోని A1 ఫంక్షన్ హాలు, LB నగర్ లో మంగళవారం ఏర్పాటుచేసిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీమతి కొండా సురేఖ ,కూడా చైర్ పర్సన్ శ్రీమతి గుండు సుధారాణి గారితో పాటు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనైనది.
సోమవారం వరంగల్ జిల్లా కోర్టు సమావేశ మందిరంలో గౌరవ జిల్లా జడ్జి శ్రీమతి నిర్మల గీతాంబ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి PCPNDT అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో పాల్గొనడమైనది. @TelanganaCMO@TelanganaCS@INC_Ponguleti
డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడా కార్యక్రమాల ఏర్పాట్లు, కార్యాచరణపై రాష్ట్ర మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి వాణీ ప్రసాద్ గారు ...(1/2)
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులకు పంపిస్తూ, దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించడమైనది. @TelanganaCMO@TelanganaCS@INC_Ponguleti
ఢిల్లీ: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాలని ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామని, భూ నిర్వాసితులకు పరిహారాన్ని వేగంగా అందజేస్తున్నామని ప్రధానమంత్రికి వివరించారు.
✅శ్రీ నరేంద్ర మోదీ గారితో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @mansukhmandviya, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ @UttamINC, రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీ @Vakiti_srihari పాల్గొన్నారు.
✅ప్రాణహిత నదిపై #Tummidihatti ప్రాజెక్టుకు +152 మీటర్ల వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
✅మహారాష్ట్రలో ముంపునకు అవసరమైన పరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ సాగునీటి అవసరాల దృష్ట్యా తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించాలని ముఖ్యమంత్రి గారు కోరారు.
✅తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో తెలంగాణలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
✅డాక్టర్ ఎస్. జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (#PRLIS), సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు (#SSMP), డిండి ఎత్తిపోతల పథకం (#DLIS) లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో తాగునీటి ప్రయోజనాలు అందడం లేదని ప్రధానమంత్రి గారికి వివరించారు.
✅పర్యావరణ అనుమతుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చినందున ఏమాత్రం ఆలస్యం లేకుండా పర్యావరణ, ఇతర అనుమతులు ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
✅సాస్కి (Scheme for Special Assistance to States for Capital Investment) కింద తెలంగాణకు అదనంగా రూ. 5,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం గారు కోరారు. తెలంగాణలో 70 నుంచి 90 శాతం మేర పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులు వినియోగించుకుంటామని చెప్పారు.
✅ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిధులు మంజూరు చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ఫలితంగా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు.
✅సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి (#CWC) సమర్పించామని ప్రధానమంత్రి గారికి తెలియజేశారు. ఈ ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే భూమి, గ్రామాల వివరాలను అంచనాకు పూర్తిస్థాయి నీటిమట్టం (FRL), బ్యాక్ వాటర్ స్థాయి గుర్తింపుతో కూడిన సమగ్ర సర్వేకు రూ.9.88 కోట్లు చెల్లించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
✅ఛత్తీస్‌గఢ్‌కు భూ పరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (NOC) త్వరగా జారీ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
✅ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (#PMKSY) కింద ఇంటిగ్రేటెడ్ సమ్మక్క సాగర్ ప్రాజెక్టు-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
✅హైదరాబాద్‌లో డిసెంబరు నెలలో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026’ ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని శ్రీ నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందించడంతో పాటు యూత్ గేమ్స్ లోగో, మస్కట్ల గురించి వివరించారు.
✅డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న #KheloIndiaYouthGames భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు యువ క్రీడాకారులకు ఇదొక చక్కని వేదిక కానుందని తెలిపారు.
✅2002లో జాతీయ క్రీడలు, 2007లో ప్రపంచ మిలిటరీ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన చరిత్ర తెలంగాణకు ఉందని వివరించారు.
#Telangana #IrrigationProjects #WaterResources #KheloIndiaYouthGames2026